విప్లవం నేరం కాదు. విప్లవకారుడు నేరస్తుడూ కాదు.

| సాహిత్యం | వ్యాసాలు

విప్లవం నేరం కాదు. విప్లవకారుడు నేరస్తుడూ కాదు.

- అరుణాంక్ లత | 04.02.2020 03:23:47pm

కాశీం తెలుగు సమాజానికి పరిచయం అవసరం లేని పేరు. టీఎస్ఎఫ్ నాయకుడిగా, తెలంగాణ ఉద్యమకాలమంతా కాళ్ళకు చక్రాలు కట్టుకొని తిరిగిన ఉపన్యాసకుడిగా, రచయితగా కవిగా, ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకుడుగా, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఉద్యమ ఉపన్యాసకుడిగా, విప్లవ రచయితల సంఘం కార్యవర్గ సభ్యుడిగా, ఇప్పుడు కార్యదర్శిగా ఒక్కడే అనేక భిన్న అస్తిత్వాల సమూహమై ప్రజలకు పరిచయం.

తనమీద మొదటి రాజద్రోహం నేరం మోపినపుడు ʹతెలంగాణ కన్నీళ్లను కలంలో నింపడం ద్రోహంమైతే/నేను రాజద్రోహం చేయడానికి సిద్దంʹ అని రాసుకున్నాడు. బతుకంతా తెలంగాణ కన్నీళ్ళనూ, దళిత పల్లెల కన్నీళ్ళనూ కలంలో నింపుతూ ఈ తెలంగాణోడు మాట్లాడుతూనే ఉన్నాడు. మాట్లాడుతూ ఉన్నందుకు రాజద్రోహం కేసులు మోపబడుతూనే ఉన్నాడు. 2016లో నమోదైన కేసులో ఇటివల అరెస్టు చేశారు. నాలుగేళ్ల తరువాత ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చింది అనేది ప్రశ్న. 2012 లోనూ కాశీంపై అమరులు గంటి ప్రసాదం, ఆకుల భూమయ్యలపై కేసు పెట్టారు. ఆ కేసుని చాలెంజ్ చేస్తూ బొజ్జా తారకం హై కోర్టులో క్వాష్ పిటిషన్ వేశాడు. కోర్టు విచారణ జరగనివ్వండి అంటూ కేసును కొట్టివేసింది. ముందస్తు బెయిల్ ఇవ్వమని అడిగినా నిరాకరించింది. ఇప్పుడు ఆ కేసును సహితం పోలీసులు తెరమీదకి తెచ్చారు. కాశీం అరెస్టును చాలెంజ్ చేస్తూ పౌరహక్కుల సంఘం అధ్యక్షులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ హై కోర్టు తలుపుతట్టాడు. ఈకేసు విచారణను చేసిన ప్రధాన న్యాయమూర్తి అధీనంలోని బెంచ్

ʹమొదటిది; 2012 కేసులో, 2019లో నమోదైన రెండు కేసుల్లో విచారణ స్థితి ఏమిటి?

రెండోది; ఆ FIRలలో డిటెన్యూ (కాశీం)పై చర్యలు తీసుకోవడంలో పోలీసులు ఎందుకు విఫలమయ్యారు?`

మూడోది; క్రైమ్ నెంబర్ 7/2016లో యాభై నాలుగు మందిని, డిటెన్యూ భార్యతో సహా నేరస్తులుగా చేర్చారు. కనుక, ఇప్పటి వరకు ఆ కేసులో ఎంతమందిని అరెస్ట్ చేశారో రాజ్యం కోర్టుకు చెప్పాలి.

నాలుగోది; ప్రొఫెసర్ నాలుగేళ్లుగా పరారీలో ఉన్నాడు, ఆచూకీ లేదు, అందువలనే పోలీసులు అరెస్ట్ చేయలేకపోయారు అని స్టాండ్ రాజ్యం తీసుకున్నది. ప్రొఫెసర్ కాశిం పరారీలో ఉన్న నేరస్తుడు అని చెప్పేందుకు పోలీసులు తీసుకున్న స్టెప్స్ ఏంటో చెప్పాలి. అతడు పరారీలో ఉన్న నేరస్తుడు అని ప్రకటించేందుకు కోర్టుకు పెట్టుకున్న అప్లికేషన్ను ఈ కోర్టుకు (హైకోర్టుకు)కు అందించాలి.

ఐదోది; డిటెన్యూ లైబ్రరీ నుండి స్వాధీనం చేసుకున్న పుస్తకాల లిస్ట్, అందులో ఏ పుస్తకాలను, కరపత్రాలను, డాక్యుమెంట్ లను డిటెన్యూకి వ్యతిరేకంగా సాక్ష్యాలుగా పరిగణిస్తుందో కోర్టుకు తెలపాలి. ఇది ముఖ్యమైన విషయం; డిటెన్యూ ప్రకారం అతడు ప్రొఫెసర్, దళిత, విప్లవ సాహిత్యాలను భోదిస్తున్నాడు. అవి విషయపరంగా షెడ్యూల్ కులాల ప్రజలపై జరుగుతున్న ఊహకు అందని హింసను కలిగి ఉంటూ సమాజపు నమ్మకాలనూ, ప్రాథమిక సూత్రాలను ప్రశ్నిస్తాయి.ʹ అంటూ ఐదు ప్రశ్నలు ప్రభుత్వానికి సంధించింది.

అంతేగాక రిమాండ్ రిపోర్టు లో "ప్రస్తుత డిటెన్యూ (అనగా కాశీం) వ్యాపారవేత్తల నుండీ, కాంట్రాక్టర్ల నుండి బలవంతంగా డబ్బులు వసూలు చేసి మావోయిస్టులకు చేరవేస్తున్నాడు" అనే ఆరోపణ చేశారు. దానికి సంబంధించిన సాక్షాధారాలనూ, "ఛత్తీస్ ఘడ్ వెళ్లి మావోయిస్టులను కలిశాడు" అనే ఆరోపణకు సంబంధించిన సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించాలి. అని అడిగింది.

కాశీం కేసును కోర్టు ప్రత్యేక కేసుగా చుస్తున్నట్టూ, ఎందుకు ప్రత్యేకమో చెబుతూ ʹమావోయిస్టు సానుభూతిపరులు అంటూ ప్రజలను పోలీసులు అరెస్టు చేస్తున్నారనే కేసులు ఎక్కువసంఖ్యలో కోర్టుకు వస్తున్నాయి గనుక వీటికీ, పైన పేర్కొన్న ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాలను కోర్టుకు అందించవల్సిన బాధ్యత రాజ్యానిదే. ఒక ప్రొఫెసర్ అవే ఆరోపణలతో అరెస్టు అయ్యాడు గనుక ధిక్కార గొంతుకలను (voice of dissent) రాజ్యం తన ఎమినెంట్ అధికారాన్ని ఉపయోగించి గొంతునొక్కుతుందా? లేదా అనే విషయం తెలుసుకోవడం కోర్టు బాధ్యత. వ్యక్తి స్వేచ్చే గాక, పౌరుల ప్రాథమిక హక్కులూ, విద్యాసంస్థల్లో రాజ్య జోక్యాన్నీ గురించిన ప్రశ్నలూ ఇప్పుడు కోర్టు ముందున్నాయి. అందువలన ఈ కేసు మిగతా కేసులతో పోలిస్తే ప్రత్యేకతను కలిగివున్నది.ʹ అని వాఖ్యనించింది. ఇవే విషయాలను ఆర్డర్ లో రాసింది. ఆ తరువాత కాశీంని పోలిస్ కస్టడీకి అడిగినా ఇవ్వలేదు.

కాశీం అరెస్టుకు సంబంధించి కోర్టు అడిగిన ప్రశ్నలోనే ʹఅతడు ప్రొఫెసర్, దళిత, విప్లవ సాహిత్యాలను భోదిస్తున్నాడు. అవి విషయపరంగా షెడ్యూల్ కులాల ప్రజలపై జరుగుతున్న ఊహకు అందని హింసను కలిగి ఉంటూ సమాజపు నమ్మకాలనూ, ప్రాథమిక సూత్రాలనూ ప్రశ్నిస్తాయి.ʹ అని సమాధానం ఉన్నది. ఇట్లా తీర్పు రావడం ఇదేమి మొదటిది కాదు. గతంలోనూ నిషేధిత సంస్థలతో సంబంధాలు కలిగిఉన్నారని నేరాలు మోపిన చాలామంది విషయంలో ʹనిషేధిత సంస్థలో సభ్యుడై ఉంటే నేరమేమి కాదనిʹ తీర్పులు వచ్చి ఉన్నాయి.

2012 నుండి కేసులు ఉన్నా ఇప్పుడే అరెస్టు ఎందుకు అంటే ʹరివల్యుషనరి థియరి ని రివల్యుషనరి మాసేస్ దగ్గరకు తీసుకుపోవడం బుద్ధిజీవులు చేయవలసిన పనిʹ అని ఎవరన్నారో గుర్తుకు లేదు గానీ, కాశీం అదే పని చేస్తున్నాడు. ఉపన్యాసకుడిగా, ఉస్మానియా యూనివర్సిటి అధ్యాపకుడిగా కాశీం కంటే, దళితుడిగా, అదీ ʹవిప్లవ రచయితల సంఘం కార్యదర్శిʹగా కాశీం వేసే ప్రభావం ఎక్కువ అని ప్రభుత్వం అనుకొని ఉంటుంది.

No. of visitors : 711
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


బీజేపీ నమూనా.. అశ్రిత పెట్టుబడిదారి విధానంతో కలగలిసిన సాఫ్ట్ హిందుత్వ : రానా అయుబ్

ఇంటర్వ్యూ : అరుణాంక్ | 16.07.2016 01:13:23pm

బి.జె.పి నమూనా అశ్రిత పెట్టుబడిదారి విధానంతో కలగలిసిన సాఫ్ట్ హిందుత్వ . బి.జె.పి పైకి హిందుత్వగా కనపడుతున్న కాంగ్రెస్ కన్నా పెట్టుబడి అనుకూల వైఖరీ ఉన్న......
...ఇంకా చదవండి

ఉదాస్ మౌస‌మ్ కే ఖిలాఫ్

అరుణాంక్, డిఎస్‌యూ | 23.03.2017 09:19:39am

భ‌గ‌త్‌సింగ్, పాష్‌ల ప్రాసంగిక‌త ఇవాల్టికీ ఉంది. పాష్ మాట‌ల్లోనే చెప్పాలంటే ʹహ‌మ్ లడేంగే సాథీ ఉదాస్ మౌస‌మ్ కే కిలాఫ్ʹ అంటూ క‌ద‌లాల్సిందే. ...
...ఇంకా చదవండి

అడవిని కాస్తున్న వెన్నెల

అరుణాంక్ | 04.09.2017 09:51:34am

పాట దూరమైంది. పాట పాడే గొంతు దూరమైంది. వినపడనంత. కనపడనంతదూర వెళ్ళారు వాళ్ళు. మదిలో, మస్తిష్కంలోవెన్నెల చెప్పిన మాటలే. వెన్నెలని ఎంత అద్భుతంగా చెప్పింది. వెన...
...ఇంకా చదవండి

న్యాయంకోసం పోరే వాళ్లకు సంకెళ్లు

అరుణాంక్ లత | 07.06.2018 09:07:57am

హిందు ఫాసిజం ఇటు దళితులకు అటు కమ్యూనిస్టు శిబిరానికి ఉమ్మడి శత్రువు. రాజ్యంలో ఉన్న హిందూ ఫాసిజం ఇద్దరిపై రక్తపువేటను కొనసాగిస్తున్నది. మిత్ర వైరుధ్యాన్ని తమ...
...ఇంకా చదవండి

అలసెంద్రవంక

అరుణాంక్‌ | 05.05.2017 01:06:18pm

నా ʹఅలʹలో ఎంత మార్పు. ʹమాటీగరిʹ ఇచ్చి చదవమన్నప్పుడు తెలుగు చదవడం కష్టంగా ఉంది అన్న అల ʹఅంటరాని వసంతంʹ గురించి మాట్లాడుతు ʹరేయ్ నాకు అటువంటి జీవితం లేదుʹ అన...
...ఇంకా చదవండి

ముసాఫిర్

అరుణాంక్ లత | 19.11.2018 03:39:50pm

ఒక నడక అతడి వెనకాల నడుస్తుంటే ఏమో అర్థం కానీ పదాలు వల్లే వేస్తూ పోతుంటాడు. నడుస్తూ, నడుస్తూ ఏదో దృశ్యాన్ని చూసి గున్ గునాయిస్తాడు. "ఇస్ దునియామే గమ్, నఫ్రత...
...ఇంకా చదవండి

యుద్ధానంతర యుద్ధగీతం

అరుణాంక్ | 06.09.2018 11:50:31pm

ప్రశ్నించిన ప్రతివాడు నక్సలైటే ఓ నా తెలంగాణ నేల నీకు గుర్తుందా! నీ మీదుగా దండకారణ్యానికి ఉద్యమమే కాదు ఇప్పుడు నిర్బంధమూ విస్తరించింది కాకపోతే రూరల్ పేద .....
...ఇంకా చదవండి

నెలవంక సందేశం

అరుణాంక్ | 16.06.2018 12:36:48am

ప్రశ్నించిన చోటల్లా బందీ కాబడుతున్న వాళ్ల సాక్షిగా దేశ ముఖచిత్రాన్ని మార్చే ఒక్క వాక్యం రాద్దాం ఒక్క కవాతు చేద్దాం ... ...
...ఇంకా చదవండి

కడలి

అరుణాంక్‌ | 05.03.2018 08:26:10am

రెండు సరిహద్దులను కలిపే వంతెనై కడలి సరిహద్దును పహారా కాసే నిగాహ్ నేత్రమైన సెంట్రీ కడలి జనమై కడలి జనసందోహమై కడలి...
...ఇంకా చదవండి

అల అడిగిన కథ

అరుణాంక్ | 18.08.2017 10:00:25am

ఎండిన చేపలు కాదు అవి. ఎండిన డొక్కలకు ఆహారమైన చేపలు. బతుకనీకి భరోసానిచ్చిన చేపలు....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India

All sections of working masses should be united together irrespective of caste and religious diferences, to fight in the path of caste annihilation..

 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  కరోనా లాఠీఛార్జ్ : ఇది మనకు అభ్యంతరం అనిపించాలి కదా?
  నిజమైన స్వాతంత్రం కోసం పోరాడటంలోనే భగత్ సింగ్ స్ఫూర్తి ఉంది
  చేతులు కడిగేసుకోవడం తప్ప ఇంకేమైనా చేయగలరా?
  అరుణతార మార్చి - 2020
  ఉన్నావో సీత
  ʹఅక్కడ ఒక్క చెట్టు కూడా లేదుʹ
  విస్తరణ - క‌ల‌ల‌కు దారులైన దండ‌కార‌ణ్య క‌థలు
  బస్తర్ లో మళ్లీ శాంతియాత్ర
  అభివృద్ధికి అసలైన అర్థం ఏమిటో ప్రశ్నించిన కథ..
  సూర్యోద‌యం దిశ‌ను మార్చుకుందా?
  ఢిల్లీ హింస కుట్రదారులు మోడీ, అమిత్ షాలే
  మూడో తరానికి...

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •