షాహీన్ బాగ్... ఒక స్వేచ్ఛా నినాదం

| సంభాషణ

షాహీన్ బాగ్... ఒక స్వేచ్ఛా నినాదం

- క్రాంతి | 04.02.2020 03:40:38pm


క‌రీంన‌గ‌ర్ యాత‌ర‌కు
పోరాటాల జాత‌ర‌కు
బ‌తుకు పోరు బాట‌ల‌కు
బావిత‌రం జాడ‌ల‌కు
కొడుకో గ‌జ్జాల రాజా పోదాంరా జాత‌ర
కొడుకో గ‌జ్జాల రాజా క‌రీనన‌గ‌ర్ యాత‌ర‌

క‌రీంన‌గ‌ర్ పోరులోన కూల‌న్న‌ల తెగువ జూడ‌
ఆ ఉద్య‌మ ర‌ణంలో రైత‌న్న‌ల తెగువ జూడ‌
రైతు కూలి అన్న‌ల‌కు విద్యార్థుల తోడు జూడ‌
మూల నుండి జిల్లంతా అల్లుకున్న తీరుజూడ‌
కొడుకో గ‌జ్జాల రాజా పోదాంరా జాత‌ర జూడ‌
కొడుకో గ‌జ్జాల రాజా క‌రీనన‌గ‌ర్ యాత‌ర‌

ఖాకి ఖాకి బ‌ట్ట‌లోల్ల లాఠీల మోత‌జూడ‌
దెబ్బ దెబ్బ దెబ్బ‌ల‌కు ఎగిసిన పిడికిళ్ల‌జూడ‌
అణ‌చివేత ప్ర‌తిఘ‌ట‌నై సాగిన ఆ తీరుజూడ‌
పోరాటం నెత్తిమీద అణ‌చివేత క‌త్తిజూడ‌
కొడుకో గ‌జ్జాల రాజా పోదాంరా జాత‌ర జూడ‌
కొడుకో గ‌జ్జాల రాజా క‌రీనన‌గ‌ర్ యాత‌ర‌
- మిత్ర‌

పోరాటం నెత్తిమీద అణ‌చివేత క‌త్తివేలాడుతున్న ఒకానొక కాలంలో క‌ల్లోల తెలంగాణను క‌ళ్ల‌కుగ‌ట్టిన పాట ఇది. కానీ, ఇప్పుడు... ఒక్క తెలంగాణే కాదు... దేశం మొత్తానికీ వ‌ర్తిస్తుంది.

కాళ్ల‌కింద నేల క‌దిలిపోతున్న‌ప్పుడు... ఈ నేల బిడ్డ‌ల అస్థిత్వ‌మే ప్ర‌శ్నార్థ‌క‌మైన‌ప్పుడు... కానికాలం ఎదురైనప్పుడు... మ‌ట్టిమ‌నుషులంతా ఒక్క‌టై చేస్తున్న పోరాటానికి వ‌ర్త‌మాన భార‌తం సాక్ష్యంగా నిలిచింది. ఆ పోరాటానికి ఇప్పుడు... షాహీన్ బాగ్ కేంద్ర‌మైంది.

జామియాలో, జేఎన్‌యూలో నెత్తురుపారుతున్న‌ప్పుడు... షాహీన్‌బాగ్ పోరాటాన్ని ఎత్తుకుంది. CAA, NRC, NPR లకు వ్యతిరేకంగా కొత్త గొంతుక‌య్యింది. అక్క‌డ‌... అమ్మ‌లు, అమ్మ ఒడిలో ఆడుకునే ప‌సిపిల్ల‌లు, వాళ్ల‌కు క‌థ‌లు చెప్పు అమ్మ‌మ్మ‌లు క‌నిపిస్తారు. ఒక్క‌రిద్ద‌రు కాదు వేలాది మంది మ‌హిళ‌లు ఒక్క గొంతులో నిన‌దిస్తుంటారు. స్వేచ్ఛ‌, స‌మాన‌త్వం కోసం పిడికిలెత్తిన పోరు త‌ల్లులు వాళ్లు.

జామియా విద్యార్థులపై లాఠీలు విరిగిన రాత్రి (డిసెంబ‌ర్ 15) షాహీన్‌బాగ్ నిద్ర కోల్పోయింది. బిడ్డ‌ల నెత్తుటిదార‌ల‌కు త‌ల్ల‌డిల్లిన త‌ల్లిగుండె పోరాట‌జెండాను ఎత్తిప‌ట్టింది. పౌర‌స‌త్వ చ‌ట్టాన్ని తిర‌స్క‌రిస్తూ 45 రోజులుగా రాత్రింబ‌వ‌ళ్ల‌ను ర‌గిలిస్తోంది. ఏ నాయ‌కుడు, నాయ‌కురాలు లేని ప్ర‌జా ఉద్య‌మం అది. ఎన‌బైలు దాటిన వ‌య‌సులోనూ ఎముక‌లు కొరికే చ‌లిని సైతం లెక్క‌చేయ‌ని త‌ల్లులెంద‌రో అక్క‌డ తార‌స‌ప‌డ‌తారు.

ఆ త‌ల్లుల దీక్ష ఇప్పుడు మొత్తం దేశాన్నే కాదు... ప్ర‌పంచాన్ని ఆకర్షిస్తోంది. న‌లుమూలల నుంచి వేలాదిగా జ‌నం షాహీన్‌బాగ్‌కి క్యూ క‌డుతున్నారు. పోరాట ప్ర‌జ‌ల‌కు సంఘీబావాన్ని ప్ర‌క‌టిస్తున్నారు. వాళ్ల‌ ఆక‌లిద‌ప్పులు తీర్చ‌డంతో పాటు, వైద్య సేవ‌లు అందిస్తున్నారు. పిల్ల‌లకు షాహీన్‌బాగే ఇప్పుడు త‌ర‌గ‌తి గ‌ది, ఆట‌స్థ‌లం. అక్క‌డే పాట‌లు, పాఠాలు. అక్క‌డ ఆజాదీ నినాదాల్లోనే కాదు... ఆర్ట్‌లోనూ స్వేచ్ఛాస్వ‌ప్నం ప్ర‌తిఫ‌లిస్తుంది. ద్వేష రాజ‌కీయాల‌కు వ్య‌తిరేకంగా కుల‌, మ‌తాలు, ప్రాంతాల‌క‌తీతంగా సాగుతుతున్న ప్ర‌జా ఉద్య‌మం అది. అందుకే... ఇప్పుడు షాహీన్‌బాగ్ అగ్గి దేశ‌మంతా అంటుకుంది. కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌, తెలంగాణ‌, మ‌హారాష్ట్ర ఇలా.. ప్ర‌తీచోట‌, ఓ షాహీన్‌బాగ్ వెలుస్తోంది.

షాహీన్ బాగ్ మ‌హిళ‌ల ప‌ట్టుద‌ల పాల‌కుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. అందుకే.. దీక్షా శిబిరాన్ని ఎత్తివేసేందుకు ప్ర‌భుత్వం తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది. బెదిరింపుల‌కు పాల్ప‌డ‌డంతో పాటు, ఉద్య‌మంపై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తోంది. డ‌బ్బులు, బిర్యానీ కోస‌మే మ‌హిళ‌లు దీక్ష చేస్తున్నార‌ని బీజేపీ అనుకూల మీడియా ద్వారా ప్ర‌చారం చేసింది. నిరసనకారుల్ని హింసావాదులుగా చిత్రించడానికి నానా ప్ర‌య‌త్నాలు చేశారు. దీక్షా స్థలానికి ఆయుధాల‌తో వెళ్లిన ఆర్ ఎస్ ఎస్ గూండాలు అల్ల‌ర్లు సృష్టించేందుకు య‌త్నించారు. ఈ ప్ర‌య‌త్నాలేవీ ఫ‌లించ‌క‌పోవ‌డంతో... జామియా విద్యార్థుల‌పై కాల్పుల‌కు తెగ‌బ‌డ్డాడు ఓ ʹరామ‌భ‌క్తుడుʹ.

మ‌రోవైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలోనూ షాహీన్‌బాగ్ ప్ర‌జా ఆందోళ‌న‌ను హింసాయుత ఆందోళ‌న‌గా చిత్రించేందుకు ప్ర‌య‌త్నిస్తోంది బీజేపీ. షాహీన్‌బాగ్‌ వద్ద ధర్నా చేస్తున్న ఆందోళనకారులు.. ఢిల్లీ ప్రజల నివాసాల్లోకి చొరబడి రేప్‌ చేసి చంపేస్తారని భారతీయ జనతా పార్టీ ఎంపీ పర్వేశ్‌ వర్మ చేసిన వ్యాఖ్య‌లే అందుకు నిద‌ర్శ‌నం. అధికార ప‌క్షం ఎన్ని కుట్ర‌లు ప‌న్నినా షాహీన్‌బాగ్ త‌ల్లుల పోరాట దీక్ష ముందు చ‌తికిల‌ప‌డాల్సిందే అని మ‌ళ్లీ మ‌ళ్లీ నిరూపిత‌మ‌వుతోంది. అందుకే.. నెల‌ల త‌ర‌బ‌డి నిరాటంకంగా ఆ త‌ల్లులు త‌మ పోరాటాన్ని కొన‌సాగిస్తున్నారు. పాల‌స్తీనా పోరాట స్త్రీల‌, క‌శ్మీర్ క‌న్న‌త‌ల్లుల‌, శ్రీలంక త‌మిళ బిడ్డ‌ల కొన‌సాగింపు వాళ్లు. వాళ్లే... రేప‌టి దేశ భ‌విష్య‌త్తు. అందుకే.. ఇప్పుడు దేశ‌మంతా షాహీన్‌బాగ్ కావాలి. ప్ర‌తి గుండెలోనూ ద్వేషాన్ని ధ్వంసించే ప్రేమ వెల‌గాలి.

No. of visitors : 367
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


అక్క‌డ డేనియ‌ల్ ఉన్నాడు

సంఘ‌ర్ష్‌ | 18.11.2016 12:59:34pm

అక్క‌డ‌ బాల్యం భ‌యంలో... య‌వ్వ‌నం నిర్బంధంలో గ‌డిచిపోతుంది. ఇంటి నుంచి బ‌య‌ట‌కెళ్లిన పిల్ల‌లు తిరిగి వ‌స్తారో రారో తెలీదు. దారి కాచుకు కూర్చునే ఖాకీ మూక‌...
...ఇంకా చదవండి

బోధ‌నా హ‌క్కు కోసం మ‌రో జైలు పోరాటం చేస్తా : ప్రొIIజి.ఎన్‌.సాయిబాబా

ఇంట‌ర్వ్యూ : క్రాంతి | 01.06.2016 12:44:47pm

1930 సంక్షోభ కాలంలో హిట్లర్ యువతను, కార్మికులను కమ్యూనిస్టుల కంటే అధికంగా ఆర్గనైజ్ చేయడాన్ని గమనించవచ్చు. ఉపాధి లేక తిరుగుబాటు స్వభావంతో ఉన్నయువతను ఫాసిస్ట...
...ఇంకా చదవండి

దూతను కాల్చివేసే చోట: బస్తర్ అడవుల్లో జీవన్మరణ సమస్యగా జర్నలిజం

సుబోజిత్ బాగ్చీ (అనువాదం : క‌్రాంతి) | 17.06.2016 09:33:33am

సామాజిక కార్యకర్తలు, లాయర్లు, న్యాయ సహాయక బృందాలు డాక్టర్లు మొదలు సామాన్యుల వరకు అక్కడ ప్రతి ఒక్కరూ తుపాకీ నీడలో జీవించాల్సిందే........
...ఇంకా చదవండి

మ‌రో ఆదివాసీ యువ‌కుడు...

క్రాంతి | 03.09.2016 03:22:46pm

17 ఏళ్ల పిల్లాడిని తీసుకెళ్లి 30 ఏళ్ల యువ‌కుడిగా త‌ప్పుడు చార్జిషీటు సిద్ధం చేశారు. 2014లో ఐదుగురు జ‌వాన్లు చ‌నిపోవ‌డానికి కార‌ణ‌మైన అంబులెన్స్ ........
...ఇంకా చదవండి

పొట్ట‌కూటి కోసం పోతే... పోలీసులు కాల్చిచంపారు

| 20.10.2016 03:21:04pm

తాపీ మేస్త్రీ కాస్తా రాత్రికి రాత్రి మావోయిస్ట‌య్యాడు. మూడు రోజుల క్రితం పనికోసం వెళ్లిన‌ మ‌నోహ‌ర్ శ‌వ‌మై తిరిగి వ‌చ్చాడు. "ఎన్‌కౌంటర్" క‌థ రిపీట్ అయ్యింది....
...ఇంకా చదవండి

సంత‌కు వెళ్లిన వాళ్లు.. శ‌వాలై వ‌చ్చారు

సంఘ‌ర్ష్‌ | 20.02.2017 11:52:50am

ఏకంగా ఇర‌వై రోజుల నుంచి మృత దేహాల‌ను ఖ‌న‌నం చేయ‌కుండా గ్రామంలోనే ఉంచుకొని ఆందోళ‌న చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఒక్క అధికారి కూడా ఈ విష‌యంలో స్పందించ‌క‌పోవ...
...ఇంకా చదవండి

ఆ చెట్టుకు నోరుంటే ..

క్రాంతి | 03.01.2017 09:49:29am

ఆట‌పాట‌ల్లో మురిసిపోయే ప‌సివాడు ఉట్ట‌న్న‌ట్టుండి న‌క్స‌లైట‌య్యాడు. క‌సిగా గుచ్చుకున్న బ‌యోనెట్ మొన వాడి మొర ఆల‌కించ‌లేదు. రాజ్యం ఎక్కుపెట్టిన తుపాకీ తూటాల...
...ఇంకా చదవండి

అధికారం నీడ‌లో.... అంతులేని హింస‌

క్రాంతి | 05.10.2016 03:32:08pm

మోదీ ప్ర‌భుత్వం ʹ మేక్ ఇన్ ఇండియాʹ పేరిట దేశ స‌హ‌జ వ‌న‌రుల‌ను వేదాంత‌, ఎస్సార్‌, టాటా, జిందాల్ వంటి బ‌హుళ‌జాతి సంస్థ‌ల‌కు క‌ట్ట‌బెడుతోంది. అందుకు......
...ఇంకా చదవండి

ఆర‌ని మంట‌లు...

| 02.11.2016 09:05:19am

2011 మార్చిలో చ‌త్తీస్‌ఘ‌డ్‌లోని తాడిమెట్ల గ్రామంలో జ‌రిగిన మార‌ణ‌హోమం పోలీసుల ప‌నే అని సీబీఐ తేల్చిచెప్పింది. ఈ కేసులో... ఎనిమిది మంది స్పెష‌ల్ పోలీస్...
...ఇంకా చదవండి

హ‌క్కుల కార్య‌క‌ర్త‌ల‌ను మోటారు వాహ‌నాల‌తో తొక్కిస్తాడ‌ట‌

సంఘ‌ర్ష్‌ | 04.03.2017 12:26:49pm

హ‌క్కుల కార్య‌క‌ర్త‌ల‌ను రోడ్డు మీద వాహ‌నాల‌తో తొక్కించాలంటూ వ్యాఖ్యానించ‌డం హంత‌క రాజ్యం న‌గ్నంగా ఊరేగుతోంద‌న‌డానికి నిద‌ర్శ‌నం. ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •