సత్యాన్ని చెప్పడమే రాజకీయ కవితా లక్షణం

| సాహిత్యం | క‌విత్వం

సత్యాన్ని చెప్పడమే రాజకీయ కవితా లక్షణం

- కెక్యూబ్ | 04.02.2020 05:17:14pm

ʹPoetry is a political act because it involves telling the truth.ʹ —June Jordan

ఏభై ఏళ్ళ విరసం సభలు ముగిసి ఇంకా ఆ ఏర్పాట్ల బడలిక తీరకుండానే ఏభై ఏళ్ళకు పైగా కలలు కని నెత్తురు ధార పోసి తెచ్చుకున్న తెలంగాణా ప్రభుత్వం ఒక వేకువ ఝామున పక్షులింకా తనున్న వేప కొమ్మల్లోంచి జాలువారుతున్న మంచు బిందువులతో తడిచిన రెక్కలను పొద్దు పొడుస్తున్న సూరీడి లేత ఎండకు ఆరబెట్టుకుని ఎగురుదామనుకునే లోపే దబదబమని తలుపులు బాదుతూ తల్లి కడుపులో తలదాచుకుని వెచ్చగా నిదరోతున్న పిల్లాడు ఉలిక్కిపడి ఏడుస్తుండగా తెరచీ తెరవని తలుపులగుండా దూసుకు వచ్చి ఇల్లంతా చిందరవందర చేసి పిచ్చి కుక్కల వలె పేట్రేగిపోయిన్ వాళ్ళని తన ఖంగుమనే గొంతుతో జాషువా పద్యం వినిపించి నవ్వుతూ భయపెట్టి వాళ్ళెంట వెళ్ళిన ప్రొ. కాశీం చేసిన నేరమేంటి. విరసం సంస్థకు కొత్తగా ఎన్నుకోబడిన కార్యదర్శిగా తనింకా కాళ్ళూ చేతులూ కూడదీసుకుని తను ప్రేమించే సంస్థను సరికొత్త ఆలోచనలతో మరింతగా మందిలోకి తీసుకుపోదామన్న కలనింకా తన రెప్పలనుండి బయటకు రాకముందే తనను బంధించి కాళ్ళకు సంకెళ్ళు వేసిన రాజ్యం తను కలగన్నదేనా?

తనేమీ అజ్నాతంగా జీవిస్తున్న వ్యక్తి గాదు. ప్రతి రోజూ తన తరగతి గదిలో పాఠం చెప్పే ప్రొఫెసర్. ఎక్కడ సభ జరిగినా ప్రజల హక్కులకు భంగం వాటిల్లినా వాళ్ళ గొంతుగా తన గొంతు విప్పి నిలబడే వక్త. నిత్యమూ యువతరం మధ్యలో తన వాడి వేడి ఆలోచనలను వారితో పంచుకునే అధ్యాపకుడు. మార్గనిర్దేశకుడు. పత్రికా సంపాదకుడు కావడమే. ఇదే రాజ్యానికి కంటగింపయి తన కంట్లో నలుసుగా మారుతున్న కాశీం ఇప్పుడు తన పునాదులు కదిలించే సాహిత్య సాంస్కృతిక సంస్థకు నాయకుడిగా ఎదగడాన్ని భరించలేకపోయింది. అసలు తనెప్పుడో రాజద్రోహ నేరాన్ని తలకెత్తుకున్నానని నిర్భయంగా ప్రకటించాడు. కొత్తగా నువ్వే నేరమూ మోపనక్కరలేదు. అయినా నిత్యమూ ప్రజా ద్రోహం చేసే పాలకులకు వ్యతిరేకంగా మాటాడుతూ రచనా వ్యాసంగం చేయడమే నేరంగా చూస్తున్న రాజ్యమే పెద్ద ద్రోహి. కాశీం పై తప్పుడు కేసులతో దాడి చేస్తూనె వుంది రాజ్యం. ప్రజల నుండి తన ఆలోచనలనుండి తనను దూరం చేయాలని చూసే రాజ్యం చేసే కుట్రను ఎదుర్కోవడంలో తామెప్పుడూ విజయం సాధిస్తూనే వుంటారు ప్రజా రచయితలు ఉద్యమకారులు. అయినా రాజ్యం తన Mind Game ఆడుతూనే వుంటుంది. ఈ మేకా పులి జూదంలో చివరకు మేకదే విజయం సాధించే రోజు త్వరలోనే వస్తుంది.

ప్రొ. కాశీం గొంతు ఎంత పదునుగా వాడిగా సూటిగా మన మెదళ్ళను కదిలిస్తుందో తన కవిత్వం కూడా అంతే నిక్కచ్చితనంతో సూటిదనంతో మనల్ని తనవైపుకు తిప్పుకునేలా చేస్తుంది. సత్యాన్ని చెప్పడమే రాజకీయ కవితా లక్షణమైనప్పుడు అది కాశీం కవిత్వంలో మరింతగా ప్రతిఫలిస్తుంది. ఏ నేరమైతే తన మీద మోపబడి నిర్బంధించబడ్డారో అదే నేరాన్ని శీర్షికగా రాసిన కవిత రాజద్రోహం ఇందుకు చక్కని ఎంపిక. ʹPoetry is a way of taking life by the throat.ʹ —Robert Frost. ఈ మాట తన కవిత్వానికి సరిగా సరిపోలిక. తన నిత్య జీవితాన్ని అక్షరరూపమిచ్చిన కవిత ఇది. కవి నిబద్ధతకు కొలమానం.

నేను రోజూ తరగతి గదిలో
పాఠం బోధిస్తూ ఉంటాను
ʹమను చరితʹ పాఠంలో
రాజ్యానికి ʹద్రోహంʹ విన్పించింది.

తను శ్రావ్యంగా ఆలపిస్తూ బోధించే మను చరిత్రలోని బ్రాహ్మణీయ కుట్రను కలిపి విద్యార్థులతో పంచుకోవడం రాజ్యానికిక్కడ ద్రోహమయింది. తరగతి గదిలో తనకిచ్చిన సిలబస్ ను యాంత్రికంగా చెప్పి వప్ప చెప్పించుకునే మామూలు ఉపాద్యాయునికీ, గుండెలో రగిలే అగ్నిపర్వతమున్న కాశీం లాంటి ప్రజల మాస్టారికి తేడా రాజ్యానికెప్పుడూ ఎరుకలోనే వుంటుంది. అందుకే ఆయన పాఠం చెప్పడం ద్రోహమయిందిప్పుడు. తరగతి గదికి దూరమయితే ఆ ఉపాధ్యాయుని మనసు ఎంత విలవిలలాడుతుందో కదా తల్లి కోడిలా. అదే ఇప్పుడు రాజ్యానికి కావాల్సింది. మానసికంగా కుంగదీసి వ్యక్తులను చీకటి కొట్లో బంధించి వారిని వారి ఆలోచనలకు దూరం చేయాలనే కుట్ర. కానీ ఈ మానసిక వికృత క్రీడకు లొంగే వాళ్ళు కారు కాశీం.

నేను తెలంగాణ గోసను
ప్రజలతో సంభాషిస్తూ ఉంటాను
పోలీసులకు కుట్ర కనిపించింది

నేను తెలంగాణలో
రాలిపడుతున్న మాంసం ముద్దలకు
నాలుగు అక్షరాలు తొడుగుతాను
పాలకులకు ʹచట్టవ్యతిరేకʹయ్యాను

ప్రజలతో మమేకమయి వారి బాధలను వాటి వెనుక దాగిన నిజాన్ని ప్రజలకు వివరించడమే కుట్రయిన సందర్భం. ఏ చట్టాన్ని రాసుకుంటారో అదే చట్టానికి తూట్లు పొడిచే పాలకులకు కవి చట్టవ్యతిరేకమవుతాడు. ఈ నిక్కచ్చితనం నిబద్ధత నిర్భీతి తన కవిత్వ శైలిలో నిండుగా పొదువుకున్న కాశీం రచన ఉప్పెనలా ఆవరించుకుంటుంది. ఇది తన ప్రత్యేకత.

తను పుట్టి పెరిగిన నేల దు:ఖాన్ని తన దు:ఖంగా ప్రకటించడమే కవి కర్తవ్యం. అది ద్రోహమైతే ఆ ద్రోహాన్ని చేయడానికి వెనుకాడనని ప్రకటించిన కాశీం మనకందరికీ ఆదర్శం కావాలి. తన వ్యక్తిత్వాన్నే తన రచనలలో ప్రకటించడమే ప్రజా రచయిత లక్షణం అయినప్పుడు అది నూటికి నూరు పాళ్ళూ కాశీం.

తెలంగాణ కన్నీళ్ళను నింపడం
ద్రోహమైతే
నేను రాజద్రోహం చేయడానికి సిద్ధం.

ప్రభుత్వం బేషరతుగా ప్రొ. కాశీం సార్ ని విడుదల చేయాలి.
విప్లవ రచయితల సంఘం వర్థిల్లాలి.

No. of visitors : 173
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఆకు క‌ద‌ల‌ని చోట వ‌ర్షించిన క‌విత్వం

కేక్యూబ్ వ‌ర్మ‌ | 20.10.2016 12:53:32am

ఒకమారుమూలపాఠశాలఉపాధ్యాయుడు ఈ నిశ్శబ్దాన్నిభరించలేక ఈ ఉక్కపోతనుధిక్కరిస్తూతనచుట్టూవున్నఆకుకదలనితనాన్నికవిత్వంగామనముందుఆవిష్కరించినదే ఈ సంకలనం.......
...ఇంకా చదవండి

ఆ పావురాలు!

కేక్యూబ్ వ‌ర్మ‌ | 02.01.2017 11:39:40pm

ఒలికిన నెత్తురు అద్దిన జెండానందుకుంటూ గుంపుగా ఆ పావురాలు! ...
...ఇంకా చదవండి

తెలవారని ఆకాశం!

కేక్యూబ్ వ‌ర్మ‌ | 07.12.2016 11:52:30am

కొన్ని మంచు బిందువులేవో రాతిరి కురిసిన వాన చివుళ్ళ నుండి రాలుతూ రెక్కల చాటున ముఖం దాచుకున్న పక్షి టపటప రెక్కలల్లారుస్తూ ఎగరబోతూ...
...ఇంకా చదవండి

నమస్కరిస్తూ..

కేక్యూబ్ వ‌ర్మ‌ | 04.09.2017 11:18:59am

కళ్ళకు గంతలు కట్టుకొన్నదని మీ న్యాయ దేవత ముందు నగ్నంగా నిలబడిన ఆ పదముగ్గురూ విడిచిన లజ్జను మీ మఖంపై నెత్తుటి ఉమ్ముగా ఊసి!...
...ఇంకా చదవండి

జీవ‌సూత్రాన్ని చెప్పే చింతా అప్పలనాయుడు ʹదుక్కిʹ

కెక్యూబ్‌ వర్మ | 16.06.2018 09:22:29am

కవితలనిండా రైతు జీవన చిత్రమే. ఒక దు:ఖార్తితో కొనసాగుతుంది. కురవని వానలు కలసిరాని కార్తెలు అప్పుల ఊబిలు కాడెద్దులను దూరం చేసే యంత్రాల దాష్టీకం అక్కరకు రాని ప...
...ఇంకా చదవండి

గులాబీ!

కేక్యూబ్ వ‌ర్మ‌ | 17.04.2017 11:32:19am

వాడెంత విధ్వంసం చేసినా నీ పసివాడి చేతిలో గులాబీ విచ్చుకుంటూ వాడిని భయపెడుతూనే వుంది!!...
...ఇంకా చదవండి

దక్షిణ యాత్ర

కెక్యూబ్ వర్మ | 04.06.2017 01:12:22pm

నీ ఒంటి రంగును హేళన చేసి నిన్ను బానిస చేసుకో చూస్తున్నాడు నీకంటూ మిగిలిన ఆఖరి అవకాశం నిన్ను నువ్వు జెండాగా ఎగురవేయడమే!!...
...ఇంకా చదవండి

మస్వాల్..

కెక్యూబ్ వ‌ర్మ‌ | 03.09.2016 12:37:26am

మరుగుతున్న మంచు తెరలుగా విడిపోతూ రాలిపోతున్న మస్వాల్ పూలెన్నో ఇప్పుడిక్కడ ఒకటే హృదయ ఘోష ఆజాదీ ఆజాదీ .......
...ఇంకా చదవండి

కుందాపన

కెక్యూబ్ వర్మ | 04.01.2018 01:31:58pm

ఈ కవిత్వం నిండా పరచుకున్న దాహం ఒంటరితనం.సమూహంలో తను నిలబడ్డ చోటు ఒంటరిగా ఒక దీపపు సమ్మెకింద నీడలా వెంటాడడాన్ని మనకనుభవంలోకి తెస్తుంది.కలసి నడవాల్సిన దారు......
...ఇంకా చదవండి

ఒంటరి వెన్నెల

కేక్యూబ్ వ‌ర్మ‌ | 07.05.2016 08:29:33am

ఈ ఇప్ప పూల వనం రాలిపోతూ నిబ్బరాన్ని వదిలి నివురు కప్పుకుంది తూరుపింకా తెలవారక నీ పేరు తలుస్తూ పొలమారుతొంది...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2020
  తెర ముందు కథ!
  షాహిన్ భాగ్..షాహిన్ భాగ్
  హిబా కోసం
  నాడు రెండుకళ్ళ-నేడు మూడు కాళ్ళ ముచ్చట్లు
  సత్యాన్ని చెప్పడమే రాజకీయ కవితా లక్షణం
  షాహీన్ బాగ్... ఒక స్వేచ్ఛా నినాదం
  విప్లవం నేరం కాదు. విప్లవకారుడు నేరస్తుడూ కాదు.
  అరెస్టు - అన్‌టచబులిటీ
  విప్లవ కవిత్వంలో ఈ తరం ప్రతినిధి
  నిర్బంధ ప్రయోగశాల
  అరుణతార జనవరి - 2020

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •