హిబా కోసం

| సాహిత్యం | క‌విత్వం

హిబా కోసం

- నయీమా అహ్మద్‌ మజూర్‌ | 04.02.2020 05:51:41pm

అమ్మా...చలిగా ఉంది

నన్ను గట్టిగా పట్టుకో

తను నొప్పితో ఏడుస్తుంది

అమ్మ అంటుంది

చలికాదమ్మా

మంచుతునకలు నిను జిల్లుమనేలా చేస్తున్నవి

అమ్మా...నన్ను గట్టిగా పట్టుకో

ఇది చుట్టుముట్టిన రాత్రి కన్నా చీకటిగా ఉంది

తను దు:ఖిస్తుంది

అమ్మ అంటుంది

చీకటిగా ఉన్నది రాత్రికాదు

పల్లెను చుట్టుముట్టిన కాలిన బొగ్గు

అమ్మా... నన్ను గట్టిగా పట్టుకో

అలల తరంగాలలో నాకు దాహం వేస్తున్నది

తను గుసగుసలాడుతుంది

అమ్మ అంటుంది

ఘోషపెడుతున్నది ఝేలం కాదు

పచ్చి పుండైన వెరినాగ్‌ నెత్తురు ఎగజిమ్ముతున్నది

అమ్మా... నన్ను గట్టిగా పట్టుకో

నాకు ఊపిరాడటం లేదు

తను గట్టిగా కేక పెడుతుంది

అమ్మ అంటుంది

ఊపిరాడనివ్వనిది దుమ్ము నిండిన గాలికాదు

నీ గొంతును తొక్కేస్తున్న పాదాలు

అమ్మా... నన్ను గట్టిగా పట్టుకో

నేను కదల్లేకపోతున్నా

తను గట్టిగా ఊపరి విడుస్తుంది

అమ్మ అంటుంది

అది నిను నిలువరిస్తున్న ఉరుము కాదు

నిను గురిపెట్టి చంపుతున్న తుపాకి

(హిబా కశ్మీర్‌లో భద్రతా దళాల కాల్పుల్లో పెల్లెట్‌ గాయం తగిలిన 18 నెలల చిన్నారి. టియర్‌ గ్యాస్‌తో ఇళ్ళు నిండిపోతే హిబా తల్లి తలుపులు తెరిచి తనను బైటికి తీసుకుపోతుండగా తన కుడి కంట్లో పెల్లెట్‌ దిగింది)

(కాశ్మీర్‌ లోయలోని వెరినాగ్‌ ప్రాంతంలో ఝేలం నది జన్మిస్తుంది)

అనువాదం: వరలక్ష్మి





No. of visitors : 314
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


సోషలిజమే ప్ర‌త్యామ్నాయం, నక్స‌ల్బ‌రీయే భారత విప్లవ పంథా

పి.వరల‌క్ష్మి | 29.04.2016 11:02:35am

20, 21వ శతాబ్దంలో పుట్టుకొచ్చిన భిన్న ధోరణుల‌న్నీ సారాంశంలో మార్క్సిస్టు వ్యతిరేకత ముఖ్యమైన ల‌క్షణంగా కలిగి ఉంటున్నాయి. కొన్నయితే మార్క్పిజం పేరుతోనే ప్రపంచ...
...ఇంకా చదవండి

నేనెందుకు రాస్తున్నాను?

పి.వరలక్ష్మి | 05.10.2016 01:16:41am

బూర్జువా పార్టీలు, మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తాయి కాబట్టి వాస్తవాలు చెప్పడం కోసం రాస్తాను. ఉదాహరణకు కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని దశాద్బాలుగా ఒక.......
...ఇంకా చదవండి

పెట్టుబడిదారీ వ్యవస్థ గర్భంలోనే ఎడతెగని సంక్షోభాలు

వ‌ర‌ల‌క్ష్మి | 12.03.2017 12:32:58am

సంక్షోభ కాలసూచికలు : ప్రజా ఆకాంక్షలు, ఆచరణ - సోషలిజమే ప్రత్యామ్నాయం (విర‌సం సాహిత్య పాఠ‌శాల కీనోట్).....
...ఇంకా చదవండి

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం

| 28.07.2016 08:35:37pm

అసంఖ్యాక రచనలు నిండైన సాహితీ జీవితాన్ని, నిబద్ధ సామాజిక దృక్పథాన్ని, నిజాయితీని తెలియజేస్తాయి. ఆమె రచనల్లో, ఆమె సామాజిక జీవితంలోనే ʹహజర్ చురాషిర్ మాʹ .......
...ఇంకా చదవండి

సీమ విద్యార్థులు ఆలపించిన కరువు రాగాల ʹకన్నీటి కెరటాలుʹ

పి.వరలక్ష్మి | 03.09.2016 01:40:55am

మన ఊర్లలో గూటి గువ్వలు, పాల పిట్టలు, ఎర్ర జొన్నలు, సజ్జ గింజెలు ఏమైపోయాయి? రాయలసీమ ప్రకృతి మరింతగా ఎందుకు నాశనమవుతోంది? పౌష్టిక ఆహారాన్నిచ్చే తిండి .......
...ఇంకా చదవండి

ఇది మనిషి మీద యుద్ధం

పి. వరలక్ష్మి | 19.04.2016 10:59:20am

సైనిక, రాజకీయార్థిక, ప్రచార రంగాల్లో సామ్రాజ్యవాదం ఎంత దాడి చేస్తున్నదో అర్థం చేసుకోవాలంటే వాటన్నిటినీ అనుసంధానించే మంద్రస్థాయి యుద్ధాన్ని అర్థం చేసుకోవాలి...
...ఇంకా చదవండి

ఆ చావు ఎవరికీ రావొద్దు - యురేనియం ఎక్కడా తవ్వొద్దు.

పి.వరలక్ష్మి | 19.11.2019 08:06:37pm

నాగప్పకు బొత్తిగా బాలేదు. ఇరవై రోజుల క్రితం కింది నుండి తొడల భాగం దాకా విపరీతంగా బొబ్బలోస్తే పులివెందుల గవర్నమెంట్ ఆస్పర్తిలో చేర్చారట. రెండు రోజులుండి వచ్...
...ఇంకా చదవండి

మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రం పై కీనోట్

పి. వ‌ర‌ల‌క్ష్మి | 03.06.2016 10:43:06pm

9, 10 జ‌న‌వ‌రి 2016 తేదీల్లో విజ‌య‌వాడ‌లో జ‌రిగిన విరసం 25వ రాష్ట్ర మ‌హాస‌భ‌ల్లో మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రంపై రాష్ట్ర కార్య‌ద‌ర్శి పి. వ‌ర‌ల‌క్ష్మి కీనోట్‌...
...ఇంకా చదవండి

ఉనా స్వాతంత్ర నినాదం

పి.వరలక్ష్మి | 15.08.2016 10:44:28pm

ఆగస్టు పదిహేను ద్రోహం చెప్పకపోతే అన్నం సహించదు నాకుʹ అని చెరబండరాజు అన్నట్లు బూటకపు స్వాతంత్రాన్ని ఎండగడుతూ నిజమైన స్వాతంత్రం కోసం ఉనా దళిత సమ్మేళనంతో... ...
...ఇంకా చదవండి

ప్రొఫెస‌ర్‌ క‌ంచ‌ ఐల‌య్య‌కు సంఘీభావంగా భావప్రకటనా స్వేచ్ఛకై

వరలక్ష్మి | 01.06.2016 09:29:12am

ప్రభుత్వాలు భావాల పట్ల నియంత్రణలు అమలుచేయజూస్తూ, భిన్నాభిప్రాయాన్ని, నిరసనను క్రిమినలైజ్ చేస్తూ దేశవ్యాప్తంగా ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలకు వ్య...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India

All sections of working masses should be united together irrespective of caste and religious diferences, to fight in the path of caste annihilation..

  • Students and the Revolution
  • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
  • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
  • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    కరోనా లాఠీఛార్జ్ : ఇది మనకు అభ్యంతరం అనిపించాలి కదా?
    నిజమైన స్వాతంత్రం కోసం పోరాడటంలోనే భగత్ సింగ్ స్ఫూర్తి ఉంది
    చేతులు కడిగేసుకోవడం తప్ప ఇంకేమైనా చేయగలరా?
    అరుణతార మార్చి - 2020
    ఉన్నావో సీత
    ʹఅక్కడ ఒక్క చెట్టు కూడా లేదుʹ
    విస్తరణ - క‌ల‌ల‌కు దారులైన దండ‌కార‌ణ్య క‌థలు
    బస్తర్ లో మళ్లీ శాంతియాత్ర
    అభివృద్ధికి అసలైన అర్థం ఏమిటో ప్రశ్నించిన కథ..
    సూర్యోద‌యం దిశ‌ను మార్చుకుందా?
    ఢిల్లీ హింస కుట్రదారులు మోడీ, అమిత్ షాలే
    మూడో తరానికి...

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •