షాహిన్ భాగ్..షాహిన్ భాగ్

| సాహిత్యం | క‌విత్వం

షాహిన్ భాగ్..షాహిన్ భాగ్

- ఉదయమిత్ర | 04.02.2020 06:05:43pm


క్రూర చట్టముల సవాలుచేస్తూ
నల్ల సముద్రమె ఉప్పొంగినదీ
(నేపథ్యంలో.. షాహిన్ భాగ్..షాహన్ భాగ్ )

ఖురానుబట్టిన చల్లనిచేతులు
ఒక్కసారిగా పిడికిళ్ళయనయి
చందమామనే పాడినగొంతులు
మరఫిరంగులై మోగినవి
"క్రూర చట్టముల "
(నేపథ్యంలో.. షాహిన్ భాగ్..షాహిన్ భాగ్ )

దుఃఖపు నదులే పోటెత్తంగా
దిక్కులన్నియు కలుసుకున్నవీ
నింగితారలే అచ్చెరువందగ
నేలతారలై వెల్గు నింపినరు
"క్రూర చట్టముల "
( నేపథ్యంలో. ..షాహిన్ భాగ్..షాహిన్ భాగ్ )

పాలకులూ ప్రతిపక్షాలన్నీ
ఒకే కుట్రలో భాగంకాగా
ప్రజా పాలన రుచి చూపంగా
చరిత్రనేమో బిత్తరపోయే
" క్రూర చట్టముల "
(నేపథ్యంలో. షాహిన్ భాగ్..షాహిన్ భాగ్ ..)

చంటిపాపనేదెచ్చిన తల్లి
పాలలోనె ధైర్యాన్ని గలిపెనూ
నిద్రించే పసిపాప కన్నుల
రేపటిస్వప్నం ప్రతిఫలించెనూ
"క్రూర చట్టముల "
( నేపథ్యంలో..షాహిన్ భాగ్..షాహిన్ భాగ్ )

నల్ల చట్టముల సాకునుజూపి
రోడ్లమీదకు ఈడ్వకముందే
ప్రజలే ముందుగ కదిలివొచ్చిరి
రోడ్డును ఇల్లుగ జేసుకున్నరు
"క్రూరచట్టముల"
(నేపథ్యంలో..షాహిన్ భాగ్..షాహిన్ భాగ్..)

రోడ్లుసైతమూ స్తంభించెనులే
పాలనసైతం స్తంభించెనులే
పండుముసలులే పోరులనిలువగ
చలికే పాపం చలిబుట్టినదీ
"క్రూరచట్టముల "
(నేపథ్యంలో..షాహిన్ భాగ్ ..షాహిన్ భాగ్.. )

దారీ తెన్నూ తెలీనిజాతికి
షాహిన్ బాగొక దారిజూపెనూ
దేశమంతటా షాహిన్ భాగులే
పుష్పించాలని కలగందాము
(అందరూ... షాహిన్ భాగ్..షాహిన్ భాగ్..)

No. of visitors : 290
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India

All sections of working masses should be united together irrespective of caste and religious diferences, to fight in the path of caste annihilation..

 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  కరోనా లాఠీఛార్జ్ : ఇది మనకు అభ్యంతరం అనిపించాలి కదా?
  నిజమైన స్వాతంత్రం కోసం పోరాడటంలోనే భగత్ సింగ్ స్ఫూర్తి ఉంది
  చేతులు కడిగేసుకోవడం తప్ప ఇంకేమైనా చేయగలరా?
  అరుణతార మార్చి - 2020
  ఉన్నావో సీత
  ʹఅక్కడ ఒక్క చెట్టు కూడా లేదుʹ
  విస్తరణ - క‌ల‌ల‌కు దారులైన దండ‌కార‌ణ్య క‌థలు
  బస్తర్ లో మళ్లీ శాంతియాత్ర
  అభివృద్ధికి అసలైన అర్థం ఏమిటో ప్రశ్నించిన కథ..
  సూర్యోద‌యం దిశ‌ను మార్చుకుందా?
  ఢిల్లీ హింస కుట్రదారులు మోడీ, అమిత్ షాలే
  మూడో తరానికి...

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •