దేశవ్యాప్త నిర్బంధంలో భాగమే కా. కాశీం అరెస్టు

| సంపాద‌కీయం

దేశవ్యాప్త నిర్బంధంలో భాగమే కా. కాశీం అరెస్టు

- విరసం | 18.02.2020 01:56:37pm

విరసం కార్యదర్శి కా. కాశీంను జనవరి 18న అక్రమంగా అరెస్టు చేశారు. దానికంటే ముందు తెంగాణలో అనేక మంది ప్రజాసంఘా నాయకును అరెస్టు చేశారు. అక్టోబర్‌ 4న టీవీవీ నాయకుడు నాగరాజును, 5న బలరాంను, 10వ తేదీన విరసం కార్యవర్గ సభ్యుడు జగన్‌ను అరెస్టు చేశారు. 15న టీఎస్‌ఎఫ్‌ నాయకుడు నమాస క్రిష్ణ, టీవీవీ అధ్యక్షుడు మద్దిలేటిని అరెస్టు చేశారు. నవంబర్‌ 12న ప్రముఖ కథా రచయిత్రి బి. అనూరాధను, విప్లవ మేధావి రవిశర్మను అరెస్టు చేశారు. 17న తెంగాణ ప్రజా ఫ్రంట్‌ నాయకుడు మెంచు రమేష్‌, చైతన్య మహిళా సంఘం నాయకురాు శ్పిను, 18న సీఎంఎస్‌ నాయకు దేవేంద్ర, స్వప్న, టీవీవీ నాయకుడు మెంచు సందీప్‌ను అరెస్టు చేశారు. వీళ్లందరి మీద చట్ట వ్యతిరేక కార్యకలాపా నిరోధక చట్టం కేసు పెట్టారు. వీళ్లేగాక తెంగాణలో సుమారు 65 మంది ప్రజాసంఘా నాయకు, రచయితు, మేధావు మీద ఈ అక్రమ కేసు పెట్టారు. కాశీంతో సహా వీళ్లందరూ వివిధ ప్రజా జీవన రంగాల్లో దశాబ్దా తరబడి పని చేస్తున్నారు. అరెస్టు, అక్రమ కేసు బెదిరింపు ద్వారా తెంగాణలో అసమ్మతి లేకుండా తుడిచేయాని కేసీఆర్‌ భావిస్తున్నాడు.
అయితే ఇది తెంగాణకే పరిమితం కాదు. దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకత్వంలో ప్రజ మీద, ప్రజాస్వామిక శక్తు మీద దారుణమైన అణచివేత కొనసాగుతోంది. మహారాష్ట్రలో ప్రభుత్వం మారాక భీమా కొరేగావ్‌ కేసును కేంద్రం ఎన్‌ఐఏకు అప్పగించింది. గత ఏడాదిన్నరగా అక్రమ నిర్బంధంలో ఉన్న విరసం వ్యవస్థాపక సభ్యుడు వరవరరావుతో సహా మరో ఎనిమిది మంది మేధావుకు బెయిు రాకుండా చేయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ దుర్మార్గానికి ప్పాడిరది. నాగపూర్‌ అండా సెల్‌లో ఉన్న జీఎన్‌ సాయిబాబ ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆయనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి న్యాయ, వైద్య సహాయం అందడం లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో 2018 సెప్టెంబర్‌లో ఎమ్మెల్యే కిడారి సోమేశ్వరరావు, శివారి సోమ హత్య కేసును వివిధ ప్రజాసంఘా నాయకు మీద పెట్టారు. అమరావతి రాజధాని ఆందోళన స్వభావం ఏదైనా సరే, అక్కడి రైతు మీద కేసు పెట్టి వేధిస్తున్నారు. ఆంధ్రా ఒడిషా సరిహద్దు ప్రాంతంలో, దండకారణ్యంలో, పశ్చిమ కనుమల్లో విప్లవోద్యమం మీద నిర్బంధం తీవ్రమైంది. కూబింగ్‌, ఎన్‌కౌంటర్‌ హత్యు నిత్యకృత్యమయ్యాయి.
దేశవ్యాప్తంగా అన్ని ప్రజాస్వామిక ఉద్యమా మీద, బుద్ధిజీవు మీద ఇలాంటి నిర్బంధమే అమవుతోంది. గత రెండు నెలకు పైగా సీఏఏ, ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా దేశంలో ఒక పెద్ద ప్రజా సంచనం జరుగుతోంది. క్షలాది మంది ప్రజు వీధుల్లోకి వచ్చి పోరాడుతున్నారు. విద్యార్థు, మహిళు క్రియాశీ నాయకత్వం అందిస్తున్నారు. ఒక బహిరంగ సభలో పాల్గొనడానికి వచ్చిన భీం ఆర్మీ నాయకుడు చంద్రశేఖర అజాద్‌ను హైదరాబాదులో పోలీసు అక్రమంగా అరెస్టు చేసి వెనక్కి పంపించేశారు. రెండు తొగు రాష్ట్రాలో సీఏఏ వ్యతిరేక సభు, సమావేశా మీద ఎన్నో ఆంక్షు అమువుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. కన్హయ్‌కుమార్‌లాంటి వాళ్లు వక్తుగా ఉన్న సభు, ఊరేగింపు మీద దాడు జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ సీఏఏ వ్యతిరేక ఆందోళను ఆర్గనైజ్‌ చేస్తున్న వాళ్ల మీద ఎన్నో అక్రమ కేసు పెడుతున్నారు. వీటన్నిటికీ పరాకాష్ట ఢల్లీిలో జేఎన్‌యూ, జామియా మిలియా ఇస్లామియా వర్సిటీలో విద్యార్థు మీద జరుగుతున్న దాడు. ఏకంగా విద్యార్థు మీద యూనివర్సిటీల్లో తుపాకీ క్పాుు జరుగుతున్నాయి. దేశం మొత్తానికి సీఏఏ వ్యతిరేక స్ఫూర్తిదాయక పోరాటం చేస్తున్న షహీన్‌బాగ్‌లో కూడా దాడు జరుగుతున్నాయి. ఎవరు పోలీసులో, ఎవరు సంఫ్‌ు కార్యకర్తలో తెలియనంతగా రాజ్యం ముసుగున్నీ తొగించి ఫాసిస్టు హింసను అము చేస్తోంది.
ఈ క్రమంలో డిసెంబర్‌ 13న జామియా మిలియా ఇస్లామియా వర్సిటీలో, జనవరి 16న అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీలో పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ప్రసంగించాడని జవహర్‌ లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాయం

విద్యార్థి షార్జిల్‌ ఇమామ్‌ దేశద్రోహి అయ్యాడు. మత ద్వేషంతో కోట్లాది మంది ప్రజ ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చుతున్న సందర్భంలో ఓ పౌరుడిగా ఆయన చేసిన ఆగ్రహ ప్రకటనను సాకు చేసుకొని ఆయన మీద కేసు పెట్టి అరెస్టు చేశారు. దీన్ని ఖండిరచిన మరో 51మందిపైన కూడా దేశద్రోహునే ముద్రవేశారు. కర్ణాటక రాష్ట్రం, బీదర్‌లోని షాహీన్‌ ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలో జనవరి 21న పౌరసత్వ సవరణ చట్టాన్ని విమర్శిస్తూ ఓ నాటకాన్ని ప్రదర్శించారంటూ స్కూల్‌ యాజమాన్యం, ఉపాధ్యాయు, తల్లిదండ్రుపై పోలీసు దేశద్రోహం కేసు నమోదు చేశారు. అసోం రైతు కూలీ నేత, హక్కు కార్యకర్త అఖిల్‌ గొగోయ్‌కి మావోయిస్టుతో సంబంధాున్నాయనే ఆరోపణతో అతడిపై దేశద్రోహం కేసు పెట్టారు. ఆయన్ను అరెస్టు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ గౌహతిలోని అతడి ఇంట్లో సోదాు నిర్వహించింది. ఉత్తరప్రదేశ్‌లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాడని ప్లి డాక్టర్‌ ఖఫీల్‌ఖాన్‌ను ప్రభుత్వం ఖైదు చేసింది.
కేరళలో నవంబర్‌ 2న ఇద్దరు సీపీఎం పార్టీ సభ్యు, కన్నూర్‌ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు న్యాయశాస్త్ర విద్యార్థు అన్‌ షుహైబ్‌, తహ ఫసల్‌ను పోలీసు అరెస్టు చేశారు. కోజికోడ్‌లో మావోయిస్టు అనుకూ కరపత్రాు పంపిణీ చేస్తున్నారనే ఆరోపణతో వారిపై ఉపా కేసు పెట్టారు. జనవరిలో అస్సామీ మేధావి హీరేన్‌ గోసైన్‌ మీద కూడా సీఏఏను వ్యతిరేకించినందుకు దేశ ద్రోహం కేసు నమోదయ్యాయి. తాజాగా ఇదే విషయంలో 135 మందిపై ఉత్తరప్రదేశ్‌లో దేశద్రోహ కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో చేర్చిన 35 మంది పేర్లతో పాటు మిగిలిన వారిని గుర్తుతెలియని వ్యక్తుగా పేర్కొన్నారు. వారిలో 19 మందిని అరెస్టు చేశారు.
ఈ వివరాు ఇటీవలి సీఏఏ వ్యతిరేక ఆందోళన మీద అమవుతున్న నిర్బంధానికి కొన్ని ఉదాహరణలే. ఈ నిర్బంధం దేశంలోని తీవ్రమైన ఆర్థిక సంక్షోభానికి వ్యక్తీకరణు. సామ్రాజ్యవాద అనుకూ దోపిడీ విధానాపై చర్చ లేకుండా చేయడానికే సీఏఏ వంటి ఫాసిస్టు చట్టాను కేంద్రం తీసుకొస్తోంది. ప్రజు, ప్రజాస్వామిక వాదు మీద కేసు పెట్టి అక్రమంగా అరెస్టు చేస్తోంది. నిర్బంధం గురించి మాట్లాడటమంటే మౌలిక సమస్య గురించి మాట్లాడటమే. ప్రజా సమస్య గురించి మాట్లాడే క్రమంలోనే అన్ని రకా ప్రజాస్వామిక శక్తుపై అమువుతున్న నిర్బంధాన్ని ఎదిరించగటం. అన్ని రకా పీడిత అస్తిత్వ, ప్రజాస్వామిక శక్తు, విప్లవ శక్తు ఐక్యంగా పోరాడితేనే ఈ ఫాసిస్టు దుర్మార్గాను అడ్దుకోగం. విప్లవ చైతన్యంతో సాహిత్య సాంస్కృతిక రంగంలో పని చేస్తున్న కా. కాశీం దగ్గరి నుంచి ఈ రోజు(ఫిబ్రవరి10న) ఢల్లీిలో విద్యార్థుపై పోలీసు దాడు దాకా ఏవీ విడి అంశాు కాదు. ఇవన్నీ బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజంలో భాగమే. తీవ్రమైన అర్థిక సంక్షోభంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నియంతృత్వంగా మారిపోయి ఇలాంటి నిర్బంధాన్ని తీసుకొస్తుంది. వేర్వేరు సమస్యుగా, భిన్న అణచివేతుగా కనిపించే అన్నిటినీ కలిపి ఆలోచించి అర్ధం చేసుకొని ఎదిరించాల్సిందే.

No. of visitors : 252
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •