ఒకరు వెనుక ఒకరు

| సాహిత్యం | క‌విత్వం

ఒకరు వెనుక ఒకరు

- అరసవిల్లి కృష్ణ | 18.02.2020 03:12:45pm

ఆకాశం నుండి ఊడిపడిన సరళ రేఖను కాదు
అమ్మ శరీరం నుంచి ప్రాణం పోసుకున్న బిడ్డ
మట్టి రేణువులు ముద్దాడిన తర్వాత
విచ్చుకున్న పూల దారిలో
బోసి నవ్వుల పసిబిడ్డ

ఏడుస్తున్న పెదవులపై
తొలి ముద్దును స్వీకరించిన చిన్నారి
నీ ముందటి ప్రతిబింబాన్ని గుర్తించావా
లేత చేతుల తో శరీరాన్ని తడుముతూ
భూగోళపు తెలిమంచులో
అమ్మ పిలిచిన పేరు
వినబడుతుందా

శరీరానికి తోడయిన పేరు
నీడలా పరిభ్రమిస్తువేళ
మనుషులు గుంపులో నడుస్తున్నప్పుడు
అనేక గొంతులు ఒకే నామాన్ని పలుకుతున్నపుడు

ఎవరయినా
తల్లి బొడ్డు పేగు పై
రక్తకణాల సంఖ్య అడిగితే

ఆటస్థలంలో
ముళ్ళ కంచెలు మిగిల్చిన గాయాలను
శరీరంపై మిగిల్చిన మచ్చలను
జాగ్రత్త చేసావు కదా

అన్నింటినీ తాటాకు రేకులపై భద్రపరుచు
పూర్వీకులు మృతదేహాల దుర్వాసనను
కట్టెల పొయ్యి దగ్గర పాదముద్రలను
వారు ధరించిన రవికెలను
రంగు వెలిసిన చొక్కాలను-
భద్రం చేయి

నడుస్తున్న నావికుడా
రంగస్థలంపై జోళె పట్టిన బిచ్చగాడా
అనేక ఉరి తాళ్ళు వేళ్ళాడుతున్నాయి
హఠాత్తుగా ఉరితాడు
ముత్తాత పేరు అడుగుతుంది
జ్ణాపకాల నానమ్మను కలగను-

ఒకరి వెనుక ఒకరు
గతాన్ని కాగితాలలో పట్టుకొని
కాగితం పై కనబడే
వణుకుతున్న కంఠస్వరాల చప్పుడు వింటూ
దేశమంతా పాలిపోయిన ముఖం వలే-

అనాది స్వరం
నిన్ను పిలవాలని ఆశించకు
అమ్మ ముందు నిలబడి
ఇంద్రియ నిగ్రహము లేని కరసేవకుడా
మెదడును మృదువుగా తాకతావా
జల,జల రాలతాయి
నా పూర్వీకుల శ్రమ బిందువులు
ఎంగిలి మాటల, ఎంగిలి భాషల ఖూనీకోర్

మానవ నిర్మిత ప్రపంచం
కాగితాలపై తేలియాడదు
మనిషి చిరునామా ,
వేదాల, ఉపనిషత్తుల,
అంధకారంలో లేదు
ఈనేల నిర్మాణం కోసం-
కృష్ణుడు, రాముడు
నీ కోట్లాది దేవతలు
చొంగ కార్చిన సమయాలు లేవు

నాదగ్గర
నాదేశ మూలవాసుల దగ్గర
ఏ ధృవీకరణ పత్రం లేదు

ఏ గోడల్ని నిర్మించినా
పగులతున్న ఇటుకలలో
పచ్చని మొక్కగా
జీవం పొందుతాం

వినబడుతుందా చిన్నారి
పాలబుగ్గల ఎరుపు
దేశం వింటున్నది ,





No. of visitors : 450
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


రెక్కల గూడు

అరసవిల్లికృష్ణ | 19.05.2018 08:44:01am

ఏమయినావు పావురాయి నీడల్ని- జాడల్ని మరిచిన మనుషులు కి తూర్పు దిక్కున ఎర్రని కాగడా వుందని నీ కళ్ళతో చెప్పలేక పోయావా- పొలికేక వినబడుతుందని.....
...ఇంకా చదవండి

రంగుల రాట్నం హఠాత్తుగా ఆగితే..

అరసవిల్లి కృష్ణ | 01.05.2020 12:27:46am

మార్చి 20న భారత ప్రధాని నరేంద్ర మోది మార్చి 22 ఆదివారం జనతా కర్ప్యూ అని ప్రకటించాడు. రేపటి తమ ఉపాధి ఏమిటి అనే ఆలోచించుకునే ప్రజలు సోమవారం తమ పనులకు ఆటంకం.....
...ఇంకా చదవండి

మనకు తెలియని మేరువు

అరసవిల్లి కృష్ణ | 02.06.2020 10:36:37pm

మేరువు నవల మనకు తెలియని స్త్రీల చరిత్రకు సంబంధించినది. అనేక ముద్రల మధ్య విలువలను స్త్రీలు మాత్రమే కాపాడాలి....
...ఇంకా చదవండి

అసమానత నుండి విప్లవం దాకా..

అరసవిల్లి కృష్ణ | 16.07.2020 11:41:15pm

కవిగా కాశీంను అంచనా వేయడానికి వాచకాన్ని చదవడం, కవిని దూరంగా వుండి గమనించడం మాత్రమే సరిపోదు. కవిని దగ్గరగా చూడాలి. కవి హృదయంలోకి దారి చేసుకొని వెళ్ళగలగాలి....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

  • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
  • Students and the Revolution
  • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    విప్లవ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాద్ కు నివాళి
    అరుణతార జులై - 2020
    వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
    గాలింపు, స్థూపాల కూల్చివేత
    కవి కాశీం కవిత్వ విశ్లేషణ
    అసమానత నుండి విప్లవం దాకా..
    ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
    తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
    కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
    వరవరరావును జైలులో చంపవద్దు
    మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
    "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •