ఫిబ్రవరి4న చత్తీస్ ఘడ్ నారాయణపూర్ జిల్లా మార్కెబెడ్ గ్రామం మీద పోలీసులు దాడి చేశారు. గ్రామస్థుల్ని నానా హింసలు పెట్టి ఊళ్లో ఉన్న పాఠశాలను కూలగొట్టారు. ముగ్గురు ఉపాధ్యాయినిలను అరెస్టు చేసి తీసికెళ్లారు. 11వ తేదీన కోర్టుకు తీసికెళ్లారు. వారం రోజులు అక్రమ నిర్బంధంలో ఉంచుకున్నారు. ఈ టీచర్ల మీద పోలీసులు అనేక అబద్దపు ఆరోపణలు చేశారు. మొట్ట మొదట అది మావోయిస్టులు నిర్వహిస్తున్న పాఠశాల. అందులో పాఠాలు చెప్పడం నేరం. అక్కడితో ఆగలేదు. ఈ మహిళలు టీచర్లు కాదు, మావోయిస్టులు, రామ్సు వడ్డే మావోయిస్టు లోకల్ ఆర్గనైజేషన్ స్క్వాడ్(ఎల్ వోసీ) సభ్యురాలు, సునీత గాడె ఎల్ వోసీ డిప్యూటీ కమాండర్, మైనీ మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యురాలు అని ప్రచారం చేస్తున్నారు. ఈ ముగ్గురు టీచర్లకు కాంకేర్ జిల్లాలో అనేక నేరాల్లో పాల్గొన్నారని నారాయణ్ పూర్ జిల్లా ఎస్పీ మోహిత్ గార్గ్ అన్నాడు.
పోలీసులు ఒక పథకం ప్రకారం ఆ ఊరి మీద దాడి చేశారు. వాస్తవానికి అక్కడి స్కూలును సాల్వాజుడం బలంగా ఉన్న రోజుల్లో ఒకసారి తగలబెట్టారు. గ్రామస్థులు మళ్లీ నిర్మించుకున్నారు. ఇప్పుడు మళ్లీ దాడి చేసి గ్రామస్థులను వేధించారు. ఆ స్కూలును మావోయిస్టులు నిర్వహిస్తున్నారు కాబట్టి దాన్ని కూలగొట్టమేగాక, అక్కడ పాఠాలు చెప్పే ఉపాధ్యాయినిలను మావోయిస్టులని అరెస్టు చేశారు. ఈ పని చేసింది చత్తీస్ ఘడ్ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ (డిఆర్జి). డిఆర్జి అంటే ఏమో కాదు. సాల్వాజుడుం మారు పేరు. చత్తీస్ ఘడ్ లో ప్రభుత్వాలు మారాయి. కానీ స్థానిక ఆదివాసీలనే విప్లవోద్యమం మీదికి ఉసిగొలిపే విధానాలు మారలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. భూపేష్ బగెల్ ముఖ్యమంత్రి. అజిత్ జోగి, రమణ్ సింగ్ కాలం నాటి అణచివేత విధానాలే. ఏవీ మారలేదు. అప్పుడూ స్కూళ్లు తగలబెట్టారు. టీచర్లను అరెస్టు చేశారు. ఇప్పుడూ అదే పని చేస్తున్నారు. .
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో అభివృద్ధి కోసం 30 వేల కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వం చెప్పుకుంటోంది. ʹఅభివృద్ధి అంటే ఇళ్లు కూల్చి రోడ్లు వేయుటʹ అని 1997లోనే వరవరరావు రాశారు. గత రెండు మూడు దశాబ్దాల్లో దేశమంతటా అన్ని రాజకీయ పార్టీలకూ ఇదే అధికార విధానం. చత్తీస్ ఘడ్ లో కూడా అంతే. స్కూళ్లను తగలబెట్టి, టీచర్లను జెయిలుపాలు చేసి ఇదే అభివృద్ది అని ప్రభుత్వం బరితెగిస్తోంది.
ఈ టీచర్ల మీద ఏం కేసు పెట్టి ఉంటారు? ఇప్పటికే జిల్లా ఎస్పీ వాళ్ల మీద అనేక నేరాలు ఆరోపించాడు. కాబట్టి ఆ కేసులతోపాటు ఉపా కూడా తప్పక పెట్టే ఉంటారు. చత్తీస్ ఘడ్ లో ఉపా దుర్వినియోగం తారా స్థాయిలో ఉందని ఒక పరిశీలన.
ఈ సంఘటనకు తెలంగాణకు పోలికలు కనిపించడం లేదా? మార్కెబెడ్ గ్రామం దేశం మొత్తానికి సూక్ష్మ వాస్తవమని అనిపించడం లేదా?
ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో పాఠాలు బోధించే సాయిబాబా, షోమాసేన్, కాశీంవంటి వాళ్లతోపాటు గతంలో అధ్యాపక వృత్తిలో ఉండిన వరవరరావు, సుధా భరద్వాజ్ లాంటి వాళ్ల మీద పోలీసులు చేసిన ఆరోపణలే మార్కెబుడ్ పాఠశాల ఉపాధ్యాయినిల మీద కూడా చేస్తున్నారు. సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొంటున్న అధ్యాపకుల మీద, బుద్ధిజీవుల మీద చేస్తున్న చార్జెస్ ఈ ముగ్గురు ఉ పాధ్యాయినిల మీద కూడా పెట్టారు. కేసు కాయితాల్లో ఏం రాస్తున్నారనే న్యాయ సంబంధమైన విషయం కూడా మాట్లాడుకోవచ్చుగాని, అసలు విషయం విద్యార్థులకు పాఠం చెప్పనివ్వకపోవడం. ప్రజలతో మంచీ చెడూ మాట్లాడనీయకపోవడం.
బలమైన ప్రతిఘాతుక భావజాల పునాది ఉన్న బీజేపీ ఈ పని చేయడంలో చాలా స్పష్టమైన అర్థం ఉన్న మాట నిజమే. కానీ అన్ని పాలకపార్టీలకు ఆ అర్థంతో పేచీ ఉండదు. ఆ పార్టీలు కోరుకునేది కూడా నిస్సందేహంగా అదే. కాకపోతే మావోయిస్టు సంబంధమైన విషయం మాట్లాడటానికి ఎవరికైనా తటపటాయింపు ఉండొచ్చు. పైగా మావోయిస్టు విషయాలు అంత ʹజన రంజకంగాʹ ఉండవు కాబట్టి, నేరుగా పోలీసులు ఇంటికే వస్తారు కాబట్టి ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టవచ్చు. కానీ విషయం ఒకటే. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం, చత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం, దేశమంతా అదే సంఘ్ ప్రభుత్వం పైకి చూడ్డానికి మాత్రమే తేడా.
ఇవాళ విద్యాలయాల్లో పాఠాలు చెప్పడానికి వీల్లేదనే వైఖరిని కేంద్రంలోని ఆర్ఎస్ఎస్ ప్రభుత్వంతో సహా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నాయి. చెబితే ఆంధ్రప్రదేశ్ లోలాగా భావాలకు, భాషకు అనుసంధానం లేని ʹఆంగ్లంʹలో చదువు చెప్పాలి. లేదా సరస్వతీ శిశుమందిర్లలో వలె హిందూ ధార్మిక విద్య చెప్పాలి. దీనికి భిన్నంగా ఢిల్లీ విశ్వవిద్యాలయంలో, హైదరాబాదు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో, దండకారణ్య జనతన రాజ్యంలోని ప్రజా పాఠశాలలో ఏ పాఠం చెప్పినా పాలకులు అంగీకరించరు. మొదటటీచర్లను అరెస్టు చేస్తారు. నగరాల్లో అయితే అర్బన్ మావోయిస్టులని ఆరోపిస్తారు. దేశభక్తి లేనివారిగా, జాతి ద్రోహులుగా చిత్రీకరిస్తారు. చత్తీస్ ఘడ్ లో అయితే స్కూళ్లను కూడా తగలబెట్టేస్తారు. టీచర్లకు మావోయిస్టు నిర్మాణాలతో సంబంధం ఆపాదిస్తారు. అభూతకల్పనలతో నేరాల చిట్టా తయారు చేస్తారు.
భావాలంటే భయం ఆర్ఎస్ఎస్ కే కాదు. అన్ని బూర్జువా పార్టీలకు, ప్రభుత్వాలకు ఉంది. విద్యాలయాల్లో భావ సంఘర్షణను ఇవి అంగీకరించవు. తీవ్రమైన ఆర్థిక సంక్షోభకాలంలో భావ సంఘర్షణను పాలకులు ప్రమాదకరంగా భావిస్తారు. బూర్జువా ప్రజాస్వామ్యం నియంతృత్వంగా మారడం అంటే ఇదే. మన దేశంలో ఫాసిజం ఇట్లా వచ్చింది. దీనికి హేతుబద్ధత అంటే పడదు. జ్ఞానం అంటే కంటగింపు. కాబట్టే స్కూళ్లను కూలదోస్తారు. విశ్వవిద్యాలయాలపై, గ్రంథాలయాలపై దాడులు చేస్తారు. విద్యార్థులపై నేరుగా కాల్పులు జరుపుతారు. విశ్వవిద్యాలయాల ఆధునిక చింతనను భ్రష్టు పట్టించాలని చూస్తారు. యూనివర్సిటీల్లో అనాగరిక భావజాలం తిష్ట వేసుకోవాలని చూస్తారు. దీన్ని అంగీకరించని అధ్యాపకులను అరెస్టు చేసి జైల్లో పెడతారు. ఒక పక్కన ఈ ప్రపంచం ఇలా ఎందుకు నడుస్తున్నదో, దోపిడీ ఎలా జరుగుతున్నదో, అణచివేత, హింస ఎలా కొనసాగుతున్నాయో విడమర్చి చెప్పే తార్కిక జ్ఞానం అందిస్తున్న స్కూళ్లను కూలగొడుతున్నారు. ఇంకో పక్క పేదరికం కనిపించకుండా గోడలు కట్టగలరు. తరతరాల పౌరసత్వాన్ని రద్దు చేసి కాన్సన్ ట్రేషన్ క్యాంపులు నిర్మించగలరు.
అక్రమ అరెస్టులు ʹనేరాలʹను ప్రకటించవు. వ్యవస్థ అట్టడుగున ఉన్న హింసాత్మక వాస్తవాన్ని ఎత్తి చూపుతాయి. సందర్భం ఏదైనా కావచ్చు. ప్రాంతం ఏదైనా కావచ్చు. వ్యక్తులు ఎవరైనా కావచ్చు. వాళ్లు విశ్వసించే భావజాలం ఏదైనా కావచ్చు. ఆరోపించే ʹనేరంʹ ఏదైనా హింసా రూపాలను ప్రశ్నించడమే. దోపిడీ గురించి మాట్లాడటమే.
చత్తీస్ ఘడ్ లో మావోయిస్టులు స్కూళ్లను కూలగొడుతున్నారని పోలీసులు ప్రచారం చేయగానే మైదాన ప్రాంత మేధావుల్లో కొందరు నిజమే అని నమ్మేశారు. విప్లవం తెస్తామంటున్న వాళ్లు సూళ్లను కూలదోయడం ఏమిటని నిలదీశారు. అక్కడ ఏం జరుగుతోందో మావోయిస్టులు చెప్పే ప్రయత్నం చేస్తే కొందరు నమ్మడానికి కూడా సిద్ధం కాలేదు. దండకారణ్యంలోని స్కూళ్లనే కాదు, దేశ రాజధానిలో గ్రంథాలయాలను కూడా తగలబెట్టేదాకా ఫాసిజం ఇప్పుడు బలపడింది. ఇప్పటికైనా ఫాసిస్టు సూక్ష్మ రూపాలను అంగీకరిస్తారో లేదో?
Type in English and Press Space to Convert in Telugu |
వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల...... |
రైతు - నీళ్లురైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం...... |
ఈ తీసివేతలు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా......... |
ఆజాదీ కశ్మీర్ : చల్లారని ప్రజల ఆకాంక్షకాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........ |
జీవిత కవిత్వం విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్ పద్ధతులకు వ... |
వివేక్ స్మృతిలో...వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు....... |
భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమేఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి...... |
కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్ దేశస్థుల స్వేచ్ఛ గు... |
మానవ హననంగా మారిన రాజ్యహింస ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం....... |
నాగపూర్ వర్సెస్ దండకారణ్యందండకారణ్య రాజకీయ విశ్వాసాలంటే న్యాయవ్యవస్థకు ఎంత భయమో సాయిబాబ కేసులో రుజువైంది. నిజానికి ఆయన మీద ఆపాదించిన ఒక్క ఆరోపణను కూడా కోర్టు నిరూపించలేకపోయిందిగాని, ... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |