ఢిల్లీ హింస కుట్రదారులు మోడీ, అమిత్ షాలే

| సంపాద‌కీయం

ఢిల్లీ హింస కుట్రదారులు మోడీ, అమిత్ షాలే

- సాగర్ | 04.03.2020 11:19:39am

దేశ రాజధానిలో మృతదేహాలతో, కన్నీళ్లతో, దుఃఖంతో, భయంతో బతుకుతున్న ప్రజలు ప్రస్తుత రాజకీయ పరిస్థితిని సూచిస్తున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకుంటున్న చోట మూకస్వామ్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న గొంతులను నులిమివేస్తున్నారు. భిన్న స్వరాలూ వినిపించడం, నిరసన ప్రకటించడం దేశద్రోహంగా పరిగణించే దశ నుండి దేశద్రోహులని కాల్చిపడేయండి అనే దాక మన ప్రజాస్వామ్యం రోజుకో మెట్టు ఎక్కుతూనే ఉంది. ఇక మీదట భిన్న స్వరాన్ని కలిగి ఉంటే మరణశిక్ష విధించే దాక వెళ్లినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇందుకు మోదీ 2014 నుంచి ఇప్పటిదాకా చేసిన పరిపాలనే సాక్ష్యం. 2014 లో అధికారంలోకి వచ్చిన తరువాత ఆక్లాక్, పన్సారే, కల్బుర్గి, గౌరీ లంకేశ్ హత్యలు మొదలు ఇప్పుడు తాజాగా ఢిల్లీలో గతం వారం పది రోజులుగా జరుగుతున్న మారణహోమం హిందుత్వ విస్తరణ విషయంలో సంఘ్ పరివార్, మోదీలకున్న స్పష్టతను తెలియచేస్తున్నాయి.

ఆర్టికల్ 370 రద్దు, చట్టల సవరణలు, అప్రజాస్వామిక చట్టాలు, అయోధ్య తీర్పుల తరువాత గత డిసెంబర్ 11న కేంద్రప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని(సిఏఏ) పార్లమెంటులో ఆమోదింపచేసింది. ఈ చట్టం జనవరి 10 నుండి అమలులోకి వచ్చింది. ఈ బిల్లు రాజ్యాంగంలోని లౌకికవాదానికి వ్యతిరేకంగా ఉంది. సాధారణంగానే ఇది ముస్లిం మైనారిటీ హక్కులను కాలరాసేవిధంగా ఉంది. సిఏఏ పార్లమెంటులో ఆమోదం పొందిన తరువాత నుంచి దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు మొదలయ్యాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా మహిళలు పెద్ద సంఖ్యలో రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలియచేశారు. తమ ఉనికికి, అస్తిత్వాలకు ముప్పుగా ఉన్న ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని ఆందోళనలు చేపట్టారు. దేశ రాజధాని ఢిల్లీలో షహీన్ బాగ్ లో మహిళలు పెద్ద ఎత్తున గుమ్మికూడి నిరసనలు చేపట్టారు. జామియా, జేఎన్యూలలో నిర్బంధం, హింస సాగుతున్న రోజులలో షాహిన్ బాగ్ ఆ పోరాటాన్ని ఎత్తుకుంది. సహజంగానే దేశవ్యాప్తంగా నడుస్తున్న పోరాటాలకు ప్రతీక అయింది. సుప్రీం కోర్టు ఆర్డర్ తో బలవంతంగా ఖాళీ చేయించేంత వరకు దాదాపు 50 రోజులకు పైగా నిరసన చేస్తునే ఉన్నాయి. ఈ నిరసనలు జరుగుతున్న సందర్భంలోనే ఢిల్లీలో ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల సభలలో పాల్గొన్న బిజెపి నేతలందరూ కూడా నిరసన తెలుపుతున్న వారు దేశద్రోహాలని వారిని కాల్చి చంపాలని, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులంటూ విద్వేషపూరిత ప్రసంగాలు చేశారు. ఎన్నికలు సిఏఏ రెఫరెండంగా ప్రకటించుకున్నారు. తీరా ఎన్నికల ఫలితాలలో ఆ పార్టీకి ఎదురుదెబ్బే తగిలింది. గతంలో లాగా దేశభక్తి కొలమానాలు ఈ సారి ప్రజల ముందు పనిచేయలేదు. ఇది వాళ్ళు బహిరంగంగానే ఒప్పుకునే స్థితికి చేర్చింది. దీని వెనుక షాహిన్ బాగ్ ఉంది. దేశంలో నిరసన తెలుపుతున్న వేలాది షహీన్ బాగ్ లు ఉన్నాయి. ఇది అధికార బిజెపికి, తన గురువు సంఘ్ పరివార్ కు ఒక ఆశనిపాతం అయింది. ఇది అడ్డు అదుపులేకుండా తన ఇష్టా రాజ్యాంగ వ్యవహరిస్తు బ్రాహ్మణీయ హిందుత్వకు ఎదురుదెబ్బ. అందుకే 2002 లో గుజరాత్ లో ఎదైతే చేశారో ఎలాగైతే మనుషులను వేటాడి చంపారో అలాగే ఢిల్లీలో వ్యవహరించారు.

ఫిబ్రవరి 22 న భీం ఆర్మీ నాయకుడు చంద్రశేఖర్ సీఏఏ కు వ్యతిరేకంగా దేశవ్యాప్త బందుకు పిలుపునిచ్చాడు. ఫిబ్రవరి 23న ఆ బందుకు మద్దతుగా ఈశాన్య ఢిల్లోని చాంద్ బాగ్ నుంచి రాజ్ ఘాట్ వరకు ర్యాలీ తీయడానికి నిర్ణయించుకున్నారు. పోలీసులు దానికి అనుమతినివ్వలేదు. అదే రోజు మధ్యాన్నం బీజేపీ ఎమ్మెల్యే కపిల్ మిశ్రా ట్విట్టర్ లో తన మద్దతుదారులందరిని మోజ్ పూర్ వద్దకు రావాలని ఒక పిలుపునిచ్చాడు. మధ్యాన్నం 3:30 గంటలకు అక్కడ ఉన్న తన మద్దతుదారులతో "ఇక్కడ డీసీపీ మన ముందు ఉన్నాడు. నా, మనందరి తరుపున ఇక్కడ చాంద్ బాగ్ , జాఫ్రాబాద్ లో నిరసన తెల్పుతున్న వారంతా కూడా ట్రంప్ పర్యటిస్తున్న ఈ మూడు రోజుల లోపు ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాలి. అప్పటిదాకా నేను శాంతియుతంగా ఉంటాను. అప్పటికి మీరు(పోలీసులు) దీనిని ఖాళీ చేయించకపోతే మేమే దాడులతో ఖాళీ చేయిస్తాము" అని ప్రకటించాడు. ఇది జరిగిన వెంటనే మధ్యాన్నం 3:45 గంటలకు బాబార్పూర్ లో నిరసనకారుల మీద దాడి మొదలైంది. సాయంత్రం 4 గంటలకు మౌజ్పూర్, చాంద్ బాగ్ , కరవాల్ నగర్ ప్రాంతాలలోని నిరసనకారుల మీద దాడులు జరిగాయి. మళ్ళి రాత్రి 9 గంటలకు దాడులు జరిగాయి. ఇంత జరిగినప్పటికీ ప్రజలు మళ్ళి 24 ఉదయం తమ నిరసనను కొనసాగించారు. 24 మధ్యాహ్నం మరోసారి నిరసనకారులమీద దాడులు జరిగాయి. మూడు రోజుల పాటు సీఏఏ నిరసనకారుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ దాడులలో సుమారు 50 మంది వరకు నిరసనకారులు మరణించారు. తమ ఉనికిని కాపాడుకోడానికి, తమలాంటివారి ఉనికిని కాపాడటానికి తమ ప్రాణాలను ధారపోశారు. ఫిబ్రవరి 25న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఎస్. మురళీధర్ పోలీసులను దీనికి కారణమైన బిజెపి నాయకులు అనురాగ్ ఠాకూర్, కపిల్ మిశ్రా, అభయ్ వర్మల మీద కేసు నమోదు చేయాలని ఆదేశించాడు. ఆదేశాలు జారీ చేసిన అర్ధరాత్రి ఆయనను హర్యానా హైకోర్టుకు బదిలీచేస్తూ కేంద్రం ఉత్తర్వులు ఇచ్చింది.

బాధితులను పరామర్శించకపోగా ఈ దాడులు జరిపింది అక్రమ వలసదారులంటూ బీజేపీ ప్రచారం చేస్తూ వచ్చింది. ఢిల్లీలో క్రేజీవాల్ ప్రభుత్వం ఉన్నప్పట్టికీ పోలీసు వ్యవస్థ కేంద్రం ఆధీనంలో ఉంటుంది. మొత్తం దాడులు జరుగుతున్న క్రమంలో తమను రక్షించమని పోలీసులకు దాదాపు 13000 ఫోన్ కాల్స్ వచ్చాయి. కానీ పోలీసు వ్యవస్థ వాటిని పట్టించుకోలేదు. ఒక పార్లమెంట్ మెంబెర్ కు 15 మంది ముస్లింలు తమను చంపడానికి వచ్చిన వారి నుండి రక్షించమని ఫోన్ చేసారు. ఆ ఎంపీ పోలీసులకు ఫోన్ చేస్తే స్పందన లేదు. పక్కన నివాసముంటున్న హిందువులు వాళ్ళని రక్షించకపోతే వీరు కూడా మరణించేవారు. దాడులు ఆపాల్సినవాళ్ళే బాధితుల మీద దాడులు చేస్తూ జనగణమన పాడాలంటూ, హిందుత్వ నినాదాలు చేశారు. దాడులు చేస్తున్న వారిని గుర్తించే సిసి కెమెరాలను పోలీసులే స్వయంగా నాశనం చేసారు. వైద్య సహాయం అందించడానికి వస్తున్న అంబులెన్సులను అడ్డుకున్నారు. హిందువుల ఇళ్ళమీద దాడులు జరగకుండా కాషాయ జెండాలు తగిలించారు, వీధులకు బారికేడ్లును అడ్డుపెట్టారు. దాడులు కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులను చంపాలని చూసారు కానీ మేము హిందువులమే అన్నందుకు వాళ్ళని ఏమి చేయకుండా వదిలివేశారు. ఇది కేంద్ర ప్రభుత్వ నిఘా వ్యవస్థకి తెలియకుండా జరిగింది కాదు. తెలిసే కావాలనే జరిపినట్టు సంఘటనలు రుజువు చేస్తున్నాయి. అందుకే మోదీ కానీ అమిత్ షా కానీ బాదితులను పరామర్శించలేదు.

ఇక అరవింద్ కేజ్రీవాల్ ప్రవర్తన బిజెపి నమ్మకమైన మిత్రుడిలా ఉంది. ఢిల్లీ ఎన్నికల్లో బిజెపి పరాజయం ఇచ్చిన ఊరట జనానికి కొద్ది ఘడియలు కూడా నిలవలేదు. పోలీసు విభాగం తన అధీనంలో లేకపోయినా బాధితుల విషయంలో ఒక సామాన్యుడిలా కూడా అతను స్పందించలేదు. తాజాగా ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్య, కన్నయ్య కుమార్ లపై పాత కుట్ర కేసును కూడా బైటికి తీసి విచారించడానికి అనుమతినిచ్చాడు.

పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించిన సంఘ్, బిజెపి శక్తులు ఇవి పాకిస్తాన్ చేసిన కుట్ర, ముస్లింలు, అక్రమవలసదారులు చేసిన కుట్ర అని పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది తుకడేతుకడే గ్యాంగ్ పని అంటూ కేంద్ర సహాయ హోమ్ మంత్రి హైదరాబాద్లో మాట్లాడుతున్నాడు. అసలు అలాంటి గ్యాంగ్ అనేది లేదని కేంద్ర సమాచార శాఖనే చెప్పింది. కానీ మళ్ళి మళ్ళి ఇలాంటి అసత్య ప్రచారాలనే బిజెపి చేస్తూ వస్తున్నది. దీనికి కొనసాగింపుగా ఢిల్లీ అల్లర్లకు హైద్రాబాదులో ఉన్న కొంత మంది విద్యార్థులు కారణం అంటూ కేంద్ర ఇంటిలిజెన్స్ శాఖ మీడియాకు లీకులు ఇస్తున్నది. ఇది మరో భీమా కోరేగాం కుట్ర కేసు కాబోతున్నదా అన్న సంకేతాలు ఇస్తున్నది. తామే దాడి చేసి తామే కేసులు పెట్టి ప్రజల పక్షాన మాట్లాడుతున్న గొంతులను అణిచివేయడంలో భాగంగా ఇలా చేస్తున్నది. తమకు అడ్డువచ్చిన ఎవరినైనా సరే ఇలాగే కుట్ర కేసులలో ఇరికిస్తామంటూ హెచ్చరిస్తున్నది. ఈ దాడులతో దేశ వ్యాప్తంగా జాతీయత పేరుతో ఒక పోలరైజేషన్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నది. ఎవరైనా తమ దారికి అడ్డువస్తే ఇలాగే దాడులు చేస్తామని ప్రకటిస్తున్నది. మాట్లాడే గొంతులను అణిచివేయడానికే ఈ చర్యలను చేపట్టింది. కానీ వీటన్నిటిని ఎప్పటిలానే పాకిస్థాన్ మీద అర్బన్ మావోయిస్టుల మీదకు నెట్టివేస్తుంది. అంతేకాక ఈ దాడులతో తన సంక్షోభం నుంచి ప్రజల ద్రుష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నది. ఒక్క షాహిన్ బాగ్ నో, చాంద్ బాగ్ నో ఖాళీచేయిస్తే తమకు ఎదురు ఉండదనుకుంటున్న హిందుత్వ శక్తులకు దేశంలో ప్రతి రోజు నడుస్తున్న వేలాది షాహిన్ బాగ్ లు సమాధానం కావాలి. వాటిలో మనమందరం భాగం కావాలి.

No. of visitors : 571
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


స్మృతి చిహ్నాలు... పోరాటపు గుర్తులు

సాగ‌ర్‌ | 19.09.2016 10:53:49am

స్మృతి చిహ్నాలు మనం చూడలేని గత చరిత్రకి సంబందించిన ఆనవాళ్లుగాను , ఒక తరం నుంచి మరొక తరానికి వాటి రాజకీయ భావజాలాన్ని ప్రచారం చేసే సాధనలుగాను , వారి అమర........
...ఇంకా చదవండి

నేనూ అర్బన్ మావోయిస్టునే

సాగర్ | 22.09.2018 09:53:57pm

పూణే పోలీసులు బీజేపీ ప్రభుత్వం చేసిన ఈ అమానవీయ చర్యకు ప్రజలు ʹమీ టూ అర్బన్ నక్సల్ʹ, ʹపూణే పోలీస్ జవాబు దోʹ అంటూ తమ నిరసనను తెలిపారు......
...ఇంకా చదవండి

ఆ కాఫీ తోటలు ఎవరివి?

సాగర్ | 05.10.2017 11:05:45pm

విశాఖ మన్యంలో ఆదివాసులు 30 ఏళ్లగా మావోయిష్టు పార్టీ నాయకత్వంలో పోరాడి కాఫీ తోటలపై సంపాదించుకున్న యాజమాన్య హక్కును తిరిగి తీసుకోవడానికి ఆంద్రప్రదేశ్ ......
...ఇంకా చదవండి

ప్రజల పై యుద్ధం

సాగ‌ర్‌ | 05.10.2016 12:31:57am

ప్ర‌జ‌లు,సామ‌జిక కార్య‌క‌ర్తలు నేడు దండకారణ్యంలో జరుగుతున్న పాశవిక దాడికి, హక్కుల హననాకి వ్యతిరేకంగా తమ మద్దతు తెలపాల్సిన అవసరంను ఈ పుస్తకం మనముందుంచుతుంది ...
...ఇంకా చదవండి

వ్యవస్థ పొట్టవిప్పి చూపెడుతున్న కరోనా

సాగర్ | 01.04.2020 10:30:27pm

గత మూడు నెలలుగా ప్రపంచమంతా కరోనా చుట్టూ తిరుగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది లక్షల మందికి పైగా దీని బారిన పడ్డారు....
...ఇంకా చదవండి

బాబుకు ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది.

సాగర్ | 16.04.2019 12:13:15am

అంతులేని రాజ్యహింసకు, హక్కుల హననానికి పాల్పడిన చంద్రబాబు ప్రజాస్వామ్యం విలువలు అంటూ మాట్లాడటం కొత్తగా, వింతగా, కాసింత వినోదంగా కూడా ఉండొచ్చు......
...ఇంకా చదవండి

హిందూ రాజ్యం దిశగా

సాగర్ | 17.11.2019 10:20:58am

ʹఒకే ప్రజ, ఒకే భాష, ఒకే సంస్కృతి,ఒకే జాతి, ఒకే దేశం, ఒకే నాయకుడుʹ అనే సంఘ్ పరివార్ రాజకీయ లక్ష్యానికి ఆర్టికల్ 370 రద్దు తరువాత ఈ తీర్పు మరో విస్తరణలాంటిదే....
...ఇంకా చదవండి

కిసాన్ ముక్తి మార్చ్

సాగర్ | 06.12.2018 12:02:02am

ʹఅయోధ్య ఆలయం కాదు రుణ మాఫీ కావాలిʹ నినాదాలతో దేశ రాజధాని ప్రతిధ్వనించింది. లక్షకు పైగా రైతుల మట్టి పాదాలు తాకి ఢిల్లీ పార్లమెంట్ వీధులు పులకించాయి......
...ఇంకా చదవండి

వేటకెళ్ళిన ఆదివాసులను వేటాడి చంపిన పోలీసులు

సాగర్ | 17.03.2019 10:35:13pm

తమ కాళ్ళ కింద ఉన్న అపార ఖనిజ సంపదను పెట్టుబడిదారులకు పంచిపెట్టడానికి ప్రభుత్వాలు ఆదివాసులను చంపివేస్తున్నాయి. ఆ నిర్బంధాన్ని, హింసను తట్టుకుని వారు ప్రభు......
...ఇంకా చదవండి

చంద్రబాబు అయిదేళ్ల పాలన - మీడియా మేనేజ్మెంట్

సాగర్ | 01.04.2019 01:47:11pm

చంద్రబాబు చేసిన దోపిడీ అంతా ఆయన మానేజ్మెంట్ నైపుణ్యంతో అభివృద్ధి అయింది. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలలో తిరిగి దీనినే ఉపయోగిస్తూ ʹనేను రాకపోతే అన్ని ఆగిపోతాయిʹ అ.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •