సూర్యోద‌యం దిశ‌ను మార్చుకుందా?

| సంభాషణ

సూర్యోద‌యం దిశ‌ను మార్చుకుందా?

- క్రాంతి | 04.03.2020 11:29:22am

ʹహుస్నా...ʹ పియూష్ మిశ్రా క‌లం నుండి, గ‌ళం నుంచి వెలువ‌డిన ఈ గీతాన్ని కొన్ని వంద‌ల సార్లు విని ఉంటాను. ఎన్ని వంద‌ల‌సార్లు విన్నా త‌నివి తీర‌ని పాట అది. పియూష్ గొంతులోని ఆర్ధ్ర‌త‌... హృదయంలోని ఆవేద‌న‌... నిద్ర‌లోనూ, మెల‌కువ‌లోనూ వెంటాడుతూనే ఉంటుంది. మ‌ళ్లీ మ‌ళ్లీ మంటో క‌ళ్ల‌ముందు క‌ద‌లాడుతుంటాడు. సాహిర్ హృద‌యంలో నిండిపోతాడు. ఫైజ్ ఆవ‌హిస్తాడు.

దేశ విభ‌జ‌న‌కు ముందు నాటి జ్ఞాప‌కాల‌ను నెమ‌రేసుకుంటున్న వ్య‌క్తి గుండె గొంతుక ఆ పాట‌. ఇండియా - పాకిస్తాన్ ఒక్క‌టిగా ఉన్న‌కాలంలో స‌రిహ‌ద్దులెర‌గ‌ని ప్రేమ‌ను, విద్వేష‌మెర‌గ‌ని జీవ‌న సంస్కృతిని గానం చేస్తున్న ప్రియుడి గొంతు అది.

మ‌నుషుల మ‌ధ్య మ‌తాల ముళ్ల కంచెలు మొలుచుకొచ్చాక‌... ʹతోబా టేక్ సింగ్ʹ కుప్ప‌కూలిపోయాక‌... ప్రేమ‌లు దూర‌మ‌య్యాక‌... ప్రాణం మిగిలి ఉండ‌డం ఎంత విషాదం? స‌లుపుతున్న గుండెగాయాన్ని ఏ లేప‌నాల‌తో న‌యం చేయ‌గ‌లం?

ఒక్క‌టైన నేల మీద స‌రిహ‌ద్దులు గీసుకున్నాక‌... స‌గం ప్రాణాన్ని గీత‌కావ‌లే వ‌దిలి వ‌చ్చేశాక‌... నిన్న‌టి జ్ఞాప‌కాలు త‌ప్ప ఏం మిగిలి ఉంటాయత‌నికి? ఆమె ఊసుల్లో కాకుండా... అక్క‌డి ఊహ‌ల్లో కాకుండా ఎలా బ‌తికుంటాడ‌తడు?

ఇదిగో, అత‌డి జ్ఞాప‌కాల్లో మిగిలింది ఆమె మాత్ర‌మే. ఆమెతో అల్లుకున్న నిన్నటి జీవితం మాత్రమే. అందుకే... మ‌ళ్లీ మ‌ళ్లీ గ‌తించిన క‌థ‌లోకి మాయ‌మ‌వుతున్నాడు. అడ్డుగోడ‌ల్ని, ముళ్ల కంచెల్ని దాటి ఆమెతో ముచ్చ‌టిస్తున్నాడు. అక్షరాలై పలకరిస్తున్నాడు. కనుకొలకలు దాటని దుఖాన్ని కలంలోకి ఒంపి లేఖ రాస్తున్నాడు.

ఓ నా హుస్నా...

దేశ విభ‌జ‌న సూర్యోద‌యం దిశ‌ను మార్చిందా? శ‌ర‌త్ రుతువులో మునుపులాగే ఆకులు రాలుతున్నాయా? అని అడుగుతున్నాడు.

హీర్ - రంఝా ప్రేమ పాట‌లు ఇంకా న‌న్ను వెంటాడుతునే ఉన్నాయి... సూఫీ క‌విత్వం ఇంకా న‌న్ను మ‌రిపిస్తూనే ఉంది అంటూ తడి జ్ఞాప‌కాల్లోకి నడిచివెళ్తున్నాడు.

మ‌తం, ద్వేషం మ‌నుషుల మ‌ధ్య స‌రిహ‌ద్దులు గీయ‌నినాటి వ‌లే నేడుకూడా ఈద్‌, దీపావ‌ళి, హోళీ, లోహ్రీ పండుగ‌లను ప్ర‌జ‌లు నేటికీ జ‌రుపుకుంటున్నారా? అంటూ... మారిన కాలాపు క్షేమ స‌మాచారాన్ని ఆరా తీస్తున్నాడు.

నిజ‌మే... కాలం చాలా వేగంగా మారుతోంది. ఎంత వేగంగా అంటే... ఇప్పుడు అత‌డు ఆమెను త‌లుచుకోవ‌డం, త‌న త‌ల‌పుల్లో ఆమెను నిలుపుకోవ‌డం నేర‌మ‌య్యేంత‌గా. అవును... హుస్నాకు ఉత్త‌రం రాయ‌డ‌మంటే దేశ‌ద్రోహం ఇక్క‌డ‌.

దుఃఖ‌ప‌డ‌డం తెలియ‌ని వాడు... నేను దేశాన్ని దండిగా ప్రేమిస్తున్నాన‌ని దండోరా వేసుకుంటున్న కాలం క‌దా... మ‌తం పేరిట జ‌రిగిన అమాన‌వీయ హింసాకాండ‌కు పొగిలి పొగిలి రోధించిన మ‌నుషులంతా దేశ‌ద్రోహులే అవుతారు.

నిన్న‌టి దాకా క‌లిసి ఉన్న వాళ్లే కావ‌చ్చు... నీతో క‌లిసి న‌డిచిన వాళ్లే కావ‌చ్చు... త‌న జేబులోని పిప్ప‌ర‌మెంట్ల‌ను నీకు పంచిన‌ వాడే కావ‌చ్చు... రంజాన్ నాడు నీకోసం ప్రేమ‌గా పాయ‌సం తెచ్చిన వాడే కావ‌చ్చు... నువ్విప్పుడ‌త‌ణ్ని ద్వేషించాల్సిందే. నీ దేశ‌భ‌క్తిని నిరూపించుకునేందుకు స్నేహాన్ని శ‌త్రుత్వంగా మ‌లుచుకోవాల్సిందే.

అవును... ఆధిప‌త్యం కోసం సాగే యుద్ధంలో అమాయ‌క ప్ర‌జ‌లు క‌దా స‌మిధ‌లయ్యేది. స‌రిహ‌ద్దుకావ‌ల‌... ఈవ‌ల నిల్చుందీ మ‌నుషులే క‌దా? వాళ్లు అడుగుతుందీ... ఆత్మ‌గౌర‌వంతో కూడిన జీవితాన్ని. వాళ్లు అడుగుతుందీ శ్ర‌మ‌కు త‌గ్గ ఫ‌లితాన్ని. వాళ్ల‌డ‌గుతుందీ పితృస్వామ్యం నుంచి ముక్తిని. వాళ్ల‌డుగుతుందీ భావ‌ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌ను. వాళ్ల‌డుగుతుందీ జీవించే హ‌క్కును. దేశ‌మేదైనా... పాల‌కులెవ‌రైనా... ప్ర‌జ‌లు కోరుకునేది ఇదే. వాళ్ల‌కు మ‌తంతో ప‌నిలేదు. కులంతో ప‌నిలేదు. రంగుతో, రూపుతో ప‌నిలేదు. ఈ అంత‌రాల‌న్నీ అధిప‌త్యవ‌ర్గాల సృష్టే. తమ పెత్తనాన్ని నిలబెట్టుకునేందుకు, కాపాడుకునేందుకు.. మనుషుల మధ్య ద్వేషాన్ని, దూరాన్ని పెంచుతున్న రాజకీయం ఇది.

ఈ అంత‌రాల‌ను, ఈ దూరాలను చెరిపేయాలనుకోవడం రాజ్యం దృష్టిలో నేరం. మ‌నుషులంతా ఒక్క‌ట‌ని చాటుతున్న విశ్వ‌మాన‌వ ప్రేమపైనే పాల‌కుల కంట‌గింపు. అందుకే... ఇవాళ ప్రేమ కూడా రాజ‌ద్రోహ‌మే.

స‌మాన‌త్వాన్ని కాంక్షించ‌డం, స్నేహ హ‌స్తాన్ని అందించ‌డం కూడా ద్రోహ‌మే. మ‌రో మాట‌లో చెప్పాలంటే... వాళ్లు - మ‌నం అనే భాష నేర్వ‌ని వాళ్లంతా దేశ‌ద్రోహులే.

ఎవ‌రు వాళ్లు? వాళ్లంటే... మ‌న వాళ్లు కాద‌ని. వాళ్లూ... మ‌న మ‌త‌స్థులు కారు. మ‌న దేశ‌స్తులు, మ‌న భాష వాళ్లు, మ‌న కాల‌నీవాసులు కారు. మ‌న పార్టీ వాళ్లు, మ‌న రంగు వాళ్లు కారు. వాళ్ల ఆచారాలు, విశ్వాసాలు వేరు. వాళ్లు వండిన ఆహారం మ‌నం తిన‌కూడ‌దు. వాళ్ల‌ని దుస్తుల్ని బ‌ట్టి గుర్తుప‌ట్ట‌వ‌చ్చు. ʹవాళ్లు కు ఇంకా చాలా పేర్లున్నాయి. అర్బ‌న్ న‌క్స‌ల్‌, అక్ర‌మ చొర‌బాటుదారులు, జాతి వ్య‌తిరేకులు. ఈ జ్ఞానం వంట‌బ‌ట్టించుకోని వాళ్లంతా దేశ ద్రోహులే ఇప్పుడు.

అదిగో.. మొన్న ఆజాదీ మైదానం నుంచి పాకిస్తాన్ జిందాబాద్ అని వాళ్ల‌ని కీర్తించిందే అమూల్య లియోనా ఆమెకూడా దేశ‌ద్రోహే. ఏమిటీ...? ఆమె హిందుస్తాన్ జిందాబాద్ అని కూడా అందంట‌రా? అది దేశ‌భ‌క్తికి నిద‌ర్శ‌నం కాదు. వాళ్ల‌ను... పొరుగువాళ్ల‌ను ద్వేషించ‌డ‌మే దేశ‌భ‌క్తికి కొల‌మాణం.

తెలిసింది క‌దా...! వ‌ర్త‌మాన భార‌తం ఎత్తిప‌ట్టిన మూక‌స్వామ్య స్ఫూర్తి గురించి.

అయినా... ఈ ప్రేమ‌లేఖ‌ను చ‌దువుతామంటారా? అయితే... మీరూ దేశ‌భ‌క్తి ప‌రీక్షకు గురికావ‌ల్సి వ‌స్తుంది జాగ్ర‌త్త‌.

हुसना
~
लाहौर के उस
पहले जिले के
दो परगना में पहुँचे
रेशम गली के
दूजे कूचे के
चौथे मकां में पहुँचे
और कहते हैं जिसको
दूजा मुल्क उस
पाकिस्तां में पहुँचे
लिखता हूँ ख़त में
हिन्दोस्तां से
पहलू-ए हुसना पहुँचे
ओ हुसना
मैं तो हूँ बैठा
ओ हुसना मेरी
यादों पुरानी में खोया
मैं तो हूँ बैठा
ओ हुसना मेरी
यादों पुरानी में खोया
पल-पल को गिनता
पल-पल को चुनता
बीती कहानी में खोया
पत्ते जब झड़ते
हिन्दोस्तां में
यादें तुम्हारी ये बोलें
होता उजाला हिन्दोस्तां में
बातें तुम्हारी ये बोलें
ओ हुसना मेरी
ये तो बता दो
होता है, ऐसा क्या
उस गुलिस्तां में
रहती हो नन्हीं कबूतर सी
गुमसुम जहाँ
ओ हुसना
पत्ते क्या झड़ते हैं
पाकिस्तां में वैसे ही
जैसे झड़ते यहाँ
ओ हुसना
होता उजाला क्या
वैसा ही है
जैसा होता हिन्दोस्तां यहाँ
ओ हुसना
वो हीरों के रांझे के नगमें मुझको अब तक आ आके सताएं
वो बुल्ले शाह की तकरीरों के
झीने झीने साये
वो ईद की ईदी
लम्बी नमाजें
सेंवैय्यों की झालर
वो दिवाली के दीये संग में
बैसाखी के बादल
होली की वो लकड़ी जिनमें
संग-संग आंच लगाई
लोहड़ी का वो धुआं जिसमें
धड़कन है सुलगाई
ओ हुसना मेरी
ये तो बता दो
लोहड़ी का धुंआ क्या
अब भी निकलता है
जैसा निकलता था
उस दौर में हाँ वहाँ
ओ हुसना
ये हीरों के रांझों के नगमे
क्या अब भी, सुने जाते है हाँ वहाँ
ओ हुसना
और रोता है रातों में
पाकिस्तां क्या वैसे ही
जैसे हिन्दोस्तां
ओ हुसना

No. of visitors : 483
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


అక్క‌డ డేనియ‌ల్ ఉన్నాడు

సంఘ‌ర్ష్‌ | 18.11.2016 12:59:34pm

అక్క‌డ‌ బాల్యం భ‌యంలో... య‌వ్వ‌నం నిర్బంధంలో గ‌డిచిపోతుంది. ఇంటి నుంచి బ‌య‌ట‌కెళ్లిన పిల్ల‌లు తిరిగి వ‌స్తారో రారో తెలీదు. దారి కాచుకు కూర్చునే ఖాకీ మూక‌...
...ఇంకా చదవండి

బోధ‌నా హ‌క్కు కోసం మ‌రో జైలు పోరాటం చేస్తా : ప్రొIIజి.ఎన్‌.సాయిబాబా

ఇంట‌ర్వ్యూ : క్రాంతి | 01.06.2016 12:44:47pm

1930 సంక్షోభ కాలంలో హిట్లర్ యువతను, కార్మికులను కమ్యూనిస్టుల కంటే అధికంగా ఆర్గనైజ్ చేయడాన్ని గమనించవచ్చు. ఉపాధి లేక తిరుగుబాటు స్వభావంతో ఉన్నయువతను ఫాసిస్ట...
...ఇంకా చదవండి

దూతను కాల్చివేసే చోట: బస్తర్ అడవుల్లో జీవన్మరణ సమస్యగా జర్నలిజం

సుబోజిత్ బాగ్చీ (అనువాదం : క‌్రాంతి) | 17.06.2016 09:33:33am

సామాజిక కార్యకర్తలు, లాయర్లు, న్యాయ సహాయక బృందాలు డాక్టర్లు మొదలు సామాన్యుల వరకు అక్కడ ప్రతి ఒక్కరూ తుపాకీ నీడలో జీవించాల్సిందే........
...ఇంకా చదవండి

మ‌రో ఆదివాసీ యువ‌కుడు...

క్రాంతి | 03.09.2016 03:22:46pm

17 ఏళ్ల పిల్లాడిని తీసుకెళ్లి 30 ఏళ్ల యువ‌కుడిగా త‌ప్పుడు చార్జిషీటు సిద్ధం చేశారు. 2014లో ఐదుగురు జ‌వాన్లు చ‌నిపోవ‌డానికి కార‌ణ‌మైన అంబులెన్స్ ........
...ఇంకా చదవండి

పొట్ట‌కూటి కోసం పోతే... పోలీసులు కాల్చిచంపారు

| 20.10.2016 03:21:04pm

తాపీ మేస్త్రీ కాస్తా రాత్రికి రాత్రి మావోయిస్ట‌య్యాడు. మూడు రోజుల క్రితం పనికోసం వెళ్లిన‌ మ‌నోహ‌ర్ శ‌వ‌మై తిరిగి వ‌చ్చాడు. "ఎన్‌కౌంటర్" క‌థ రిపీట్ అయ్యింది....
...ఇంకా చదవండి

వెలివాడే తొలిపొద్దై పుస్త‌కావిష్క‌ర‌ణ‌

ఫొటోలు : క‌్రాంతి | 17.07.2016 12:15:31pm

రోహిత్ వేముల స్మృతిలో విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘం వెలువ‌రించిన వెలివాడే తొలిపొద్దై పుస్త‌కాన్ని రోహిత్ త‌ల్లి వేముల రాధిక ఆవిష్క‌రించారు. మార్చి ...
...ఇంకా చదవండి

సంత‌కు వెళ్లిన వాళ్లు.. శ‌వాలై వ‌చ్చారు

సంఘ‌ర్ష్‌ | 20.02.2017 11:52:50am

ఏకంగా ఇర‌వై రోజుల నుంచి మృత దేహాల‌ను ఖ‌న‌నం చేయ‌కుండా గ్రామంలోనే ఉంచుకొని ఆందోళ‌న చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఒక్క అధికారి కూడా ఈ విష‌యంలో స్పందించ‌క‌పోవ...
...ఇంకా చదవండి

అధికారం నీడ‌లో.... అంతులేని హింస‌

క్రాంతి | 05.10.2016 03:32:08pm

మోదీ ప్ర‌భుత్వం ʹ మేక్ ఇన్ ఇండియాʹ పేరిట దేశ స‌హ‌జ వ‌న‌రుల‌ను వేదాంత‌, ఎస్సార్‌, టాటా, జిందాల్ వంటి బ‌హుళ‌జాతి సంస్థ‌ల‌కు క‌ట్ట‌బెడుతోంది. అందుకు......
...ఇంకా చదవండి

ఆ చెట్టుకు నోరుంటే ..

క్రాంతి | 03.01.2017 09:49:29am

ఆట‌పాట‌ల్లో మురిసిపోయే ప‌సివాడు ఉట్ట‌న్న‌ట్టుండి న‌క్స‌లైట‌య్యాడు. క‌సిగా గుచ్చుకున్న బ‌యోనెట్ మొన వాడి మొర ఆల‌కించ‌లేదు. రాజ్యం ఎక్కుపెట్టిన తుపాకీ తూటాల...
...ఇంకా చదవండి

ఆర‌ని మంట‌లు...

| 02.11.2016 09:05:19am

2011 మార్చిలో చ‌త్తీస్‌ఘ‌డ్‌లోని తాడిమెట్ల గ్రామంలో జ‌రిగిన మార‌ణ‌హోమం పోలీసుల ప‌నే అని సీబీఐ తేల్చిచెప్పింది. ఈ కేసులో... ఎనిమిది మంది స్పెష‌ల్ పోలీస్...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  నక్సల్బరీని ఎలా అర్థం చేసుకోవాలి?
  భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు
  నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  లాక్ డౌన్ లో అబద్ధాలు - ఎన్ కౌంటర్లు
  కా. కాశీం విడుదల కోసం కృషి చేసిన మిత్రులందరికీ విప్లవాభివందనాలు - కరోనా విపత్తులో రాజకీయ ఖైదీలను, ఇతర ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి
  కాపిటల్ లో కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు
  ʹ రాగో ఏమవుతుంది? ʹ
  "తిన్నాడో లేదో పాపం"
  పరిమళభరిత తావుల్లోంచి
  ఆకలి చెమట వాసన
  ఇంద్రావతి..
  ఆలోచనల్లో మార్పు వస్తేనే స్త్రీల జీవితాలు మారుతాయoటున్న శీలా సుభద్రాదేవి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •