అభివృద్ధికి అసలైన అర్థం ఏమిటో ప్రశ్నించిన కథ..

| సాహిత్యం | క‌థ‌లు

అభివృద్ధికి అసలైన అర్థం ఏమిటో ప్రశ్నించిన కథ..

- పలమనేరు బాలాజీ | 04.03.2020 11:52:52am

కథా శిల్పానికి సంబంధించిన విషయాల్లో కథను ఎవరు చెబుతారు అనేది ఒక ప్రధానమైన విషయం .కథ చెప్పే పాత్రను బట్టి కథను పాఠకుడు అర్థం చేసుకునే తీరుతెన్నులు మారుతాయి.
కథను పాత్రల ద్వారా చెప్పడం ఒక పద్ధతి అయితే, కథను కథకుడు చెప్పడం మరొక పద్ధతి అయితే, కథను పక్షుల చేత జంతువుల చేత, చెట్లు చేత చెప్పించడం ఒక విభిన్న, విలక్షణ పద్ధతి.
పంచతంత్రం కథలు మనకు తెలిసిందే. గొరుసు జగదీశ్వర్రెడ్డి రాసిన "చీడ" కథ ఈ కోవలో విలక్షణమైనది. ఈ పరంపరలో ఉత్తరాంధ్ర రచయితల సంఘం నడుపుతున్న ఉరకవే పత్రికలో ముద్రితమైన శ్రీ గండేట గౌరు నాయుడు గారి కథ "ఇదొక పిట్ట సెప్పిన కత ".

పాఠకులను ఎంతగానో ఆకట్టుకున్న కథ. పెట్టుబడి దారి సమాజానికి, ప్రజా సంక్షేమం పట్టని పాలక వర్గానికి ఒక హెచ్చరిక ఈ కథ.

సాధారణంగా ఈ కథను చెప్పటానికి పాత్రలను కాక ఒక పిట్టను ఎంపిక చేసుకోవడం లోనే రచయిత ప్రత్యేకత స్పష్టంగా కనబడుతుంది.ఆ పిట్ట కూడా మామూలు పిట్ట కాదు.పిట్టగా మారిన రైతు అది.

నాలుగు పేజీల ఈ కథ అనేక దశాబ్దాల సామాజిక ,ఆర్థిక రాజకీయ చరిత్రకు ఒక ప్రతిరూపం.
అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి తపించే పురాతన మానవుడి సంవేదనకు, దశాబ్దాల ఆర్థిక సామాజిక చరిత్రకు అక్షర రూపంగా నిలిచే మంచి కథల వరుసలో తప్పనిసరిగా చేర్చవలసిన గొప్ప కథ ఇది.

ఈ కథలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఈ కథలో ఎక్కడ ఏ భాగం చదివినా రచయిత ఏం చెప్పదలచుకున్నాడో, రచయిత ఏ జీవితాన్ని వాస్తవికంగా చూపించదలచుకున్నాడో ఆ విషయం స్పష్టంగా పాఠకుడికి తెలిసి వస్తుంది. ఈ కథలో వాస్తవాలు తప్ప ఊహలు లేవు. సంఘర్షణలు తప్ప అలంకారాలు లేవు. ఎవరూ కాదనలేని సామాజిక జీవిత సత్యం ఈ కథ. బహుశా మట్టి వాసన ,చెమట వాసన రక్తం వాసన కలగలిసిన ఒక మానవత్వపు పరిమళం ఏదో ఈ కథనిండా అల్లుకుని పాఠకుడిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. తమకు తాము పరాయివాళ్ళుగా మారిపోయిన పాఠకులకు, తమ వాళ్లకు తాము పరాయివాళ్ళుగా మారిపోయిన పాఠకులకు, తమ మూలాలకు తమ ఇండ్లకు తమ పల్లెటూర్లకు తమ వ్యవసాయలకు, గ్రామీణ జీవన నేపధ్యం, మట్టి వాసనకు దూరంగా తరలివెళ్లిన పాఠకులకు ఈ కథ చెంపపెట్టులాంటిది.

కన్నీటికే కన్నీరు రావడం ఆకలికే ఆకలి వేయడమే, అభివృద్ధిని ప్రశ్నించడమే ఈ కథ.

దశాబ్దాల జీవితాన్ని చిత్రించడానికి ,నవలకు సరిపడా కథా వస్తువును దృశ్యమానం చేయడానికి రచయిత ఇక్కడ వాడుకుంది కేవలం నాలుగు పేజీలు మాత్రమే.

చిక్కగా అల్లిన కథాకథనం ,రచయిత వ్యక్తిత్వం ఈ కథ కున్న మంచి లక్షణాలు.

వస్తు ఐక్యత ,శిల్ప వైవిధ్యం, నమ్మకమైన కంఠ స్వరానికి ఒక మంచి ఉదాహరణ ఈ కథ .

పాఠకులకే కాదు , కొత్త రచయితలకు, మంచి కథలు రాయాలనే తపన ఉన్న ఔత్సాహిక రచయితలకు కూడా ఈ కథ ఒక చక్కటి పాఠం.

గొప్పగా రైతు జీవితాన్ని గడిపి వ్యవసాయం చేయడమే నేరమైపోయిన కాలంలో 30 ఎకరాల రైతు మూడు ఎకరాలకు దిగిపోయి, ఆఖరికి అదీ పోగొట్టుకొని పంచ సిరిగి పై మీద గుడ్డయిపోయిన రైతు కథ ఇది.
తోటపల్లి బ్యారేజీ ధాటికి ఊర్లు మునిగిపోయి, ఇచ్చిన నష్టపరిహారం ఎటూ చాలక ఎంత తిరిగి ఎంత ప్రాధేయపడినా ,అధికారులు కరుణించక కొడుకులిద్దరూ పెళ్ళాం పిల్లలతో విజయవాడ, హైదరాబాద్ కు వెళ్ళిపోతే ఇక తప్పనిసరి పరిస్థితుల్లో , లేకుండా పోయిన ఊరువదిలి చిన్న కొడుకు తోటి పట్నం వచ్చేసి, ఖాళీగా కూర్చుని తినే అలవాటు లేక, నిరంతరం కష్టించే రైతు గుండెకు అది చేతకాక ,యూనిఫాం వేసుకుని సెక్యూరిటీ గార్డ్ గా మారిన రైతు కథ ఇది.

బానిసలా నోరు మూసుకుని, చేతులు కట్టుకుని, వంగి వంగి పనులు చేయటం, మందుబాబులకు మందు పంపిణీ చేయటం చేతకాక, వ్యక్తిత్వాన్ని చంపుకోవడం ఇష్టం లేక, యూనిఫామ్ వదిలి పెట్టిన మనిషి పిట్టలా మారిపోతాడు.

ఒక మాట అంటే మనసుకు నచ్చ చెప్పుకున్నాడు గానీ, దొంగతనం అంటగట్టి మెడపట్టి గెంటేసినాక అక్కడ ఉండలేక పోతాడు.

ఆ పిట్ట ముందు ఇంటి పైకి ఎగురుతుంది . ఇంట్లో ఎవరూ ఉండరు. ఏమీ ఉండదు. అన్నింటినీ కోల్పోయి బొంతగా మాత్రం మిగిలిన తన జీవితాన్ని చూసుకుంటాడు రైతు.

పట్టణాలు దాటుకుంటూ , ఉనికే లేకుండా పోయిన తన ఊరి ఆనవాళ్లు వెతుక్కుంటూ పయనిస్తాడు.విమానాశ్రయం కోసం భూములు కోల్పోయిన రైతుల బాధలని, వాళ్ళ ప్రతిఘటనని ,ప్రపంచీకరణ పరిణామాల్ని దగ్గరగా చూస్తాడు.

మనుషులు ఎండిపోతున్నా, ఊర్లు ఖాళీ అవుతున్నా, వ్యవసాయం అదృశ్యమై పోతున్నా, పచ్చగా మిగిలిన జామతోటలో మెరిసిపోతున్న మంత్రి పసుపు భవనాన్ని చూస్తాడు.పసుపు అనగానే అసలు నిజం తెలుస్తుంది.

కొత్త ఊరు కనపడుతుంది కానీ , ఎక్కడా మనుషులు కనపడరు. మానవత్వం కనపడదు. మానవ సంబంధాలు కనపడవు. పాత ఊరును ప్రాజెక్టు మింగేస్తే ; కొత్త ఊరును పట్టణం మింగేయడం గమనిస్తాడు. మొక్కా, మోడు లేని ఊర్లో సిమెంట్ రోడ్లు మాత్రం కనబడతాయి. ఎవరు ఆనందంగా ఉన్నట్టు కనపడరు.

నీటి కింద మునిగిన తన పాత ఊరుని వెతుక్కుంటూ నీటిలోకి జారిపోతాడు.

తనతో బ్రతకలేక, లేకుండా పోయిన భార్య రాములమ్మ గుర్తుకొస్తుంది. ఆమెను మొదటిసారి చూసిన జ్ఞాపకాలు కళ్లముందు కదలాడతాయి . మట్టి దిబ్బగా మారిపోయిన వాళ్ళ ఇంటి ముందుకొస్తే ,కళ్ళం లో తొలిసారి రాములమ్మను చూసిన ఆ జ్ఞాపకాలతో తడిచి పోతాడు.

ఎవరికైనా పుట్టిన ఊరి మట్టిలో కలిసి పోవాలని ఉంటుంది, కానీ ఇతడికి మాత్రం పుట్టిన ఊరు లేకుండా పోతుంది. నీటిలో మునిగి మట్టిలో కలిసిపోయిన ఊరు అతనికి ఏం సమాధానం చెబుతుంది.?ఈ ఆదర్శాలకు ఏ అభివృద్ధికి నిదర్శనం ఈ దృశ్యం??
***

హృదయం మేథ కలగలిసిన ఒక తాత్వికత ఈ రచయిత సొంతం. ముక్కుసూటిగా సాధ్యమైనంత వేగంగా దూసుకుపోయే ప్రవాహం లాంటి కథనం ఈ రచయిత ప్రత్యేకత.

***
అభివృద్ధి అంటే ఏమిటి? అభివృద్ధి పేరిట ప్రభుత్వం అమలు చేసే చట్టాలు ,తీసుకు వస్తున్న మార్పులు, శిథిలమవుతున్న మనుషులు, అదృశ్యం అవుతున్న వ్యవసాయం, ఊర్లు, మనిషిలో మాయమైపోతున్న మంచితనం, ఒక్కమాటలో చెప్పాలంటే మనిషి లోపల శిశువు మరణించడమే ఈ కథ.

జీవితాన్ని చూసే రచయితకు, జీవితాన్ని లోతుగా అర్థం చేసుకునే రచయితకు చాలా తేడా ఉంటుంది. రచయితకు జీవితం గురించి తెలియడం వేరు. అలా జీవించడం వేరు.
జీవించడం తెలిసిన రచయితలే బురద మట్టి గురించి ,ఊరు గురించి, వ్యవసాయం గురించి, ఊర్లు, మనుషులు అదృశ్యం కావడం గురించి కథలు రాయగలుగుతారు. వ్యవసాయం అదృశ్యం కావడం, మనిషి అదృశ్యం కావడం, ఊరు అదృశ్యం కావడం మామూలు విషయాలు కావు .ఇది ఒక అసాధారణ విషాదం. భవిష్యత్తుకు ఒక ప్రమాదకరమైన హెచ్చరిక ఈ కథ.

ఈ భూమ్మీద రైతన్న వాడు లేకుండా చేయడమే పరిపాలకుల ఉద్దేశమా?

ఊర్లు అదృశ్యమై పోయాక వ్యవసాయం అదృశ్యం కాకుండా ఉంటుందా? వ్యవసాయం అదృశ్యమయ్యాక, రైతు అదృశ్యం కాకుండా ఉంటాడా ?రైతు అదృశ్యం అయ్యాక మనిషి అదృశ్యం కాకుండా
ఉంటాడా? ఇక మిగిలేది ఏమిటి ?

ఇక మిగిలేది ఎవరు ?

ఎవరికి?

ఈ కథ చదివిన తర్వాత మదిలో మెదిలే ప్రశ్నలకు, కలిగే అలజడికి సమాధానం ఏమిటో పాఠకులు ఎవరికి వారు ఆలోచించుకోవాలి. ప్రశ్నించాలి.
చర్చించుకోవాలి!

***
తన వాళ్లందరినీ ,తన ఊరిని తన జీవితాన్ని గతాన్ని తలచుకుని రైతు మట్టిబెడ్డగా మారిపోవడంతో కథ ముగుస్తుంది.

నిజానికి కథ ఎక్కడ ముగిసింది? ఇలాంటి కథలు కొనసాగుతూనే ఉంటాయి, కొత్త సమాధానాలు దొరికేంతవరకు....

No. of visitors : 468
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


పరిమళం , పదును రెండూ వున్నకవిత్వం – చేనుగట్టు పియానో

పలమనేరు బాలాజీ | 04.02.2017 02:37:03am

కవి పాలక పక్షం, రాజ్యం పక్షం, వహించకుండా ప్రజా పక్షం వహిస్తున్నాడని ప్రజల ఆగ్రహాన్ని,ఆవేదనల్ని, ప్రశ్నల్ని,నిరసనల్ని తన గొంతుతో వినిపిస్తున్నాడని .......
...ఇంకా చదవండి

ʹనారుమడిʹ మళ్ళీ మళ్ళీ చదివించే మంచి క‌విత్వం

పలమనేరు బాలాజీ | 18.01.2017 11:47:15pm

కాలం గడచినా మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చి చదవాలని అనిపించే మంచి కవితా సంపుటాల్లో ʹ నారుమడి ʹ ఒకటి. యెన్నం ఉపేందర్ ( డాక్టర్ వెన్నం ఉపేందర్ )అటు కథకుడిగా , యిటు కవి...
...ఇంకా చదవండి

సాహిత్య విమర్శకు కొత్త బ‌లం

పలమనేరు బాలాజీ | 04.03.2017 09:54:02am

ఈ పుస్తకం లో వ్యక్త పరచిన అభిప్రాయాల్లో రచయిత ఎక్కడా సహనం కోల్పోలేదని, సాహిత్య అంశాల పట్ల రచయితకు గల ఆసక్తి ,నిబద్దత,స్పష్టతే ఇందుకు కారణాలని, విభేదించే...
...ఇంకా చదవండి

ఖాళీ ఇల్లు,ఖాళీ మనుషులు

పలమనేరు బాలాజీ | 01.06.2016 11:57:12am

నమ్ముకున్న కలల్ని గాలికొదలి ఇల్లు వదిలి, ఊరు వదిలి పిల్లల్ని వదిలి, సహచరుల్ని వదిలి...
...ఇంకా చదవండి

మనిషి లోపలి ప్రకృతి గురించి చెప్పిన మంచి కథ ʹ ఆఖరి పాట ʹ

పలమనేరు బాలాజీ | 03.08.2019 11:39:20pm

మనిషికి, మట్టికి మధ్య వున్న అనుభందం విడదీయరానిది . మట్టి మనిషిని చూస్తున్నాం, విoటున్నామని అనుకుంటాం కానీ, నిజానికి మట్టి మనిషిని నిజంగా సంపూర్ణంగా ......
...ఇంకా చదవండి

మార్కులే సర్వస్వం కాదని చెప్పిన కథ ʹ నూటొకటో మార్కు ʹ

పలమనేరు బాలాజీ | 05.09.2019 01:00:59pm

ʹ వీడికి వందకి వంద మార్కులు రావలసింది , కానీ తొoతొమ్మిదే వచ్చాయిʹ అప్పుడు ఒకే ఒక్క మార్కు కోసం ఇంత హైరానా పడి రావాలా అని ? అని అడుగుతాడు సైకాలజిస్టు......
...ఇంకా చదవండి

స్త్రీ సాధికారత కోసం సమానత్వం కోసం డిమాండ్ చేస్తున్న ʹ నీలి గోరింటʹ

ప‌ల‌మ‌నేరు బాలాజీ | 03.05.2019 03:22:15pm

ఆశావాద దృక్పథంతో మంచి సమాజం కోసం ఒక ఆధునిక స్త్రీ పడే తపనను ఈ కవిత్వం తప్పక చెపుతుంది. పసిబిడ్డల నుండి ముసలివాళ్ళు వరకు అన్ని ప్రాంతాల్లో స్త్రీలపై జరుగ...
...ఇంకా చదవండి

ఒక మంచి రాజనీతి కథ

పలమనేరు బాలాజీ | 16.07.2019 09:19:27pm

వ్యవస్థలో, మనిషిలో పేరుకుపోతున్న రాజకీయాన్ని దళారీ తనాన్ని వ్యాపార తత్వాన్ని నగ్నంగా చూపించిన ఈ కథలో ప్రతి పదం ముఖ్యమైనది, అనివార్యమైనది. ఆయా పదాలు......
...ఇంకా చదవండి

మానవ సంబంధాల ఉన్నతీకరణకు చక్కటి ఉదాహరణ ʹ చందమామ రావేʹ

పలమనేరు బాలాజీ | 16.08.2019 09:24:03pm

సాధారణంగా బిడ్డల వల్ల తల్లులు బాధలు పడే కథలు కొన్ని వేల సంఖ్యలో ఉంటాయి . తల్లి, బిడ్డలకు సంబందించిన కథలు కొన్ని వేల సంఖ్యలో వచ్చింటాయి. వృద్ధాప్యదశకు చేర.....
...ఇంకా చదవండి

వివక్షతని ప్రశ్నించిన కొత్త దళిత కథ : " పైగేరి నారణప్ప కథ..."

పలమనేరు బాలాజీ | 02.08.2020 04:14:44pm

కుల అహంకారాన్ని ప్రశ్నించి, వర్గ రాజకీయాల నుండి దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడమనే ఒక మనిషి కథను ఊరు నుండి తన సమాజం నుండి తన వర్గం నుండి దూరంగా ఉంటున్న .....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •