ఉన్నావో సీత

| సాహిత్యం | క‌విత్వం

ఉన్నావో సీత

- వడ్డెబోయిన శ్రీనివాస్ | 08.03.2020 10:48:58am


ఉన్నావో రాముడే
హత్యాచారి !

విచ్చలవిడి మగతనమే
హిందుత్వమై
సీతను
అగ్ని గుండం చేశాక —
ఉన్నావో మీంచి
ఊపిరిలూదుకుంటూ
ఉరికొస్తోంది
జ్వలిత !
చిరునవ్వులు తగలబడి పోతుండగా
ప్రేమలు కాలి పోతుండగా
నిప్పుల సముద్రంలా !

జన్మబంధం
బూడ్దవుతుండ
పువ్వులకుప్పలా తగలబడ్తోంది!

నీడ తగలబడ్తుండగా
అప్యాయతలు అనురాగాలు రాల్తుండగా

అణువణువు
అనలధారిణై
ఉన్నావో చలి
మంటలుమంటల్లో తగలేస్తూ

ఆడపిల్లలకు
తెరిచిన కొత్త పాఠశాలలా
లోకం కళ్ళల్లో
కూర్చున్న ధిక్కారమై
పురుషాహంకారజ్వాలల్లోంచి
అగ్నిమొగ్గై
విచ్చుకున్నతిరుగుబాటై
ఉన్నావో సీత
అగ్నికీలలప్రయోగశాలై
అణిచివేతలఇనుపముళ్ళమీంచిపరుగెత్తుకొస్తోంది

కాషాయకుర్చీ
విలాసాల పెదాలపై
నిప్పుల తాండవం చేస్తూ
తరతరాలబానిసత్వంపునాదుల్ని
పెకిల్చి
కణకణమండే
కన్నీటి చుక్కల ఆనవాళ్ళు
తలాపిడికెడు పాలు పెడ్తూ

నేను నడిచే దారుల్లో
నువ్వు నడిచే దారుల్లో
మనం నడిచే దారుల్లో
పెరటి మొక్కల్లా నడిచి పోతుంది
లక్ష్మణ రేఖల్ని ముక్కలుముక్కలు చేసి
కాలం కాగానే రాలడానికి
గోడ సున్నాన్ని కానని

వెర్రిలేసిన
వేదభూమిని
ఒంటి మంటలతో కడుగుతోంది
అమ్మతనానికి
వెన్నతాపడం చేసి
ఆడతనానికి
అగ్నితాపడం పెడుతూ
అశ్లీలం అఘాయిత్యాల శబ్దలౌల్యాల
ధర్మసంస్థాపనకు
మంట పెడుతోంది

కిరాతక ఆధిపత్య పురుషాంగానికి
మంటల ఉరితాళ్ళు తగిలించి
ధర్మం నాలుగు పాదాలు తొడుక్కున్న
మృగమనఃసమానవ జంతువుల్ని
జ్వాలా కర్ర నెగరేసింది

రాబందునాగరిక రాజ్యంలో
విలువలకు అబార్షనై
విధిరాతల వికృతక్రీడా విన్యాస
కర్మపరిహాసాల
కర్మభూమికళ్ళను
కాలిపోతున్న కళ్ళ తెరిపిస్తోంది

మానవ పరిమళాలు కోల్పోయి
వొకేవొక
జనన కుహరాన్ని
ఆడదానిగా గుర్తించిన
అంతరించి పోయిన మనుషుల ప్రకటించి
దేశంగుండెలమీద అంటించింది

వరసలు వధించబడిన కాలం లో
ఉమ్మనీటివాసనొదలని కీచకత్వం
అగ్నిశిలు వేసి
చారిత్రక చలనాగ్నిగుండమై
ఉన్నావో సీత
దేహదాహదేశాన్ని
అగ్నిపాడె అలంకరిస్తూ

మృగభారతాన్ని
అన్ని భాషలకు అర్ధమైయ్యే
అగ్నిభాష భావోద్వేగాలతో వస్తోంది
కాలిపోతున్న కలలబట్టలతో

కర్కోటక సుఖ నీడై పోయిన
ఈ దేశ పుల్లింగ పులిపంజా రాజకీయాల
రాజ్యంమెడ
అగ్నిపూలగొల్సై పట్టి
ఎండిన రాతిమేఘాల్లోంచి
అగ్నిగంగై ప్రవహిస్తోంది

వొంటినిండా
సూర్యుణ్ణి ఆవాహన చేసుకొని
ఉన్నావో సీత ఉదయించింది
సూర్యపుత్రై

(శివం త్రివేది,శుభం త్రివేదిఅత్యాచారం చేసి నిప్పు పెట్టగా,మంటల్తో కిలో మీటర్ పరుగెత్తి మరణించిన ఉన్నావో అత్యాచార బాధితురాలి స్మృతిలో)

No. of visitors : 420
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


హెచ్చరిక

వడ్డెబోయిన శ్రీనివాస్ | 19.05.2018 09:17:54am

బాబాలు స్వాములు యోగుల ఇంద్రియానందం ముంచితీసిన లైంగికమతపిచ్చి రాజ్యంలో ఆడంటే బలిజీవి! మగంటే బలికోరే పితృస్వామ్యం!.....
...ఇంకా చదవండి

టార్చిలైటు

వడ్డెబోయిన శ్రీనివాస్ | 31.10.2019 07:59:56pm

ఇంకా ఎగిలి వారని తెలంగాణ చేతిల ఇయ్యాల ఎర్రబస్సే టార్చిలైటు !...
...ఇంకా చదవండి

వాళ్ళు

వడ్డెబోయిన శ్రీనివాస్ | 17.11.2019 06:06:37pm

ప్రాణం చీకటి పడినా సరే ! దొర డెడ్ లైన్లకు డెడ్ లైన్లు పెట్టిండ్రు దొర సెల్ప్ డిస్ మిస్ సెల్ఫౌట్ చేసిండ్రు ...
...ఇంకా చదవండి

న్యాయమూర్తులుం గారూ!

వడ్డెబోయిన శ్రీనివాస్ | 02.12.2019 11:25:41pm

హద్దులున్నయని సుద్దులు జెప్పుకుంటనే హక్కులను అంగట్ల బెడ్తివి ...
...ఇంకా చదవండి

ది కల్చర్ ఆఫ్ కరోనా

వడ్డెబోయిన శ్రీనివాస్ | 02.04.2020 01:19:46am

కొట్టండి చప్పట్లు చప్పట్లు కొట్టండి...
...ఇంకా చదవండి

దగ్ధహృదయమా !

వడ్డెబోయిన శ్రీనివాస్ | 16.03.2020 11:49:34pm

ఈ వీధి ఈ చివరి నుండి రాముడు ఏడ్చుకుంటూ వస్తున్నాడు ఆ కొస నుండి అల్లా ఏడ్చుకుంటూ వస్తున్నాడు...
...ఇంకా చదవండి

గోడలమనుషులు

వడ్డెబోయిన శ్రీనివాస్ | 16.03.2020 11:53:45pm

గోడలు కట్టడమే తెల్సు వాళ్ళకు ! మనుషుల మధ్య మనసుల మధ్య మతాల మధ్య ...
...ఇంకా చదవండి

ముస్లింమంటే కరోనా కాదురా

వడ్డెబోయిన శ్రీనివాస్ | 15.04.2020 11:16:47pm

మసీదు పావురం కళ్ళ లోంచి కన్నీరుసేమియా కారుతుండాలేమో!...
...ఇంకా చదవండి

చీకటిదీపం

వడ్డెబోయిన శ్రీనివాస్ | 16.04.2020 06:47:03pm

ఆకలీ కరోనా అన్నదమ్ములై పోయి అఖండభారత దండయాత్ర చేస్తుంటే మెతుకంటకముందే ఆకలి చేతుల్ని కడిగేసుకోమనడం కొత్తా!!! ఓటమి కోసమే ఓటు వేస్తున్న ఓటరులారా! ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  నక్సల్బరీని ఎలా అర్థం చేసుకోవాలి?
  భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు
  నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  లాక్ డౌన్ లో అబద్ధాలు - ఎన్ కౌంటర్లు
  కా. కాశీం విడుదల కోసం కృషి చేసిన మిత్రులందరికీ విప్లవాభివందనాలు - కరోనా విపత్తులో రాజకీయ ఖైదీలను, ఇతర ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి
  కాపిటల్ లో కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు
  ʹ రాగో ఏమవుతుంది? ʹ
  "తిన్నాడో లేదో పాపం"
  పరిమళభరిత తావుల్లోంచి
  ఆకలి చెమట వాసన
  ఇంద్రావతి..
  ఆలోచనల్లో మార్పు వస్తేనే స్త్రీల జీవితాలు మారుతాయoటున్న శీలా సుభద్రాదేవి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •