ఎస్ బ్యాంక్ – తాజా సంక్షోభానికి గుర్తు

| సంపాద‌కీయం

ఎస్ బ్యాంక్ – తాజా సంక్షోభానికి గుర్తు

- సాగర్ | 16.03.2020 02:29:51pm

దేశవ్యాప్తంగా లక్షలాది ఖాతాదారులున్న ఎస్ బ్యాంకు మార్చి మొదటి వారంలో దివాలా తీసింది. దేశంలో ప్రవేట్ బ్యాంకులలో 4వ స్థానంలో ఉంది ఎస్ బ్యాంకు. భారీగా పేరుకుపోయిన నిరర్ధక ఆస్తుల వలన ఇలా జరిగింది అనేది ఒక ప్రాధమిక అంచనా. దీని వలన బ్యాంకు ఖాతాదారులు, స్టాక్ హోల్డర్స్ తీవ్రంగా నష్టపోతున్నారు. ఇది బ్యాంకింగ్ వ్యవస్థ లోపాలను తెలియచేస్తుంది. సంఘటన జరిగిన తరువాత ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ఎస్ బ్యాంకు కార్యకలాపాలను గత రెండేళ్ల నుంచి పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. మరి ఈ రెండేళ్ల కాలంలో ఏ విధమైన చర్యలు తీసుకున్నారో మాత్రం చెప్పలేదు. 2018 సెప్టెంబర్లో బ్యాంకు వ్యవస్థాపకుడు, డైరెక్టర్ అయినటువంటి రానాకపూర్ ను ఆర్బీఐ ఇక మీదట బ్యాంకు డైరెక్టర్ గా ఉండటానికి వీలులేదని చెప్పింది. 2019 జనవరితో రానాకపూర్ పదవికాలం ముగిసిపోయింది. బ్యాంక్ నిర్వహణలో తీవ్రమైన లోపాలతో పాటు ఉల్లంఘనలకు పాల్పడటంతో ఈ చర్య ఆర్బీఐ తీసుకున్నట్టు పేర్కొంది.

బ్యాంకు పరిస్థితి ఇలా కావడానికి ప్రధాన కారణం యూపీఏ ప్రభుత్వం అని బిజెపి ఆరోపిస్తుంది. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆర్ధిక రంగంలో ఏ సంక్షోభం వచ్చిన అది కాంగ్రెస్ మీద నెట్టడం పరిపాటైంది. 2014 మార్చి నాటికీ ఎస్ బ్యాంకు డిపాజిట్లు 74,192 కోట్లు ఉండగా ఇచ్చిన రుణాలు 55,633 కోట్లు ఉన్నాయి. అలాగే నిరర్ధక ఆస్తులు 0. 31%. సెప్టెంబర్ 2019 నాటికీ మొత్తం డిపాజిట్లు 2,09,497 కోట్లు ఉండగా ఇచ్చిన రుణాలు 2,24,505 కోట్లు ఉన్నాయి. నిరోధక ఆస్తులు 7.39% కు చేరాయి. ఇంకా ఎంత మాత్రం చెల్లింపులు చేయాలేని పరిస్థితికి ఎస్ బ్యాంకు నెట్టివేయబడింది. గత క్వార్టర్ (అక్టోబర్ - డిసెంబర్) నాటికీ ఎస్ బ్యాంకు నికర నష్టం - 18,560 కోట్లుగా, నిరర్ధక ఆస్తులు(మొండి బకాయిలు) విలువ 42,761 కోట్లుగాను ప్రకటించింది. బ్యాంకింగ్ చరిత్రలో ఇది అతి పెద్ద నష్టం. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూపుకు 12,808 కోట్లు, సుభాష్ చంద్ర కు చెందిన ఎస్సెల్ గ్రూపుకు 8,415 కోట్లు, డీహెచ్ఎఫ్ఎల్ 4,375 కోట్లు మొండిబకాయిలలో వీటిదే మెజారిటివాటా. లాభాపేక్షే లక్ష్యంగా ఇష్టారీతిన రుణాలు మంజూరు చేయడం వాటిని తిరిగి రాబట్టడంలో విఫలం కావడం వల్ల ఎస్ బ్యాంకు ఈ దుస్థితికి చేరుకున్నది. గత నవంబర్ నాటికే ఎస్ బ్యాంకు ఈ స్థితికి చేరుకున్నది. పెట్టుబడులు రాక సంక్షోభంలో కూరుకుపోయింది. అయితే నవంబర్లో కెనడాకు చెందిన ఎర్విన్ బ్రెయిచ్ 1. 2 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు అంటూ ఎస్ బ్యాంకు వర్గాలు తెలిపాయి. దీనితో అప్పటిదాకా నష్టాల్లో ఉన్న బ్యాంకు షేర్ విలువ ఒక్కసారిగా పెరిగింది. సరిగ్గా అదే సమయంలో రానా కపూర్ ఎస్ బ్యాంకు లో ఉన్న తన వాటాలన్నటిని అమ్మివేశాడు. ఒక్క 900 షేర్లు మాత్రమే ఉంచుకున్నాడు. వాటి విలువ దాదాపు 60,000 మాత్రమే. ఇక జనవరిలో బ్యాంకు స్వతంత్ర డైరెక్టర్ ప్రకాశ్‌ అగర్వాల్‌ రాజీనామా చేశారు. బ్యాంకు నిర్వహిస్తున్న తీరు, నిబంధనల అమలులో వైఫల్యం వల్ల రాజీనామా చేశానని ప్రకటించారు. బ్యాంకు విషయాలలో సెబీ కలుగచేసుకోవాలని కూడా ఈ సందర్భంలో వ్యాఖ్యానించారు. నవంబర్ నుంచి జనవరి వరకు కూడా ఎస్ బ్యాంకు ప్రతినిధులు ఎప్పటికప్పుడు పెట్టుబడులు వస్తున్నాయంటూ ప్రచారం చేస్తూ వచ్చారు. కానీ వాస్తవంలో ఏవి అమలులోకి రాలేదు. ఇవన్నీ మార్కెట్టులో తమను నిలబెట్టుకోవడానికి చేసిన ప్రచారం మాత్రమే. చివరకు త్రైమాసిక ఫలితాలను ప్రకటనిచలేని దశకు చేరుకున్నది.

బ్యాంకు దివాళా ప్రకటన అనంతరం ఆర్ధిక మంత్రి, ఆర్బీఐ ప్రజల వ్యతిరేకతను తప్పించుకోడానికి కొన్ని చర్యలను చేపట్టాయి. వాటిలో భాగంగా యెస్ బ్యాంక్ రీకన్‌స్ట్రక్షన్ స్కీమ్ ఆమోదం తెలిపాయి. ప్రభుత్వ రంగ సంస్థ అయినా ఎస్బిఐ దాదాపు 49% వాటాతో పెట్టుబడి పెట్టనుంది. దీనితో పాటు ఐసీఐసీఐ, కోటాక్ మహేంద్ర, బ్యాంకు అఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంకులు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను నష్టాల్లో ఉన్న ప్రవేట్ బ్యాంకులను ఆదుకోవడానికి ముందుకు నెట్టడం అనేది తప్పని ఆర్ధిక వేత్తలు చెబుతున్నారు. మొండి బకాయిలున్న పెట్టుబడిదారుల గురుంచి బిజెపి ప్రభుత్వం ఇప్పటి దాక ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పైగా అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ సంస్థకు రాఫెల్ విమానాల కాంట్రాక్టును కట్టబెట్టింది. ఒక వైపు అంతర్జాతీయంగా అంబానీకి అప్పులిచ్చిన బ్యాంకులు వసూళ్లకు ప్రయత్నాలు చేస్తుంటే మోడీ మాత్రం అంబానీని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వ్యవసాయరంగ సంక్షోభం వల్ల రైతులకు రుణాలు మాఫీ చేయడానికి, వాళ్ళను కలవడానికి కూడా ఇష్టపడని మోదీ అంబానీకి మాత్రం అండగా ఉంటున్నాడు. రానా కపూర్ ను అరెస్టు చేసి ఈడీ కి అప్పచెప్పడం ఒక కంటి తుడుపు చర్య మాత్రమే.

యెస్ బ్యాంకు సంక్షోభం అనేది దానికి మాత్రమే పరిమితమవుతుంది అనుకోవడం పొరపాటే. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సంబందించిన మొండి బకాయిలు 10 లక్షల కోట్లను దాటాయి. ఇది 2014 తో పోల్చుకుంటే 5 రెట్లు ఎక్కువ. అలాగే 2013 -15 కాలానికి సంబంధించిన 5. 17 లక్షల కోట్ల మొండి బకాయిలను మోడీ ప్రభుత్వం రద్దు చేసింది. ఇక ఆర్ధిక మాంద్యం నుంచి గట్టెక్కడానికి ఆర్బీఐ దగ్గరున్న మిగులు డబ్బు 1.76 లక్షల కోట్ల డబ్బును బిజెపి ప్రభుత్వం వాడుకుంటుంది. మరో వైపు కార్పొరేట్లను ఆదుకోవడానికి వారి మీద విధించే 14 వేల కోట్ల రూపాయల సర్ ఛార్జిని ఉపసంహరించుకుంది. అలాగే పెట్టుబడిదారులకు సంపద కొరత రాకుండా బ్యాంకుల ఏకీకరణను ప్రారంభించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులను ఒక చోటుకు తీసుకురావడం ద్వారా సంపద కొరత ఉండకుండా చేయొచ్చు అని చెబుతున్నపట్టికి ఇది కార్పొరేట్లను ఆదుకునే చర్యలలో భాగమే. ఏకీకరణ వల్ల ప్రయోజనం కన్పడలేదని బ్యాంకు అఫ్ బరోడా విషయంలో తేలినప్పట్టికి మరోసారి ఏప్రిల్ 1 మరో 10 బ్యాంకులను ఏకీకరణ చేయబోతున్నారు. వీటిలో నాలుగు బ్యాంకులకు మూలధనం కోసం సుమారు 70 వేల కోట్లను ప్రభుత్వం సమకూర్చింది. వీటి ద్వారా పెట్టుబడిదారులకు రుణాలను ఇప్పించడమే ప్రభుత్వలక్ష్యం. అంతేకాక గత కొన్నేళ్లుగా లాభల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకుంటూ వాటిని ప్రవైటీకరించడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. మరో వైపు నష్టాల్లో ఉన్న ప్రవైటు రంగ సంస్థలో లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలతో పెట్టుబడులు పెట్టిస్తున్నది. కొద్దీ మంది కోసం కోట్లాది మంది ప్రయోజనాలు పణంగా పెడుతున్నాయి.
ఆర్ధిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి మోడీ ప్రభుత్వం చాలా గారడీలు చేస్తోంది. వాస్తవానికి ఇవి ఏవి సంక్షోభానికి పరిష్కారాలు కాదు. ఈ పనులన్నీ సంక్షోభానికి గుర్తులే. దీనికి ప్రభుత్వ రాజకీయ ఆర్ధిక విధానాల్లో మూలాలు ఉన్నాయి. మోడీ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి తీసుకువచ్చిన నోట్లరద్దు, జీఎస్టీ, బ్యాంకుల ఏకీకరణ అన్ని కూడా వీటిలో భాగమే. ఇవి ఏవి కూడా ఈ ఆర్ధిక సంక్షోభాన్ని పరిష్కరించాలేవు. ఇంకా పెంచుతూ పోతాయి.

No. of visitors : 237
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


స్మృతి చిహ్నాలు... పోరాటపు గుర్తులు

సాగ‌ర్‌ | 19.09.2016 10:53:49am

స్మృతి చిహ్నాలు మనం చూడలేని గత చరిత్రకి సంబందించిన ఆనవాళ్లుగాను , ఒక తరం నుంచి మరొక తరానికి వాటి రాజకీయ భావజాలాన్ని ప్రచారం చేసే సాధనలుగాను , వారి అమర........
...ఇంకా చదవండి

నేనూ అర్బన్ మావోయిస్టునే

సాగర్ | 22.09.2018 09:53:57pm

పూణే పోలీసులు బీజేపీ ప్రభుత్వం చేసిన ఈ అమానవీయ చర్యకు ప్రజలు ʹమీ టూ అర్బన్ నక్సల్ʹ, ʹపూణే పోలీస్ జవాబు దోʹ అంటూ తమ నిరసనను తెలిపారు......
...ఇంకా చదవండి

ప్రజల పై యుద్ధం

సాగ‌ర్‌ | 05.10.2016 12:31:57am

ప్ర‌జ‌లు,సామ‌జిక కార్య‌క‌ర్తలు నేడు దండకారణ్యంలో జరుగుతున్న పాశవిక దాడికి, హక్కుల హననాకి వ్యతిరేకంగా తమ మద్దతు తెలపాల్సిన అవసరంను ఈ పుస్తకం మనముందుంచుతుంది ...
...ఇంకా చదవండి

ఆ కాఫీ తోటలు ఎవరివి?

సాగర్ | 05.10.2017 11:05:45pm

విశాఖ మన్యంలో ఆదివాసులు 30 ఏళ్లగా మావోయిష్టు పార్టీ నాయకత్వంలో పోరాడి కాఫీ తోటలపై సంపాదించుకున్న యాజమాన్య హక్కును తిరిగి తీసుకోవడానికి ఆంద్రప్రదేశ్ ......
...ఇంకా చదవండి

బాబుకు ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది.

సాగర్ | 16.04.2019 12:13:15am

అంతులేని రాజ్యహింసకు, హక్కుల హననానికి పాల్పడిన చంద్రబాబు ప్రజాస్వామ్యం విలువలు అంటూ మాట్లాడటం కొత్తగా, వింతగా, కాసింత వినోదంగా కూడా ఉండొచ్చు......
...ఇంకా చదవండి

వేటకెళ్ళిన ఆదివాసులను వేటాడి చంపిన పోలీసులు

సాగర్ | 17.03.2019 10:35:13pm

తమ కాళ్ళ కింద ఉన్న అపార ఖనిజ సంపదను పెట్టుబడిదారులకు పంచిపెట్టడానికి ప్రభుత్వాలు ఆదివాసులను చంపివేస్తున్నాయి. ఆ నిర్బంధాన్ని, హింసను తట్టుకుని వారు ప్రభు......
...ఇంకా చదవండి

హిందూ రాజ్యం దిశగా

సాగర్ | 17.11.2019 10:20:58am

ʹఒకే ప్రజ, ఒకే భాష, ఒకే సంస్కృతి,ఒకే జాతి, ఒకే దేశం, ఒకే నాయకుడుʹ అనే సంఘ్ పరివార్ రాజకీయ లక్ష్యానికి ఆర్టికల్ 370 రద్దు తరువాత ఈ తీర్పు మరో విస్తరణలాంటిదే....
...ఇంకా చదవండి

కిసాన్ ముక్తి మార్చ్

సాగర్ | 06.12.2018 12:02:02am

ʹఅయోధ్య ఆలయం కాదు రుణ మాఫీ కావాలిʹ నినాదాలతో దేశ రాజధాని ప్రతిధ్వనించింది. లక్షకు పైగా రైతుల మట్టి పాదాలు తాకి ఢిల్లీ పార్లమెంట్ వీధులు పులకించాయి......
...ఇంకా చదవండి

చంద్రబాబు అయిదేళ్ల పాలన - మీడియా మేనేజ్మెంట్

సాగర్ | 01.04.2019 01:47:11pm

చంద్రబాబు చేసిన దోపిడీ అంతా ఆయన మానేజ్మెంట్ నైపుణ్యంతో అభివృద్ధి అయింది. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలలో తిరిగి దీనినే ఉపయోగిస్తూ ʹనేను రాకపోతే అన్ని ఆగిపోతాయిʹ అ.....
...ఇంకా చదవండి

యూనియన్లు ఏం చేయగలవో దొరకు బాగా తెలుసు

సాగర్ | 02.12.2019 09:10:25pm

యూనియన్లు ఏం చేయగలవో కెసిఆర్ కు బాగా తెలుసు. పోరాటాలు విజయం సాధించొచ్చు, ఓడిపోవచ్చు. సంఘాలు కార్మికులకు గొంతునిస్తాయి. మళ్ళీ మళ్ళీ పోరాడే ధైర్యాన్నిస్తాయి. ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India

All sections of working masses should be united together irrespective of caste and religious diferences, to fight in the path of caste annihilation..

 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  నేను దీపాలు ఆర్పను.. కొవ్వొత్తులు వెలిగించను.. ఏం చేస్తావ్?
  కరోనా లాఠీఛార్జ్ : ఇది మనకు అభ్యంతరం అనిపించాలి కదా?
  నిజమైన స్వాతంత్రం కోసం పోరాడటంలోనే భగత్ సింగ్ స్ఫూర్తి ఉంది
  చేతులు కడిగేసుకోవడం తప్ప ఇంకేమైనా చేయగలరా?
  ఆ కన్నీటిని ఈ శిక్ష తుడిచేయగలదా?
  మీరెప్పుడూ అర్బన్‌ మావోయిస్టులనే మాట వాడలేదా?
  మనుషులకే అర్థమయ్యేదీ, పంచుకునేదీ దుఃఖమే అంటున్న పద్మకుమారి కథలు
  The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
  Students and the Revolution
  గోడలమనుషులు
  దగ్ధహృదయమా !
  మూడో కన్ను

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •