తిమిరంపై సమరం

| సంభాషణ

తిమిరంపై సమరం

- క్రాంతి | 16.03.2020 02:37:26pm

మ‌నుషుల క‌ద‌లిక‌ల‌పైనే కాదు... ఆట‌, మాట‌, పాటపైనే కాదు... అక్షరాలపై కూడా ఆంక్షలు అమలవుతున్న కాలం ఇది. ఆమాటకొస్తే కాగితాల్లోని అక్ష‌రాలపైనే కాదు... గోడల మీది గీతలపై కూడా.

అక్ష‌రమంటే ఆగ్రహం కదా... అక్ష‌రమంటే ఆయుధం కదా. అది జనాగ్రహమైనప్పుడు జైలు గోడలు కూడా అక్ష‌రాలను ఆలింగనం చేసుకుంటాయి. రంగు రంగుల గీతలన్నీ రాత్రిని మండిస్తాయి. నల్లటి ఆకాశంపై సప్తవర్ణాల సింగిడి పొడుస్తుంది. జామియా ఎదపై ఎగిరిన ధిక్కార పతాకం... షాహీన్ బాగ్ శిరస్సుపై ఉదయిస్తుంది. నెత్తుట తడిసిన అక్షరాలు ఆజాదీ నినాదాలై మొలకెత్తుతాయి. రాలిన నక్షత్రాల్ని నడివీథిలో సాక్ష్యంగా నిలబెట్టిన కుంచెకు కాలం సలామ్ చెబుతుంది.

అవును, ఈ చీకటి కాలంలో... చిగురిస్తున్న ఉశస్సుకు సృజనాత్మక ధిక్కారం చూపుతున్న దారి ఇది. విద్వేష భాషపై, విభజన రాజకీయంపై యువతరం ఎత్తిన నవకేతనం ఇది. కళ కళకోసం కాదు.. కళ ప్రజల కోసమని నమ్మే కలాలు, గళాలు, కుంచెలు కలగలిసి ప్రదర్శిస్తున్నసృజనాత్మక వ్యక్తీకరణ ఇది.

సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ కి వ్యతిరేకంగా పోటెత్తిన ప్రజాగ్రహం ఇప్పుడు భిన్న కళారూపాల్లో వ్యక్తమవుతోంది. ఆ హరివిల్లు జామియా నుంచి జేెఎన్యూ నుంచి షాహీన్ బాగ్ నుంచి దేశం దేశమంతా అలుముకుంటోంది.

నిరసన ʹనేరమైనప్పుడు...ʹ ధిక్కారం దశ దిశలా ప్రజ్వలిస్తుంది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా వ్యక్తమవుతున్న నిరసన, హక్కుల పరిరక్షణ పోరాటంగా పరిణమించిన కాలం ఇది. విద్యార్థులు, మహిళలు నడిపిస్తున్న ఈ పోరాటం సరికొత్త ఆయుధాల్ని అట్టడుగు ప్రజల అమ్ముల పొదికిచ్చింది.

పాట, కవిత్వం, ఆర్ట్, గ్రాఫిటీ మొదలు రాప్ గీతాలు, లఘుచిత్రాలు, ఉపన్యాసాలు, నినాదాలు, నృత్య రూపకాలు, కామిక్స్, ప్లేకార్డులు, పోస్టర్లు, మీమ్ ఇలా ఎన్నెన్నో కోట్లాది మంది ప్రజలను ఒక్కటి చేసిన పోరాట రూపాలు అవి.

ఎండను, వానను, చలినీ జయించిన పోరాట కాలం కదా ఇది. రాత్రిని, పగలునూ ఏకం చేసిన రోజులు కదా ఇవి. అందుకే... జామియాలు, షాహీన్ బాగు లు ఊరూరా ఉద్భవిస్తున్నాయి.

అక్కడ...ʹఇంక్విలాబ్ జిందాబాద్ʹ అని నినదించినా, ʹబోల్ కే లబ్ ఆజాద్ హై తేరేʹ అంటూ పిలుపునిచ్చినా.. ʹహమ్ దేఖేంగేʹ అంటూ సవాల్ విసిరినా... ʹహమ్ యాద్ రఖేంగేʹ అంటూ హెచ్చరించినా.. ప్రజాగ్రహమే ప్రతిఫలిస్తోంది.

హక్కులన్నీ రాజ్యం ఉక్కు పాదాల కింద నలిగిపోతున్నప్పుడు, జామియాలో లాఠీలు విరుగుతున్నప్పుడు, ʹరామ రాజ్యంʹలో తూటాల వర్షం కురుస్తున్నప్పుడు, వంద కోట్ల మంది మెడలపై పౌరసత్వ కత్తి వేలాడుతన్నప్పుడు, ʹదేశభక్తిʹ పరీక్షలో నువ్వో ద్రోహివైపోతున్నప్పుడు కాళ్లకింది నేల నేర్పే పాఠం అది.

ఆ తొవ్వకు సాంస్కతిక కళా రూపాలు కొత్త ఊపిరిలూదుతున్నాయి.

జామియా, జేెన్ యూ, షాహీన్ బాగ్ గోడలపై కనిపించే రంగు రంగుల చిత్రాలు, అక్షరాల్లో ప్రతిధ్వనించే నినాదాలు నిరసన స్వరాన్ని పలికిస్తున్నాయి. స్వేచ్ఛా కాంక్షను ప్రకటిస్తున్నాయి. జామియా ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు ప్రారంభించిన ఈ సృజనాత్మక వ్యక్తీకరణ ఇప్పుడు మొత్తం దేశం చూపును ఆకర్షిస్తోంది. ఆర్టిస్ట్స్ రైజ్ ఫర్ ఇండియా పేరుతో షాహీన్ బాగ్ గోడలపై విద్యార్థులు వేసిన గ్రాఫిటీ ఇప్పుడు హక్కుల గొంతుకగా మారింది.

గోడలు మాత్రమే కాదు... వీథులను, రహదారులను సైతం రంగులతో నింపేశారు వాళ్లు. రాజ‌కీయాల‌ను రంగుల్లో ఒంపి... ప్ర‌పంచాన్ని ఆవాహ‌న చేస్తున్నారు. సామాజిక మాద్యమాల్లో సైతం తమ నృజనాత్మకతను చాటుతున్నారు.

షాహీన్ బాగ్ లో బడిపిల్లలు వేస్తున్న చిత్రాల్లో నిరసన, ట్విట్టర్లో టీనేజ్ కుర్రాడి ఆగ్రహం, ఇన్ స్టాగ్రాంలో, యూట్యూబ్ లో ఎక్కడ చూసినా ఒక ధిక్కారం ధ్వనిస్తుంది.

కవులు, రచయితలు, చిత్రకారులు, కార్టూనిస్టులు, యానిమేషన్ ఆర్టిస్టులు ఇలా ఎందరెందరో నృజనకారులు తమ ప్రతిఘటనను వ్యక్తీకరిస్తున్నారు. అక్కడ రోహిత్ వేముల నినదిస్తుంటాడు. నజీబ్ తారసపడతాడు. భగత్ సింగ్ పిలుస్తుంటాడు. అక్ష‌రాలు దిద్దే చేతులు ఆయుధాల ముందు పిడికిలెత్తి నిలబడాయి. చరిత్రతో సంభాషించే నినాదాలెన్నో ఆ గోడల మీద, రోడ్లపైన, ప్లెకార్డు మీద కనిపిస్తాయి.

బెంగుళూరులో సీఏఏ వ్యతిరేక ప్రదర్శనలో కనిపించిన ʹ1933 - 45 నుంచి మేమున్నాం ఇక్కడʹ అనే పోస్టర్ చూస్తే ఓ నియంత పాలన గుర్తుకు వస్తుంది. నాజీ నియంతృత్వం మదిన మెదులుతుంది. ʹరాజుల ముసుగులు తొలగిస్తారు... జామియా అమ్మాయిలు... తమ చేతలతో విప్లవాన్ని నృ ష్టిస్తారు... మొత్తం ప్రజలంతా వీథుల్లోకి వచ్చినప్పుడు పితృస్వామ్యపు దుస్తులు వదిలిపోతాయిʹ అంటూ... అజీజ్ వినిపించిన కవిత్వం గెలుపుపై విశ్వాసాన్ని ప్రకటిస్తుంది.

నడిచే వీథుల్లో మొలిచిన ప్రశ్నలు.. వీచే గాలిలో వినిపించే నినాదాలు.. చూసే కళ్లలో నిండిన కన్నీళ్లు. అన్నీ స్పష్టమే.

అమెరికా ఆధిప‌త్యాన్ని ప్ర‌శ్నించిన ఆర్ట్ అది. నిర్బంధం కోర‌లకందకుండా రెక్క‌లు చాచి .. వీధుల్లోంచి, స్కైవేల నుంచి, రైళ్లెక్కి ప‌రుగుపెట్టిన గ్రాఫిటీ అది. చైనా ఐక్య‌త‌కు మాద్యమంగా మారిన గోడ రాతలు అవి. నక్సల్బరీని నలు దిశలా ప్రచారం చేసిన ఎర్రసిరా అది. అది కేవ‌లం ఆర్ట్ మాత్ర‌మే కాదు.. కొన్ని రంగులు మాత్ర‌మే కాదు... వేల ఆలోచనలు.

ఇంగ్లండ్‌లో వ్యంగ చిత్రమై రాజ్యాన్నివెక్కిరించిన బ్యాంక్సీ కనిపిస్తాడు అక్కడ. అది షాహీన్ బాగ్ లోనే కాదు, బెంగుళూరు ఆజాదీ మైదానంలో, టిస్ హైదరాబాద్ లో ప్రతిచోటా కనిపించే చిత్రాలవి.

ఈ సాంస్కతిక కళా రూపాలపైనా కన్నెర్ర జేసిన రాజ్యం హరివిల్లు వర్ణాలపై ఆంక్షలు విధించింది. ʹబీజేపీ ఒక క్యాన్సర్.. అది నిన్ను చంపకముందే దాన్ని అంతచేయుʹ, ʹమోదీ ఓ ఫాసిస్టుʹ, ʹస్వేచ్ఛా కశ్మీర్ʹ లాంటి నినాదాలపై బెంగుళూరు, ముంబై నగరాల్లో రాజ్యం ఆగ్రహాన్ని ప్రకటించింది.

గోడల మీద రాతల్నే కాదు.. సామాజిక మాద్యమాల్లోని నృజనాత్మక వ్యక్తీకరణపైనా విరుచుకుపడుతోంది. నిరసనను నేరంగా పరిగణిస్తూ... గొంతునొక్కుతోంది. ఒక్క ఉత్తర ప్రదేశ్ లోనే 124 మందిని అరెస్టు చేసినట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి. దాదాపు 10వేల ట్విట్టర్, 10 ఫేస్ బుక్, 181 యూట్యూబ్ అకౌంట్స్ పై ఆగ్రహాన్ని ప్రదర్శించింది.

ఎందుకంటే.. ʹసబ్ చంగా సీ హైʹ (ఎవ్రీ థింగ్ ఈజ్ ఫైన్) ఇప్పుడు వినిపించాల్సింది ఈ ఒక్క నినాదమే. అయినా... ప్రజలు హమ్ కాగజ్ నహీ దికాయేంగే.. అని నినదిస్తూనే ఉన్నారు. ఎందుకంటే, ఆంక్షలెప్పుడూఆలోచ‌న‌ల‌ను నిద్ర‌పుచ్చ‌లేవు కనుక. అవి మళ్లీ మళ్లీ చిగురిస్తూనే ఉంటాయి. కొత్త పాటను ఎత్తుకుంటాయి.

No. of visitors : 185
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


అక్క‌డ డేనియ‌ల్ ఉన్నాడు

సంఘ‌ర్ష్‌ | 18.11.2016 12:59:34pm

అక్క‌డ‌ బాల్యం భ‌యంలో... య‌వ్వ‌నం నిర్బంధంలో గ‌డిచిపోతుంది. ఇంటి నుంచి బ‌య‌ట‌కెళ్లిన పిల్ల‌లు తిరిగి వ‌స్తారో రారో తెలీదు. దారి కాచుకు కూర్చునే ఖాకీ మూక‌...
...ఇంకా చదవండి

బోధ‌నా హ‌క్కు కోసం మ‌రో జైలు పోరాటం చేస్తా : ప్రొIIజి.ఎన్‌.సాయిబాబా

ఇంట‌ర్వ్యూ : క్రాంతి | 01.06.2016 12:44:47pm

1930 సంక్షోభ కాలంలో హిట్లర్ యువతను, కార్మికులను కమ్యూనిస్టుల కంటే అధికంగా ఆర్గనైజ్ చేయడాన్ని గమనించవచ్చు. ఉపాధి లేక తిరుగుబాటు స్వభావంతో ఉన్నయువతను ఫాసిస్ట...
...ఇంకా చదవండి

దూతను కాల్చివేసే చోట: బస్తర్ అడవుల్లో జీవన్మరణ సమస్యగా జర్నలిజం

సుబోజిత్ బాగ్చీ (అనువాదం : క‌్రాంతి) | 17.06.2016 09:33:33am

సామాజిక కార్యకర్తలు, లాయర్లు, న్యాయ సహాయక బృందాలు డాక్టర్లు మొదలు సామాన్యుల వరకు అక్కడ ప్రతి ఒక్కరూ తుపాకీ నీడలో జీవించాల్సిందే........
...ఇంకా చదవండి

మ‌రో ఆదివాసీ యువ‌కుడు...

క్రాంతి | 03.09.2016 03:22:46pm

17 ఏళ్ల పిల్లాడిని తీసుకెళ్లి 30 ఏళ్ల యువ‌కుడిగా త‌ప్పుడు చార్జిషీటు సిద్ధం చేశారు. 2014లో ఐదుగురు జ‌వాన్లు చ‌నిపోవ‌డానికి కార‌ణ‌మైన అంబులెన్స్ ........
...ఇంకా చదవండి

పొట్ట‌కూటి కోసం పోతే... పోలీసులు కాల్చిచంపారు

| 20.10.2016 03:21:04pm

తాపీ మేస్త్రీ కాస్తా రాత్రికి రాత్రి మావోయిస్ట‌య్యాడు. మూడు రోజుల క్రితం పనికోసం వెళ్లిన‌ మ‌నోహ‌ర్ శ‌వ‌మై తిరిగి వ‌చ్చాడు. "ఎన్‌కౌంటర్" క‌థ రిపీట్ అయ్యింది....
...ఇంకా చదవండి

వెలివాడే తొలిపొద్దై పుస్త‌కావిష్క‌ర‌ణ‌

ఫొటోలు : క‌్రాంతి | 17.07.2016 12:15:31pm

రోహిత్ వేముల స్మృతిలో విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘం వెలువ‌రించిన వెలివాడే తొలిపొద్దై పుస్త‌కాన్ని రోహిత్ త‌ల్లి వేముల రాధిక ఆవిష్క‌రించారు. మార్చి ...
...ఇంకా చదవండి

సంత‌కు వెళ్లిన వాళ్లు.. శ‌వాలై వ‌చ్చారు

సంఘ‌ర్ష్‌ | 20.02.2017 11:52:50am

ఏకంగా ఇర‌వై రోజుల నుంచి మృత దేహాల‌ను ఖ‌న‌నం చేయ‌కుండా గ్రామంలోనే ఉంచుకొని ఆందోళ‌న చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఒక్క అధికారి కూడా ఈ విష‌యంలో స్పందించ‌క‌పోవ...
...ఇంకా చదవండి

అధికారం నీడ‌లో.... అంతులేని హింస‌

క్రాంతి | 05.10.2016 03:32:08pm

మోదీ ప్ర‌భుత్వం ʹ మేక్ ఇన్ ఇండియాʹ పేరిట దేశ స‌హ‌జ వ‌న‌రుల‌ను వేదాంత‌, ఎస్సార్‌, టాటా, జిందాల్ వంటి బ‌హుళ‌జాతి సంస్థ‌ల‌కు క‌ట్ట‌బెడుతోంది. అందుకు......
...ఇంకా చదవండి

ఆ చెట్టుకు నోరుంటే ..

క్రాంతి | 03.01.2017 09:49:29am

ఆట‌పాట‌ల్లో మురిసిపోయే ప‌సివాడు ఉట్ట‌న్న‌ట్టుండి న‌క్స‌లైట‌య్యాడు. క‌సిగా గుచ్చుకున్న బ‌యోనెట్ మొన వాడి మొర ఆల‌కించ‌లేదు. రాజ్యం ఎక్కుపెట్టిన తుపాకీ తూటాల...
...ఇంకా చదవండి

ఆర‌ని మంట‌లు...

| 02.11.2016 09:05:19am

2011 మార్చిలో చ‌త్తీస్‌ఘ‌డ్‌లోని తాడిమెట్ల గ్రామంలో జ‌రిగిన మార‌ణ‌హోమం పోలీసుల ప‌నే అని సీబీఐ తేల్చిచెప్పింది. ఈ కేసులో... ఎనిమిది మంది స్పెష‌ల్ పోలీస్...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India

All sections of working masses should be united together irrespective of caste and religious diferences, to fight in the path of caste annihilation..

 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  నేను దీపాలు ఆర్పను.. కొవ్వొత్తులు వెలిగించను.. ఏం చేస్తావ్?
  కరోనా లాఠీఛార్జ్ : ఇది మనకు అభ్యంతరం అనిపించాలి కదా?
  నిజమైన స్వాతంత్రం కోసం పోరాడటంలోనే భగత్ సింగ్ స్ఫూర్తి ఉంది
  చేతులు కడిగేసుకోవడం తప్ప ఇంకేమైనా చేయగలరా?
  ఆ కన్నీటిని ఈ శిక్ష తుడిచేయగలదా?
  మీరెప్పుడూ అర్బన్‌ మావోయిస్టులనే మాట వాడలేదా?
  మనుషులకే అర్థమయ్యేదీ, పంచుకునేదీ దుఃఖమే అంటున్న పద్మకుమారి కథలు
  The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
  Students and the Revolution
  గోడలమనుషులు
  దగ్ధహృదయమా !
  మూడో కన్ను

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •