ఇంకా ఎంత నెత్తురు కావాలో..

| సాహిత్యం | క‌విత్వం

ఇంకా ఎంత నెత్తురు కావాలో..

- శేషు కొర్లపాటి | 16.03.2020 02:55:49pm

ఇద్దరి మనుషుల మధ్య
తొలకరి జల్లులా ప్రేమ కురిసిన రోజు
కులం ఉన్మాదమై తోక మీద లేస్తుంది

సమాజం తక్కెడలో
కులం పెచ్చు తూగుతున్న వేళ
ప్రేమ అంటారానిదే అవుతుంది
ప్రేమించడం కుల ద్రోహమే అవుతుంది

కులం న్యాయమూర్తి అవతారమెత్తి
కులదెయ్యం కాళ్ళుమొక్కి
ప్రేముంచిన తప్పుకు
మరణ శిక్ష విదిస్తుంది

తానే తాళారై
తానే కత్తై
తలలు నరుకుతుంది

కట్టుబానిస సమాజం
ఈ తీర్పు అద్భుతమంటూ
ఊరేగింపులు తీస్తుంది

కులం అంటుకున్న కత్తి
నిత్యం నెత్తుటి స్నానాలు చేస్తూనే ఉంటుంది

కట్టుబాట్లు కట్లు తెంచుకున్న తెలివి
తెగిపడిన తలై నన్ను చూసి నవ్వుతుంది

నోరు తెరవని శవాల సమూహాలతో
సమాజం కులాల కంపు కొడుతుంది
కడగడానికి ఇంకా ఎంత నెత్తురు కావాలో





No. of visitors : 189
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India

All sections of working masses should be united together irrespective of caste and religious diferences, to fight in the path of caste annihilation..

  • Students and the Revolution
  • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
  • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
  • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    నేను దీపాలు ఆర్పను.. కొవ్వొత్తులు వెలిగించను.. ఏం చేస్తావ్?
    కరోనా లాఠీఛార్జ్ : ఇది మనకు అభ్యంతరం అనిపించాలి కదా?
    నిజమైన స్వాతంత్రం కోసం పోరాడటంలోనే భగత్ సింగ్ స్ఫూర్తి ఉంది
    చేతులు కడిగేసుకోవడం తప్ప ఇంకేమైనా చేయగలరా?
    ఆ కన్నీటిని ఈ శిక్ష తుడిచేయగలదా?
    మీరెప్పుడూ అర్బన్‌ మావోయిస్టులనే మాట వాడలేదా?
    మనుషులకే అర్థమయ్యేదీ, పంచుకునేదీ దుఃఖమే అంటున్న పద్మకుమారి కథలు
    The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
    Students and the Revolution
    గోడలమనుషులు
    దగ్ధహృదయమా !
    మూడో కన్ను

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •