సమ్మోహన..

| సాహిత్యం | క‌విత్వం

సమ్మోహన..

- రివేరా | 16.03.2020 02:59:32pm

To be or not to be. Thatʹs the question - Hamlet

జైలు బరువేగానీ భయం లేదు
నీడ అరువు బేరమే చచ్చేంత భయం

నిజమే జైలు లేనిదెక్కడ?
అంతకుమించింది ఈ నీడ

ఉక్కపోస్తే, నడకలో చిక్కుబడితే
ఎవరో ఎందుకో ఉక్కుపాదం మోపితే
టకటకలాడిస్తాయి చెరచెరలాడతాయి
లేసులు కట్టుకోలేదని పాదాలను
గాలిలోని శక్తులను ఆదేశిస్తున్నాయని
వేలికొసలను మటుకే ఊచలు వేరు చేస్తాయి
నీడలలా కాదు.. జైలునీడలసలే కాదు
ఊచలు ఊసులు చెప్పవు.. ఇవి చెబుతాయి
ఊచలు ఏ చాన్సూ ఇవ్వవు.. ఇవి ఇస్తాయి
ఊచలు ఊకోమంటాయి.. ఇవి ఊరికే ఉంచవు
చర్మం అలాగే ఉంచి లోనంతా కుట్టేస్తాయి
చర్మం అలాగే ఉంచి అంగాంగాన్నీ కట్టేస్తాయి
చర్మం అలాగే ఉంచి కలలను కొట్టేస్తాయి
ఎందుకనో
ఇష్టమైనవన్నీ ఆ కలల్లో కోరలు చాస్తాయి

గోడ మీది నీడ కథలో తోక మాయం
ఆ రహస్య జీవ సూచికను అట్టా ఆడించి
కను కొలనులు ఇట్టా దోచి..

దాల్ రోటి రుచిలో అమ్మ మాయం
పుట్టినప్పుడు ముక్కు, చెవులు
ఒత్తినంత ఒద్దికగా
చెక్కపై వేసి రోటి చేసే ఆమె నుదుటి
చుక్కలకో భాష ఉండేది..
చిచ్చుకొట్టి భూగోళం అచ్చుని
ఆటాలో ఆడించే చేతులకో విన్యాసం ఉండేది
పసందుగా ఆకాశం జిహ్వశ్వాలను పూన్చేది
జైల్లో కూడా రోటి ఇస్తారుగానీ అమ్మ రాదు
ఇన్ని నీడల్ని తప్పించుకొని కలలోకయినా..

ఇష్టమైనవన్ని ఆ కలల్లో కోరలు చాస్తాయి
ఎందుకనో.. ఎందుకనో...





No. of visitors : 135
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


మంద్ర‌స్థాయి యుద్ధం - ప్ర‌జా ప్ర‌తిఘ‌ట‌న : రివేరా

రివేరా | 10.06.2016 01:10:40am

9, 10 జ‌న‌వ‌రి 2016 తేదీల్లో విజ‌య‌వాడ‌లో జ‌రిగిన విరసం 25వ రాష్ట్ర మ‌హాస‌భ‌ల్లో మంద్ర‌స్థాయి యుద్ధం - ప్ర‌జా ప్ర‌తిఘ‌ట‌న పై రివేరా ఉప‌న్యాసం.......
...ఇంకా చదవండి

చేజారిన జాడల్లోంచి మైదానాల్లోకి..

రివేరా | 16.07.2016 11:50:45am

పుస్తకాల సంచిని గిరాటేసి రోడ్డుపైకి దూసుకెళ్లిన జ్ఞాపకం వెనుక నుంచి పిలుస్తున్న తల్లివైపు స్నేహితుల భుజాలపైనుంచి నవ్వుతూ చూడటమే చివరిచూపు.......
...ఇంకా చదవండి

ఏప్రిల్ పండు II రివేరా

రివేరా | 24.04.2016 11:08:03pm

పిల్లలు లేని ఇల్లు, ఇది హైదరాబాద్, ఊరేగింపు, ఏప్రిల్ పండు,...
...ఇంకా చదవండి

సాయంకాలం వాన‌!

రివేరా | 20.12.2016 11:48:01pm

దుప్ప‌టి కింద‌, దిండు అడుగున‌ పిల్ల‌లు చూడ‌కుంటా క‌ప్పెట్టుకొన్న వ‌ర‌ద‌గూడుని మెలిపెడ‌తావేమో...
...ఇంకా చదవండి

భ‌యం చుట్టూ భ‌యం..

ఎడార్డో గెల‌నో | 04.02.2017 01:18:19am

వీళ్లెక్క‌డ చంపుకుతింటారోన‌ని ఆడ‌వాళ్ల‌కు భ‌యం భ‌యంలేని ఆడ‌వాళ్లంటే మ‌గ‌వాళ్ల‌కు మ‌హా భ‌యం దొంగ‌లంటే భ‌యం, పోలీసుల‌న్నా మ‌రి భ‌య‌మే తాళాలు లేని త‌లుపులంటే భ...
...ఇంకా చదవండి

రెప్పని కప్పని నిద్దుర

రివేరా | 16.08.2016 09:26:54am

ఒకే రాత్రిని కప్పుకొన్న మనకి ఒక్క నిద్దుర చాలదా? చుక్క కలని పొదువుకోడానికి ఈ ఒక్క దేహ వర్షం చిలకదా?...
...ఇంకా చదవండి

ఈ రాక్ష‌స గీతి వింటారా?

రివేరా | 02.11.2016 10:23:06am

మ‌నం నిల‌బ‌డిపోయిన చోట నుంచే మ‌న న‌డ‌క‌ల‌ను మోసుకెళుతున్నారు మ‌నం ఆపేసిన రాగాల‌నే తీగ‌లుగా సాగిపోతున్నారు మ‌న గొంతునీ, మ‌న వంతునీ మ‌న‌క్కిచ్చేసి వెళుతు...
...ఇంకా చదవండి

నో, ఐ డోన్ట్‌ లైక్‌ టమాట

రివేరా | 17.09.2016 10:14:09am

టమాట రంగు సరే, రసాలూరే సరస్సులేమీ.. కొంచెం కరిచిపట్టుకొన్న మిలమిలా మీనాలేమీ.. పైకి కిందకి మునకలేసే గత్తరబిత్తర గోళాలేమీ.......
...ఇంకా చదవండి

అద్గ‌దీ...

రివేరా | 20.10.2016 12:13:15am

అటో ఇటో వేటో పోటో ప‌డిపోవాల్సిందే! పాల‌కులంతా ప్ర‌జాస్వామిక‌వాదులై ప్రజ‌లేమో నియంత‌లైతే ఏమి చేస్తాం?...
...ఇంకా చదవండి

సబ్కా జవాబ్ వెతికుతున్న కవి రివేరా

మహమూద్ | 04.05.2017 10:49:39am

విప్లవకవిత్వాన్ని ఈసడించుకునే వర్గాన్ని కూడా ముక్కుమీద వేలేసుకునేలా రివేరా ఓ మంచి కవి అని అందరి చేత అనిపించుకోవడం వాస్తవానికి విప్లవ సంస్కృతి విజయమే.......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India

All sections of working masses should be united together irrespective of caste and religious diferences, to fight in the path of caste annihilation..

  • Students and the Revolution
  • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
  • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
  • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    నేను దీపాలు ఆర్పను.. కొవ్వొత్తులు వెలిగించను.. ఏం చేస్తావ్?
    కరోనా లాఠీఛార్జ్ : ఇది మనకు అభ్యంతరం అనిపించాలి కదా?
    నిజమైన స్వాతంత్రం కోసం పోరాడటంలోనే భగత్ సింగ్ స్ఫూర్తి ఉంది
    చేతులు కడిగేసుకోవడం తప్ప ఇంకేమైనా చేయగలరా?
    ఆ కన్నీటిని ఈ శిక్ష తుడిచేయగలదా?
    మీరెప్పుడూ అర్బన్‌ మావోయిస్టులనే మాట వాడలేదా?
    మనుషులకే అర్థమయ్యేదీ, పంచుకునేదీ దుఃఖమే అంటున్న పద్మకుమారి కథలు
    The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
    Students and the Revolution
    గోడలమనుషులు
    దగ్ధహృదయమా !
    మూడో కన్ను

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •