దగ్ధహృదయమా !

| సాహిత్యం | క‌విత్వం

దగ్ధహృదయమా !

- వడ్డెబోయిన శ్రీనివాస్ | 16.03.2020 11:49:34pm

మిత్రమా!
ఎక్కడున్నావు ?

ఈ చీకట్లో
నీ అజా వినిపించడం లేదు

ఎదురెదురుగా
మన ఇండ్లు ఎదగకున్నా
కాలంతో
వయస్సు కెదిగాం

ఏ వాతావరణం
మనం
కాలుష్యం కాలేదు

నీ రేకులింటి ముందు
నీ బెంచీ మీద కూర్చున్నప్పుడు
నీ గొంతు లోంచి
భగవద్గీత
ప్రవహించేది

నా రేకులింటి ముందు
నా బెంచీ మీద కూర్చున్నప్పుడు
నా గొంతు లోంచి
ఖురాన్
పరిమళించేది

కాలం చెట్టు పూసి
రాలిన రోజులపూలు
దోసిళ్ళలో పట్టుకొని
ఎన్నెన్ని జ్ఞాపకాలు ఏరుకున్నాం

ఇప్పుడేంటి ?
మన అనుభవాల వీధుల్లో
నెత్తుటి మరకలగోతులు పరుచుకున్నాయి !

మన మాటల్ని విరిచి
ఈ వీధుల్లో
గాజు పెంకుల్లా విసిరి పోయారు

నీ ఇంటి ముందు
నీ కుర్చీ ముక్కలైంది
నా ఇంటి ముందు
నా కుర్చీ ఒక్కలైంది

మన పసి అడుగుల పాటలు విని
పరవసించిన
ఈ వీధి కేమయింది ?
మృత్యు దాహ కేకలు వేస్తోందీవేళ !

ఈ కత్తుల కరాళ నృత్యం
ఈ గాజుముక్కల తుఫాను
ఈ ఇటుకలవర్షం
ఈ రాళ్ళురప్పల వడగండ్లు
ఈ ఇనుపరాడ్ల వరద

మనస్సు లో
దాచుకున్నవన్నీ
ఈ రోడ్డు మీద వదిలేసి పోయారు

దగ్ధనెలవంకా !
ఎక్కడని వెతకాలి ?

ఇక్కడ కొంచెం
వెంట్రుకలున్న
గడ్డపు చర్మపు ముక్క పడిఉంది

ఈ రోడ్డు మీద
నీ నెత్తురు బొట్టు నెట్లా గుర్తు పట్టను ?

పోనీ
నేను వేసిన చావు కేకైనా
గుర్తు పట్టావా ?

చెల్లా చెదరై
ముక్కలై
నెత్తురొడి
ఈ రోడ్డు మీద పడి పోయి ఉన్న
ఖురాన్ వాక్యాలు !

ఈ వీధి
ఈ చివరి నుండి
రాముడు
ఏడ్చుకుంటూ వస్తున్నాడు

ఆ కొస నుండి
అల్లా
ఏడ్చుకుంటూ వస్తున్నాడు

మన వీధి నిండా
మనం నాటిన కలలు
తెగ నరికి పోయింది
విద్వేష భాష

చివరిమూల
తిరుగుతున్నప్పుడు
మా ఇద్దరి చితులు పేర్చి
పడిపడి నవ్వుతున్న
ద్వేషభక్తి
కత్తులభాష మాట్లాడుతోంది

బహుశా !
మన మనసులు
దానికి దొరకలేదేమో!?





No. of visitors : 329
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


హెచ్చరిక

వడ్డెబోయిన శ్రీనివాస్ | 19.05.2018 09:17:54am

బాబాలు స్వాములు యోగుల ఇంద్రియానందం ముంచితీసిన లైంగికమతపిచ్చి రాజ్యంలో ఆడంటే బలిజీవి! మగంటే బలికోరే పితృస్వామ్యం!.....
...ఇంకా చదవండి

టార్చిలైటు

వడ్డెబోయిన శ్రీనివాస్ | 31.10.2019 07:59:56pm

ఇంకా ఎగిలి వారని తెలంగాణ చేతిల ఇయ్యాల ఎర్రబస్సే టార్చిలైటు !...
...ఇంకా చదవండి

ఉన్నావో సీత

వడ్డెబోయిన శ్రీనివాస్ | 08.03.2020 10:48:58am

మృగభారతాన్ని అన్ని భాషలకు అర్ధమైయ్యే అగ్నిభాష భావోద్వేగాలతో వస్తోంది కాలిపోతున్న కలలబట్టలతో ...
...ఇంకా చదవండి

వాళ్ళు

వడ్డెబోయిన శ్రీనివాస్ | 17.11.2019 06:06:37pm

ప్రాణం చీకటి పడినా సరే ! దొర డెడ్ లైన్లకు డెడ్ లైన్లు పెట్టిండ్రు దొర సెల్ప్ డిస్ మిస్ సెల్ఫౌట్ చేసిండ్రు ...
...ఇంకా చదవండి

న్యాయమూర్తులుం గారూ!

వడ్డెబోయిన శ్రీనివాస్ | 02.12.2019 11:25:41pm

హద్దులున్నయని సుద్దులు జెప్పుకుంటనే హక్కులను అంగట్ల బెడ్తివి ...
...ఇంకా చదవండి

ది కల్చర్ ఆఫ్ కరోనా

వడ్డెబోయిన శ్రీనివాస్ | 02.04.2020 01:19:46am

కొట్టండి చప్పట్లు చప్పట్లు కొట్టండి...
...ఇంకా చదవండి

గోడలమనుషులు

వడ్డెబోయిన శ్రీనివాస్ | 16.03.2020 11:53:45pm

గోడలు కట్టడమే తెల్సు వాళ్ళకు ! మనుషుల మధ్య మనసుల మధ్య మతాల మధ్య ...
...ఇంకా చదవండి

ముస్లింమంటే కరోనా కాదురా

వడ్డెబోయిన శ్రీనివాస్ | 15.04.2020 11:16:47pm

మసీదు పావురం కళ్ళ లోంచి కన్నీరుసేమియా కారుతుండాలేమో!...
...ఇంకా చదవండి

చీకటిదీపం

వడ్డెబోయిన శ్రీనివాస్ | 16.04.2020 06:47:03pm

ఆకలీ కరోనా అన్నదమ్ములై పోయి అఖండభారత దండయాత్ర చేస్తుంటే మెతుకంటకముందే ఆకలి చేతుల్ని కడిగేసుకోమనడం కొత్తా!!! ఓటమి కోసమే ఓటు వేస్తున్న ఓటరులారా! ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

  • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
  • Students and the Revolution
  • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    వాళ్ల స్వేచ్ఛ కోసం పోరాడదాం
    నక్సల్బరీని ఎలా అర్థం చేసుకోవాలి?
    భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు
    నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
    లాక్ డౌన్ లో అబద్ధాలు - ఎన్ కౌంటర్లు
    కా. కాశీం విడుదల కోసం కృషి చేసిన మిత్రులందరికీ విప్లవాభివందనాలు - కరోనా విపత్తులో రాజకీయ ఖైదీలను, ఇతర ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి
    కాపిటల్ లో కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు
    ʹ రాగో ఏమవుతుంది? ʹ
    "తిన్నాడో లేదో పాపం"
    పరిమళభరిత తావుల్లోంచి
    ఆకలి చెమట వాసన
    ఇంద్రావతి..

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •