మీరెప్పుడూ అర్బన్‌ మావోయిస్టులనే మాట వాడలేదా?

| దండ‌కార‌ణ్య స‌మ‌యం

మీరెప్పుడూ అర్బన్‌ మావోయిస్టులనే మాట వాడలేదా?

- పాణి | 17.03.2020 03:36:36pm

నాలుగు రోజుల కింద రాజ్యసభలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నడూ అర్బన్‌ మావోయిస్టులు అనే పదబంధాన్ని వాడలేదని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ను అబద్ధాల కార్ఖానా అని ఎందరో ప్రజాస్వామికవాదులు అన్నారు. దీనికి హేతుబద్ధ ఆధారాలు చూపించారు. అబద్ధాలు, వక్రీకరణలు, వంచనలు ఆర్‌ఎస్‌ఎస్‌కు వెన్నతో పెట్టిన విద్య. నిస్సిగ్గుగా ఏ మాట అయినా అనగల బరితెగింపు దాని మూలాల్లోనే ఉంది. ఇది కూడా అలాంటిదే. ఈ నెల 11వ తేదీ రాజ్యసభలో తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యురాలు శాంత ఛత్రి మాట్లాడుతూ అర్బన్‌ మావోయిస్టుల కిందికి ఎవరెవరు వస్తారు? అని ప్రభుత్వాన్ని అడిగారు.

దీనికి సమాధానంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కాని, హోంశాఖగాని అర్బన్‌ మావోయిస్టులనే పదబంధాన్ని ఎక్కడా, ఎప్పుడూ అధికారికంగా ఉపయోగించలేదని వివరణ ఇచ్చారు. ఈ మాట పూర్తి అబద్ధం. నిజాలే మాట్లాడాలనే నియమం ఏమీ లేకపోవడం కాదు, ఏ అబద్ధాలైన మాట్లాడవచ్చు..దేనికీ బాధ్యత పడాల్సిన పని లేదు..అనేది పార్లమెంటరీ రాజకీయాల్లో సహజ ధోరణి. ఇదేదో మామూలు జీవితంలో నిజానికి అబద్ధానికి ఉండే తేడా లాంటిది కాదు. అధికార రాజకీయాల్లో దీనికి స్పష్టమైన ప్రయోజనాలు ఉంటాయి. వ్యూహాత్మక అవసరాలు ఉంటాయి. వాటిని సాధించుకోవడమే లక్ష్యం. అందుకోసం ఏమైనా మాట్లాడతారు.

నిజానికి అర్బన్‌ మావోయిస్టులు అనే మాటకు చాలా చరిత్ర ఉన్నది. అదంతా ఇక్కడ మళ్లీ అక్కర్లేదు. కనీసం జిఎన్‌ సాయిబాబ సందర్భంలో చూసినా సరిపోతుంది. 2011లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఆయనను అర్బన్‌ మావోయిస్టు అన్నది. అది కూడా అదాటున అని వదిలేయలేదు. దాని మీద వాదన కూడా చేసింది. ఈ మాట కేవలం సాయిబాబ కోసమే కాదు. దాని వెనుక ఒక వ్యూహం ఉంది. సరిగ్గా ఐదేళ్లు తిరిగే సరికి 2016లో చత్తీస్‌ఘడ్‌లో ఆనాటి బీజేపీ ప్రభుత్వ హయాంలో బస్తర్‌ ఎస్పీ కల్లూరి ఆధ్వర్యంలో ఆపరేషన్‌ అగ్ని(యాక్షన్‌ గ్రూప్‌ ఫర్‌ నేషనల్‌ ఇంటగ్రెటీ) అనే అభియాన్‌ ఆరంభమైంది. ఇది ఒక సంస్థ కూడా.

దీని ప్రధాన ఉద్దేశం.. ఆదివాసీ విప్లవోద్యమ ప్రాంతాల్లో ప్రభుత్వం చేస్తున్న దారుణ యుద్ధాన్ని, ఎన్‌కౌంటర్‌ హత్యలు, అత్యాచారాలు, గృహదహనాలు లాంటి మారణకాండను పట్టణాల్లో ఉండి ఖండిస్తున్న ʹఅర్బన్‌ మావోయిస్టులʹ మీద దాడి చేయడం. ఆదివాసుల మీద, మావోయిస్టు ఉద్యమం మీద సీఆర్‌పీఎఫ్‌ వంటి నానా రకా బగాలు నేరుగా యుద్ధం చేస్తున్నట్లే.. ఈ దుర్మార్గాన్ని ఖండించే వాళ్ల మీద దాడి చేయడం అగ్ని లక్ష్యం అని అందులో ప్రకటించుకున్నారు. ఇందులో అర్బన్‌ మావోయిస్టులనే మాట స్పష్టంగానే వాడారు. ఆ తర్వాతనే చత్తీస్‌ఘడ్‌లో ఎందరో ప్రజాస్వామికవాదుల మీద భౌతిక దాడులు జరిగాయి. కేసులు పెట్టారు. వాళ్లు రాష్ట్రంలో ఉండి ఆదివాసుల గురించి మాట్లాడలేని స్థితి కల్పించారు.

భీమా కోరేగావ్‌ కేసు తర్వాత బీజేపీ నేతలు, వాళ్ల మేధావులు వగైరా విరివిగా ఈ మాట ఉపయోగిస్తున్నారు. ఒక రకంగా అగ్ని కొనసాగింపే భీమా కోరేగావ్‌ కేసు అని చెప్పవచ్చు. కాకపోతే అగ్నిని కూడా కలుపుకొని కేంద్రంలోని గత బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్‌ సమాధాన్‌ అనే పెద్ద యుద్ధ వ్యూహాన్ని తయారు చేసింది. అమలు చేస్తోంది. ఈ క్రమంలో అగ్ని పేరులో ఉన్నట్లే ʹనేషనల్‌ ఇంటెగ్రిటీʹకి భంగం కలిగిస్తున్నారని సంఘ్ పరివార్‌ అనుకున్న వాళ్లందరినీ అర్బన్‌ మావోయిస్టు జాబితాలోకి తోసేశారు. ప్రజా జీవితంలో నిలబడి మాట్లాడే ప్రతి ఒక్కరినీ దేశభద్రత, సమైక్యతకు నష్టం కలిగించే వారిగా చిత్రీకరిస్తున్నారు. అందరి మీద దేశద్రోహం దగ్గరి నుంచి అనేక అప్రజాస్వామిక చట్టాల కింద కేసు పెడుతున్నారు. అందరినీ చట్ట
వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద అరెస్టు చేస్తున్నారు. ఈ స్థితిని గత ప్రభుత్వ హయాంలోనే సంఘ్ పరివార్‌ పూర్తి స్థాయిలో తీసుకొచ్చింది. ఇప్పుడు మరింత విచ్చలవిడిగా ఈ పనులు చేస్తోంది. తాజాగా అయోధ్య తీర్పు తర్వాత అమిత్‌షా సీఆర్‌పీఎఫ్‌ బలగాల అధికారులతో మాట్లాడుతూ అటవీ ప్రాంతాల్లో తీవ్రవాదాన్ని అణచివేస్తున్నట్లు మన తదుపరి లక్ష్యం అర్బన్‌ మావోయిస్టులు కావాలి అన్నాడు. ఆయన అక్కడితో ఆగలేదు. అదే సమయంలో పార్లమెంట్‌లో మాట్లాడుతూ అర్బన్‌ మావోయిస్టుల పని పడతామని, వాళ్లను ఏరివేస్తామని ప్రకటించాడు.

ఇటీవల ఢిల్లీ ఎన్నిక సమయంలో బీజేపీ నేతలు, ముఖ్యంగా మోదీ కాంగ్రెస్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ కూడా అర్బన్‌ మావోయిస్టులనే మాట అన్నాడు. ఈ పదాన్ని మొదట మావోయిస్టు రాజకీయాలుండే మేధావులను అణచివేయడానికి తీసుకొచ్చి క్రమంగా వేర్వేరు సందర్భాల్లో ఈ పదబంధానికి విస్తృత అర్థం ఇవ్వడం మొదలు పెట్టారు. తన ప్రత్యర్థులందరినీ ఈ పేరుతో అణచివేయవచ్చని సంఘ్ పరివార్‌కు క్రమంగా అర్థమైంది. మావోయిస్టు భావజాలంలోని తీక్షణతను, క్రియాశీలతను సహజంగానే ఆర్‌ఎస్‌ఎస్‌ సరిగానే గుర్తిస్తుంది. తన రాజకీయ, భావజాల ప్రత్యర్థిగా మావోయిజాన్ని అది భావిస్తుంది. దాన్ని టార్గెట్‌ చేస్తూనే రోజువారి రాజకీయ వ్యవహారాల్లో ఎవరు అసమ్మతి వినిపించినా వాళ్లందరినీ అర్బన్‌ మావోయిస్టులని అంటోంది. యూపీఏ కాలం నుంచి ప్రభుత్వం, మంత్రులు, పోలీసులు అందరూ అంటున్న మాట ఇది. వ్యూహాత్మకంగానే విప్లవోద్యమ మేధావులను, ప్రజాస్వామికవాదులను అణచివేయడానికి ఈ మాట వాడుతున్నారు. ఇది కేవలం ఆరోపణకు ఉపయోగించడం లేదు. ఒక రకమైన అణచివేత వ్యూహాన్నే దీని మీద నిర్మించారు. ప్రజా పోరాటాలను, ప్రగతిదాయక పరివర్తనను, విముక్తి భావనను ప్రేరేపించే మావోయిజాన్ని ఎదుర్కొనే భావజాల వ్యూహం కూడా అర్బన్‌ మావోయిస్టులనే మాటలో ఉంది. కానీ కిషన్‌రెడ్డి అబ్బే... అలాంటి మాటే లేదు.. ప్రభుత్వం ఆ పదాన్ని వాడటం లేదని బుకాయిస్తాడు. సంఘ్ గ్యాంగ్‌కు ఇది అలవాటే.

తాజాగా సీఏఏ వ్యతిరేకపోరాటాలపై దాడులు చేస్తూ.. ఇది ʹతుక్‌డే తుక్‌డే గ్యాంగ్‌ʹ పని అని బీజేపీ నాయకులు ఆరోపించారు. స్వయంగా డిసెంబర్‌ 26న ఢిల్లీలో ఓ సభలో మాట్లాడుతూ అమిత్‌షా అన్నాడు. దాని మీద సమాచార హక్కు చట్టం ప్రకారం ఆరా తీస్తే భారత కేంద్ర హోం శాఖ అలాంటి పదంగాని, దానికి సంబంధించిన సమాచారంగాని తమ వద్ద లేదని అన్నది. అలాగే అర్బన్‌ మావోయిస్టుల గురించి కూడా తమ వద్ద ఏ సమాచారం లేదని అన్నది. అబద్ధాలకు, వక్రీకరణలకు, అణచివేతకు పుట్టిన సంఘ్ గ్యాంగ్‌కు ఇది మామూలే.





No. of visitors : 493
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?

పాణి | 04.05.2017 10:53:32am

హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల......
...ఇంకా చదవండి

రైతు - నీళ్లు

పెన్నేరు | 16.08.2016 01:10:03pm

రైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం......
...ఇంకా చదవండి

ఈ తీసివేత‌లు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?

పాణి | 16.08.2016 12:59:12am

నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా.........
...ఇంకా చదవండి

ఆజాదీ క‌శ్మీర్ : చ‌ల్లార‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌

పాణి | 16.07.2016 11:04:09am

కాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........
...ఇంకా చదవండి

వివేక్ స్మృతిలో...

పెన్నేరు | 17.09.2016 09:54:49am

వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు.......
...ఇంకా చదవండి

జీవిత కవిత్వం

పాణి | 04.06.2017 12:38:44pm

విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్‌ పద్ధతులకు వ...
...ఇంకా చదవండి

భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే

పాణి | 22.09.2017 01:18:31pm

ఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి......
...ఇంకా చదవండి

కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?

పాణి | 07.10.2017 11:08:49am

ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్‌ దేశస్థుల స్వేచ్ఛ గు...
...ఇంకా చదవండి

మానవ హననంగా మారిన రాజ్యహింస

పాణి | 02.11.2016 08:47:26am

ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం.......
...ఇంకా చదవండి

నాగపూర్‌ వర్సెస్‌ దండకారణ్యం

పాణి | 17.11.2017 11:35:51pm

దండకారణ్య రాజకీయ విశ్వాసాలంటే న్యాయవ్యవస్థకు ఎంత భయమో సాయిబాబ కేసులో రుజువైంది. నిజానికి ఆయన మీద ఆపాదించిన ఒక్క ఆరోపణను కూడా కోర్టు నిరూపించలేకపోయిందిగాని, ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

  • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
  • Students and the Revolution
  • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    నక్సల్బరీని ఎలా అర్థం చేసుకోవాలి?
    భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు
    నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
    లాక్ డౌన్ లో అబద్ధాలు - ఎన్ కౌంటర్లు
    కా. కాశీం విడుదల కోసం కృషి చేసిన మిత్రులందరికీ విప్లవాభివందనాలు - కరోనా విపత్తులో రాజకీయ ఖైదీలను, ఇతర ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి
    కాపిటల్ లో కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు
    ʹ రాగో ఏమవుతుంది? ʹ
    "తిన్నాడో లేదో పాపం"
    పరిమళభరిత తావుల్లోంచి
    ఆకలి చెమట వాసన
    ఇంద్రావతి..
    ఆలోచనల్లో మార్పు వస్తేనే స్త్రీల జీవితాలు మారుతాయoటున్న శీలా సుభద్రాదేవి

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •