ఆ కన్నీటిని ఈ శిక్ష తుడిచేయగలదా?

| సాహిత్యం | వ్యాసాలు

ఆ కన్నీటిని ఈ శిక్ష తుడిచేయగలదా?

- పాణి | 20.03.2020 05:59:16pm

ఆ నలుగురు అమానుషమైన పని చేశారు. మనుషులు కదా? ఎలా చేయగలిగారని లోకం దిగ్భ్రాంతికి గురైంది. ఇంత అనాగరిక సమాజంలో జీవిస్తున్నామా? అని సందేహంలో పడిపోయింది. మానవీయత భంగపడ్డప్పుటి సంక్షోభం ఇది. మానవీయంగా ఉండటమే మనిషి సహజ లక్షణం అనుకుంటాం. అది అడుగంటిపోతున్నప్పటి విషాదానికి సూచిక ఇది. నిత్యం ఎన్నో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఏ కారణం వల్లో కొన్నే చర్చనీయాంశమవుతున్నాయి. అది పూర్తిగా వేరే విషయం.

వ్యక్తులు చేసే ఇలాంటి హింసకు మూలాలేమిటనేదే అసలు ప్రశ్న.

కానీ న్యాయ వ్యవస్థకు ఇవేవీ పట్టవు. నేరానికి శిక్ష విధించడంతో దాని పని మొదలై, అక్కడే ముగిసిపోతుంది. న్యాయ వ్యవస్థకు నేరంలోని ʹఅమానవీయతేʹ అర్థమవుతుంది. శిక్షలోని అమానవీయత ఎన్నటికీ అర్థం కాదు. దేనికంటే న్యాయ వ్యవస్థకు సమాజంతో పని లేదు. దాని నాగరికతా క్రమంతో పని లేదు. సమాజంలో జరిగే నేరాన్ని అంచనా వేసి, సాక్షాధారాలనుబట్టి శిక్ష వేసి తన పని అయిపోయిందని అనుకుంటుంది.

అది అలా అనుకున్నంత మాత్రాన న్యాయ వ్యవస్థకు సాధికారత రాదు. సమాజంలో కూడా అలా అనుకొనే వాళ్లు ఉంటేనే దాని సాధికారత చెలామణి అవుతుంది. నేరం-శిక్ష విషయంలో ప్రతి సమాజానికి తనదైన నాగరికతా క్రమంలో సాధించిన విలువలు ఉంటాయి. పద్ధతులు ఉంటాయి. అత్యాచారం చేసిన మగవాడ్ని, వివాహేతర సంబంధం పెట్టుకున్న స్త్రీని సామూహికంగా రాళ్లతో కొట్టి చంపగల పరిష్కారాలకు ʹన్యాయంʹ అనే ఆమోదం ఉన్న సమాజం మనది. ఇలాంటి ఎన్నో ʹన్యాయబద్ధʹ పరిష్కారాలను అంగీకరించే సమాజం మనది. అందువల్లనే ఇది అత్యాచారం చేసిన వాళ్లను తక్షణం పోలీసులు కాల్చేయడం న్యాయమని అంగీకరిస్తుంది. న్యాయస్థానం ఉరిశిక్ష వేయడాన్ని న్యాయమైన పరిష్కారమని చప్పట్లు కొడుతుంది. హర్షధ్వానాలు వ్యక్తం చేస్తుంది. అక్షర రూపంలోని శిక్షాస్మృతినిబట్టే న్యాయ స్థానాల తీర్పులకు సాధికారత రాదు.. ఇదుగో ఇలాంటి అనాగరిక మన:స్థితికి కారణమైన సాంఘిక మూలాల వల్లే న్యాయస్థానాల తీర్పులకు ఆమోదం వస్తోంది.

ʹఆధునికʹ న్యాయవ్యవస్థలోని అనాగరిక విలువలకు మద్దతు సమాజంలోని అనాగరిక స్థితి నుంచి నిరంతరం అందుతూ ఉంటుంది. అత్యాచారం అమానుషమని దు:ఖించిన వాళ్లే నేరం చేసిన వాళ్లను కాల్చేయాలని కోరుకుంటారు. ఉరి తీయమని డిమాండ్‌ చేస్తారు. మనుషులు చూపగల పరిష్కారాలు ఇవే అని నమ్ముతూ ఉంటారు. నేరాన్ని ప్రశ్నించడంలో, శిక్షను అర్థం చేసుకోవడంలో మౌలికంగా మనం మనుషులమనే సంగతి మర్చిపోతుంటారు.

అమానుషమైన నేరాలు, వాటికి అనాగరికమైన శిక్షలు ఒకే మురికి గుంట నుంచి ఉత్పత్తి అవుతుంటాయి. నేరాన్ని ఖండించడానికి, శిక్షను సమర్థించడానికి మానవత, నాగరికత పునాది కాలేని దుస్థితి ఇది.

ఈ మొత్తంలో నేరానికి కారణాలు చర్చనీయాంశం కావు. మనుషులను నేరస్థులుగా మార్చుతున్న నేరమయ వ్యవస్థను ప్రశ్నించాలనే ఆలోచనే ఉండదు. మానవతకు ఇక చోటు ఎక్కడ ఉంటుంది? స్త్రీల శరీరాలపై దారుణమైన నేరాలు చేసేవాళ్లనూ, వాళ్లకు ఉరిశిక్ష విధిస్తే సంబరాలు చేసుకొనే వాళ్లనూ ఇద్దరినీ ఉత్పత్తి చేయడం ఈ వ్యవస్థ నేరస్వభావానికి ఉదాహరణ.

ఇంతకూ ఆ నలుగురినీ ఉరి తీసేశారు. ఉరే సరి అని నమ్మేవాళ్లు ఈ పగటి పూట కూడా ప్రశాంతంగా నిద్రపోతుంటారు కావచ్చు. ఇది నిర్భయంగా మహిళలు జీవించే లోకంగా ఎప్పటికి మారేను? తల్లులు నిశ్చింతగా జీవించే రోజు వచ్చేనా?

ఆ తల్లికి ఈ వేకువతో దు:ఖం తీరి ఉంటుందని చెప్పలేం.

ఒకవేళ అదే జరిగితే ఈ శిక్ష సరైనదే కావచ్చు. కానీ ఆమె కడుపుకోత ఎన్నటికీ తీరేది కాదు. అమానవీయమైన హింసతో గాయపడిన ఆ తల్లి కన్నీటిని అనాగరిక శిక్షలు తుడిచేయగవా

No. of visitors : 328
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?

పాణి | 04.05.2017 10:53:32am

హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల......
...ఇంకా చదవండి

రైతు - నీళ్లు

పెన్నేరు | 16.08.2016 01:10:03pm

రైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం......
...ఇంకా చదవండి

ఈ తీసివేత‌లు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?

పాణి | 16.08.2016 12:59:12am

నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా.........
...ఇంకా చదవండి

ఆజాదీ క‌శ్మీర్ : చ‌ల్లార‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌

పాణి | 16.07.2016 11:04:09am

కాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........
...ఇంకా చదవండి

వివేక్ స్మృతిలో...

పెన్నేరు | 17.09.2016 09:54:49am

వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు.......
...ఇంకా చదవండి

జీవిత కవిత్వం

పాణి | 04.06.2017 12:38:44pm

విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్‌ పద్ధతులకు వ...
...ఇంకా చదవండి

భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే

పాణి | 22.09.2017 01:18:31pm

ఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి......
...ఇంకా చదవండి

కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?

పాణి | 07.10.2017 11:08:49am

ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్‌ దేశస్థుల స్వేచ్ఛ గు...
...ఇంకా చదవండి

మానవ హననంగా మారిన రాజ్యహింస

పాణి | 02.11.2016 08:47:26am

ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం.......
...ఇంకా చదవండి

నాగపూర్‌ వర్సెస్‌ దండకారణ్యం

పాణి | 17.11.2017 11:35:51pm

దండకారణ్య రాజకీయ విశ్వాసాలంటే న్యాయవ్యవస్థకు ఎంత భయమో సాయిబాబ కేసులో రుజువైంది. నిజానికి ఆయన మీద ఆపాదించిన ఒక్క ఆరోపణను కూడా కోర్టు నిరూపించలేకపోయిందిగాని, ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  నక్సల్బరీని ఎలా అర్థం చేసుకోవాలి?
  భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు
  నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  లాక్ డౌన్ లో అబద్ధాలు - ఎన్ కౌంటర్లు
  కా. కాశీం విడుదల కోసం కృషి చేసిన మిత్రులందరికీ విప్లవాభివందనాలు - కరోనా విపత్తులో రాజకీయ ఖైదీలను, ఇతర ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి
  కాపిటల్ లో కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు
  ʹ రాగో ఏమవుతుంది? ʹ
  "తిన్నాడో లేదో పాపం"
  పరిమళభరిత తావుల్లోంచి
  ఆకలి చెమట వాసన
  ఇంద్రావతి..
  ఆలోచనల్లో మార్పు వస్తేనే స్త్రీల జీవితాలు మారుతాయoటున్న శీలా సుభద్రాదేవి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •