చేతులు కడిగేసుకోవడం తప్ప ఇంకేమైనా చేయగలరా?

| సంభాషణ

చేతులు కడిగేసుకోవడం తప్ప ఇంకేమైనా చేయగలరా?

- పి.వరలక్ష్మి | 21.03.2020 09:28:42am

ʹస్వీయ నియంత్రణ, సామాజిక దూరం, మానవీయత, కృత నిశ్చయంతో కరోనాను జయిద్దాం. కరోనాకు మందు లేదు. కొన్ని వారాల పాటు బైట తిరక్కుండా వర్క్ ఫ్రం హోం చేయండి. అత్యవసరం అయితే తప్ప ఇంటి నుంచి కాలు బైట పెట్టొద్దు.ʹ ప్రపంచమంతా విజ్రుంభిస్తున్న అంటువ్యాధి దేశాన్ని తాకినప్పుడు ప్రధానమంత్రి ప్రజలకిచ్చిన సందేశం ఇది. ఇందులో తప్పేముంది అనొచ్చు. కానీ భారతదేశంలోని ఏ ప్రజలకిచ్చిన సందేశం ఇది? మధ్యతరగతి ఉద్యోగ, సంపన్నవర్గాల పక్కనే మోడీ కట్టిన అహ్మదాబాద్ గోడ చాటున దాచిన భారతదేశం ఇంకోటుంది. దిక్కు మొక్కులేని జనం ఏమైతేనేఁ అనుకోవడానికి వచ్చింది గాలి ద్వారా సోకే అంటువ్యాధి కదా?

చేతులెలా కడుక్కోవాలి బాబూ? ఇరవై సెకండ్లు సబ్బుతో.. కాదు హ్యాండ్ సానిటైజర్ తో రుద్దాలా? నిరంతరం పారే నల్లా నీళ్ళు లేవిక్కడ? ఇక ఎండాకాలం కూడా రాబోతోంది! ఈ కొత్త కరోనాతో సంబంధం లేకుండానే ఇండియాలో అపరిశుభ్ర నీటి వల్లే రోజూ సగటున ఏడుగురు చనిపోతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. అంతా అబద్ధం అని వాట్సాప్ యూనివర్సిటీలో ఖండిస్తే అయిపోయేది కాదు.

ఆయన చెప్పినట్లు ఇళ్ళు కదలకుండా పూట గడిస్తే బానే ఉంటుంది. ఇంట్లో కూచుంటే గడవనివారి సంగతేంటి అని కూడా మేం అడగం. తప్పనప్పుడు కొన్ని రోజుల పాటు ఎలాగోలా బతికేస్తాం. కానీ ఇళ్ళు లేనివాళ్ళు కూడా ఉన్నారు కదా..! ఎక్కడో ఎందుకు? ఒక్క ఢిల్లీ లోనే లక్షా 25వేల మందికి నెత్తి మీద కప్పు లేదు. రోడ్ల మీద, రైల్వే స్టేషన్లలో, బస్టాపుల్లో ఎక్కడపడితే అక్కడ పడుకుంటారు. ఎంత కాదన్నా వీళ్ళూ మనుషులే కాబట్టి కరోనా వీరిలో కూడా బతికి బైటికొస్తుంది.

ఇండియాలో ప్రతి ఆరుగురిలో ఒకరు మురికివాడల్లో జీవిస్తుంటారు. నాగరిక సమాజం వీరికి దూరంగా ఉండొచ్చు. కానీ వీరు సామాజిక దూరం పాటించడం అయ్యేపని కాదు. మురిక్కాలవల పక్కన టార్పాలిన్ టెంట్ల కింద కిక్కిరిసిన జాగాలో రాసుకు పూసుకు పడి ఉంటారు. ఇవి చాలవన్నట్లు ఇప్పుడు నిర్బంధ శిబిరాలు తయారవుతున్నాయి. అస్సాంలో ఆరు నిర్బంధ శిబిరాల్లోకి వేలాది మందిని మందల్లా తోలేశారు. వీరంతా ఎన్నార్సీ రాకమునుపు ఎవరి కష్టం వారు నమ్ముకొని బతికే స్వేచ్చా జీవులు.

ʹకరోనా వల్ల మధ్య తరగతి, పేద వర్గాల ఆదాయమార్గాలకు విఘాతం కలుగుతుంది. సంపన్నవర్గాలు వారిని ఆదుకోవాలిʹ అన్నారు ప్రధానమంత్రి. ఒక్క ఏడాది సంపన్న వర్గాలకు రాయితీలు ఇవ్వకుండా ప్రభుత్వం వీరిని ఎందుకు ఆదుకోకూడదు? కనీసం నిత్యావసరాలు సరఫరా చేస్తామని ఎందుకు అనడం లేదు? గూడు లేని వారికి ఆశ్రయం కల్పించి అందరికీ కనీస వైద్యం అందించే ప్రయత్నం చాలా పెద్ద మాట. రానున్న సవాలును ఎదుర్కోడానికి తగినన్ని ఆసుపత్రులను, సిబ్బందిని సిద్ధం చేయడానికి వెంటనే నిధులు విడుదల చేయాల్సిన అవసరం ఉంటుంది కదా! కానీ ప్రధాన మంత్రి ఏం చెబుతున్నాడంటే కరోనా ప్రభావం ఆర్థికరంగంపై పడుతుంది కాబట్టి దానిని ఆదుకునేందుకు ఆర్థికమంత్రి నేతృత్వంలో టాస్క్‌ ఫోర్స్‌ ను ఏర్పాటు చేస్తారట!

వదంతులు నమ్మొద్దు అని ముఖ్యమంత్రి చెబుతున్నారు. కానీ ఆవు మూత్రం తాగితే కరోనా రాదని ప్రచారం చేస్తున్నవారిని, దానిని పంచి పెడుతున్నవారిని ప్రభుత్వం నియత్రించే ప్రయత్నం చేయదు. ʹమానవీయతʹతో కరోనాను జయిద్దాం అని కూడా అన్నారాయన. సామాజిక దూరం అంటున్నారని చెప్పి సనాతన అమానవీయ అంటు, ముట్టు ఆచారాలను ప్రచారం చేస్తున్నారు ఆయన భక్తులు.

కరోనా లక్షణాలు (అంటే మరేం లేదు- జ్వరం, శ్వాస సమస్యలు) కనిపిస్తే ప్రైవేట్ ఆసుపత్రులు రోగుల్ని చేర్చుకోకుండా తిప్పి పంపుతున్నారన్న వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం లేదు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా వ్యాపారం తప్ప వైద్యం లేదు. ఇలాంటి స్థితిలో ప్రజలకు అత్యవసర వైద్యం ఎలా అందేను?

ఒక్క రోజు కర్ఫ్యూ గురించి అధికార, అనధికార ప్రచారం ఘనంగా మొదలైంది. ఒక్క రోజు ఇల్లు కదలకుంటే కరోనా చైన్ తెంపివేయొచ్చు అని సోషల్ మీడియా సిద్ధాంతాలు తయారైపోయాయి. ప్రభుత్వం చెప్పాల్సింది చెప్పింది. ఇక ప్రజలదే బాధ్యత అని చెప్పేస్తారు కావొచ్చు. రేపు వ్యాధి ప్రబలితే స్వీయ నియంత్రణ చేసుకోవడంలో ప్రజలు విఫలమయ్యారు అని కూడా అనొచ్చు.

ఇప్పటికింకా కోవిడ్ 19 ఇండియాలో ప్రాథమిక దశలోనే ఉంది. బైటి నుండి వచ్చిన వాళ్ళ ద్వారా మెల్లగా వ్యాపించడం మొదలైంది కాబట్టి రెండో దశలో ఉందని కూడా అంటున్నారు. తర్వాతి దశ, అంటే ఇక్కడి జన సమూహంలో పడితే గనక అదిక దావానలమే. పిట్టల్లా కాదు. మనుషులు పురుగుల్లా రాలిపోతారు.

ఇటువంటి విపత్తులు మన ఆధునికతలోని డొల్లతనాన్ని చూపుతాయి. పెట్టుబడిదారీ వ్యవస్థ అమానవీయతను, జీవావరణ విధ్వంసాన్ని రుచి చూపుతాయి. అయితే ఏ విపత్తు వచ్చినా అత్యధికంగా బలైపోయేది పీడిత వర్గాలే.





No. of visitors : 541
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


సోషలిజమే ప్ర‌త్యామ్నాయం, నక్స‌ల్బ‌రీయే భారత విప్లవ పంథా

పి.వరల‌క్ష్మి | 29.04.2016 11:02:35am

20, 21వ శతాబ్దంలో పుట్టుకొచ్చిన భిన్న ధోరణుల‌న్నీ సారాంశంలో మార్క్సిస్టు వ్యతిరేకత ముఖ్యమైన ల‌క్షణంగా కలిగి ఉంటున్నాయి. కొన్నయితే మార్క్పిజం పేరుతోనే ప్రపంచ...
...ఇంకా చదవండి

నేనెందుకు రాస్తున్నాను?

పి.వరలక్ష్మి | 05.10.2016 01:16:41am

బూర్జువా పార్టీలు, మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తాయి కాబట్టి వాస్తవాలు చెప్పడం కోసం రాస్తాను. ఉదాహరణకు కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని దశాద్బాలుగా ఒక.......
...ఇంకా చదవండి

పెట్టుబడిదారీ వ్యవస్థ గర్భంలోనే ఎడతెగని సంక్షోభాలు

వ‌ర‌ల‌క్ష్మి | 12.03.2017 12:32:58am

సంక్షోభ కాలసూచికలు : ప్రజా ఆకాంక్షలు, ఆచరణ - సోషలిజమే ప్రత్యామ్నాయం (విర‌సం సాహిత్య పాఠ‌శాల కీనోట్).....
...ఇంకా చదవండి

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం

| 28.07.2016 08:35:37pm

అసంఖ్యాక రచనలు నిండైన సాహితీ జీవితాన్ని, నిబద్ధ సామాజిక దృక్పథాన్ని, నిజాయితీని తెలియజేస్తాయి. ఆమె రచనల్లో, ఆమె సామాజిక జీవితంలోనే ʹహజర్ చురాషిర్ మాʹ .......
...ఇంకా చదవండి

సీమ విద్యార్థులు ఆలపించిన కరువు రాగాల ʹకన్నీటి కెరటాలుʹ

పి.వరలక్ష్మి | 03.09.2016 01:40:55am

మన ఊర్లలో గూటి గువ్వలు, పాల పిట్టలు, ఎర్ర జొన్నలు, సజ్జ గింజెలు ఏమైపోయాయి? రాయలసీమ ప్రకృతి మరింతగా ఎందుకు నాశనమవుతోంది? పౌష్టిక ఆహారాన్నిచ్చే తిండి .......
...ఇంకా చదవండి

ఇది మనిషి మీద యుద్ధం

పి. వరలక్ష్మి | 19.04.2016 10:59:20am

సైనిక, రాజకీయార్థిక, ప్రచార రంగాల్లో సామ్రాజ్యవాదం ఎంత దాడి చేస్తున్నదో అర్థం చేసుకోవాలంటే వాటన్నిటినీ అనుసంధానించే మంద్రస్థాయి యుద్ధాన్ని అర్థం చేసుకోవాలి...
...ఇంకా చదవండి

ఆ చావు ఎవరికీ రావొద్దు - యురేనియం ఎక్కడా తవ్వొద్దు.

పి.వరలక్ష్మి | 19.11.2019 08:06:37pm

నాగప్పకు బొత్తిగా బాలేదు. ఇరవై రోజుల క్రితం కింది నుండి తొడల భాగం దాకా విపరీతంగా బొబ్బలోస్తే పులివెందుల గవర్నమెంట్ ఆస్పర్తిలో చేర్చారట. రెండు రోజులుండి వచ్...
...ఇంకా చదవండి

మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రం పై కీనోట్

పి. వ‌ర‌ల‌క్ష్మి | 03.06.2016 10:43:06pm

9, 10 జ‌న‌వ‌రి 2016 తేదీల్లో విజ‌య‌వాడ‌లో జ‌రిగిన విరసం 25వ రాష్ట్ర మ‌హాస‌భ‌ల్లో మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రంపై రాష్ట్ర కార్య‌ద‌ర్శి పి. వ‌ర‌ల‌క్ష్మి కీనోట్‌...
...ఇంకా చదవండి

ఉనా స్వాతంత్ర నినాదం

పి.వరలక్ష్మి | 15.08.2016 10:44:28pm

ఆగస్టు పదిహేను ద్రోహం చెప్పకపోతే అన్నం సహించదు నాకుʹ అని చెరబండరాజు అన్నట్లు బూటకపు స్వాతంత్రాన్ని ఎండగడుతూ నిజమైన స్వాతంత్రం కోసం ఉనా దళిత సమ్మేళనంతో... ...
...ఇంకా చదవండి

ప్రొఫెస‌ర్‌ క‌ంచ‌ ఐల‌య్య‌కు సంఘీభావంగా భావప్రకటనా స్వేచ్ఛకై

వరలక్ష్మి | 01.06.2016 09:29:12am

ప్రభుత్వాలు భావాల పట్ల నియంత్రణలు అమలుచేయజూస్తూ, భిన్నాభిప్రాయాన్ని, నిరసనను క్రిమినలైజ్ చేస్తూ దేశవ్యాప్తంగా ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలకు వ్య...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India

All sections of working masses should be united together irrespective of caste and religious diferences, to fight in the path of caste annihilation..

  • Students and the Revolution
  • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
  • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
  • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    నేను దీపాలు ఆర్పను.. కొవ్వొత్తులు వెలిగించను.. ఏం చేస్తావ్?
    కరోనా లాఠీఛార్జ్ : ఇది మనకు అభ్యంతరం అనిపించాలి కదా?
    నిజమైన స్వాతంత్రం కోసం పోరాడటంలోనే భగత్ సింగ్ స్ఫూర్తి ఉంది
    చేతులు కడిగేసుకోవడం తప్ప ఇంకేమైనా చేయగలరా?
    ఆ కన్నీటిని ఈ శిక్ష తుడిచేయగలదా?
    మీరెప్పుడూ అర్బన్‌ మావోయిస్టులనే మాట వాడలేదా?
    మనుషులకే అర్థమయ్యేదీ, పంచుకునేదీ దుఃఖమే అంటున్న పద్మకుమారి కథలు
    The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
    Students and the Revolution
    గోడలమనుషులు
    దగ్ధహృదయమా !
    మూడో కన్ను

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •