ఎప్పుడు లేంది ఆ రోజు కోర్టుహాలంత నిండుగుంది. విచారణ మొదలైంది
న్యాయవాది : మిలార్డ్, ఈ వ్యక్తి నా క్లయింట్ యొక్క విశ్వాసాలు, మనోభావాలను తీవ్రంగా గాయ పరుస్తున్నాడు గావున విచారించి తగు న్యాయం చేయవలసిందిగా ప్రార్థన...
న్యాయమూర్తి : ఇతని మీద అభియోగమేమి ?
న్యాయవాది : మిలార్డ్, ఈ వ్యక్తి గత కొంతకాలంగ నా క్లయింట్‌ను తీవ్రంగ వేధిస్తున్నాడు. గౌరవనీయులైన నా క్లయింట్ సనాతన ధర్మాన్ని నమ్మెసున్నిత మనస్కుడు. భూకేంద్ర సిద్ధాంతం (భూ.కే.సి)ను నమ్మె సనాతుడు. పూర్వ వేదకాలం నుండి ఇతని పూర్వికులు అదే విశ్వాసాన్ని కలిగున్నోళ్లు. ఈ విశ్వాసాన్ని కలిగుండటం ఈ దేశంలనె కాదు, అమెరికాలో గూడ ఉన్నారని మీకు తెలియజేస్తున్నాను. అలాంటి గొప్ప విశ్వాసం తప్పంటూ, దాన్ని ఖండిస్తూ సూర్యకేంద్ర సిద్ధాంతం (సూ.కే.సి)ను ప్రచారం చేస్తూ నా క్లయింట్‌ను తీవ్ర మనోవేధనకు గురిచేస్తూ, సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తున్న ఈ అధర్మున్ని విచారించి ధర్మాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నాను.
ఉద్యోగ జీవిత మలిదశలో ఇటువంటి సంకటస్థితిల పడతానని ఊహించలే న్యాయమూర్తి గారు!
విశ్వాసాలకు సిద్ధాంతాలకు మధ్య వైరుధ్యమిది. దేశం జరుగుతున్న సంఘటనలను చూస్తుంటె ఎప్పుడో ఓసారి ఈ స్థితి అంతటా వ్యాపిస్తుందని తొసుగాని ఇంత త్వరగా తన బెంచి మీదకే వస్తదని ఊహించలేక పోయాడు!
బోనులున్న అక్యూజ్డ్ వైపు చూశాడు. ఒక్కడే ఎంతో నిబ్బరంగా ఆత్మ విశ్వాసంతో నిలబడున్నాడు. న్యాయవాదిని పెట్టుకోనట్టుంది. అతని మాటలిందామని
న్యాయమూర్తి : న్యాయవాది ఆరోపించినట్లు మీరు సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నారా?
అక్యూజ్డ్ : అయ్యా, నేను వ్యతిరేకిస్తుంది భూ.కే.సిని మాత్రమే అతని ధర్మాన్ని కాదు...
ధృడంగా వాదిస్తున్న అతన్ని చూస్తే ఏమి చేయాలో అర్థం కావటంలే న్యాయమూర్తికి. పైగా కోర్టులోపల, బయట భూ.కే.సిని నమ్మెవారితో నిండిపోయింది. ఒంటరిగా ఇతను జాలనిపించిన ఏం చేయగలడు ?
ఎప్పుడో తన పాఠశాల విద్యలో చదివిన సూర్యుడు, దాని చుట్టూ తిరిగే తొమ్మిది గ్రహాలను గుర్తు చేసుకుంటు కళ్లు మూసుకున్నడు. ఎంత లెక్క వేసిన ఏదో ఒక గ్రహాం తప్పిపోతుంది. పోని సూ.కే.సి. కరెక్టు అని చెప్పె ధైర్యం ఈ స్థితిల తనకుందా? ఏవో అదృశ్య శక్తులు గ్రహాలు తిరిగినట్టు తన చుట్టూ తిరుగుతున్నట్టుగా ఉంది.
న్యాయమూర్తిగారి వైఖరి చూసి ఎదో పెద్ద శిక్ష వేస్తాడని కోర్టుల ఉన్నవారంత ఉత్కంటగా ఎదురు చూడసాగారు. సరిగ్గా ఆ సమయంల ఏదో గుర్తొచ్చి
న్యాయమూర్తి : ʹభూ.కే.సిని అతను, సూ.కే.సి.ని ఇతను తగు సాక్ష్యాదారాలతో నిరూపించుకోవల్సిందిగా ఆదేశించడమైనదిʹ. రెండు నెలలకు కేసు వాయిదా వేశారు. తను తప్పు చేస్తున్నాననె అపరాధ బావనతో కూర్చి మీద నుండి లేస్తూ
నెల రోజులకు ఆ న్యాయమూర్తి గారి పదవి విరమణ. కేసు ఎప్పటికి ఎలా ముగుస్తదో?
Type in English and Press Space to Convert in Telugu |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |