ఢిల్లీలో ఛత్తీస్ గఢ్ బస్తీ ఉంది. కరోనా కట్టడిని మించిన కట్టడిలోకి దేశాన్ని తీసుకెళ్లడంతో అన్ని ప్రాంతాల్లాగే దేశరాజధానిలోని ఇలాంటి వందలాది బస్తీలు రోడ్డెక్కుతున్నాయి. ఈ బస్తీల నుంచి కదులుతున్న మహా వలస సైన్యాల్లో దశాబ్దాల క్రితం వచ్చి ఢిల్లీలో స్థిరపడినవీ, అన్ సీజన్లో వచ్చి పనులు చేసుకొని సీజన్లో తమ స్థలాలకు వెళ్లిపోయేవీ ఉన్నాయి. యువ జనాభా వృద్ధి ఎక్కువగా ఉండే మధ్యభారతంలోని మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బిహార్, జార్ఖండ్, ఛత్తీస్ గఢ్ నుంచే ఈ దేశానికి వలస సేవలు అందుతున్నాయి. వినియోగించుకొన్న శ్రమశక్తికి జరిపే చెల్లింపుల మోతాదును తగ్గించుకోవడానికి ఒక విధానంగానే వలసలను పాలకవర్గాలు ప్రోత్సహిస్తున్నాయనేది స్పష్టం. ఢిల్లీ వంటి మధ్యతరగతి స్వర్గంలో, ఇంటి పనుల్లోనూ, మధ్యతరహా కార్ఖానాల్లోనూ వీరు ఎక్కువగా పనిచేస్తున్నారు. ఇటు దక్షిణాదికి వస్తే.. ఇక్కడి వ్యవసాయ సమాజాలు కోతలు, నాట్లు, పత్తి-వేరుశనక పీకడం, బావుల తవ్వకం, బోర్లు వేయడం వంటి పనులకు వలస కూలీల సేవలను వాడుకొంటున్నాయి. కార్పొరేట్, ఈ- కామర్స్ అగ్రీ ఆన్లైన్ బిజినెస్ విస్తరణతో ఒకనాడు సీజనల్ గా ఉన్న సాగును ఇప్పుడు ఏడాదంతా చేసినా ఇంకా పని మిగిలేలా ఉత్పత్తి కార్యకలాపాలు వ్యవసాయరంగంలో పెంచారు. మాల్స్ డిమాండ్, ప్రపంచవ్యాప్త ఆన్లైన్ ఆర్డర్ల అవసరాలను తీర్చడానికి విస్తారమైన భూకమతాల్లో ఈ ఉత్పత్తి సాగుతోంది. పంటకు, పంటకు మధ్య ఉండే విలంభ కాలాన్ని అంతకంతకూ కుదిస్తూ నిరంతరాయంగా పంటలు తీసేలా సాగుతున్న ఈ ఉత్పత్తి పద్ధతికి వనరు వలసలే. ఈ వాతావరణం కల్పించిన ఆశను అందుకోవడానికి సామాన్య, మధ్యతరగతి రైతులు కూడా పంటల సాగులో రసాయనాల, నీళ్ల వినియోగం పెంచేశారు.
భూగర్బాల చివరి చెమ్మనూ బోర్లతో లాగేస్తున్నారు. ఇది నాణేనికి రెండోవైపు. దరిమిలా వలస కూలీల అవసరం బోరుగాడిలో పెరిగి..అది ఛత్తీస్ గఢ్ వంటి సంప్రదాయ సమాజాల ప్రాథమిక ఆర్థిక చలనాన్ని కుదిపేస్తున్న తీరును గమిత లోతుగా అధ్యయనం జరిపారు. తన అధ్యయన సారాన్ని ʹపట్టణాలకు ప్రవహిస్తున్న అడవి బిడ్డల చెమట, నెత్తురుʹ పేరిట అందించారు.
మనుషులే కాదు, ప్రాంతాలూ పోరాటాల ద్వారానే ఉనికిలోకి వస్తాయనేది ఛత్తీస్ గఢ్ విషయంలో కనిపిస్తున్న సత్యం. ఆదివాసీలు, మావోయిస్టులు కలిసి అక్కడ సాగిస్తున్న నూతన ప్రజాస్వామిక ప్రయోగాల పై బోలెడు సాహిత్యం అందుబాటులో ఉంది. ఈ ప్రయోగాల పరిచయం ఉన్నవారికి ఛత్తీస్ గఢ్ లోని వలసలపై ఉండే అవగాహనను గమిత విస్తరిస్తూనే, సామాజిక అనుభవంలోకి అనివార్యంగా ఎప్పటికప్పుడు వచ్చి చేరుతుండే అంశాల పరిశీలనకు మనల్ని పురిగొల్పుతుంది.
ఈ సమాజంలో విచ్చిన్న ప్రవాహంలా సాగే రెండురకాల వలసలతో మనకు పరిచయం ఉంది. విప్లవ స్థావరాలు, ప్రాంతాలు శాశ్వతం కాదనే చలన పోరాట అనుభవం రీత్యా తమ స్థలాలు శత్రువు ఆధీనంలోకి వెళ్లగానే తాత్కాలికంగా ఆదివాసీలు అక్కడనుంచి వేరే ప్రాంతాలకు వలస పోతుంటారు. రెండు, మూడు నెలలు ఆ కొత్త ప్రాంతాల్లో దొరికిన పని చేసుకొంటూ గడుపుతారు. తమ ప్రాంతాలు తిరిగి తమ స్వాధీనంలోకి రాగానే వచ్చేస్తుంటారు. ఈ ఎరుకతోనే వారు తమ రాష్ట్ర సరిహద్దులకు ఆనుకొని ఉండే ప్రాంతాల్లోనే మసలుతుంటారు. అక్కడి రైతులతో ఏర్పడిన పరిచయాలను సజీవంగా కొనసాగిస్తూ, కోతల సమయంలో కొద్దికాలం కోసం కూలి పనులకు వెళుతుంటారు. కఠినశిలలతో నిండిన భూముల్లో వ్యవసాయం తక్కువగా ఉండి, అటవీ ఉత్పత్తుల సేకరణే ప్రధాన జీవన వనరు కావడంతో, తమ దగ్గర చేయడానికి పనులు లేనప్పుడు ఇలాంటి వలసలు వారికి తప్పవు. ఇలాగే, ఉత్పత్తి, ప్రయోగంతో ముడిపడిన మరో వలస కోణం కూడా ఉంది.
అవిచ్చిన్న ప్రవాహం దీని గుణం. అదే మహానగరాలకు అటవీబిడ్డల వలస!వినిమయ సంస్కృతి సంతల దాకా చేరిన దరిమిలా కొత్త ఆసక్తులు, మోహాలు యువతను ఈ వలసలకు ప్రేరేపిస్తే.. గండశిలల్లాంటి నేలను సాగుకు సిద్ధం చేయడానికి పెట్టుబడులు, సొంత ట్రాక్టర్ ఏర్పాటుచేసుకోవడం, పోలీసుల కళ్ల నుంచి తప్పించుకోవడానికి జనతన సర్కారులో చురుగ్గా ఉండే గ్రామస్థాయి నాయకులు, రైతులు వలసలకు సిద్ధమవుతున్నారంటూ గమిత వారి అనుభవాలను నమోదు చేశారు. రెండు నెలలకు అని పది నెలలు పని చేయించుకొని, ఇస్తామన్న దానికి చాలా తక్కువ చేతిలో పెట్టడంతో తాము కోరుకొన్న ఏ అవసరం తీరకుండానే చాలామంది వెనుదిరుగుతున్నారు. ఆ అవసరం తీర్చుకోడానికి మరికొందరు మళ్లీ మళ్లీ వలసలబాట పడుతున్నారు. అయితే, పూర్తిగా పరిసర ప్రాంతాల్లో అలవాటయిన వాతావరణంలో సాగే పై రెండు వలసలతో పోల్చితే ఈ వలస అంతా కొత్తే. వెళ్లిన ప్రాంత ఆహార్యం, భాష, ఆహారం, వ్యవహార శైలి, ఉండే పరిసరాలు, అప్పగించే పని, శ్రమశక్తికి జరిపే చెల్లింపుల పద్ధతి అంతా అటవీ బిడ్డలకు ప్రతికూలమైనవే. వారు అలవాటుపడిన ప్రాకృతిక జీవన సారూప్యతను మహానగరాల్లో కానలేక.. అయోమయానికి, ఆందోళనకు గురి అవుతున్నారు. పని స్థలాల్లో అమానవీయతకు, అత్యాచారాలకు, అవమానాలకు, మోసాలకు, అనారోగ్యాలకు, దోపిడీకి ఛత్తీస్ గఢ్ ఆదివాసీ వలస కూలీలు బలవుతున్నారు! వలస కూలీలుగా మారుతున్నవారిలో 10, 12 ఏళ్ల బాలికలూ ఉండటం కలత పెట్టే అంశం!
విప్లవ ఉద్యమం బలంగా ఉన్న ప్రాంతాల నుంచే ఈ వలసలు సాగుతున్న దృష్ట్యా జనతన సర్కారు ఏమి చేస్తున్నదనే ప్రశ్న సహజంగానే ఉత్పన్నం అవుతుంది. వలసలను ఆపడానికి తమ వద్ద సుదీర్ఘ ప్రణాళికే ఉన్నదని అక్కడి గెరిల్లాలు వివరించారని గమిత తెలిపారు. తలకిందులయిన ఆదివాసీ సామాజిక, ఆర్థిక చిత్రాన్ని సరిదిద్దడానికి సహకార వ్యవసాయాన్ని పెంచడమే మార్గమని గమిత కూడా చెబుతున్నారు. సాగులో సహకారాన్ని పెంచడంలో భాగంగా రుణాలు, ట్రాక్టర్లు, విత్తనాలు, ఎరువులను సమకూర్చడానికి జనతన సర్కారు వద్ద ఉన్న పరిమిత వనరులు చాలవు. ఇది సమ స్యేగానీ, ఇదొక్కడే ప్రధాన అడ్డంకి కాదనేది విప్లవోద్యమ అవగాహన అని గమిత విశ్లేషించారు. రాజకీయ కార్యాచరణ ద్వారా అందించే నిరంతర చైతన్యమే ఒకనాటికి వలసలను రద్దుచేసి... ఉన్నచోటే పని, ఆహారం, గౌరవానికి హామీనిచ్చే స్వావలంబన భారతాన్ని నిర్మిస్తుందనే ఆశాభావాన్ని గమిత ఈ అధ్యయనంలో ప్రకటించారు!
Type in English and Press Space to Convert in Telugu |
మంద్రస్థాయి యుద్ధం - ప్రజా ప్రతిఘటన : రివేరా9, 10 జనవరి 2016 తేదీల్లో విజయవాడలో జరిగిన విరసం 25వ రాష్ట్ర మహాసభల్లో మంద్రస్థాయి యుద్ధం - ప్రజా ప్రతిఘటన పై రివేరా ఉపన్యాసం....... |
చేజారిన జాడల్లోంచి మైదానాల్లోకి..పుస్తకాల సంచిని గిరాటేసి
రోడ్డుపైకి దూసుకెళ్లిన జ్ఞాపకం
వెనుక నుంచి పిలుస్తున్న తల్లివైపు
స్నేహితుల భుజాలపైనుంచి
నవ్వుతూ చూడటమే చివరిచూపు....... |
ఏప్రిల్ పండు II రివేరాపిల్లలు లేని ఇల్లు, ఇది హైదరాబాద్, ఊరేగింపు, ఏప్రిల్ పండు,... |
సాయంకాలం వాన!దుప్పటి కింద, దిండు అడుగున
పిల్లలు చూడకుంటా కప్పెట్టుకొన్న
వరదగూడుని మెలిపెడతావేమో... |
సబ్కా జవాబ్ వెతికుతున్న కవి రివేరావిప్లవకవిత్వాన్ని ఈసడించుకునే వర్గాన్ని కూడా ముక్కుమీద వేలేసుకునేలా రివేరా ఓ మంచి కవి అని అందరి చేత అనిపించుకోవడం వాస్తవానికి విప్లవ సంస్కృతి విజయమే....... |
రెప్పని కప్పని నిద్దురఒకే రాత్రిని కప్పుకొన్న మనకి
ఒక్క నిద్దుర చాలదా?
చుక్క కలని పొదువుకోడానికి
ఈ ఒక్క దేహ వర్షం చిలకదా?... |
భయం చుట్టూ భయం..వీళ్లెక్కడ చంపుకుతింటారోనని ఆడవాళ్లకు భయం
భయంలేని ఆడవాళ్లంటే మగవాళ్లకు మహా భయం
దొంగలంటే భయం, పోలీసులన్నా మరి భయమే
తాళాలు లేని తలుపులంటే భ... |
ఈ రాక్షస గీతి వింటారా?మనం నిలబడిపోయిన చోట నుంచే
మన నడకలను మోసుకెళుతున్నారు
మనం ఆపేసిన రాగాలనే
తీగలుగా సాగిపోతున్నారు
మన గొంతునీ, మన వంతునీ
మనక్కిచ్చేసి వెళుతు... |
నో, ఐ డోన్ట్ లైక్ టమాటటమాట రంగు సరే,
రసాలూరే సరస్సులేమీ..
కొంచెం కరిచిపట్టుకొన్న
మిలమిలా మీనాలేమీ..
పైకి కిందకి మునకలేసే
గత్తరబిత్తర గోళాలేమీ....... |
అద్గదీ...అటో ఇటో వేటో పోటో పడిపోవాల్సిందే!
పాలకులంతా ప్రజాస్వామికవాదులై
ప్రజలేమో నియంతలైతే ఏమి చేస్తాం?... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |