కరోనా కాలంలో ʹవైరస్ʹ థ్రిల్లర్

| సాహిత్యం | స‌మీక్ష‌లు

కరోనా కాలంలో ʹవైరస్ʹ థ్రిల్లర్

- మిసిమి | 02.04.2020 12:07:53am

కరోనా కాలంలో వైరస్ ఇతివృత్తంలో వచ్చిన సినిమాలు యూ ట్యూబ్ ద్వారా వైరల్ అవుతున్నాయి. సుమారుగా కోవిడ్ లక్షణాలతో వ్యాపించే వ్యాధి ఇతివృత్తంగా 2011లో వచ్చిన ʹcontagionʹ ఇప్పుడు చూస్తే ఆశ్చర్యమనిపిస్తుంది. 2019 జూన్ లో వాస్తవ ఘటనల ఆధారంగా ʹవైరస్ʹ పేరుతో మలయాళం సినిమా విడుదలైంది. ʹcontagionʹ సినిమా ప్రభావం ఇందులో కనిపిస్తుంది. అయితే వార్తా కథనాలను సృజనాత్మకంగా మలచడం వల్ల ఇది మరింత కళాత్మక అనుభూతిని తీసుకొస్తుంది. మానవానుబంధాలు, భావోద్వేగాలు, ప్రేమ, సాహసం, విద్వేషం వంటి హృదయగతమైనవి, సామాజికమైనవి కొన్ని లోటుపాట్లతో అయినా మిస్సవ్వకుండా తీసుకొచ్చారు. ఆశిక్ అబూ, రీమా కల్లింగళ్ (సినిమాలో నర్సు అఖిల పాత్రధారిణి) నిర్మాణంలో, ఆశిక్ అబూ దర్శకత్వంలో విడుదలైన ఈ మల్టీ స్టారర్ సినిమాలో ప్రముఖ స్టార్స్ కనిపిస్తారు గాని కథానాయక పాత్రలంటూ ఏవీ లేవు. తెలుగులో ఇలా ఊహించగలమా?

సినిమాలో ఆసక్తికరమైన అంశం ఇంకోటుంది. వైరస్ వ్యాప్తికి కారణం టెర్రరిస్టుల కుట్ర అనే వాట్సాప్ యూనివర్సిటీ బాపతు ప్రచారం. ʹనిపాʹతో చనిపోయే మొదటి వ్యక్తి ముస్లిం కావడమే ఇందుకు ఆధారం కావడం ఇప్పుడున్న మెజారిటీ మత ఉద్రిక్త సామాజిక స్థితికి సూచిక. కరోనా వెనక కుట్ర సిద్ధాంతాలను విచ్చలవిడిగా ప్రచారం చేయడం చూస్తూనే ఉన్నాం కదా, ఈ సినిమా చూస్తున్నప్పుడు తప్పకుండా అక్కడ కనెక్ట్ అవుతాం. 2018లో కేరళలో నిపా వైరస్ వల్ల ప్రధానంగా వైద్య సిబ్బంది చనిపోయారు. అందులో లిని పుతుస్సేరి అనే 32 ఏళ్ల నర్సు నిపా బారినపడ్డ మొదటి వ్యాధిగ్రస్తునికి చికిత్స చేయడం మూలాన మరణించింది. ఆమె సేవలను కేరళ సమాజం ఎంతో ఉన్నతంగా స్మరించుకుంటుంది. సినిమాలో ʹఅఖిలʹ పాత్ర ʹలినిʹని గుర్తు చేస్తూ ఎంతగానో కదిలిస్తుంది. నిపాతో చనిపోయిన వారి శవాలను ముట్టుకోడానికి ఎవరూ ముందుకురాని స్థతిలో సాహసం చేసే అటెండర్ బాబు, డా.బాబూ రాజ్, వైద్య వృత్తి పట్ల గౌరవాన్ని ఇనుమడింపజేసే డా.ఆబిద్ అన్నీ నిజ జీవిత పాత్రలే.. పేర్లు మారాయి, అంతే! అటెండర్ బాబు మొదట జీతాలు చెల్లించని విషయమై నిరసన తెలుపుతూ నినాదాలిస్తుంటాడు. అతనే ఎమర్జెన్సీలో ఎవరూ సిద్ధపడని సాహసానికి పూనుకొని పిపిఈ (ఇన్ఫెక్షన సోకకుండా వేసుకొనే రక్షణ తొడుగులు) ధరించి శవాన్ని ముట్టుకుంటాడు. డా.బాబూరాజ్ ఏంతో మంది మృతులకు స్వయంగా అంత్యక్రియలు జరిపిస్తాడు.

కోజిక్కోడ్, మలప్పురం జిల్లాల్లో వైరస్ మరణాలు ప్రజల్ని నిలువునా వణికిస్తాయి. నిపా మృతుల కుటుంబాలను భయంతో, అనుమానంతో సమాజం దూరం పెడితే, పిజి మెడికల్ విద్యార్థిని డా.అన్ను వెళ్లి ఆ కుటుంబాలను కలుస్తుంది. వైరస్ ఎలా వ్యాపించిందో పరిశోధన చేయడం ఆమె లక్ష్యం. ఈ పని ఆమె స్వచ్ఛ౦దంగానే తీసుకుంటుంది. ఇది కూడా నిజజీవిత పాత్రే. సినిమాలో డా.అన్ను కుట్ర సిద్ధాంతాన్ని తిప్పి కొడుతుంది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అందుకు సహకరిస్తుంది. సినిమాలోలా ప్రభుత్వ యంత్రాంగం ఉంటే బాగుంటుందనిపిస్తుంది కానీ నిజంగా అలా ఉంటుందా? రాష్ట్ర ఆరోగ్య మంత్రి, జిల్లా కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధి, ఆరోగ్య శాఖ అధికారులు, కోజిక్కోడ్ మెడికల్ కాలేజీ సిబ్బంది, సైంటిస్టులు, దాతల సహకారం, సామాన్యుల సాహసాలతో చేయికలిపి ʹనిపాʹను జయిస్తారు. చివరికి 21 మంది నిపాతో చనిపోయినట్లు, ఇద్దరు మృత్యువుతో పోరాడి గెలిచినట్లు ప్రకటిస్తారు. ఆ జీవన్మరణ పోరాటం మనల్ని చాలా రోజులు వెంటాడక మానదు. ఇక ʹబాగా దొరికిపోయాడుʹ అనిపించే విషయం దర్శకుడు ఆశిక్ అబూ రాష్ట్ర ప్రభుత్వం పట్ల ఎంతో సానుకూలత ప్రదర్శించడం. వైరస్ పై పోరాటం ప్రధానమే అయినా అంత నిర్విమర్శగా ఉండాల్సిన అవసరం లేదు. అయితే కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులను మాత్రం వచ్చీ రాగానే కుట్ర సిద్ధాంతానికి తెర తీసేవారిగా చూపిస్తాడు. (ఇది మాత్రం నిజమే కదా అనిపిస్తుంది.) కేంద్రంలో బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలో లెఫ్ట్ ఫ్రంట్ మనకు గుర్తు రాకమానవు.

ఘటనలను సృజనాత్మకంగా మలిచే ప్రక్రియలో సానుకూల, ప్రతికూల అంశాల కోసం కూడా ఈ సినిమా చూడొచ్చు. ఇప్పటి లాక్ డౌన్ లో ʹవైరస్ʹ సినిమా ఉన్నదానికన్నా మరింత అద్భుతంగా మన మానసిక ప్రపంచంతో కనెక్ట్ అవుతుంది. యూట్యూబ్ లో ఎవరైనా ఈ సినిమా చూడొచ్చు. లోపాలున్నప్పటికీ చూసినవాళ్ళు ఇదొక మెడికల్ త్రిల్లర్ అని అంగీకస్తారు.

No. of visitors : 551
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దళిత మహిళా పోరాట చరిత్రను సిలబస్ నుండి తొలగించిన సి.బి.ఎస్.ఇ

-మాయా పలిత్ | 02.01.2017 11:54:34pm

ʹCaste, Conflict and Dress Changeʹ అనే అధ్యాయాన్ని 9వ తరగతి సామాజిక శాస్త్ర పాఠ్య ప్రణాళిక నుండి తొలగిస్తున్నట్లు సి.బి.ఎస్.ఇ (ఉన్నత పాఠశాల కేంద్రీయ విద్యా ...
...ఇంకా చదవండి

తెలుగువారి ముంగిట్లోకి ప్రపంచం

మిసిమి | 17.06.2016 11:09:21am

విశ్వ పరిణామ క్రమంలో ఆవిర్భవించిన మనిషి గురించి, ఆ మనిషి సృష్టించుకున్న ప్రపంచం గురించి ఆలోచించినప్పుడు, తెలుసుకుంటున్నప్పుడు, కవిగా శ్రీశ్రీ పొందిన ఉద్వేగా...
...ఇంకా చదవండి

దేవతా - దెయ్యమూ

మిసిమి | 03.09.2016 12:53:20am

ఆ అమ్మాయి పదిహేనేళ్ల వయసులో చాలా అందంగా ఉండేదట. ఆ ఊరి భూస్వామి ఆమె మీద మోజుపడి, కుట్రపన్ని ఆమె తండ్రిని హత్య చేసి ఆమెను చేరదీసి చేసి ఇంట్లో బంధించి........
...ఇంకా చదవండి

చదివిన వారిని ʹపాల్గుణʹ ఆవహిస్తాడు!

మిసిమి | 16.07.2016 12:56:55pm

పాల్గుణ మట్టివేళ్ళ నుండి రూపొందిన విప్లవకారుడు. సింగరేణి గని కార్మికుడిగా అత్యంత సహజంగా కార్మికోద్యమానికి దగ్గరై, కార్మికవర్గ రాజకీయాలను సొంతం చేసుకున్న......
...ఇంకా చదవండి

మాయమైన నజీబ్ మాట్లాడే సంగతులు

మిసిమి | 05.04.2017 09:43:48pm

దేశంలో అసహనం (ఉన్మాదం అనవలసినదాన్ని) గురించి రచయితలు, శాస్త్రవేత్తలు, ఆలోచనాపరులు మూకుమ్మడి నిరసన తెలిపినప్పుడు మన ప్రభుత్వం వెటకారం చేసిన విషయం ఎంత.......
...ఇంకా చదవండి

సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో రొమిలా థాపర్‌ తదితర పిటిషన్‌దారుల పత్రికా ప్రకటన

| 01.10.2018 10:37:48pm

సమాజంలో బలహీనవర్గాల హక్కుల కోసం పనిచేస్తున్న వ్యక్తులపై రాజ్యం తీవ్రవాద వ్యతిరేక చట్టాలను సరైన ఆధారం లేకుండా ప్రయేగించేటప్పుడు అది కూడా ఒక రకమైన టెర్రర్... ...
...ఇంకా చదవండి

చిన్న చేపల్ని చంపుతున్న పెద్ద పరిశ్రమ

రాహుల్ మాగంటి | 22.09.2018 11:48:04pm

ఆంధ్రప్రదేశ్ లోని ఆ తీర ప్రాంత గ్రామంలో పారిశ్రామిక కాలుష్యం చేపల్ని చంపేసాక మత్యకారులు ఏమయ్యారు? సముద్రమంత గతానికి అనిశ్చిత భవిష్యత్తుకు మధ్య పెనుగులాడు.....
...ఇంకా చదవండి

మానవహక్కులను వెటకారం చేసే ద్వేషభక్తులు అర్థం చేసుకోలేనిది.

మిసిమి | 17.03.2019 09:38:24am

జెనీవా ఒప్పందం గురించి ఎంత ప్రచారం జరిగింది! పట్టుబడిన యుద్ధ ఖైదీని, అది సివిల్ వార్ అయినా సరే మానసిక శారీరక హింసకు గురిచేయకుండా ఎట్లా చూసుకోవాలో సోషల్ మీ.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •