నీతి కథ! - రాజకీయ వ్యంగ్య కథ

| సాహిత్యం | క‌థ‌లు

నీతి కథ! - రాజకీయ వ్యంగ్య కథ

- బమ్మిడి జగదీశ్వరరావు | 03.07.2016 10:39:36pm

చంద్రబాబు: ఎస్.. నేనే నెంబర్ వన్! దేశంలోనే మా ఆంధ్రా నెంబర్ వన్!

తెలుగు దేశం కార్యకర్త: రాజధాని భూములూ.. యిన్ సైడర్ ట్రేడింగూ.. బినామీలూ... యిసుక దందాలూ.. సోలారు ప్లాంట్లూ.. సాగునీరు టెండర్లు మొదలు విద్యత్తు టెండర్ల వరకూ.. ప్రతీదీ వొక పద్ధతి మీద కష్టపడి చేసుకుంటూ మా బాబుగారు ముందుకు పోయారు.. పోతున్నారు.. చిన బాబు గారి చొరవా మంత్రుల సహకారం మరువలేనిది.. ఈ విజయానికి కార్యకర్తలుగా మేం గర్వపడుతున్నాం.. దేన్నయినా వ్యవస్థీకృతం చెయ్యడానికి మన గౌరవ ముఖమంత్రి పగలూ రాత్రీ నిద్రపోకుండా నిద్రపోనివ్వకుండా శ్రమిస్తున్నారు.. ప్రపంచస్థాయి రాజధానిలాగే ప్రపంచస్థాయి నీతిని సాధిస్తాం.. సాధించి తీరుతాం..

ఎన్‌సీఏఈఆర్: మేం (నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లయిడ్ ఎకనమిక్ రీసెర్చ్) మాట్లాడేది అవినీతి గురించి..

వైయస్ జగన్: చంద్రబాబు ప్రభుత్వం లక్షన్నర కోట్లకు పైగా అవినీతికి పాల్పడిన విషయం ప్రతిపక్షంగా మేం చెపుతూ వచ్చాం. దేశంలోకెల్లా ʹఆంధ్రప్రదేశ్ అత్యంత అవినీతి రాష్ర్టంʹ అని ఎన్‌సీఏఈఆర్ జరిపిన అధ్యయనంలో తేలింది. కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ సంస్థ తన అధ్యయనంతో మరోసారి రుజువు చేసింది..

వైసీపీ కార్యకర్త: అన్నా మనల్ని మించి వాళ్ళు సంపాదించుకుంటున్నారన్నా.. అవినీతిలో నాన్నగారూ మీరూ నెంబర్ వన్ అని బాబుగారు యెప్పుడూ చెపుతూ వొచ్చారన్నా.. ఆమాట మా కేడర్ కు యెంతో బలాన్ని యిచ్చేదన్నా.. రేపు అధికారంలోకి వొస్తే మనం సంపాదించుకోవడానికి యేమీ మిగిల్చేలా లేరన్నా.. అన్నో.. అన్నా.. మనం అధికారంలోకి వొచ్చేదాకా మనకీ కష్టాలు తప్పేలా లేవన్నో.. అన్నా..

ఎన్‌సీఏఈఆర్: ఏడవకండి.. రాజ్యం వీర భోజ్యమన్నారు.. ఓపిక పట్టండి ప్లీజ్..

జయలలిత: మా తమిళనాడుకు రెండో స్థానం రావడం ఆనందంగా వున్నా అంత కంటే బాధగా కూడా వుంది. నాకు కోర్టులు సమన్లు యివ్వడం.. విచారణ జరపడం.. చివరకు క్లీన్ʹచీట్ʹ యిచ్చినా నాదూకుడు తగ్గింది.. అయితే భవిష్యత్తులో మొదటి స్థానంలో వుండడానికి ఆంద్రప్రదేశ్ ని అధిగమించడానికి సర్వ విధాలా ప్రయత్నిస్తామని హామీ యిస్తున్నాను..

అన్నాడియంకె కార్యకర్త: అమ్మా.. నువ్వుదా ఫస్టుదా వుండాల. నీతి అయినా అవునీతి అయినా మనముదా ఫస్టుదా వుండాల. తెలుగు వాళ్ళకన్నా మనముదా సినిమాల ఫస్టుదా వుంటిమి. అమ్మ మీరుదా అవునీతి చేస్తురా అదే నీతి. మీ నీతిదా మాకుదా మార్గము.. ఆంధ్రకుదా మన తమిళనాడుకుదా మూడు శాతం తేడా. అదిదా పెద్ద యెక్కువ కాదు.. అమ్మని మించి దైవమున్నదా.. అమ్మని మించి అవునీతి వున్నదా.. శాశ్వత సత్యమిదిదా..

ఎన్‌సీఏఈఆర్: అమ్మా అవినీతీ వొక్కటేనా.. ఆ.. యేమిటా పాట?

మమతా బెనర్జీ: మేము మూడో స్థానంలో వున్నందుకు గర్విస్తున్నా, మార్కిస్టు పార్టీ అన్నింట్లో పశ్చిమ బెంగాల్ ని అన్ని రకాలుగా వెనుకబడేలా చేసింది. మేము మూడో స్థానంతో సరిపెట్టుకోకుండా త్వరలోనే మొదటి స్థానాన్ని సాధించడానికి పగలూ రాత్రి కృషి చేస్తామని అంత వరకూ అహర్నిశలూ శ్రమిస్తా, ఆంద్రప్రదేశ్ లో బాబుకున్న అవకాశాలు మాకు లేవు. మేము అవకాశాల్ని కల్పించుకుంటామని ముందంజ వేస్తామని మా బెంగాల్ ప్రజలకు మాటిస్తున్నాను..

తృణముల్ కాంగ్రెస్ కార్యకర్త: దీదీ.. మీ మాట మీద మాకు నమ్మకం వుంది. మార్క్సిస్టుల కుట్రలవల్ల గోలవల్ల మనం కొద్దిగా వెనకపడ్డాము. మార్క్సిస్టులు కలిసి వొచ్చి ప్రభుత్వానికి సహకరిస్తే మంచిది. మనకూ ఆంద్రా అవినీతికి పది శాతమే తేడా. మనము పది శాతమే వెనకబడ్దాం. యిది పెద్ద తేడా కాదు. మనం మొదటి స్థానానికి ప్రయత్నిద్దాం. ప్రజల్ని భాగస్వాములను చేయడం ద్వారానే చంద్రబాబు విజయాన్ని సొంతం చేసుకోవడాన్ని మనం గుర్తించాలి.. గమనించాలి..

ఎన్‌సీఏఈఆర్: ʹప్రజలుʹ అనే మాట అన్నింటికీ వాడడం వల్ల ఆ మాటని తిరిగి నిర్వచించుకోవాలి..

వీరభద్రసింగ్: మా హిమాచల్ ప్రదేశ్ ఆఖరి స్థానంలో వుండడం కొంత బాధిస్తున్నా మా పెర్ఫార్మెన్స్ నలభై అయిదు శాతంగా వుండడం ఉపశమనాన్ని యిస్తోంది. నలభై అయిదు శాతంగా అవినీతి వున్నప్పటికీ దాన్ని జీరో చేసి అవినీతి రహిత రాష్ట్రంగా ఎన్‌సీఏఈఆర్ పేర్కొనడాన్ని త్రీవంగా ఖండిస్తున్నాం. మా కాంగ్రెస్ పార్టీ అవినీతికి నిలువెత్తు నిదర్శనంగా పేరు తెచ్చుకుందన్న విషయం మరువరాదు.. మేము కేంద్రంలో అధికారం కోల్పోవడమే అందుకు రుజువు..

హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యకర్త: వీరేంద్ర సాబ్.. మన హిమాచల్ ప్రదేశ్ లో అవినీతి లేదని చెప్పలేదు, ఓ మోస్తరుగా వుందని యాభై అయిదు శాతం మంది చెప్పారు. ఒక మోస్తరుగా వుంది అంటే అర్థం లేదని కాదు, తీవ్రంగా లేదని. దానికి మనము బాధపడవలసిన పని యెంత మాత్రమూ లేదు.. ఆ విషయంలో మన పార్టీకి వొక చరిత్ర వుంది.. అయితే నల్లధనం విషయంలో అవినీతి పరులకు కొమ్ముకాసి బీజేపీ ముందజలో దూసుకుపోతుందేమోనని నా దిగులు..

ఎన్‌సీఏఈఆర్: అవినీతి విషయంలో యింతటి అవగాహన మాకు కూడా సాధ్యము కాదు..

కేసీఆర్: మేమిప్పుడే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నం. మేము పసిబిడ్డ లెక్కున్నం. అడుగులేయబట్టి రెండేళ్ళు అయితాంది. బంగరు తెలంగాణ సాధించే క్రమంలో అవినీతిలైనా యెందులోనైనా ముందుంటం.. మనకు ఆంధ్రోల్లు యెక్కడ అవకాశామిచ్చిన్రు? యెప్పుడు అవకాశామిచ్చిన్రు? ఆల్లతో కలిసి నాయకులుగ వున్నమంటే వున్నం గాని మంచి మంచి పదవులల్ల ఆల్లే వున్నారు. ఆల్లు గుండెకాయలు తిన్నరు.. మాకు తోలు మాలు యిచ్చిన్రు. గిప్పుడు మాకు గిట్ల అవకాశం అచ్చింది. మేమేంటో మా పనేంటో తొందరలోనే చేసి చూపిస్తం.. చెప్పుడు నాకు చేత కాదు.. చేసి చూపించుడే.. తల్సుకున్నంటే చంద్రబాబు గింద్రబాబు గిట్ల పనికి రాడు మల్ల.. దేశంల మనమే ముందుంటం.. ప్రపంచకంల ముందుంటం..

టియ్యారెస్ కార్యకర్త: అన్నా.. ఏమి చెప్పినవే.. మన రాష్ట్రం మనకు అచ్చింది, మన అవినీతి మనం గిట్ల చేసుకోవాలె. అన్నా అసలు వోటుకు నోటు కేసులల్ల చంద్రబాబుకు పేరు అచ్చినట్టుగ చేసింది నువ్వే. ఆంద్రోల్ల ప్రతి విజయానికి మనం రాల్లెత్తినమన్నా.. మనముందు చరిత్ర వున్నది. మన దగ్గర అవినీతి యిరవై ఆరున్నర శాతం తీవ్రంగా వుందని అన్నరు సరే, అరవై రెండు శాతం మంది అవినీతి వొక మోస్తరుగ వున్నదని.. మన ప్రజలు చెప్పిన్రా లేదానే? మాంసము తింటే బొక్కలు మెడల కట్టుకోవాల్నా? కేంద్రంతో సఖ్యత వుందనే తెలుగుదేశం పార్టీ ఆంద్రా వోళ్లకి ఫస్ట్ యిచ్చిన్రు. మనకు యివ్వలే. ఇందలమల్ల కేంద్రం కుట్ర అర్థం చేసుకోవాలే..

ఎన్‌సీఏఈఆర్: మేం యిరవై తొమ్మిది రాష్ట్రాలలో సర్వే నిర్వహించినాం. మా సంస్థకు అరవైయేళ్ళ వయసుంది. ప్రపంచ వ్యాప్తంగా యిరవైరెండు దేశాలలో నలభైతొమ్మిది ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు మాతో కలిసి పని చేస్తున్నాయి.. అనేక ప్రభుత్వ ప్రవేటు సంస్థలు మాతో భాగస్వాములుగా వున్నారు.. ʹప్రజలుʹ అర్థం చేసుకోవాలి!

ʹప్రజలుʹ: మీరు అర్థం చేసుకోవాల్సింది వొకటుంది.. ఈ దేశంలో- అవినీతే నీతి! నీతే అవినీతి! ఆరెంటికీ మధ్య అంటే నీతికీ అవినీతికి మధ్య తేడా లేదు! దూరమూ లేదు! అవి వొకప్పుడు వ్యతిరేక పదాలు! యిప్పుడు సమానార్ధకాలు!

No. of visitors : 1050
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ʹనోట్ʹలో మట్టి!

బమ్మిడి జగదీశ్వరరావు | 20.12.2016 11:23:30pm

పుండొక చోట వుంటే వైద్యం వొక చోట..ʹ అన్నాడు మా బావమర్ది. వాతలు పెట్టిన నేతల దిబ్బల మీద దీపం పెట్టాలని.. మా ఆవిడ శక్తివంచన లేకుండా శాపం పెడుతోంది. తిడుతోంద...
...ఇంకా చదవండి

మధు వడ్డించిన అన్నం!

బమ్మిడి జగదీశ్వరరావు | 05.03.2018 08:03:16am

ఆకలి అందరికీ వుండొచ్చు! తినే అర్హత మాత్రం అందరికీ వుండదు! లేదని తిన్నావో నువ్వు దొంగవి! చిరుగుల బట్టా మాసినజుట్టూ అందుకు సాక్ష్యం! అయినా దేశానికి కన్నమేస్తే...
...ఇంకా చదవండి

దునియా అంతా ʹదొరల రాజ్యముʹ షూటింగే గదనే?!

బమ్మిడి జగదీశ్వరరావు | 06.12.2017 12:38:01am

లేదు.. లేదు.. గిది సినిమా కాదు.. మేం నటించలేదు.. అని లక్ష్మణూ రాజేషూ అంటే గది కూడా స్క్రిప్టే! వాళ్ళ స్క్రిప్టు వాళ్లకుంటది! మన స్క్రిప్టు మనకుంటది! మన సిని...
...ఇంకా చదవండి

100% డిజబులిటి నీడెడ్!

-బమ్మిడి జగదీశ్వరరావు | 06.11.2017 09:04:16am

అన్నిదారులూ మూసేస్తే? తలుపులన్నీ మూసేస్తే? పిల్లి తిరగబడుతుంది.. మనుషులు తిరగబడరా? బడతారు! అవే మిలిటెంటు ఉద్యమాలు అవుతాయి! సాయుధ పోరాటాలు అవుతాయి! చెయ్యవలసి...
...ఇంకా చదవండి

నీ అడుగులోన అడుగు వేసి నడవనీ.. నన్ను నడవనీ!

బమ్మిడి జగదీశ్వరరావు | 05.10.2017 11:27:55pm

సెంట్రల్ సర్కారే నడుపుతున్న రైల్వే డిపార్టమెంట్ యేమి చేసింది? రిజర్వేషన్లు అయిపోయాయని చెపుతూ ʹతత్కాల్ʹ పేరుతో యెక్కువ రేట్లకీ- అదనపు రెట్లకీ- డబ్బుండీ ......
...ఇంకా చదవండి

లౌకిక రామరాజ్యం వర్ధిల్లాలి!

బమ్మిడి జగదీశ్వరరావు | 19.09.2017 11:32:20pm

దేవుడయినా దేశమయినా మనదే పేటెంట్! భక్తీ మనదే! దేశభక్తీ మనదే! సత్యము చెప్పుటకు సంశయించ తగదు.. మన దాయాదులు యీ విషయమందు ముందంజన వున్నారు! మొన్నటికి మొన్న పాకిస్...
...ఇంకా చదవండి

ఈ పక్షం బుల్పికలు!

బమ్మిడి జగదీశ్వరరావు | 06.02.2018 12:30:59pm

రాజ్యాంగం ఏమయ్యింది?" "చిరిగిపోయింది!" "ఎలా..?" "కోళ్ళ కాళ్ళకు కత్తులు కట్టారుగా?...
...ఇంకా చదవండి

ఫ్యాన్స్ బాబూ.. ఫ్యాన్స్!

బమ్మిడి జగదీశ్వరరావు | 19.10.2017 09:46:33pm

ప్రతొక్కడూ ఫ్యాన్సు మీద బురదచల్లి మాట్లాడడం ఫ్యాన్సుగా మనం సహించవొద్దు! ఫ్యాన్సుగా మనం వొక్కటిగా లేకపోతే యేకం కాకపోతే ఐక్యంగా వుండకపోతే డేమేజ్ అయిపోయి చాలా ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  యువ విప్లవ కవి, విరసం సభ్యుడు కా. సంతోష్‌ అక్రమ నిర్బంధాన్ని ఖండించండి
  మానవ సంబంధాలను ఎత్తిపట్టిన కథలు
  నీలి కురుంజిల్ని... లాల్ కురింజిలుగా విరబూయిద్దాం!
  అయోధ్యకి మళ్ళీ రెక్కలొచ్చినయ్
  రాయలసీమ బతుకు పోరాటం
  మట్టివాసనెపుడూ జీవనోత్సవమే.
  పాలమూరి దుఃఖం
  బతుకు వెతుకులాట లో పాఠకుడికి యెదురయ్యే నిఖార్సైన మానవుడు
  తొలితరం విప్లవ కథకుడు
  స్వేచ్చా స్వప్నం
  సమాజ నగ్న చిత్రం ʹమట్టిరంగు బొమ్మలుʹ
  సామాజిక ఆర్థిక అసమానతలను ప్రశ్నించిన కులవృక్షం

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •