గాజు గోళం లాంటి మానవజీవితానికి ఆశే సంజీవనీ మంత్రం!

| సాహిత్యం | స‌మీక్ష‌లు

గాజు గోళం లాంటి మానవజీవితానికి ఆశే సంజీవనీ మంత్రం!

- శివలక్ష్మి | 02.04.2020 08:22:43am

చైనా గ్లోబల్ టివి అంతర్జాతీయ సమాచార ప్రవాహానికి విలక్షణమైన ప్రత్యామ్నాయాన్ని అందించడానికి ప్రయత్నిస్తుంది. ఇతర మీడియా సంస్థలకు భిన్నంగా దేశాలు, ప్రాంతాలు, కథలపై సమతుల్యమైన రిపోర్ట్ లను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. అంతర్జాతీయ దృక్పథం నుండి వార్త లను నివేదిస్తుంది!

చైనా గ్లోబల్ టివి నెట్ వర్క్ రూపొందించిన ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడవలసిన డాక్యుమెంటరీ ʹవుహాన్‌లో ఒక నెల రోజుల లాక్‌డౌన్ʹ (Lockdown one month in Wuhan). ఈ డాక్యుమెంటరీ దర్శకుడు ʹగి యూన్ ఫైʹ (GE YUNFEI), స్క్రిప్ట్ రచయితలు ʹఘూ ఘైన్ చెన్ʹ (XU XINCHEN), గి యూన్ ఫై.

కరోనా (కోవిద్ 19) అనే మహా భయంకరమైన అంటువ్యాధి చైనా లోని వూహాన్ పట్టణంలోని హుబీ ప్రాంతానికి మొట్ట మొదటగా సోకింది. అది నేడు ప్రపంచ దేశాలన్నిటికీ వ్యాపిస్తూ జీవితం చాలా దుర్బలమైనదని, ఊరికే అల్లల్లాడి పోతుందని మనుషులందరికీ ఒక గుణపాఠం నేర్పుతుంది!

2020 సంవత్సరం, జనవరి 23 వ తేదీ, చైనీయుల నూతన సంవత్సరానికి రెండు రోజుల ముందు, వూహాన్ నగరంలో హాంకౌ రైల్వే స్టేషన్ గడియారం ఉదయం 10 గంటల సమయాన్ని సూచిస్తుంది. నగరం అంతటా ప్రజా రవాణాకు సంబంధించిన సిటీ బస్సులు, సబ్వేలు, ఫెర్రీలు దూర ప్రయాణపు బస్సులతో సహా ఆపివేయబడ్డాయి. వూహాన్ నగరంలో వ్యాపించిన చావు దెబ్బ తీసే ఘోరమైన వైరస్ ను ఆపే ప్రయత్నంగా దేశ మంతటా లాక్‌డౌన్ ఒక నెల రోజులపాటు ప్రకటించారు. షాంఘై, జెజియాంగ్, హైనాన్, జియాంగ్జీ నుండి వైద్య బృందాలు వుహాన్ ప్రజల కోసం బయలుదేరాయి.

ఒక వూహాన్ నగర మహిళ ʹనేను సిటీ బస్సులు సబ్వేలను నిర్మానుష్యంగా చూశాను. ప్రజా రవాణా మూసివేయబడిందని మేము విన్నప్పుడు మాకు చాలా మంది వీధుల్లో నడుస్తూ కనిపించారు. అన్నీ ఆగిపోయాయి, చాలా మంది ఇప్పుడు ఇంటికి వెళ్ళలేరు. వారి గురించి నేను చాలా బాధపడుతున్నాను. బలవంతంగా ఆగిపోయిన వారిలో ʹచెన్ హెంగ్ʹ అనే వలస కార్మికుడు కూడా ఉన్నాడు. చివరకు అతనికీ, అతని తోటి కార్మికులకీ ఒక ఆశ్రయం దొరికింది - అది ఒక అండర్ గ్రౌండ్ పార్కింగ్ స్థలం. అతను ʹభారీగా వర్షం పడుతున్నప్పుడు బేస్ మెంట్ స్థలంలో మేము తలదాచుకునేవాళ్ళం, వర్షం ఆగినప్పుడు నడక సాగించేవాళ్ళం. ఒక రెస్క్యూ షెల్టర్ కనుక్కోవాలని మా ప్రయత్నం. అటు వైపుగా నడుస్తున్నప్పుడు, దారిలో ఆ ఆశ్రయం అప్పటికే నిండి ఉందని విన్నాం. ఇక అందులో ఎవరికీ చోటుండదని తెలిసిందʹని చెప్పారు. చెన్ వర్షంలో వీధి వెంట నడుస్తున్నప్పుడు, లాక్ డౌన్ చేసిన మొదటి రోజు వూహాన్లో ధృవీకరించబడిన కరోనా వైరస్ రోగుల సంఖ్యను 495 గా ప్రకటించారు. అది రెండు వారాల ముందున్న సంఖ్యకు పది రెట్లు పెరిగింది. ఇంకా వూహాన్ నగరంలో 9 మిలియన్ల మంది నివశిస్తున్నారు. వూహాన్ సీఫుడ్ మార్కెట్ ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి మూల కారణమని భావించారు. వూహాన్ స్థానిక అధికారులు జనవరి 1 న మార్కెట్‌ను మూసివేశారు. కానీ వైరస్ అప్పటికే వూహాన్ ప్రజల్లోవ్యాపించేసి కదలికలో ఉంది.

వూహాన్ నగరంలో కరోనా వైరస్ ను ఎదుర్కొన్న వారిలో వూహాన్ విశ్వవిద్యాలయానికి చెందిన జోంగ్ నాన్ హాస్పిటల్ ʹడాక్టర్ జావో జిగాంగ్ʹ మొదటి వాడు. ఇతనికి జ్వరం, ఆకలి మందగించడం, విపరీతమైన దగ్గు మొదలైన లక్షణాలతో హాస్పిటల్ కి వచ్చాడు. ఇతను వూహాన్ నగర నివాశి కాదు. రోగి వూహాన్ వెలుపల నుండి వచ్చాడు. సిటి స్కాన్ ఫలితం అతనికి న్యుమోనియా ఉందని చూపించింది, కానీ ఆ సమయంలో రోగ నిర్ధారణకు ముఖ్యమైన ప్రమాణం ʹహువానన్ సీఫుడ్ మార్కెట్‌ʹ ఆహారం తీసుకోవడంగా పరిగణిస్తున్నారు. అన్నెం పున్నెం తెలియని అడవి జంతువులను నిందించారు, కానీ శాస్త్రీయమైన సాక్ష్యాలు అప్పటికే మానవుని నుంచి మానవ ప్రసారాన్ని సూచించాయి. అది రెండు చోట్ల కనిపించింది.

83 ఏళ్ల ఎపిడెమియాలజిస్ట్ ʹజోంగ్ నాన్షన్ʹ ని 2002-2003 లో SARS (severe acute respiratory Syndrome) అనే ప్రమాదకరమైన వైరస్ కి గురైన మొదటి సభ్యుడుగా చైనాలో జాతీయ హీరోగా పరిగణిస్తారు. ఇది మానవులలో, జంతువులలో తీవ్రమైన శ్వాసకోశ అనారోగ్యాలకు కారణమవుతుంది. ప్రజలు వుహాన్ నుండి దూరంగా ఉండాలని జోంగ్ నాన్షన్ అభిప్రాయపడ్డారు. హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్ మిషన్ జరుగుతున్నట్లు ఖచ్చితమైన ఆధారాలను కనుగొన్నారు. ఈ సంక్షోభ సమయంలో ప్రజలకు వార్తల ద్వారా విషయాన్ని విశదీకరించారు. ఇది చైనా అంతటా ప్రజలను వణికించింది. అదే సమయంలో వూహాన్ నుంచే చాలా మంది వైరస్ బారిన పడడంతో అక్కడి పరిస్థితి క్షణ క్షణానికీ క్షీణించసాగింది.

కరోనా వైరస్ వాస్తవానికి అప్పటికే దిగ్భ్రాంతికరంగా రోజు రోజుకీ అభివృద్ధి చెందుతూనే ఉంది, అది ఇప్పుడు ఒక వ్యక్తి నుండి చాలామంది వ్యక్తులకు పాకుతుంది. మొదటి రోగి ʹడాక్టర్ జావో జిగాంగ్ʹ సీఫుడ్ మార్కెట్‌ కు అసలెప్పుడూ వెళ్ళనేలేదు. ఏది ఏమైనప్పటికీ వైరస్ మాత్రం వూహాన్ నగరాన్ని అత్యంత వేగంగా చుట్టుముడుతుంది!

వూహాన్ జోంగ్ నాన్ హాస్పిటల్ లో కరోనా రోగులతో పనిచేస్తున్న డాక్టర్ జావో జిగాంగ్ కి, రెండు రోజుల తర్వాత, కరోనా సోకిందని నిర్ధారించబడింది. ఆయన ఇంటికి తిరిగి వెళ్ళింతర్వాత ʹవిపరీతమైన చలి, అలసట కలిగాయనీ, శరీర ఉష్ణోగ్రత, 37.5 డిగ్రీల సెల్సియస్ గా ఉందనీ పిచ్చి దిగులేసిందనీʹ చెప్పారు. డాక్టర్ జావో జిగాంగ్ సహోద్యోగులలో ఎక్కువ మంది కరోనా లక్షణాలను చూపించడం ప్రారంభించార., అజాగ్రత్తగా ఉన్నందువల్ల చాలామందికి ఒకరినుంచి ఒకరికి కరోనా సంక్రమించింది. అప్పటి నుండి మా బృందంలోని వైద్యులు, నర్సులు అందరం వైరస్ చాలా అంటువ్యాధి అని మేము గ్రహించాం. మాకు సహాయంగా 38,000 మంది వైద్య కార్మికులు వూహాన్ విచ్చేశారు.పని చురుగ్గా ప్రారంభమైంది. వాతావరణం చాలా బిజీగా మారిపోయింది.

వూహాన్ నంబర్ 4 హాస్పటల్ నుంచి ʹజి జింగ్ జింగ్ʹ (Xie Zing jing) అనే నర్స్ ʹనేను ఇలాంటివి ఎప్పుడూ చూడలేదు, రోగులు వరుసగా ఎన్నో సర్కిల్స్‌లో ఉన్నారు, వారిని చూస్తుంటేనే నాకు నిరాశా నిస్పృహలు ముంచెత్తుతున్నాయి. రోగుల రాకకు అంతనేది లేకుండా ఉంది. మేము ఎంత నాన్‌స్టాప్‌గా పని చేస్తున్నా సరే, ఇంకా చాలా మంది రోగులు వేచి ఉన్నారు, లాక్ డౌన్ అయిన రెండవ రోజు, ఒక కొత్త హాస్పిటల్, హుయో షెన్ షాన్ హాస్పిటల్ (Huoshenshan Hospital) 1000 పడకలతో, కరోనా వైరస్ రోగులకు చికిత్స చేయడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది.

ʹహుయో షెన్ షాన్ ప్రాజెక్ట్ʹ లో పని చేసే కన్ స్ట్రక్షన్ ఇంజనీర్ వు జిజెన్ (Wu ZHIZHEN) ʹమేము రోజువారీ పనులను అత్యంత వేగంగా చేస్తున్నాం. ఒక కొత్త ఆసుపత్రి సరిపోలేదు గనుక ప్రభుత్వం వాగ్ధానం చేసిన 1600 పడకల ఆసుపత్రి ని ప్రణాళిక చేసి ఆఘ మేఘాలమీద నిర్మిస్తున్నాంʹ అని చెప్పారు.

న్యూ ఇయర్ (జనవరి 25) రోజున, పొలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీ సమావేశానికి ప్రెసిడెంట్ జి జిన్‌పింగ్ (Xi Zinping) అధ్యక్షత వహించి, ముందు వరుసలో పోరాడుతున్న వైద్య కార్మికులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. చైనీస్ న్యూ ఇయర్ సందర్భంగా కరోనా వైరస్ ని ఓడించాలనీ, కుటుంబ కలయికల కంటే ప్రజల భద్రత, ఆరోగ్యాలకు అధిక ప్రాధాన్యత నివ్వాలనీ, అంటువ్యాధి నివారణ, నియంత్రణలు ఇప్పుడు చాలా ముఖ్యమైన పనులనీ 1200 మంది వైద్య కార్మికులకు తన సందేశాన్నిచ్చారు ప్రెసిడెంట్ జిన్‌పింగ్.

లాక్ డౌన్ 7 వ రోజు తర్వాత జనవరి 28 న చూస్తే చైనాలో ʹకోవిడ్ -19ʹ ఇన్ఫెక్షన్లు హుబీ ప్రావిన్స్ వుహాన్ నుంచి-356, హుబీ ప్రావిన్స్ బయట -705 గా నమోదయ్యాయి. అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ డైరెక్టర్-జనరల్ టెడ్రోస్ ఘెబ్రెయేసుస్ (TEDROS GHEBREYESUS) నోవెల్ కరోనా వైరస్ గ్లోబల్ వ్యాప్తిపై ʹ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ ʹ గా జనవరి 31 న ప్రకటించారు. ʹబలహీన ఆరోగ్య వ్యవస్థలతో ఉన్న దేశాలకు కరోనా వేగంగా వ్యాపించే అవకాశం ఉందనే విషయం గొప్ప ఆందోళనను కలిగిస్తుందని, అదే ఈ ప్రకటనకు ప్రధాన కారణంʹ అని చెప్పారు. కరోనా కట్టడి కోసం వైద్య సరఫరా కర్మాగారాలను చైనా అంతటా తిరిగి పనిలోకి తెచ్చారు.

సీన్ కట్ చేస్తే తిరిగి వుహాన్‌లో

తీవ్రమైన అనారోగ్య కరోనావైరస్ రోగుల చికిత్స కోసం, జనరల్ హాస్పిటల్స్ లోని సాధారణ వార్డులను, వేరు చేసి క్వారంటైన్ (నిర్బంధించి ఉంచే) గదుల్లోకి మార్చడం ప్రారంభించారు.

వూహాన్ యూనియన్ హాస్పిటల్ వైస్ ప్రెసిడెంట్ జింగ్ యాంగ్ (Zing Yang) మాట్లాడుతూ,ʹ మేము ఒక వార్డులో ప్రవేశించాం, కానీ మమ్మల్ని లోపలికి అనుమతించలేదు. కెమెరాలను గానీ సెల్ ఫోన్‌ లను గానీ లోపలికి అనుమతించలేదు. నేనప్పుడే 1850 యువాన్లతో ఖరీదైన కొత్త ఫోన్ కొన్నాను. కానీ నేను దాన్ని బయటకు తీస్తే గోడకు స్మారక చిహ్నంగా ఉంచాల్సిందే! లోపలికి వెళ్ళే వస్తువు లోపల ఉండాల్సిందేʹ నన్నారు. హాస్పిటల్ వైస్ ప్రెసిడెంట్ అయినప్పటికీ, ఏమాత్రం అధికార దర్పం లేకుండా రోగుల బాగు కోసం నిబంధనలు పాటించాల్సిందేనన్నారు!

వైద్యులు, నర్సులు ప్రత్యేక వార్డులోకి ప్రవేశించే ముందు రెండు పొరల రక్షణ సూట్లు, చేతి తొడుగులు, షూ కవర్లు, ఫేస్ మాస్క్‌లు, గాగుల్స్ తప్పనిసరిగా ధరించాలి. వూహాన్ యూనియన్ హాస్పిటల్ నుంచి యు వెన్ (YU WEN) అనే నర్స్ ʹ నా ముఖం నిండా బొబ్బలొచ్చాయి. నేను గాజుగుడ్డను ఉపయోగించకపోతే ఫేస్ మాస్క్‌ లు, గాగుల్స్ ధరించలేను. ఇది నిజంగా చాలా నరక యాతనగా ఉంది. మా 6-గంటల షిఫ్ట్ లో నీళ్ళు తాగడం గానీ, తినడం గానీ చివరకు టాయిలెట్ కి కూడా వెళ్ళ కూడదు. హాస్పిటల్ మా కోసం డైపర్లను, రక్షణ సూట్ లను కొనుగోలు చేసింది. ఈ సూట్లు చాలా ఖరీదైనవి కాబట్టి మేము వాటిని మేము సేవ్ చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.

వూహాన్ యూనియన్ హాస్పిటల్ డాక్టర్ టాంగ్ జిన్ (TANG XIN) ʹనేను రోగికి కాథెటర్‌ ను చేర్చాను, తీవ్ర వేదన ననుభవిస్తూ, అనారోగ్యంతో ఉన్న రోగులకు ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఆక్సిజన్ సరిపోనప్పుడు రోగి స్పృహ కోల్పోవడం మొదలు పెడతాడు, అతను నియంత్రణ లేకుండా చాలా కదులుతాడు, అప్పుడు వెంటిలేటర్ లేదా ఇంజెక్షన్లు చేయడం వంటి చికిత్సలు చాలా కష్టతరమవుతాయి. రోగుల నుంచి ఆగకుండా గంటలు మోగుతుంటాయి. 6 గంటల పని తర్వాత కూడా నర్సులు నిరంతరం రోగులకు హాజరవుతుంటారు.

డాక్టర్ టాంగ్ జిన్, తన షిఫ్ట్ ముగిశాక, టాటోటెక్టివ్ గేర్‌ను తీసి చూస్తే అతని శరీరమంతా దద్దుర్లు ఉన్నాయి. ఆయన ʹడ్యూటీలో ఉన్నప్పుడు చాలా బిజీగా, దురద పుడుతున్న పుడుతున్న స్పృహ కూడా తెలియదు. స్నానం చేసిన తర్వాత చర్మం భయంకరంగా కనిపిస్తూ దురదతో దారుణంగా బాధ పెడుతుంది. నేను 6 నుండి 8 గంటలు విశ్రాంతి తీసుకోగలిగితేనే తర్వాత పని భారాన్ని కొనసాగించ గలుగుతాను. వైద్య కార్మికులు ఎక్కువ తినాలి, మేము బలంతో ఉండాలి. తిని, శక్తి తెచ్చుకోక పోతే రోగుల్ని ఒక చోటి నుంచి మరొక చోటికి ఎలా మోయగలుగుతాం? ఏ సౌకర్యాలూ లేకుండా పనినే ప్రధమ కర్తవ్యంగా భావించి రోగుల్ని కరోనా నుంచి కాపాడడనికి మా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాంʹ అని అన్నారు.

వూహాన్ యూనియన్ హాస్పిటల్ నుంచి ʹఘూ పై పైʹ (ZHU PEIPEI) అనే నర్స్ʹ చాలా మంది నర్సులు ఆక్సిజన్‌ను పీల్చుకోవాల్సిన అవసరం ఉంటుందన్నారు. వైద్య బృందాలు తమ కెదురైన గడ్డుకాలం గురించి భయపడకుండా గాయపడి, మృత్యువు బారిన పడబోతున్నవారిని స్వస్థపరిచి రక్షిస్తున్నారు. ఫిబ్రవరి ఆరంభం నాటికి చైనా నలుమూలల నుండి 10000 మంది వైద్య కార్మికులను రప్పించారు. ఆ తర్వాత వారాల్లో ఆ సంఖ్యకు మూడు రెట్ల మందిని పిలిపించారు. 16 ప్రావిన్సుల నుండి వైద్యులు, నర్సులు వుహాన్ చుట్టు పక్కల ఉన్న నగరాలకు ఒక్కో నగరానికి ఒక్కో ప్రావిన్స్ వైద్య సహాయం చేసేలా ప్రణాళికలు రూపొందించారు. నిర్మాణ పనులు ప్రారంభమైన రెండు వారాల లోపు మొదటి అత్యవసర ఆసుపత్రి ʹహుషెన్‌ షాన్ హాస్పిటల్ ను పూర్తి చేసి, తీవ్ర అనారోగ్య కరోనా వైరస్ రోగులకు వైద్యం అందించడం ప్రారంభించారు. అయినప్పటికీ ఇంకా తగినన్ని పడకలున్న హాస్పిటల్స్ లేవు. వైరస్ వ్యాప్తిని ఆపడానికి, లాక్ డౌన్‌లో ఉన్న 9 మిలియన్ల మంది సురక్షితంగా ఉంచడానికి, ధృవీకరించబడిన రోగులందరినీ వేరు చేసి ఆసుపత్రులకు పంపుతున్నారు. నగరమంతటా డజన్ల కొద్దీ క్వారంటైన్ కేంద్రాలు ప్రారంభించారు. క్వారంటైన్‌లో ధృవీకరించబడిన రోగులు, జ్వరం రోగులు, ఇంకా ధృవీకరించబడని రోగులతో సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తులు ఉన్నారు.

ఫిబ్రవరి 5 న, కరోనా బారిన పడిన ʹడాక్టర్ జావో జిగాంగ్ʹ (మొట్టమొదట వూహాన్ వెలుపల చైనాలో కరోనా సోకిన వ్యక్తి) కోలుకుని నా రోగులందరినీ నేను మధ్యలో వదిలెయ్యలేను, ఫ్రంట్‌లైన్‌కు తిరిగి వెళ్లి పోరాటం కొనసాగిస్తానంటూ తిరిగి డ్యూటిలో చేరారు. ఫిబ్రవరి 3 న దేశవ్యాప్తంగా ʹకోవిడ్ -19ʹ మృతులు 361. ఇది సార్స్ వైరస్ మరణాల రేటు 349 ను అధిగమించింది.

ఫిబ్రవరి 4 నుంచి - 14 వ లాక్ డౌన్ రోజుకి కరోనా బాధితుల సంఖ్యలు ఈ క్రింది విధంగా పెరుగుతూ వచ్చాయి.

వుహాన్ - హుబీ ప్రావిన్స్ 356 నుంచి 1748 వరకు, 1748 నుంచి 1766 వరకు

వెలుపల- హుబీ ప్రావిన్స్700 నుంచి 705 వరకు, 705 నుంచి 707 వరకు

లాక్ డౌన్ మూడవ వారంలో 10,000 కేసులు నిర్ధారించబడ్డాయి, వూహాన్లో అనేక వేల మంది అనుమానించబడ్డారు, కాని 200 కంటే తక్కువ హాస్పిటల్స్ లో మాత్రమే పడకలు అందుబాటులో ఉన్నాయి. స్టేడియంలు, కన్వెన్షన్ సెంటర్లు వంటి ప్రభుత్వ భవనాలను తాత్కాలిక ఆసుపత్రులుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో 4000 పైగా పడకలు ఏర్పాటయ్యాయి.

25 సంవత్సరాల ʹమిస్ షెన్ʹ (Mss Shen) అనే కరోనా రోగిని ఒక హోటల్ నుండి తాత్కాలిక ఆసుపత్రికి బదిలీ చేశారు. రోగులు ప్రాథమికంగా తమను తాము చూసుకోగలిగిన వారిని తాత్కలిక ఆసుపత్రులలో ఉంచి పరిక్షలు చేస్తున్నారని చెప్పారామె.

చైనా గ్లోబల్ టివి వాళ్ళు వివిధ వైద్య సిబ్బందినీ, రోగుల్నీ ఇంటర్వ్యూలు చెయ్యడం కనిపిస్తుంది.

ʹమిస్టర్ యేʹ (Mr Ye) కింఘై (Qinghai) ప్రావిన్స్ నుండి వచ్చిన ముస్లిం. వూహాన్ పర్యటనలో అతను వ్యాధి బారిన పడ్డాడు. ʹఇక్కడ మీకు ప్రత్యేక హలాల్ ఆహారం ఉందా? మీరు దానికేమైనా చెల్లించాల్సిన అవసరం ఉందా ? అని రిపోర్టర్ అడిగితే , ʹఅవును, హలాల్ ఆహారాన్ని వారు నా మంచం దగ్గరికే తెచ్చి అందిస్తారు. ఇక్కడ ఆహారం, వైద్య చికిత్సలు అవసరమైన ప్రతి విషయాన్నీ ప్రభుత్వమే బాధ్యతతో చూసుకుంటుందని చెప్పారు.

లాక్ డౌన్ చేయడానికి ఒక నెల ముందు స్థానిక డాక్టర్ ʹలి వెన్ లియాంగ్ʹ (Li Wen Liang) వైరస్ గురించి ప్రజలను అప్రమత్తం చేయడానికి ప్రయత్నించాడు, కాని అతన్ని స్థానిక అధికారులు తీవ్రంగా మందలించారు. కాని అప్పటికే అతను కరోనా వైరస్ తో తీవ్రంగా అనారోగ్యంతో ఉన్నాడు. టీవీ అతనిని చేరుకుని ప్రశ్నించబోయింది. ʹనేను పూర్తి వాక్యాలను మాట్లాడలేను. నా ఊపిరితిత్తులు కొంచెం బాగుపడే వరకూ వేచి చూద్దాంʹ అన్నారు. కానీ ఆ రోజు ఎప్పుడూ రానే రాలేదు. ఫిబ్రవరి 7 న ʹలి వెన్ లియాంగ్ʹ కన్నుమూశారు!

ప్రజల ఆందోళనలు హోరెత్తిపోవడంతో ʹలి వెన్ లియాంగ్ʹ మరణానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని పంపింది. చైనాలో 3000 మందికి పైగా సోకిన వైరస్ కి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో, వైద్య కార్మికులు చాలామంది వూహాన్లో ఉన్నారు. ఒక డజన్ మంది మరణించారు. వైద్యులు, నర్సులు వార్డులలో తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవ చేస్తున్నారు. వుహాన్ నివాసితులు నగరంలో కరోనా నివారణకు కలిసి కట్టుగా తమ వంతు కృషి చేస్తున్నారని తేలింది. చైనాకిప్పుడు తత్వం బోధపడింది. అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా, అప్రమత్తతతో వ్యవహరించడం మొదలుపెట్టింది!

చైనా అంతటా గ్లోవ్స్, రక్షిత సూట్లు, పంపిణీ చేశారు. విదేశాల నుండి కూడా విరాళంగా వచ్చాయి. వాటిని పంపిణీ చేయడం ఒక ఒక పెద్ద సవాలుగా మారింది. ʹడైరెక్టర్ హావోʹ వీటిని సరఫరా చేయడానికి ప్రవేశించగానే డాక్టర్లు అక్కడ నిరీక్షిస్తూ కనిపించేవారని చెప్పారు. ʹయు యాంగ్ʹ (Yu yang) అనే మహిళ స్వచ్చంద సేవ కుపక్రమించింది. కొంతమంది మహిళలు, నర్సులు కుటుంబ సభ్యులను వదిలి వేరుగా జీవిస్తూ స్వచ్చందంగా సేవ చేస్తున్నారు!

ఈ సంక్షోభ సమయంలో వైద్య పరికరాలను పంపిణీ చేస్తున్న కొరియర్లు చాలా అవసరం. వైద్య సామాగ్రి పంపిణీని సమన్వయం చేసే ʹచెన్ క్విన్ʹ (Chen Qin) అనే నర్స్ ʹవైద్య వస్తువులను ఎస్ఎఫ్ ఎక్స్‌ప్రెస్ కొరియర్ ఫీజులను కూడా తీసుకోకుండా వూహాన్ కి సేవలందించిందని చెప్పారు. ʹషి చాంగ్ బింగ్ʹ (SHI ZHANGBING) అనే కొరియర్ ఈ క్లిష్ట పరిస్థితుల్లో కరోనాకి వెరవకుండా ప్రజలకు సేవ చేస్తున్నందుకు తన కుటుంబ సభ్యులందరూ గర్వపడుతున్నారని చైనా గ్లోబల్ టివి రిపోర్టర్ తో చెప్పారు.

ఫిబ్రవరి 12 న, 10000 కన్నా ఎక్కువ, నగరంలో కొత్త కేసులు ప్రకటించబడ్డాయి. పరీక్షలు చేసి నెమ్మదిగా ఫలితాలకోసం చూడడం కన్నా కరోనా వైరస్ రోగిని గుర్తించడానికి ఆరోగ్య అధికారులు చికిత్స లక్షణాలను పరిశీలించడం ప్రారంభించారు. చైనా కేంద్ర కమిటీ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పొలిటికల్ బ్యూరో స్టాండింగ్ కమిటీ ఫిబ్రవరి 12 న సమావేశమైనట్లు టివి లో న్యూస్ వస్తుంది. పొలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీ జరిపిన మరొక సమావేశానికి అదే రోజున అధ్యక్షుడు ʹజి జిన్‌పింగ్ʹ నాయకత్వం వహించారు. వైరస్‌ పై పోరాటానికి ఫలానా నిర్దేశికాలు, బ్యూరోక్రసీ పెద్ద శత్రువులు అని సమావేశం తేల్చింది. మరుసటి రోజు వుహాన్ నగరం, హుబీ ప్రావిన్స్ నాయకత్వంలో మార్పు వచ్చింది. కరోనా అంటువ్యాధిని పరిష్కరించడానికి కఠినమైన చర్యలు తీసుకున్నారు.

వుహాన్ హుబీ ప్రావిన్స్ 1766, హుబీ ప్రావిన్స్ వెలుపల 707 నుంచి, ఫిబ్రవరి 13 కి అంటే 21 వ లాక్ డౌన్ రోజుకి

వుహాన్ హుబీ ప్రావిన్స్ 13436, హుబీ ప్రావిన్స్ వెలుపల 312 కి రోగుల సంఖ్యలు పెరిగిపోయాయి.

ఫిబ్రవరి 14 న మరో 1400 మంది సైనిక వైద్యులను వుహాన్ కి పంపారు. 11 సైనిక విమానాల్లో, వైద్యబృందాలను, సామాగ్రిని రప్పించారు. చైనా Y 20 రవాణా విమానం సైనిక కసరత్తులకు కాకుండా బయట ఆపరేషన్లో పాల్గొనడం ఇదే మొదటిసారి అని ʹఘూ హైరోంగ్ʹ (ZHU HAIRONG) మిలిటరీ మెడికల్ టీం సభ్యుడు చెప్పారు.

29 ప్రావిన్స్ లు, వివిధ ప్రాంతాల నుండి 30000 మందికి పైగా వైద్య కార్మికులు వుహాన్ కి తరలి వచ్చారు. ʹఈ రోజు నుండి మనమంతా వుహాన్ నివాసితులంʹ అని ప్రతిజ్ఞ తీసుకుని అత్యంత సురక్షితమైన పద్ధతులను ప్రయోగించడానికి మనస్ఫూర్తిగా పూనుకున్నారు. శ్వాసకోశ వ్యాధులు, అంటువ్యాధుల నివారణకు ఈ వైద్య బృందం ఉత్తమమైన చికిత్సా పద్ధతులను ఎంచుకుంది.
జనవరి చివరిలో రోజుకు 35,000 గా సరఫరా జరుగుతున్న N 95 మెడికల్ మాస్క్‌లను 300,000 లకు పెంచారు. రక్షిత గేర్ల ఉత్పత్తి కూడా పెంచారు. ఫిబ్రవరి 17 న వుహాన్ నగరం చివరికి వైరస్ వ్యాప్తి చేయగల ప్రజలందరినీ నిర్బంధించ గలిగింది. వారు ఈ ప్రజలను ఏ విధంగా క్వారంటైన్ కి పంపగలిగారు?

ఈ వైద్య బృందం కాలి నడక నడుస్తూ ప్రతి ఇంటి తలుపు తట్టారు. అలుపనేది లేకుండా ప్రతి ఒక్కరి ఆరోగ్య, అనారోగ్య విషయాలను ఉ.కి డయబెటిస్, ఆర్ధరైటిస్, బిపి లాంటి మెడికల్ రికార్డులున్నాయా అని పరిశీలించారు. వివరాలను సేక రించారు. ఆసుపత్రికి వెళ్లవలసిన నివాసితులు కమ్యూనిటీ సెంటర్‌కు ఫోన్ చేయాలి, ప్రతి ఒక్కరూ ఇంటి వద్దే ఉండాలని ఆదేశించారు. మళ్ళీ నోటీసు వచ్చేవరకూ ఆగమన్నారు. కిరాణా సామాగ్రి ఆన్‌లైన్‌లో కొనుగోలు చెయ్యాలి. వాటిని ప్రవేశ ద్వారాల వద్ద వదిలివేయాలని సంబంధిత సంస్థలకు ఆదేశాలిచ్చారు. ప్రజలు ఆ సామాన్లను తర్వాత సేకరించుకునేలా హ్యూమన్ టు హ్యూమన్ ప్రసారాన్ని నివారించడానికి చర్యలు తీసుకున్నారు. ఇన్ని రోజుల లాక్ డౌన్ వల్ల మానసిక దౌర్బల్యానికి లోనవుతున్న రోగులను తోబుట్టువుల వలే లాలించి అనునయంగా కౌన్సిలింగ్ చేశారు. వారికి కావలసిన మందులను వారే స్వయంగా కొనుగోలు చేశారు.

ఫిబ్రవరి 19 న అంటే లాక్ డౌన్ 27 వ రోజున వుహాన్ హుబీ ప్రావిన్స్ 615, హుబీ ప్రావిన్స్ వెలుపల 45 మాత్రమే మిగిలారు

ఫిబ్రవరి 23 న అంటే లాక్ డౌన్ 33 వ రోజున వుహాన్ హుబీ ప్రావిన్స్74, హుబీ ప్రావిన్స్ వెలుపల ఒకే ఒక్కరున్నారు. అంటే రోగుల సంఖ్యను గణనీయంగా తగ్గించగలిగారు!

బ్రూస్ అల్వార్డ్ (BRUCE ALWARD) అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్,ʹ కొత్త శ్వాసకోశ వ్యాధికి చైనా సాహసోపేతంగా అవలంభించిన విధానం వేగంగా దాని వ్యాప్తిని అరికట్టగలిగింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రజలు అసాధారణమైన కాలం గడిపారు. ఆ మానసిక ఒత్తిడిని అనుభవించిన, ఇప్పటికీ అనుభవిస్తున్న వూహాన్ ప్రజలకు ప్రపంచం ఎప్పటికీ రుణపడి ఉంటుంది. సంక్లిష్ట సమయంలో వారు పోషించిన పాత్రకు ప్రపంచమంతా ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటుందిʹ అని అన్నారు. అది ముమ్మాటికీ నిజం!

నర్స్ ʹజి జింగ్ జింగ్ʹ చైనా అంతటా మాకున్న మద్దతుతో, మా జీవన నాణ్యత మెరుగుపడింది. మా కెంతో సహాయ మందింది. ఇంతకుముందు వూహాన్‌ లో మేము ఇక్కడ ఒంటరిగా పోరాడుతున్నామని అనుకున్నాను. కానీ ఇప్పుడు మొత్తం దేశస్థులు మాతో ఉన్నారని అర్ధమైంది. దీన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని సంతోషంగా చెప్పారు.

డాక్టర్ ʹవు వైకాంగ్ʹ (Wu WEICONG) ʹఈ ʹకోవిద్-19ʹ వ్యాప్తి ప్రతి ఒక్కరికీ లోతైన జ్ఞాపకశక్తినీ, గాఢమైన ఎరుకనీ ఇస్తుందని నేను భావిస్తున్నాను. యుద్ధం ముగిసిపోలేదు. కానీ ప్రజలు ఇప్పుడు వెలుగులతో నిండిన ప్రేమ తిరిగి ప్రారంభమయ్యే రోజు కోసం ఎదురు చూస్తున్నారు, పండోర పెట్టె తెరుచుకుని విపత్తు భయం, అనారోగ్యాలను ప్రజలకు విడమరిచి విప్పి చెప్పిందʹన్నారు.

డాక్టర్ టాంగ్ జిన్,ʹపండోర పెట్టెలో ఆశ ఇంకా మిగిలి ఉంది. నా నగరం ఆగిపోలేదని, కాకపోతే కొంచెం మందగించిందని నేను అనుకుంటున్నాను. మనం పోరాడకపోతే ఇంకెవరు పోరాడతారు? ఆశను నిరంతరం నిలుపుకుంటూ ప్రాణం ఉన్నంత కాలం పోరాడాలి. దీనిముందు ఇంతకుముందు పడ్డ కష్టాలు అసలు కష్టాలే కావు!ʹ- అని అన్నారు.

వైద్యులు, నర్సులు విశ్రాంతి తీసుకోలేరు. ప్రపంచం వారి భుజస్కంధాల మీద నడుస్తుంది!

చైనా ఏదో బయో ఆయుధంగా ఈ వైరస్ ని తయారు చేసిందనే వింత వింత కుట్ర సిద్ధాంతాలు రాజ్యమేలుతున్నాయి. వాళ్ళ ఆహారపుటలవాట్ల మీద బ్రాహ్మణీయ వర్గాలు దాడి చేస్తున్నాయి. అగ్రరాజ్యాధినేతలనుండి అన్ని దేశాల ప్రభుత్వాలు చైనా ఆఘమేఘాల మీద ʹCOVID-19ʹ వైరస్‌ కి వ్యతిరేకంగా చేపట్టిన విధానాలను అధ్యయనం చెయ్యాలి. రాజకీయాలను పక్కన బెట్టి తన ప్రజల రక్షణ కోసం చైనా తీసుకున్న జాగ్రత్తలనూ ప్రేమనూ గమనించాలి!

చైనా ఒక ముస్లిం రోగి మంచం దగ్గరికే హలాల్ ఆహారాన్నిఅందించింది. వేల మంది రోగులకి ఉచితంగా ఆహారం, వైద్య చికిత్సలు అందించింది. అలా అని అసలు చైనాలో అసలు తప్పులే జరగలేదని కాదు! డాక్టర్ ʹలి వెన్ లియాంగ్ʹ ని పట్టించుకోకుండా అతని చావుకి కారణమైంది.

తప్పులనుంచి పాఠాలు నేర్చుకుని చైనా పాలకులు శీఘ్ర గతిన గట్టి చర్యలు చేపట్టారు. చైనాలో దేవుడు, దయ్యం, మతం లాంటివి లేనందువల్ల కూడా ఇంత శాస్త్రీయమైన ఫలితాల్ని సాధించారేమో!

వూహాన్ ప్రజలను నిరుత్సాహ పరచకుండా, వైరస్ వ్యాప్తి చెందడానికి వీల్లేని కీలకమైన మార్గాలను అనుసరించి, కృతకృత్యులైన వారందరికీ, ఈ మానవాళిని రక్షించే మహత్కార్యంలో భాగమైన త్యాగమూర్తులందరికీ చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది!

ఈ డాక్యుమెంటరీ ʹCOVID-19ʹ వైరస్‌కు వ్యతిరేకంగా అవిశ్రాంతంగా పోరాడుతున్న వారందరికీ అంకితం చేశారు. వైరస్ నుండి మానవాళిని రక్షించడంలో వారు చేసిన ప్రయత్నాలు ప్రపంచం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు!

No. of visitors : 576
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •