నేను దీపాలు ఆర్పను.. కొవ్వొత్తులు వెలిగించను.. ఏం చేస్తావ్?

| సాహిత్యం | వ్యాసాలు

నేను దీపాలు ఆర్పను.. కొవ్వొత్తులు వెలిగించను.. ఏం చేస్తావ్?

- పాణి | 03.04.2020 06:56:28pm

డియర్ మోదీ.. ప్రధానీ

రాజ్యానికి చీకటి ముఖం ఉంటుందని మా తెలుగు భాషలో సుప్రసిద్ధ రచయిత రావిశాస్త్రిగారు అంటారు. సరిగ్గా నీ రాజ్యానికి ఈ మాట సరిపోతుంది. ప్రధాన మంత్రిగా నీవు దీనికి తగినవాడివి. నీది చీకటి ముఖం. నీవి చీకటి రాజకీయాలు. కాబట్టి ఆదనంగా మా ఇంట్లో ఉండే దీపాలను కూడా ఆర్పేసి నేను చీకటిని ప్రోత్సహించలేను. వేరే ఎప్పుడైనా కొవ్వొత్తులు నాకు అవసరమైతే, ఇష్టమైతే వెలిగించుకుంటాను. దివ్వెలు ముట్టిస్తాను. కానీ నీవు చెప్పావని మాత్రం ఆదివారం రాత్రి వెలిగించను.

ఎందుకంటే నీ దీపాలు ఆర్పే వ్యూహం ఏమిటో నాకు తెలుసు. ప్రత్యేకంగా ఈ ప్రోగ్రాం దేశ ప్రజలకు ఎందుకు ఇస్తున్నావో కూడా తెలుసు. ఈ దేశ ప్రజలు అన్నం పెట్టి, అక్షరాలు నేర్పితే రచయితను అయినవాడ్ని. నాలుగు వాక్యాలు రాయడం తెలుసుకున్న వాడ్ని. సత్యం మాత్రమే చెప్పమని ప్రజలు నన్ను నిత్యం ఆదేశిస్తుంటారు. కాబట్టి నీ వ్యూహంలో నేను ఎన్నటికీ భాగం కాను. కరోనా విలయం ఆపలేని మానవ విషాదం. మహాశక్తి సంపన్నులైన మనుషులను ʹఒంటరి వాళ్లను చేసింది. స్వయం బందీలను చేసింది. బంధాలను, బాంధవ్యాలను పరీక్షకు గురి చేస్తోంది. అయినా సరే మేం చరిత్ర పొడవునా మానవ విషాదాలను గుండెకు హత్తుకొని, మానవ మేధతో, హృదయంతో ఎదుర్కోవడం తెలిసిన వాళ్లం. కరోనాను ఎదుర్కోవడమే కాదు, మానవతను, హేతుచింతనను, శాస్త్రీయతను ఎత్తిపట్టడానికి సిద్ధమైన వాళ్లం.

అయితే నీవు ఎలాంటి వాడివి? మనుషుల కోసం నీవేం చేస్తున్నావు? రోగగ్రస్థమైపోతున్న దేశానికి నీవు ఉపదేశాలు తప్ప ఏం ఇచ్చావని? మందులు లేవు, ఆస్పత్రులు లేవు, మనుషుల్ని కాపాడే వైద్య వ్యవస్థ లేదు. చివరికి నోటికి గుడ్డ అడ్డం పెట్టుకోమని చెప్పడమే తప్ప మాస్కులు ఇచ్చే తాహతు కూడా నీకు లేదు. నిరంతరం చేతులు కడుక్కోమని చెప్పే నీవు ఈ ఎండా కాలంలో జనానికి గుక్కెడు మంచి నీళ్లు కూడా ఇవ్వ లేవు. ఇండ్లలోనే ఉండమని చెప్పే నీవు కోట్ల మందిని వీధుల్లోకి విసిరేశావు. అబద్దాలు చెప్పడం నీకు వెన్నతో పెట్టిన విద్య. అన్నీ దాచేయడం తప్ప మరేవీ తెలియదు. కరోనా ఎన్ని వైరుధ్యాలను బైటికి తీసుకొచ్చిందో. ఎన్ని వాస్తవాలను నగ్నంగా బైటపెట్టిందో.

మోదీ..మై డియర్ ప్రధానీ.. కరోనా నీ విషపు చూపులకు అర్థాలు కూడా చెబుతోంది. వైద్యుల పేరు చెప్పి ఆ రోజు నీవు చప్పట్లు కొట్టించుకున్నావు. ఈ రోజు దీపాలు ఆర్పేసి చీకట్లలో ఉండమంటున్నావు. కోటానుకోట్ల మందిని వాళ్ల చావుకు వాళ్లను వదిలేసి గంభీరమైన ప్రసంగాలు చేస్తున్నావు. అంత వరకే అయితే ఏమో. కానీ నీవు కరోనా చితి మంటల్లో నీ హిందుత్వ పేలాలు వేపుకుంటున్నావు. నీ చేతికి దొరికిన దేన్నయినా నీవు మతంగా మార్చగల మాంత్రికుడివి. అంటే మనుషుల్ని వేరు చేయడం తప్ప నీకు తెలిసిన విద్య ఏదీ లేదు. దానికి మతం ఒక్కటే నీ సాధనం.

కరోనా మృత్యు సందర్భంలో కూడా ముస్లింలను వదిలి పెట్టదల్చుకోలేదు. సోషల్ డిస్టెన్స్ కరోనా నియంత్రణకు కాదు, నీకు చాలా అవసరం. ముస్లింలకూ ఈ దేశానికీ డిస్టెన్స్ పెంచడమే నీ లక్ష్యం. లేకపోతే నిజాముద్దీన్ మర్కజ్ మీద నీ శ్రీరామ సేన ఇంతగా దుష్ప్రచారం ఎందుకు చేస్తోంది. బాధితులు ఎవరైతేనేం.. వైరస్ సోకితే వైద్యం చేయించడం ఒక్కటే నీ విధి. లేనిపోని అధిక ప్రసంగాలు చేస్తున్న నీ మూకను ఎందుకు కట్టడి చేయలేకపోతున్నావు? కరోనా వైరసను కట్టడి చేస్తానని దేశం మీదికి ఈ వైరసన్ను ఎందుకు వెదజల్లావు? కరోనా తీవ్రమయ్యాక దేశంలో తబ్లీగీ జమాత్ ఒక్కటే జరిగిందా? ఫిబ్రవరిలో, మార్చిలో ఎన్ని హిందూ పండగలు జరగలేదు! ఎన్ని మేళాలు సాగలేదు! దేశ విదేశాల జనం లక్షల సంఖ్యలో వాటిల్లో పాల్గొన్నారు కదా? వాటిలో అయినా, ఢిల్లీ జమాలో అయినా కరోనా సోకిన వాళ్లకు వైద్యం చేయించకుండా నీ అల్లరి మూక దేశం ఇల్లెక్కి ఎందుకు ఇంతగా ముస్లింలను వేలెత్తి చూపిస్తోంది? ఇంతకూ నీవు ప్రకటించిన దీపాలు ఆర్పే పథకానికి రూపాయి ఖర్చు పెట్టాల్సిన పనిలేదు. దమ్మిడీ పని అక్కర్లేదు. పైగా 130 కోట్ల మంది తలా 9 నిమిషాలు నీకు ఇస్తే చాలన్నావు. దీపాలు ఆర్పి ఏ అద్భుతాలు సృష్టించగలవు? ఒక్క కరోనా క్రిమినైనా దూరం చేయగలవా? నీ అసలు ఉద్దేశం అది కాదు. అసలు నీకు ఆ ఉద్దేశమే లేదు. ఈ దేశ పాలకుడిగా నీ కళ్లలో పిసరంత విచారం కనిపిస్తున్నదా? నీ వల్ల తలెత్తిన ఆర్థిక సంక్షోభాన్ని ప్రశ్నించేందుకు వీధుల్లో ఒక్కరంటే ఒక్కరూ లేకుండా అందరూ వాళ్ల ఇండ్లలో వాళ్లే అరెస్టయిపోయే అద్భుతమైన అవకాశం దొరికింది కదా? అనే వెలుగు కనిపిస్తోంది. అందుకేనా ఇక దేశానికి దీపాలు ఎందుకని ఆర్పేయమంటున్నావ్? నీ గుట్టుమట్టు తెలిసిన వాళ్లు జైళ్ల నుంచి బైటికి వస్తే మాటలతోనే నిన్ను కడిగేస్తారని నిర్దాక్షిణ్యంగా లోపలే అట్టిపెట్టుకున్నావు.

కరోనా వసే ప్రజలు చచ్చిపోతారు. కానీ ఫాసిజం కరోనా వెరస్ మీద ఆధారపడి విస్తరిసుందని నీవు నిరూపిస్తూన్నావు. ఆ రోజు చప్పటు కొట్టినా, రేపు దీపాలు ఆర్పేసినా దేశ ప్రజలందరినీ నీ చంకలో పెట్టుకోడానికే కదా? అందరినీ నీతో గొంతు కలిపేలా చేసుకోడానికే కదా? అందరూ నీతో ఉన్నారని చాటుకోడానికే కదా? చచ్చిపోయేవాళ్లు పోయినా ఉన్న వాళ్లంతా నీతో ఉన్నారని, ఇంక రెండో మాట లేదని చెప్పుకోడానికే కదా నీవు ఈ దీపాలు ఆర్పే పని అప్పగించింది. కరోనా నియంత్రణ కోసం ఎవరంతకు వాళ్లు దూరంగా ఉండిపోవడం కంటే ఎవరి దీపాలు వాళ్లే ఆర్చుకోవడమే కదా అసలు విషాదం. ఎంత కాని కాలం ఇది. ఇక మిగిలింది అత్యంత ప్రమాదరకమైన కరోనా, అంతకంటే ప్రమాదకరమైన నీ ఫాసిజం. . ఇంత తెలిసీ నేను దీపాలు ఎందుకు ఆర్పేయాలి. చీకట్లో అబద్దాలు ప్రచారం చేసుకోవడం నీ విధానం. వెలుగులో అంతకంటే ప్రచండమైన సత్యాలు చెప్పడం మా విధానం. అందుకే పట్టపగల్లాగా ఆ సమయంలో ఇల్లంతా లైట్లు వేసి ఉంచుతా.

No. of visitors : 911
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?

పాణి | 04.05.2017 10:53:32am

హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల......
...ఇంకా చదవండి

రైతు - నీళ్లు

పెన్నేరు | 16.08.2016 01:10:03pm

రైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం......
...ఇంకా చదవండి

ఈ తీసివేత‌లు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?

పాణి | 16.08.2016 12:59:12am

నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా.........
...ఇంకా చదవండి

ఆజాదీ క‌శ్మీర్ : చ‌ల్లార‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌

పాణి | 16.07.2016 11:04:09am

కాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........
...ఇంకా చదవండి

వివేక్ స్మృతిలో...

పెన్నేరు | 17.09.2016 09:54:49am

వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు.......
...ఇంకా చదవండి

జీవిత కవిత్వం

పాణి | 04.06.2017 12:38:44pm

విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్‌ పద్ధతులకు వ...
...ఇంకా చదవండి

భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే

పాణి | 22.09.2017 01:18:31pm

ఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి......
...ఇంకా చదవండి

కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?

పాణి | 07.10.2017 11:08:49am

ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్‌ దేశస్థుల స్వేచ్ఛ గు...
...ఇంకా చదవండి

మానవ హననంగా మారిన రాజ్యహింస

పాణి | 02.11.2016 08:47:26am

ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం.......
...ఇంకా చదవండి

నాగపూర్‌ వర్సెస్‌ దండకారణ్యం

పాణి | 17.11.2017 11:35:51pm

దండకారణ్య రాజకీయ విశ్వాసాలంటే న్యాయవ్యవస్థకు ఎంత భయమో సాయిబాబ కేసులో రుజువైంది. నిజానికి ఆయన మీద ఆపాదించిన ఒక్క ఆరోపణను కూడా కోర్టు నిరూపించలేకపోయిందిగాని, ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  వాళ్ల స్వేచ్ఛ కోసం పోరాడదాం
  నక్సల్బరీని ఎలా అర్థం చేసుకోవాలి?
  భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు
  నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  లాక్ డౌన్ లో అబద్ధాలు - ఎన్ కౌంటర్లు
  కా. కాశీం విడుదల కోసం కృషి చేసిన మిత్రులందరికీ విప్లవాభివందనాలు - కరోనా విపత్తులో రాజకీయ ఖైదీలను, ఇతర ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి
  చీమకుర్తి వలస కార్మికుల పోరాటం
  వివి ʹమన కవిʹ అని నిరూపించిన సముద్రస్వరం
  కడప జిల్లాలో వలస కూలీల దుఃఖనది
  కాపిటల్ లో కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు
  సర్వాంతర్యామి!
  నడవాలెనే తల్లి- నడవాలెనే

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •