తడారని నెత్తుటి జ్ఞాపకం

| దండ‌కార‌ణ్య స‌మ‌యం

తడారని నెత్తుటి జ్ఞాపకం

- వంగల సంతోష్ | 20.04.2020 02:53:33pm

పచ్చని పోలాలు ఒక్క సారిగా ఎరుపెక్కాయి. పారుతున్న సెలయేరులన్ని నెత్తుటితో నిండుకున్నాయి. వీచే పైరగాలిలో ఆర్తనాదాల కేకలు. ఇంతకీ ఇవన్ని ఎక్కడ.. ఎప్పుడు జరిగాయనా..? సరిగ్గా 1981 ఏప్రిల్ 20న ఇంద్రవెల్లిలో ఈ సంఘటన చోటుచేసుకున్నది. అసలు అక్కడ ఏం జరిగింది? ఇంత రక్తం పారడానికి కారణం ఏంటి? ఇప్పటికీ అక్కడ 144 సెక్షన్ విధింపు ఏంటి? స్వరాష్ట్రం వచ్చినా ఆంక్షలు ఎందుకు? పాలక ప్రభుత్వాలు ఎందుకింతగా భయపడుతాయి? ఏప్రిల్ 20 వచ్చిందంటే ఇంద్రవెల్లి, ఊట్నూర్, చుట్టుపక్కల పోలీసులు గస్తీ ఎందుకు పెడుతారు.

ముప్పైతొమ్మిదేళ్ల కిత్రం ఇంద్రవెల్లిలో రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో సభ నిర్వహించ తలపెట్టారు. ఈ సభ ప్రచారానికి వాళ్లకు మైకులు ఏమి లేవు. కేవలం వాళ్ళు గ్రామాలు తిరుక్కుంటూ నోటి ద్వారా గూడాలల్లో చెప్పడమే. ఈ సభ ముఖ్య ఉద్దేశం అనాటికి పూర్వం గూడాలల్లో జరుగుతున్న దోపిడి భుస్వామ్య విధానంపై గళమెత్తడం. దున్నుకుంటున్న పోలాలకు పట్టా ఇవ్వడం కోసం, పండించిన పంటకు మద్దతు ధర కల్పించడం కోసం, షావుకార్ల పెత్తనం పూర్తిగా తోలగించడం కోసం ఆదీవాసీలు రైతు కూలి సంఘం వెంట కదిలారు. ముందుగా అనుకున్నట్లుగానే ప్రభుత్వం సభకు పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చి తరువాత రద్దు చేసింది. ఎందుకో ఏమో కారణాలు ప్రభుత్వానికి తెలిసు. కానీ స్పష్టంగా చెప్పలేదు. ఈ సభ పరిణామాలు ఎలా ఉండబోతాయో ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చినట్లుంది. ఇంద్రవెల్లి సభ జరిగే నాటికి ముందే సిరిసిల్ల జగిత్యాలలో రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమాలు చాలా ప్రభావం వేసాయి. అక్కడ భుస్వాముల, దోరల పెత్తన్నాన్ని పారదోలి భూముల్ని సంఘం జెండా కింద ఆక్రమించి భూమిలేని వాళ్ళకు పంచడం జరిగింది. అది జైత్రయాత్రే అయింది. అనతి కాలంలోనే కల్లోలిత చట్టం ఉపయోగించి సిరిసిల్లా జగిత్యాలను కల్లోలిత ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటన చేసింది. ఇది 1978లో జరిగింది. ఇలాంటి పరిస్థితులు ఇంద్రవెల్లిలో జరుగుతాయని ప్రభుత్వం ఊహించి వెనువెంటనే సభకు ఇచ్చిన అనుమతిని రద్దు చేసింది.

ఏప్రిల్ 20 న జరిగే ఇంద్రవెల్లి సభకు ఆ చుట్టు పక్కల ఉన్న ఆదీవాసీలు బయలుదేరారు. ప్రభుత్వం అనుమతి రద్దు చేసినట్లు వారికి తెలియదు. పోలీసులు మైకుల ద్వారా చేబుతున్నా ఆ భాష అర్ధం కాక కొందరు, ఎలాగైనా ఈ రోజు మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది కదా అని మరికొందరు... ఇలా ఎవరికి వాళ్ళు ఇంద్రవెల్లి చేరుకున్నరు. వాగులు వంకలు కొండలు కోనలు మట్టి రోడ్ల వెంబడి చేట్లు పుట్లు దాటుకుంటు చీమల దండులా సాగి వచ్చారు. అదే రోజు అక్కడ అంగడి(సంత) జరుగుతుంది. దారి వెంబడి పోలీసులు బలగాలతో కాపు కాసారు. సభా ప్రాంగణానికి చేరనివ్వకుండా అడ్డుకున్నారు. అయినా కానీ పోలీసులను కాదని సభా ప్రాంగణానికి వెలుతున్న వాళ్ళను పిట్టల్లా కాల్చారు. పచ్చని అడవంతా ఆదీవాసీ నెత్తురుతో ఎర్రబారింది. తెలంగాణలో జరిగిన మరో జలియన్ వాలాబాగ్. ఆదివాసులను క్రూరంగా కాల్చుకతిన్న ప్రభుత్వం చేసిన ఘోరాన్ని దాచిపెట్టాలని చూసింది. 13మందే చనిపోయారని అని దొంగ లెక్కలు చెప్పింది. ఎక్కడా నిజాలు చెప్పే ధైర్యం లేని ప్రభుత్వం తన కపటనీతిని భయట పెట్టుకుంది.

ప్రజలు మాత్రం అత్యంత సాహసంతో తుపాకుల రాజ్యానికి ఎదురొడ్డి ప్రాణమిచ్చారు. ఇంద్రవెల్లిలో జరిగిన ఈ మారణకాండకు గుర్తుగా అక్కడ అమరుల స్థూపాన్ని నిర్మించారు. నిజానిజాలు బయటి ప్రపంచానికి తెలియాలని పౌరహక్కుల సంఘాలు ఇంద్రవెల్లిలో జరిగిన హత్యకాండ మీద నిజనిర్ధారణ చేసి అక్కడ సుమారుగా 60 మంది చనిపోయారని, వందలాది మందికి గాయాలైయాయని నివేదిక ఇచ్చారు. ఆనాటి నుండి ప్రభుత్వాలు ఇంద్రవెల్లిలో ఏప్రిల్ 20 రాగానే ఆంక్షలు విధిస్తాయి. ఎక్కడ మళ్ళీ ఇంద్రవెల్లి పునర్నిర్మాణం అవుతుందో అని, ప్రజలు మళ్ళీ తిరుగబడతారో అని నిరతరం వాళ్లకున్న భయం. కొన్నేళ్ళ తరువాత దోపిడి దొంగలు మార్చి19, 1986లో ఇంద్రవెల్లి స్థూపాన్ని కూల్చారు. ఆదివాసులు, పౌరసంఘాలు, ప్రజల ఒత్తిడి వల్ల ప్రభుత్వం ఐ.టి.డి.ఎ నిధులతో 1987 లో స్థూపాన్ని నిర్మంచింది.

ఇంద్రవెల్లి స్వరాష్ట్రంలోనూ మాయని గాయమై మిగిలే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఆంక్షలను కాలరాసే స్వేచ్చా వాయువులు గిరిజన గూడాలపై వీస్తాయని కోరికలుండె. తెలంగాణ రాష్ట్రం ఆదివాసులకు మరింత అన్యాయమే చేసింది. ఏ ప్రభుత్వాలైనా దోపిడి సాధనాలను కోనసాగించేవే, హత్యలను పురిగోల్పేవే కానీ ప్రజల స్వేచ్చను కాపాడగలిగేవి కాదు కదా. ఇప్పడు తెలంగాణ పాలకులు ఇంద్రవెల్లిలో ఏప్రిల్20న నిషేధాజ్ఞలు విధించడమనే ఆనవాయితీ కొనసాగిస్తూ ఉన్నది. ఇంద్రవెల్లి ఒక తడారని జ్ఞాపకం. ఇంద్రవెల్లి రోడ్ టు రేవల్యూషన్ కీ ఒక మార్గం. ముపై తొమ్మిదేళ్ళుగా జరుగుతున్న అన్యాయాలు, పాలక ప్రభుత్వాల దమనకాండకు ఇంద్రవెల్లి ఒక నిదర్శనం. అమరులను స్మరించుకోవడానికి ప్రభుత్వాలు ఆజ్ఞలు విధిస్తున్నాయంటే వాళ్ళ క్రూరత్వమే కాదు, భయం కూడా ఎంతగా ఉన్నదో ఇట్టే అర్ధమైతున్నది. ఇంద్రవెల్లి ఒక నెత్తుటి గాయమే కాదు. సిరిసిల్లా- జగిత్యాల జైత్రయాత్ర అయినట్టు ఇంద్రవెల్లి నెత్తురు జంగల్ మహల్... దండకారణ్యం దాకా వేసిన విముక్తి దారి అయింది. పోరాటాలే అంతిమ శరణ్యమంటు చాటిన ఇంద్రవెల్లి అమరులకు సలాములు.

(ముపైతోమ్మిదేళ్ళ ఇంద్రవెల్లి అమరత్వం సందర్భంగా)


No. of visitors : 913
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •