అడవి - నది

| సాహిత్యం | క‌విత్వం

అడవి - నది

- నాగేశ్వర్ | 22.04.2020 07:54:02am

అడవి ఆకాశం నుండి
నక్షత్రాలు
నదిలో జారిపడ్డాయి

నది ఇంద్రావతి
అడవి గడ్చిరోలి

పచ్చని చెట్ల మధ్య
చుక్కల సమూహం
వెన్నెల
కనురెప్పలు తెరుస్తోన్నవేళ

ఉరుముకు ముందు
మెరుపు లేదు
పిడుక్కి ముందు
ఉరుమూ లేదు
రాజ్యం
సైలెంచర్ గ్రేనేడ్ లాంచర్
తూటాల వడగళ్ల
వానై కురిసింది
నదిలో
అడవి ఒడిలో
రాలిన నక్షత్రాల
నెత్తురు ధారలు తారలు

అమరులు
ఆకాశ దీపాలు

అలల అరచేతుల మీదుగా
బిడ్డల్ని
ఒడ్డుకు చేర్చిన ఇంద్రావతి గుండెల మీద నిద్రపుచ్చి
ఆకుల
చీరంచు కప్పిన గడ్చిరోలి
పెనవేసుకొని
తల్లి వలపోత
దు:ఖమయ్యాయి

చివరి చుక్కనూ
తెగ్గోస్తామని
శత్రువు భీకర ప్రతిజ్ఞ

లోకం ఆకాశం
చీకటి పూసుకున్న వేళ
యధావిధిగా
లక్షోప లక్షలుగా
చుక్కల సమూహాలు
పాలపుంతలు....
ఆకాశ గంగలు...






No. of visitors : 373
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


అతడూ అర్బన్ నక్సలైటే

నాగేశ్వర్ | 23.03.2019 06:05:50pm

అతడిప్పుడు భౌతికంగా మన కళ్లముందుంటే అతడూ అర్బన్ నక్సలైటే దేశ అంతర్గత భద్రతకు అత్యంత ప్రమాధకారే ...
...ఇంకా చదవండి

అతడేమన్నాడు

నాగేశ్వర్‌ | 28.08.2019 07:11:41pm

మనుషులు కనిపిస్తే అల్లుకపోయే మల్లెచెట్టు మాటల్లో పూచే మల్లె పూలు ఎప్పుడూ తన ఉనికిలోనే మోదుగ పూలై పూస్తాడు ఎల్లప్పుడూ చీమల బారై తిరుగాడుతాడు అతని కనుల మహా స...
...ఇంకా చదవండి

ఇల్లు

నాగేశ్వర్ | 22.04.2020 08:15:05am

మూటనిండా ముల్లెవుందని కారుకూతల నోరు జారారు రాజ్యం కోడై కూసింది ఆ తల్లి మూట ముడివిప్పి చూస్తే పిడికిళ్ళెత్తి జేజేలు పలుకుతూ జనమే జనం ...
...ఇంకా చదవండి

చెడగొట్టు వాన

నాగేశ్వర్ | 16.04.2019 09:25:58am

ఐదేండ్లకోసారి కురిసే వాన అప్పుడప్పుడు ముందస్తు అకాల వర్షమై కుమ్మరిస్తుంది మధ్యంతరం కుండపోత వానవుతుంది అన్నీ వడగండ్లవానలే...
...ఇంకా చదవండి

అర్హత

నాగేశ్వర్‌ | 01.04.2019 02:23:51pm

అతడు తన గొంతునూ వెంటబెట్టుకెళ్ళాడు గొంతు అతని నిరసన గళం...
...ఇంకా చదవండి

యురేనియమం

నాగేశ్వర్ | 03.08.2019 11:46:09pm

అడవికి ఆదివాసికి అతికిన బొడ్డుతాడు పుటుక్కున తెంపుదాం నోటికాడి పోడు బువ్వ బుక్కను కాకులై తన్నుకుపోదాం దూపబుడ్లు ఊటచెరువుల కడుపెండబెడదాం నల్లమల నిండ...
...ఇంకా చదవండి

కరోనా కర్ఫ్యూ

నాగేశ్వర్ | 02.04.2020 01:02:52am

నీకూ నాకూ మధ్య మాస్క్ ములాఖత్ గోడ కట్టుకోవాల్సిందే...
...ఇంకా చదవండి

"దేశభక్తి"

నాగేశ్వర్ | 02.08.2020 04:08:39pm

మనలో దేశభక్తి ఊటలు ధారలుగడుతుంటే వాడు ధరల అడుగులు ఒక్కోమెట్టు ఆకాశం మేడెక్కించే పనిలో ఉంటాడు మనం దేశభక్తి శిగాలొచ్చి ఊగుతుంటే పెట్టుబడి చుట్టాల నెత్తిమీది ...
...ఇంకా చదవండి

పూల పరిమళం వాళ్ళు

నాగేశ్వర్ | 02.06.2020 11:25:40pm

వాళ్ళు మా ఇంటి పెరట్లో ఎర్రమందారాలు మా చేను సెలకల్లో నవ్వే గోగుపూలు...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

  • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
  • Students and the Revolution
  • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    అరుణతార జులై - 2020
    వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
    గాలింపు, స్థూపాల కూల్చివేత
    కవి కాశీం కవిత్వ విశ్లేషణ
    అసమానత నుండి విప్లవం దాకా..
    ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
    తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
    కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
    వరవరరావును జైలులో చంపవద్దు
    మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
    "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
    అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •