రెండు రేకులు
నాలుగు కర్రలు
పాత బొంతల పైకప్పు
ఇదే అతని స్థిరచరాస్తి
రక్తమూ చెమట కలగలిపి
ఇల్లంతా అలికి
ముగ్గులేసింది ఆ తల్లి
ఇల్లంతా కడుపుతీపివాసన
ఇరవై ఏండ్లుగా
ఆ ఇంటి దిగుట్లో
కనుగుడ్లు దీపాలు
వెలుగుతూనే ఉండేది
ఆ ఇంటి గుమ్మానికి
చూపుల దండలుకట్టి
ఎదురుచూస్తుండేది ఆ తల్లి
ఎల్లప్పుడూ
పొద్దుకెదురు చూస్తుండేది
ఓ రోజు సంధ్యాసమయాన
విజేందర్
ఇంద్రావతి అలల మీద
సూర్యాస్తయమై ఇంటికొచ్చాడు
వస్తూ వస్తూ ఆకాశమంత
అమరత్వాన్ని
మూటగట్టుకొచ్చాడు
మూటనిండా
ముల్లెవుందని
కారుకూతల నోరు జారారు
రాజ్యం కోడై కూసింది
ఆ తల్లి
మూట ముడివిప్పి చూస్తే
పిడికిళ్ళెత్తి
జేజేలు పలుకుతూ
జనమే జనం
Type in English and Press Space to Convert in Telugu |
అతడూ అర్బన్ నక్సలైటేఅతడిప్పుడు
భౌతికంగా మన కళ్లముందుంటే
అతడూ అర్బన్ నక్సలైటే
దేశ అంతర్గత భద్రతకు
అత్యంత ప్రమాధకారే
... |
అతడేమన్నాడుమనుషులు కనిపిస్తే
అల్లుకపోయే మల్లెచెట్టు
మాటల్లో పూచే మల్లె పూలు
ఎప్పుడూ తన ఉనికిలోనే మోదుగ పూలై పూస్తాడు
ఎల్లప్పుడూ చీమల బారై తిరుగాడుతాడు
అతని కనుల మహా స... |
చెడగొట్టు వానఐదేండ్లకోసారి కురిసే వాన
అప్పుడప్పుడు ముందస్తు అకాల వర్షమై కుమ్మరిస్తుంది
మధ్యంతరం కుండపోత వానవుతుంది
అన్నీ వడగండ్లవానలే... |
అర్హత
అతడు
తన గొంతునూ వెంటబెట్టుకెళ్ళాడు
గొంతు అతని నిరసన గళం... |
యురేనియమంఅడవికి
ఆదివాసికి
అతికిన బొడ్డుతాడు పుటుక్కున తెంపుదాం
నోటికాడి
పోడు బువ్వ బుక్కను
కాకులై తన్నుకుపోదాం
దూపబుడ్లు
ఊటచెరువుల
కడుపెండబెడదాం
నల్లమల నిండ... |
"దేశభక్తి"మనలో దేశభక్తి ఊటలు ధారలుగడుతుంటే
వాడు ధరల అడుగులు
ఒక్కోమెట్టు ఆకాశం మేడెక్కించే పనిలో ఉంటాడు
మనం దేశభక్తి శిగాలొచ్చి ఊగుతుంటే
పెట్టుబడి చుట్టాల నెత్తిమీది
... |
కరోనా కర్ఫ్యూనీకూ నాకూ మధ్య
మాస్క్ ములాఖత్ గోడ కట్టుకోవాల్సిందే... |
అడవి - నదిఅమరులు
ఆకాశ దీపాలు
అలల అరచేతుల మీదుగా
బిడ్డల్ని
ఒడ్డుకు చేర్చిన ఇంద్రావతి గుండెల మీద నిద్రపుచ్చి
ఆకుల
చీరంచు కప్పిన గడ్చిరోలి... |
పూల పరిమళం వాళ్ళువాళ్ళు
మా ఇంటి పెరట్లో ఎర్రమందారాలు
మా చేను సెలకల్లో నవ్వే గోగుపూలు... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |