రంగుల రాట్నం హఠాత్తుగా ఆగితే..

| సాహిత్యం | వ్యాసాలు

రంగుల రాట్నం హఠాత్తుగా ఆగితే..

- అరసవిల్లి కృష్ణ | 01.05.2020 12:27:46am

నెల రోజులుగా ప్రపంచం ఇంటి గదులకు పరిమితమైనప్పుడు మునుపటి జీవన శైలి గురించి వలపోతలుంటాయి. భారతదేశం వ్యవ‌సాయ కార్మిక రంగాలపై ఆధార పడిన దేశం. చేతులు కదిలితే గాని బువ్వ నోటికి రాని పరిస్థితి. దేశం ఏదో ఒక పనిలో వుంటుంది. శ్రమ ద్వారా వచ్చే వేతనం కుటుంబ పోషణకారిగా వుంటుంది. శ్రమలో ఆనందాన్ని వెతుక్కుంటారు. భారత దేశం సంపన్నుల కార్మికుల వలస కూలీల అనాథల సమాహారం. ఒక దేశాన్ని నిర్వచించాలంటే దాని స్వీయ అనుభవాన్ని అంచనా వేయాలి. నయా సంపన్నవర్గం, మధ్య తరగతి, దినసరి వేతనం ద్వారా జీవితాన్ని నెట్టుకొస్తున్న కూలీలు, గ్రామాలలో కనీస జీవితం అమరక నగరాలకు వలస పోతున్న వలస కూలీలు- భారతదేశమనే రంగుల రాట్నం ఎల్లవేళలా తిరిగితే అంతా సజావుగానే వుంటుంది. రంగుల రాట్నం ఒక్కసారి ఆగితే అందులో కూర్చున్న వారు ఉక్కిరి బిక్కిరి అవుతారు. ఆందోళన పడతారు. కలత చెందుతారు.

మార్చి 20న భారత ప్రధాని నరేంద్ర మోది మార్చి 22 ఆదివారం జనతా కర్ప్యూ అని ప్రకటించాడు. రేపటి తమ ఉపాధి ఏమిటి అనే ఆలోచించుకునే ప్రజలు సోమవారం తమ పనులకు ఆటంకం కలగదని భావించారు. ఒక రోజు ఇంటిలో వుంటే పోయేదేముంది అనుకున్నారు. దేశ ప్రజలను లాక్ డౌన్ చేయడానికి ప్రధాని హోదాలో తన గందరగోళాన్ని బీద ప్రజలపై ప్రయోగించాడు. దశలు దశలుగా మార్చి22 నుండీ మే 3 వరకు ప్రజలను గృహ నిర్భంధం లోకీ నెట్టి వేసాడు. భారతదేశపు నడక హఠాత్తుగా ఆగింది. ప్రజలు ఇళ్ళకి పరిమితమై ఈ దేశ పాలక వర్గాల కార్యాచరణ వైపు ఆశగా చూసే స్థితి ఏర్పడింది.

కరోనా పరిచయం అక్కర లేని పేరు. ఆ పేరు వింటే చలనం ఆగిన ప్రపంచం జ్ఞాపకమవుతుంది. నవంబర్ మధ్య భాగంలో చైనాలో ఊపిరి తీసుకున్న ఈ వైరస్ ఇవాళ ప్రపంచాన్ని వణికిస్తుంది. దాదాపు అయిదు నెలలుగా ప్రపంచంపై ఆధిపత్యాన్ని చాటుకుంది. కరోనా వైరస్ ను ఎదుర్కొనే సైన్సు ప్రపంచం దగ్గర లేదు. కరోనా అన్ని రకాల ఆధిపత్యాలను ధ్వంసం చేసింది. ఒక్కమాటలో చెప్పాలంటే పాలక వర్గాల చేతకానితనాన్ని బహిర్గతం చేసింది. బయో సవాల్ ఎదురయినప్పడు ప్రజల్ని కాపాడే పరిష్కారాలు తమ దగ్గర లేవనే విషయం తేటతెల్లమయింది. మనం నివసిస్తున్నది అనుకున్నంత భధ్రలోక్ కాదని ఇంద్రధనుస్సులా కనబడుతున్న జీవన శైలిలో రంగులు వెలిసిపోవచ్చని నిరుపించింది.

భారతదేశానికి వస్తే దేశప్రధాని, అతని అధికార యంత్రాంగపు నిర్లక్ష్యం బయటపడింది. ధనికులు పేదలు అనే విభజనగీత కాదుగాని స్వేఛ్ఛగా విదేశాలకు వెళ్ళి రాగలిగే సంపన్నులు కరోనా వైరస్ ను పేదల వరకు తెచ్చారని లేదా ప్రజలు జీవించే హక్కును హరించి వేసారనే అభిప్రాయం బలంగా చోటు చేసుకుంది. దాదాపు రెండు నెలల పాటు ఇంటికి పరిమితమై జరుగుబాటు లేకుండా రేపటి తమ ఆర్థిక స్థితి ఏమిటి అనే ఆందోళన వారిని ఆవరించింది. రైతులు‌, రైతు కూలీలు, కార్మికులు, వలస కూలీలు వీరికి బతుకు భరోసా లేదా ఆసరా ఇవ్వాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరో అన్నట్లు వారి ఏడుపుకే వారిని వదిలేసారు.

నిజానికి ప్రజలు దాతృత్వాన్ని కోరుకోరు. తమ శ్రమ ద్వారా తమ కుటుంబాలు గడవడానికి దారులు వేసుకుంటారు. తమ ప్రమేయం లేకుండా ఆదారి ఆగితే, కరోనా బూచిని చూపి పాలక వర్గాలు ఆపితే వారి జీవన స్ధితి ఏమిటి అనే అవగాహన ఈ దేశ పాలకులకు లేదు. వడ్రంగి, తాపీ మేస్త్రి, ముఠా కూలి, క్షురకులు, తోపుడు బండ్ల వాళ్ళు కడుపుకింత ముద్ద కోసం సహస్ర వృత్తులు చేసుకునే వారు, చాలీచాలని సంపాదనతో బతుకు బండిని నెడుతున్న వాళ్ళు తమకు తెలియకుండానే కనీస ఆదాయాన్ని కోల్పాయారు. ఇంటి అద్దెలు, పొదుపు సంఘాల బకాయిలు, అప్పులకు వడ్డీలు... కేంద్ర రాష్ట్ర పాలకులు తమ చూపును ఇటు వైపు సారించడానికి సిధ్ధంగా లేవు. పాలకుడు చెప్పగానే ప్రజలు చప్పట్లు కొట్టారు. దీపాలు వెలిగించారు. ఏప్రిల్ 5 ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు దీపావళి పండగను అమాయకంగా జరుపుకున్నారు. మోదీ చెప్పాడని కాదు. దీపాలు వెలిగిస్తే వైరస్ అంతమవుతుందని వారనుకున్నారు. అదే వారికి తెలిసిన సత్యం. తమ కుటుంబం తమ పిల్లలు అంతిమంగ దేశం బావుండాలనే వారి ఆకాంక్షలో శాస్త్రీయత లేకపోవొచ్చు. దీపం వెలిగించడమనేది ప్రతీకగా తీసుకున్నారు.

దేశ ఆర్థికస్థితి కాసేపు పక్కన పెడదాం. పాలకుని నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించుకుంటున్నది ఈ దేశంలోని పేదలే. దేశంలోని చాలా ప్రాంతాలలో చిక్కుకుపోయిన వలసకూలీలు తమ ప్రాంతాలకు వెళ్ళే మరోమార్గం లేక లాక్ డౌన్ ఎప్పడు తొలగిస్తారో తెలియక మండే ఎండలో నిలబడి వున్నారు.

అధికార మార్పిడి అనంతర భారతదేశం ఈనాటికీ వలస కూలీల దేశంగానే వుంది. లక్షలాది మంది వ్యవసాయం నుండి వ్యవసాయ అనుబంధ చేతివృత్తుల నుండి దూరం కాబడిన వారు సంచార వలసకూలీలుగా విస్తాపనకు గురి అవుతున్నారు. కరోనా సందర్భంలో వారి గురించి చర్చనడుస్తుంది. దాతృత్వం, ఓదార్పు మాటలు మాట్లాడి మన లోపలి అసంతృప్తులను చల్లార్చడం కాదు. కరుణ అంతిమ పరిష్కారం కాదు.

కరోనా అనంతర భారతదేశంలో అనేక మార్పులు జరుగుతాయని ఆర్థిక సామాజిక అసమానతలను దాటి సమానత వైపు దేశం అడుగులు వేస్తుందనే అలోచనలు సాగుతున్నాయి. కానీ నిజాముద్దీన్ ఘటన ఈ దేశ ముస్లింలను ఎంత అభధ్రతలోకి నెట్టి వేసిందో మన అనుభవంలోకి వచ్చింది. మన చుట్టూ అనేక భ్రమలు అలుముకొని వున్నాయి. మన ఆకాంక్షలకు న్యాయబద్ధత ఉంది కాని ‌‌‌‌‌ఆర్థిక సామాజిక దొంతర్లు బలంగానే వున్నాయి. మనుషులు తమ భూమి, తమ సంపద అనే ఆవరణను దాటి బయటకు రాలేరు. ఎవరి క్లేశానికి, బతుకు భయానికి వారిని వదిలేసి ఈ దేశ పాలక వర్గాలు చోద్యం చూస్తున్నాయి. బడా కార్పొరేట్లు మాత్రం బనాయించి మరి ఆర్థిక ప్యాకేజి కావాలని అడుగుతున్నాయి. సామాన్యుడు మాత్రం తన స్వీయ గౌరవాన్ని వదులుకొని యాచించలేడు.

కరోనా కాలంలోనే ఒక తల్లి తన ముగ్గురి పిల్లలను గంగా నదిలోకి తోసి తాను ఆత్మహత్య చేసుకుంది. చావు పరిష్కారమనుకుంది. లోకం పోకడ ఎరుగని పసిపాపలు జీవించడం కంటే మరణించడం మేలనుకుంది. తల్లిగా ఆమె నిర్ణయాన్ని తప్పు పట్టవచ్చు గాని చిన్నారుల ఆశలను చిదిమేసిన ఆ తల్లి అన్ని విశ్వాసాలను కోల్పోయి వుంటుంది. బహుశా మానవీయ సమాజం, రాజ్య యంత్రం అపజయం చెంది వుండకపోతే ఇలాంటి అమానవీయ ఘటనలకు అవకాశముండదు.

No. of visitors : 317
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


రెక్కల గూడు

అరసవిల్లికృష్ణ | 19.05.2018 08:44:01am

ఏమయినావు పావురాయి నీడల్ని- జాడల్ని మరిచిన మనుషులు కి తూర్పు దిక్కున ఎర్రని కాగడా వుందని నీ కళ్ళతో చెప్పలేక పోయావా- పొలికేక వినబడుతుందని.....
...ఇంకా చదవండి

ఒకరు వెనుక ఒకరు

అరసవిల్లి కృష్ణ | 18.02.2020 03:12:45pm

నాదగ్గర నాదేశ మూలవాసుల దగ్గర ఏ ధృవీకరణ పత్రం లేదు...
...ఇంకా చదవండి

మనకు తెలియని మేరువు

అరసవిల్లి కృష్ణ | 02.06.2020 10:36:37pm

మేరువు నవల మనకు తెలియని స్త్రీల చరిత్రకు సంబంధించినది. అనేక ముద్రల మధ్య విలువలను స్త్రీలు మాత్రమే కాపాడాలి....
...ఇంకా చదవండి

అసమానత నుండి విప్లవం దాకా..

అరసవిల్లి కృష్ణ | 16.07.2020 11:41:15pm

కవిగా కాశీంను అంచనా వేయడానికి వాచకాన్ని చదవడం, కవిని దూరంగా వుండి గమనించడం మాత్రమే సరిపోదు. కవిని దగ్గరగా చూడాలి. కవి హృదయంలోకి దారి చేసుకొని వెళ్ళగలగాలి....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •