డిస్టర్బ్ చేసే సినిమా... ʹహమీద్ʹ

| సాహిత్యం | స‌మీక్ష‌లు

డిస్టర్బ్ చేసే సినిమా... ʹహమీద్ʹ

- ఉదయమిత్ర | 01.05.2020 12:45:55am

(a film of fractured souls)

"గోడకు వేలాడే పటాలు రెండు రకాలు..ఒకటి అందమైనది..రెండోది, ఊగించి లాలించి శాసించి చీల్చి చెండాడేది" -చలం

"హమీద్" సినిమా రెండో రకానిది. ఎంత వొద్దనుకున్నా కన్నీళ్ళు పెగులుకొచ్చే సినిమా ఇది. ఒక మానవ మహావిషాదాన్ని ఓపిల్లవాడి దృష్టికోణం నుంచి తెరమీద అద్భుతంగా ఆవిష్కరించాడు దర్శకుడు ఐజాజ్ ఖాన్. ప్రపంచ సినిమాల సరసన చేరిపోయే సినిమా ఇది.

తెరమీద తమ అద్భుత నటనతో పండించిన తల్హ హర్షద్ రాహి(హమీద్) కు, అతని తల్లిగా నటించిన రషికా దుగ్గల్ (ఇస్రత్)కు జాతీయ అవార్డులొచ్చాయి

శ్రీనగర్ లో తనమిత్రుడు చెప్పిన ఓ ఆసక్తికరమైన సంఘటనకు ముగ్ధుడై పోయి అతను రాసిన నాటకం. Phone no.786 ఆధారంతో తీసిన సినిమా ఇది

... ... ...

ఒకవిధంగా ఈసినిమా కథ ఠాగోర్ రాసిన "కాబూలీవాలా" ను పోలి ఉంటది. ఎక్కడో ఆప్ఘనిస్తాన్ నుండి వొచ్చిన కాబూలీవాలాకు బెంగాలీ అమ్మాయికి ఏర్పడ్డ అనుబంధాన్ని సున్నితంగా చిత్రీకరించాడు ఠాగోర్. బంధాలు. అనుబంధాలు విశ్వజనీనమైనవని ఆయన అభిప్రాయం

ఈ సినిమాలో కూడ కరడుగట్టిన ఓ సైనికుడికి, ఓ అమాయకపు కాశ్మీరీ పిల్లవాడికి (ఒక హిందువుకు, ఒక ముస్లింకు) ఏర్పడిన అనుబంధాన్ని, హృద్యంగా చూపిస్తూనె దానివెనుక అల్లుకున్న కాశ్మీరీల విషాద చరిత్రను చూయిస్తాడు రచయిత. అయినా కాబూలీవాలాకన్న హమీద్ కథ వేయిరెట్లు గొప్పది. ఈసినిమాలో వ్యవస్థీకృతమైన రాజ్యపు క్రూరత్వాన్ని, చిన్నాభిన్నమైపోతోన్న ప్రజాజీవితాన్ని ఎంతటి విపత్కర పరిస్థితినైనా తట్టుకోగలిగే కాశ్మీరీల గుండెనిబ్బరాన్ని మనం చూడగలుగుతాము

... ... ...

కథ మొత్తం హమీద్(8) అనే బాలుని చుట్టు తిరుగుతుంది. హమీద్ అంటే దైవప్రార్థన అంట. ఆ పిల్లవాడు చురుగ్గా ఉంటాడు. ధైర్యంగా ఉంటాడు. అంతకన్నా అమాయకంగా ప్రశ్నలు కూడా వేస్తుంటాడు.

తండ్రి రహ్మత్ మంచి కవి, గాయకుడు. బతుకుదెరువుకోసం వడ్రంగి పనిచేస్తుంటాడు. తండ్రికీ కొడుకుకీ మధ్యన గొప్ప ప్రేమ సంబంధాలుంటాయి.

తండ్రి కొడుకును సైకిల్ మీద కూచోబెట్టుకుని పాటలు పాడుతూ తీసుకపోతుంటే చూడముచ్చటగా ఉంటది.

ఓ రోజు రాత్రి పనినుండి రహ్మత్ ఇంటికి వొస్తుంటే సైనికులు అతడిని అరెస్టు చేసి పట్టుకుపోతారు. అతడిక రాడు.

తమ తమ పిల్లలు భర్తలు "మిస్సింగ్" కావడం కాశ్మీరీ స్త్రీలకిది మామూలే. రేషన్ షాపులముందు సరుకులకోసం నిలబడ్డట్లు కాశ్మీరీ స్త్రీలు తమవాళ్ళ ఆచూకి కోసం ఫోటోలు డాక్యుమెంట్లు పట్టుకుని ఆర్మీ ఆఫీసుముందు నిలబడ్తారు. జవాబురాని ప్రశ్న కోసం విద్యార్థి పడే మౌనవేదనలా ఉంటుంది వాల్ల పరిస్థితి. ఓ సందర్భంలో ఇస్రత్ కూ, మరోతల్లికీ మధ్యన ఓ ఆసక్తికరమైన సంభాషణ జరుగుతుంది. తనముందు నిలబడ్డ స్త్రీకి లోపలనుండి పిలుపొస్తే హడావిడిగా ఓ ఫైలు పట్టుకొని బయలుదేరబోతుంది. అప్పుడు నుస్రత్ "మీరు పొరపాటున నాఫైలు తీసుకుపోతున్నారు... మీఫైలు నాదగ్గరుంది" అంటుంది. అప్పుడామె ఫిలసాఫికల్ గా నవ్వి, "ఎవరిఫైలు ఐతే ఏందమ్మా... అన్నీ ఒకటేగా" అంటుంది.

ఇంట్లో తండ్రి లేకపోవడంతో హమీద్ చదువు మానేసి వడ్రంగిపని (బోట్లు తయారుచేయడం)కి కుదురుతాడు.
... ... ...

ఓ రోజు తండ్రి ఆచూకి గురించి హమీద్ తల్లిని అడుగుతాడు. దానికామె,"మీ నాయన దేవుని దగ్గరకు వెళ్ళిపోయాడు" అని ముభావంగా చెబుతుంది. ఇక అప్పట్నుంచి హమీద్ సమయం దొరికినపుడల్లా, "అమ్మా..నాయన దేవుని దగ్గర కెందుకెళ్ళాడు, ఇంక తిరిగిరాడా" అని ప్రశ్నలువేసి విసిగిస్తుంటాడు.

ఓ సందర్భంలో,

ʹఅమ్మా...786 అంటే అర్థమేమిటిʹ అంటూ అమాయకంగా అడుగుతాడు హమీద్.

ʹఅది దేవుని నెంబరు...ʹ అని క్లుప్తంగా చెప్పేసి పనిలో పడిపోతుందామె

ఆ సంఘటన కథను మలుపుదిప్పుతుంది
... ... ...
తనతండ్రి దేవుడి దగ్గర ఉన్నాడు గాబట్టి, ఆ నెంబరు(786) ద్వారా దేవుడిని కాంటాక్ట్ చేసి, తన తండ్రిని ఇంటికి పంపమని దేవుడినడగాలని నిశ్చయించుకుంటాడు హమీద్. కాని, ఎవరికైనా ఫోన్ చేయాలంటే పది నెంబర్లుండాలిగదా..

ఓ రోజు ఓ క్యాలెండర్ మీద... 9-786-786-786 నెంబరుజూసి నోట్ చేసుకుంటాడు. అది దేవుని నెంబరే అనుకొని... ఆ నెంబరుకు డయల్ చేస్తాడు... విచిత్రంగా అది "అభయ్" అనే CRPF జవానుకు తగులుతుంది. అతడు కాశ్మీరిలను ద్వేషించే కరడుగట్టిన జవాను. పైగా కాశ్మీరీ పండిట్ల జాతికి చెందినవాడు.

ఇక... వాళ్ళిద్దరి మధ్య సంభాషణ దఫదఫాలుగ కొనసాగుతుంది

ʹఅస్సలమాలేకుమ్...మాట్లాడేది దేవుడేనా?ʹ కుతూహలంగా అడుగుతాడు హమీద్… మాట్లాడేటప్పుడు మాటిమాటికీ ఆకాశంవైపు చూస్తుంటాడు (దేవుడు ఆకాశంలోనేగదా ఉండేదీ!)

మొదట అభయ్ ఆశ్చర్యపడి నిభాయించుకుని, "అవతల మాట్లాడేది ఎవరు?" అని ప్రశ్నిస్తాడు.

"నేను హమీద్ ను మాట్లాడుతున్నా..."

"చెప్పు... ఏంగావాలె?ʹ

"మా నాయన మీ దగ్గరున్నడు గద. ఆయనను ఎట్లాగైన మా ఇంటికి పంపాలె... మా అమ్మ ఎప్పుడూ ముభావంగ ఉంటది... ఎప్పుడూ నన్ను కోపం జేస్తుంటది. మానాయన ఉంటే నాకు మంచిగుంటది."
... ... ...
"దేవుడా...నీకు సర్ది అయినట్టుంది.. మాటలు సరీగ రావడం లేదు..కొంచెం..శొంఠి మిరియాల కషాయం వేసుకో... మా నాయన మాకిదే చేసేవాడు"
... ... ...
"నీకు తెలుసా దేవుడా... మానాయన మంచి కవిత్వం రాస్తాడు... నీకు కవిత్వం రాయడం వొచ్చా?"

"కవిత్వం రాయడం రాదుగాని, కొంచెం కొంచెం పాడడం వొచ్చు" అని సైనికుల మార్చ్ సాంగ్ వినిపిస్తాడు అభయ్. ఇద్దరు కల్సి పాడుకుంటారు
... ... ...
"దేవుడా.. నీవు గనక మానాయనను పంపకపోతే నేను ఆ పర్వతాలవెనుకకు వెళ్ళిపోతా... ఆతర్వాత మీ ఇష్టం. ఒకవేళ పంపితే నేను బుద్ధిగా చదువుకొని, మా అమ్మానాయనల చూసుకుంటా"

"సరే..సరే... నువ్వు పర్వతాలు దాటిపోవొద్దు. నేను నా ప్రయత్నం చేస్తా"

...ఇట్లా సాగుతుంది ఇద్దరిమధ్య సంభాషణ.
... ... ...
క్రమంగా హమీద్ కు అభయ్ కూ మధ్యన ఓ అనుబంధం పచ్చని తీగలా అల్లుకుపోతుంది... హమీద్ నిష్కల్మషమైన మాటలు వింటుంటే,అభయ్ కు తన బిడ్డ గుర్తుకొచ్చి, కళ్ళు చెమరుస్తాయి. కరడుగట్టిన మనిషి కాస్తా ప్రేమించే మనిషిగ మారిపోతాడు.

హమీద్ నుండి అతని తండ్రి వివరాలు తెలుసుకున్న అభయ్ ఆర్మీ క్యాంప్ ఆఫీసుల ఎంక్వయిరీ చేస్తాడు. సూటిపోటి మాటలు తప్ప ఫలితముండదు. చివరకు రహ్మత్ ను చంపేశారని తెల్సిపోతుంది.

అదే మూడ్ లో ఉండగా హమీద్ నుండి ఫోనొస్తుంది.

"మీనాయన చనిపోయాడు. ఇక అతడిని మర్చిపొండి"అంటూ జవాబిస్తాడు అభయ్.

"లేదులేదు, మానాయన చనిపోలేదు. మీరసలు పట్టంచుకోలేదు. పట్టించుకోలేదు" అంటూ ఆవేశంగా అరుస్తాడు.

"మేం పట్టించుకొని గూడ చేసేదేంలేదు..." అంటాడు అభయ్ నిరాశగా

"మరి మీరుండి ఏంలాభం? ఏంలాభం? ఏం లాభం?" అంటూ కోపంతో సెల్ ను గోడకేసి కొడ్తాడు..

... ... ...
ఇక అక్కడ్నుంచి హమీద్ పట్టలేని దుఃఖంతో పిచ్చివాడిలా చెట్లవెంబడి గట్లవెంబడి తిరిగితిరిగి ఓ చోట కుప్పగూలిపోతాడు.

ʹఓ దేవుడా, మానాయననేం జేశావు? మానాయనను మా ఇంటికి పంపు... మాఇంటికి పంపు..." అంటూ ఆకాశంచూస్తూ గుండెలు పగిలేలా రోదిస్తాడు హమీద్.

అప్పడే అతనిముందుగా ఓ శవపేటికను తీసుకుపోతారు. ఆ శవపేటీకను ఆమనుషులను మార్చి మార్చి చూస్తాడు హమీద్.
... ... ...
చివరగా హమీద్ శ్మశాన వాటికకు పోతాడు. అక్కడ చేతులతో ఓగుంతదీసి, తనతండ్రి డాక్యుమెంట్లు, ఫోటో, పగిలిన సెల్ ముక్కలు పెట్టేసి గుంత పూడ్చేసి వెళ్ళీపోతాడు. అట్లా తండ్రికోసం అన్వేషణ ముగిసిపోతుంది.
... ... ...
అవతల తల్లి సుదీర్ఘ మౌనంవీడి, అందరు అభాగ్య స్త్రీలతో కలిసి, ముఖ్యమంత్రి వొస్తున్నాడని తెలిసి ధర్నా చేయడానికి వెళుతుంది. అక్కడున్న అనేకుల "మిస్సింగ్" ఫోటోలు చూసి భోరున ఏడ్చేస్తుంది. వ్యక్తిగత దుఃఖం కాస్తా సామూహిక దుఃఖంగా మారుతుంది. పిల్ల కాలువ కాస్త నదిగామారుతుంది.

మరోవైపు యువకులు "మాకుస్వేచ్ఛ కావాలి" అంటూ తుపాకులు ధరించిన సైనికులకెదురునిల్చి నినాదాలిస్తారు. సహనం కోల్పోయిన తనమిత్రుడు వాల్లమీద కాల్పులు జరుపబోతే అభయ్ అతడిని వారించి వెనుకకు తీసుకుపోతాడు. చిత్రమేమంటే మొదట్లో అభయ్ కాశ్మీరిల మీద కాల్పులు జరపబోతే ఈమిత్రుడే అభయ్ ని వారిస్తాడు. హమీద్ తో ఏర్పడిన అనుబంధం వల్ల అభయ్ లో కాశ్మీరీల పట్ల దృక్పథం మారిందని ఈసంఘటన తర్వాత మనక అర్థమౌతుంది.

బరువెత్తిన జ్ఞాపకాలతో అభయ్ ఇంటికిబయలుదేరుతాడు
... ... ...

మళ్ళీ కొత్త జీవితాలు ప్రారంభించాలనుకుంటారు తల్లీకొడుకులు. కొడుకు వడ్రంగి పనిలో కుదుర్తాడు. కొత్తగా తయారుచేసిన బోటును హమీద్ నడుపుతూ ఉంటే, నిర్మలాకాశంవైపూ, హమీద్ వైపూ మార్చి మార్చి చూస్తూ, ఎన్నడు నవ్వని నుస్రత్ ఫక్కున నవ్వేస్తుంది.

బోటుముందుకుసాగుతుంటే, వెనుక కాశ్మీరీ సంగీతం వినబడుతుంటది. అప్రయత్నంగా కళ్ళు చెమరుస్తాయి.

ఇంటికి వెళ్ళాక, ప్రేమను చంపుకోలేని అభయ్, హమీద్ కు ఫోన్ జేస్తాడు. నిశ్శబ్దమే సమాధానం

గొప్పముగింపు
****************

No. of visitors : 318
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  వాళ్ల స్వేచ్ఛ కోసం పోరాడదాం
  నక్సల్బరీని ఎలా అర్థం చేసుకోవాలి?
  భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు
  నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  లాక్ డౌన్ లో అబద్ధాలు - ఎన్ కౌంటర్లు
  కా. కాశీం విడుదల కోసం కృషి చేసిన మిత్రులందరికీ విప్లవాభివందనాలు - కరోనా విపత్తులో రాజకీయ ఖైదీలను, ఇతర ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి
  చీమకుర్తి వలస కార్మికుల పోరాటం
  వివి ʹమన కవిʹ అని నిరూపించిన సముద్రస్వరం
  కడప జిల్లాలో వలస కూలీల దుఃఖనది
  కాపిటల్ లో కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు
  సర్వాంతర్యామి!
  నడవాలెనే తల్లి- నడవాలెనే

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •