ధ్వనిస్తోన్న ఊపిరులూ, అడుగుల సవ్వడులూ

| సంభాషణ

ధ్వనిస్తోన్న ఊపిరులూ, అడుగుల సవ్వడులూ

- హావర్డ్ ఫాస్ట్ | 01.05.2020 01:32:14am

ఈ మేడే అమరుల కథ హావర్డ్ ఫాస్ట్ రాసిన ప్రఖ్యాత నవల ʹది అమెరికన్ʹలోని ఒక భాగం. కార్మికోద్యమ సానుభూతిపరుడైన పీటర్ ఆర్ట్ గేల్డ్ అనే జడ్జి సాక్షిగా మేడే అమరుల అంతిమ యాత్ర దృశ్యమిది.

- సంపాదకవర్గం.

వాళ్లకు శుక్రవారం ఉరిశిక్ష విధించబడింది. మరుసటి రోజు వార్తా పత్రికల్లో ఉరికి సంబంధించిన విస్తృతమైన వివరాలు, కుప్పల కొద్దీ సంపాదకీయాలు ప్రచురించబడ్డాయి - చనిపోయిన వ్యక్తుల పైనా, చట్టాలూ-వ్యవస్థ పైనా, ప్రజాస్వామ్యం పైనా, రాజ్యాంగమూ దాని అనేకానేక సవరణల పైనా - వీటిలో కొన్నింటిని ʹహక్కుల బిల్లులుʹ అని పిలుస్తారు - విప్లవం, ప్రజాస్వామ్య స్థాపకుల గురించీ, గృహయుద్ధం గురించీ. వీటితో పాటే అంత్యక్రియల సూచనలు కూడా ప్రచురించబడ్డాయి. నగర అధికారులు అయిదుగురి మృతుల - తన గదిలో చనిపోయిన లింగ్ తో పాటు పార్సన్స్, స్పాయిస్, ఫిషర్, ఏంజెల్ల- దేహాలను తీసుకోవడానికి వాళ్ల బంధు మిత్రులకు అనుమతినిచ్చారు. కావాలనుకుంటే బహిరంగ అంత్యక్రియలు జరపడానికి కూడా ఈ బంధుమిత్రులకు అనుమతి ఇవ్వబడింది. వాయిల్డ్ హాయిమ్ శ్మశాన వాటికకు పోవడానికి శోకయాత్ర ఏయే రోడ్లపై నుండి వెళ్లవచ్చునో మేయర్ రోశ్ ప్రకటన జారీ చేశాడు. ఇదంతా పన్నెండు నుండి రెండు గంటల మధ్యలో ముగియాల్సి వుంటుంది. కేవలం విషాద సంగీతం మోగించవచ్చును. ఆయుధాలు వెంట తీసుకుపోకూడదు. జెండాలు, బ్యానర్లు పట్టుకొని నడవకూడదు. ʹమృతులు సమాజానికి శత్రువులుగా ప్రకటించినబడిన వాళ్లు, నేరస్తులు, హంతకులు, అయినప్పటికీ అంత్యక్రియల్లో పాల్గొనడానికి కొన్ని వందల మంది రావొచ్చునʹని వార్తా పత్రికలు రాశాయి. మతస్వాతంత్ర్యానికి గ్యారంటీనిచ్చే రాజ్యాంగంలోని అధికరణం ప్రకారం అంత్యక్రియలకు అనుమతినివ్వడం న్యాయసంగతమైనది.

ఆదివారం నాడు జడ్జి తాను వాకింగ్ కు వెళ్తున్నానని భార్యతో చెప్పాడు. అయితే అతను వాకింగ్ చేస్తూ ఎక్కడికి వెళ్తాడో ఎమ్మా అనుమానించింది కానీ ఏమీ మాట్లాడలేదు. ఆదివారపు ఉదయం ఒంటరిగా బయటికి వెళ్లాలనే అతని కోరిక విచిత్రంగా వుందని ఆమె అనలేదు. కానీ నిజానికి అది ఆశ్చర్యకరమైన విషయం కాదు. జులూస్ (ఊరేగింపు) మార్గం వైపు వెళ్తున్నప్పుడు తాను వేనవేల చికాగోవాసుల్లో ఒకడిని మాత్రమేనని జడ్డికి అనిపించింది. ఉదాసీనంగా, మురికిగా వున్న చికాగో రోడ్లకు రెండువైపులా దాదాపు సగం నగరం నిలబడి జులూస్ కోసం ఎదురుచూస్తున్నట్లుగా అనిపించింది అతనికి.

ఉదయం చల్లగా వుంది. ప్రజలు తనను గుర్తుపట్టడం అతనికి ఇష్టం లేదు. అందుకని అతను కోటు కాలరను పైకెత్తుకున్నాడు. టోపీని నుదిటి మీద కిందికి లాక్కున్నాడు. చేతులను జేబుల్లోకి దోపుకొని శరీర భారాన్ని కాసేపు కంపిస్తున్న ఒక కాలు పై కాసేపు మరొకకాలుపై మోపుతూ ఎదురుచూడసాగాడు.

జులూన్ కనిపించింది. అది అనుకున్నట్టుగా లేదు. అనుమతినిచ్చిన అధికారులు అనుకున్నట్టుగానయితే అసలే లేదు. ఏ సంగీతమూ లేదు, అడుగుల చిరు సవ్వడులూ, స్త్రీల మంద్రపు వెక్కిళ్లు తప్ప. శబ్దాలన్నీ, అరుపులన్నీ వీటిలోనే మునిగిపోయాయి. యావత్ నగరాన్ని ఒక విశాలమైన, శోకపూరితమైన నిశ్శబ్ద కఫన్ కప్పివేసినట్టుగా వుంది.

మొదట జెండా పట్టుకొని ఒక మనిషి వచ్చాడు. జులూస్లోని ఏకైక జెండా. ఒక పాత, రంగు వెలిసిన నక్షత్రాలూ, పట్టీల జెండా. అది గృహ యుద్ధం సమయంలో సగర్వంగా ఒక రెజిమెంట్ ముందర ఎగిరేది. దాన్ని పట్టుకొని నడుస్తున్నది గృహ యుద్ధంలో పోరాడిన ఒక సైనికుడు. నడీడులో వున్న అతని మొహం రాతితో మలిచినట్టుగా అన్పిస్తున్నది.

తర్వాత వచ్చాయి మృతదేహాలూ, శవపేటికలూ. తర్వాత పాత, కప్పులేని గుర్రపు బండ్లు వచ్చాయి. వాటిల్లో కుటుంబ సభ్యులున్నారు. వాటిల్లో ఒక దాంట్లో ఆల్ట్ గేల్డ్ కు లూసీ పార్సన్స్ (అమర కార్మిక నాయకుడు పార్సన్స్ జీవిత భాగస్వామి) కనిపించింది. ఆమె తన ఇద్దరి పిల్లలతో పాటు కూర్చొని వుంది. ఆమె చూపులు సూటిగా ఎదుటికి సారించి వున్నాయి.

తర్వాత వచ్చారు మృతుల విడదీయలేని స్నేహితులు, వాళ్ల కామ్రేడ్లు. వాళ్లు నాలుగు నాలుగు వరుసల్లో నడుస్తున్నారు. గృహ యుద్ధంలో పాల్గొన్న సైనికుడి మొహం వలెనే వాళ్ల మొహాలు కూడా ఉదాసీనంగా వున్నాయి.

తర్వాత మంచి దుస్తులు ధరించిన పురుషుల, స్త్రీల సమూహం వచ్చింది. వాళ్లలో చాలా మంది ఆల్ట్ గేల్డ్ కు తెలిసినవాళ్లే, పరిచయస్తులే. లాయర్, జడ్జి, డాక్టర్, టీచర్, చిన్న వ్యాపారులు, ఇంకా చాలామంది. వీళ్లంతా ఈ అయిదుగురిని కాపాడడానికి పోరాడినవాళ్లు.

తర్వాత వచ్చారు కార్మికులు. వీళ్ల సంఖ్యకు హద్దుల్లేవు. వాళ్ళు - ప్యాకింగ్ కంపెనీల నుండి, కట్టెల కార్ఖానాల నుండి, మైకార్మిక్, పుల్ మైన్ కార్ఖానాల నుండి వచ్చారు. వాళ్లు మిల్లుల నుండి, ఎరువుల కంపెనీల నుండి, రైల్వే యార్డుల నుండి, రేకు పీపాల గోదాముల నుండి వచ్చారు. వాళ్లు నిరుద్యోగులు నివసించే ధర్మశాలల నుండి, రోడ్ల నుండి, గోధుమ చేన్ల నుండి, షికాగో, ఇంకా డజన్ల కొద్ది ఇతర నగరాల వీధుల నుండి వచ్చారు. చాలా మంది తమకున్న వాటిలోకెల్లా మంచి బట్టలను ధరించారు. తమ ఏకైక నల్ల పెళ్లి సూట్‌ను ధరించారు. చాలా మందితో పాటు వాళ్ల భార్యలు కూడా వున్నారు. పిల్లలు కూడా వాళ్లతో పాటు నడుస్తున్నారు. కొంత మంది పిల్లలను ఎత్తుకొని వున్నారు. కానీ వాళ్లలో చాలా మందికి పని దుస్తులు తప్ప వేరే బట్టలు లేవు. వాళ్లు తమ మొత్తం దుస్తులు, నీలి జీన్స్, కమీజు ధరించి వున్నారు. పశువుల కాపర్లు కూడా వున్నారు. వాళ్లు అయిదు వందల మైళ్ల దూరం నుండి తమ గుర్రాలపై వచ్చారు. వాళ్లసలు వీళ్ల శిక్ష మాఫీ అవుతుందనుకొని వచ్చారు. చికాగో ప్రజల పట్ల వాళ్లకు విశ్వాసం వుండింది. కానీ ఆ శిక్ష మాఫీ కానీ పరిస్థితిలో అంత్యక్రియల్లో పాల్గొనడానికి ఆగిపోయారు. వాళ్లు తమ మొరటైన ఎత్తు మడుమల చెప్పులు తొడుక్కొని నడుస్తున్నారు. వాళ్లలో నగరానికి సమీపంలోని గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన ఎర్ర ముఖపు రైతులున్నారు. ఇంజన్ డ్రైవర్లున్నారు. విశాలమైన జలాశయాల నుండి వచ్చిన నావికులు వున్నారు.

వందలాది పోలీసులు, పింకర్టన్ మనుషులూ రోడ్డుకు రెండు దిక్కులా నిలబడి వున్నారు. కానీ వాళ్లు జులూస్ ను చూసి నిశ్శబ్దంగా నిలబడిపోయారు. వాళ్లు తుపాకులను పక్కన పెట్టేశారు. చూపులను నేలమీదికి వాల్చేసుకున్నారు.

ఎందుకంటే కార్మికులు శాంతంగా వున్నారు. వినిపిస్తున్నది కేవలం వాళ్ల ఊపిరులూ, నడుస్తున్న పాదాల సవ్వడులే. ఒక్క శబ్దం కూడా వినబడడం లేదు. ఎవరూ మాట్లాడడం లేదు. పురుషులూ, స్త్రీలూ, ఆఖరికి పిల్లలు కూడా మాట్లాడడం లేదు. రోడ్డు పక్కన నిలబడ్డ వాళ్లు కూడా నిశ్శబ్దంగా వున్నారు.

ఇప్పటికీ కార్మికులు వస్తూనే వున్నారు. ఆల్ట్ గేల్డ్ ఒక గంట దాకా నిలబడి వున్నాడు. కానీ వాళ్లు వస్తూనే వున్నారు. భుజం భుజం కలిపి నడుస్తూ, రాతి వంటి మొహాలతో, కండ్ల నుండి మెల్ల మెల్లగా కన్నీళ్లు కారుస్తూ, కానీ వాటిని ఎవరూ తుడుచుకోవడం లేదు. మరొక గంట గడిచింది. కానీ వస్తున్న వాళ్లకు అంతు లేదు. ఎన్ని వేల మంది వచ్చారు, ఎన్ని వేల మంది ఇంకా రావాల్సి వుంది, అతను అంచనా వేయలేకపోతున్నాడు. కానీ ఒక విషయం అతనికి తెలుసు, ఈ దేశ చరిత్రలో ఇటువంటి అంత్యక్రియలు ఎప్పుడూ జరగలేదు. అత్యంత ప్రియతమ నాయకుడు అబ్రహం లింకన్ మరణించినప్పుడు కూడా జరగలేదు.

ʹచికాగో పోలీసుల ప్రకారం అమర కార్మిక నాయకుల శోక యాత్రలో ఆరు లక్షలకు మించిన ప్రజలు పాల్గొన్నారు.ʹ

(సంఘత్ మెహన కశ్ పత్రిక సౌజన్యంతో)


No. of visitors : 310
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

International Seminar on Nationality Question

AIPRF | 20.11.2018 11:30:05pm

AIPRF - International Seminar on Nationality Question | Delhi | 16 - 19 Feb 1996| William Hinton | Saibaba | Varavararao | Ngugi |Noam Chomsky...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి

లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్‌

virasam | 07.06.2016 11:00:13am

పాత‌న‌గ‌రం పేద ముస్లింల‌కు బ‌డేబాయి, స‌హ‌చ‌రుల‌కు ఖాన్‌సాబ్‌.పౌర‌హక్కుల నేత‌గా, విప్ల‌వ ర‌చ‌యిత‌గా, అధ్యాప‌కుడిగా, పాత్రికేయుడిగా తెలుగు స‌మాజంలో త‌నదైన‌......
...ఇంకా చదవండి

కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

విప్లవ రచయితల సంఘం | 25.09.2017 02:25:15pm

భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  వాళ్ల స్వేచ్ఛ కోసం పోరాడదాం
  నక్సల్బరీని ఎలా అర్థం చేసుకోవాలి?
  భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు
  నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  లాక్ డౌన్ లో అబద్ధాలు - ఎన్ కౌంటర్లు
  కా. కాశీం విడుదల కోసం కృషి చేసిన మిత్రులందరికీ విప్లవాభివందనాలు - కరోనా విపత్తులో రాజకీయ ఖైదీలను, ఇతర ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి
  చీమకుర్తి వలస కార్మికుల పోరాటం
  వివి ʹమన కవిʹ అని నిరూపించిన సముద్రస్వరం
  కడప జిల్లాలో వలస కూలీల దుఃఖనది
  కాపిటల్ లో కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు
  సర్వాంతర్యామి!
  నడవాలెనే తల్లి- నడవాలెనే

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •