విప్లవోద్యమంలో అమరులైన వేలాది మంది రక్తసంబంధీకులు, స్నేహితులతో 2002 జూలై 18న అమరుల బంధు మిత్రుల సంఘం ఏర్పిడింది. నాటి నుంచి ప్రతి సంవత్సవం సుభాష్‌నగర్‌లోని అమరవీరుల స్థూపం వద్ద ఎర్రజెండా ఎగరేసి, అమరులను స్మరించుకోవడం విప్లవ సాంప్రదాయంగా వస్తున్నది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అమరుల కుటుంబసభ్యులు, మిత్రులు, విప్లవాభిమానులు ఆరోజు కోసం ఎదురుచూస్తుంటారు. కన్నబిడ్డల్ని, జీవన సహచరుల్ని ప్రజా యుద్ధంలో కోల్పోయిన వాళ్లంతా స్థూపం వద్ద అమరులను తలుచుకొని నివాళులర్పిస్తాయి. కన్నీటి వ్యథతోనే విప్లవకారుల త్యాగాన్ని, ఆశయాల్ని ఎలుగెత్తిచాటుతారు. దోపిడీ పీడనలు లేని సమాజం కోసం సాగుతున్న యుద్ధంలో రాజ్యం చేతిలో హత్యగావించబడ్డ విప్లవ వీరుల ఆశయాల్ని ఎలుగెత్తి చాటడమంటే.. రాజ్యహింసను ప్రతిఘటించడమే. ఇవాళ రాజ్యహింస అనేక రూపాల్లో ప్రజా ఉద్యమాలపై అమలవుతోంది. విద్యార్థులు, రైతులు, కార్మికులు, మహిళలు, హక్కుల కార్యకర్తలు ఇలా.. అన్ని వర్గాల ప్రజలపై అమలవుతున్న రాజ్యహింసకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ గొంతెత్తాల్సి అవసరం ఉంది. ఈ క్రమంలో అమరుల స్మృతిలో రాజ్యహింసకు వ్యతిరేకంగా జరిగే సభను జయప్రదం చేయాలని బంధుమిత్రుల సంఘం ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, విప్లవాభిమానులకు విజ్ఞప్తి చేస్తోంది.
పుస్తకాల పరిచయం
కాకరాల, ఎబీఎంఎస్ గౌరవాధ్యక్షులు
పాణి, విరసం
Type in English and Press Space to Convert in Telugu |
అడవి తల్లీ నీకు వందనామమ్మా...కామ్రేడ్ గుండేటి శంకర్ స్మృతిలో.. "అడవి తల్లీ నీకు వందనామమ్మా...
పుడమి తల్లీ నీకు వందనామమ్మా.. పురుగు బూసి ముట్టకుండగా జూడు"... |
రాజ్యహింస చెలరేగి పోయెగదనే.. ఎదురు కాల్పుల పేర మిము జంపెగదనేఅమరుల బంధు మిత్రుల సంఘం ఆవిర్భావ దినం సందర్భంగా 18 జూలై 2016న సుబాష్ నగర్లో ర్యాలీ. అమరుల స్మృతిలో... కళాకారుల విప్లవ గీతాలు........ |
అమరుల స్మృతిలో....రాంగుడా లాంటి అతి పెద్ద బూటకపు ఎన్కౌంటర్ దగ్గరి నుంచి దండకారణ్యంలో నిత్యం ఎక్కడో ఒక చోట ఎదురుకాల్పులు జరుగుతునే ఉన్నాయి. ఎంతోమంది విప్లవకారులు, విప్లవాభిమాన... |
నీ పోరు గెలవాలని ..నిన్ను ఆ పోరులో చూడాలని ..అమరుల బంధుమిత్రుల సంఘం ఆవిర్భావ సభలో ప్రభాకర్ స్మృతిలో " సాహితి " పాడిన పాట ... |
అమరుల బంధు మిత్రుల సంఘం ఉత్తరాంధ్ర రెండో సదస్సుఉత్తరాంధ్ర అమరులను స్మరిస్తూ అమరుల బంధు మిత్రుల సంఘం ఈనెల 23న బొడ్డపాడులో ఉత్తరాంధ్ర రెండో సదస్సును నిర్వహిస్తోంది........ |
అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగాదేశ వ్యాప్తంగా ఉద్యమ ప్రాంతాల్లో కూంబింగ్ కొనసాగుతోంది. గ్రామాల మీద దాడులు, వేధింపులు, అరెస్టులతో పాటు ఎన్కౌంటర్ హత్యలు కొనసాగుతున్నాయి. వందలాది మంది సీఏఏ ... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |