ఆకలి చెమట వాసన

| సాహిత్యం | క‌విత్వం

ఆకలి చెమట వాసన

- వడ్డెబోయిన శ్రీనివాస్ | 01.05.2020 02:10:43am


ఏంటో
నిర్వాహనమైన
ఈ రోడ్డంతా
నడుస్తున్న ఆకలి సంతకాల
నల్ల బ్యానరైంది

బతుకొచ్చిన పల్లెడొక్క
బగ్గెండిన పత్తికాయై భల్లున పగిలింది

తలమీంచి జారి
నీడతాబేలు
తనలోకి తాను లాక్కుంది

బొందబడ్డ డొక్కల్లో
అమ్మ చేతులు వీచినట్టు
ఊరు పిలుస్తోంటే

తన చేతులు లాలించి పెంచిన నిర్మాణాలు
వొంకరనవ్వుగా
తన చెమట బుజ్జగించితాగి పెరిగిన సంపద వెక్కిరిస్తుండగా
పిండేస్తున్న ఆకల్నెత్తుకున్న
కడుపు చేత్తో పట్టుకొంది

ఏరోజుకారోజు
చేతుల్నమ్ముకొనో
కాళ్ళూ చేతుల్నమ్ముకొనో
బతుకుమీంచి
ఒల్చేసుకునే
ఆకలి కి

ఈ రోజు
తాళం వేసే దెట్లా ?

పేగులు తగలబడ్తున్న
ప్రేమసీమల
బతుకాశల్లోంచి
కరడు కట్టిన సింహాసనం కళ్ళ మీదుగా
వందల వేల కిలోమీటర్లైయ్యాక

ఆకలి వైరస్ కు లొంగి పోయి
మహానగర నిర్జీవనడిబొడ్డై నిలువడానికి
మట్టి మనిషి
దిష్టిబొమ్మేం కాదు గదా!
బతుకంటేనే భయం!!
కరోనా కంటే—

దుఃఖమీదుతూ
వొక పసి పేగుల ఇసుకగూడు
బాదల భారీవాహనంలో
వొక వైకల్య స్వప్నం
కష్టాల కర్ర పట్టుకుని
వొక రాలని వాడిన పువ్వు
మసల్తున్న
ఈ అగమ్యగోచరదారి గొడుగు పడ్తున్నాయి

రోడ్డంతా ఆకలిచెమట వాసన!

చూపులేని తాళం
చూరులేని బతుకు
మెతుక్కు పడింది

రోడ్డు తొడుక్కున్న పాదాల
అలజడులజల్లు వెంట
కొన్ని రాజ్య డిటెన్షన్ కలలూ
కొన్ని చావులు నడుస్తుండగా

ఇవ్వాళ
ఈ దేశం
కరోనా గీసిన ఆకలి చిత్రమైంది
ఇవ్వాళ
ఈ దేశం
వొక జీవ కళేబర ఊరేగింపైంది

ఊరు చేరాకైనా
ఆకలి చస్తుందా?

థూత్తెరి
ఈ దేశభక్తి కి
చెమటచుక్కంత మానవత్వం లేదు

No. of visitors : 374
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఇంద్రవెల్లి జ్ఞాపకమా!

వడ్డెబోయిన శ్రీనివాస్ | 17.04.2018 12:23:20am

అడవీ మనిషైయ్యింది అడవీ ఆలోచనైంది అడవీ చీమూనెత్తుటి స్పర్శైంది అడవి మనస్సు పుట్టింది అడవి ప్రశ్నైంది ధిక్కారమైంది సంఘమైంది ...
...ఇంకా చదవండి

జలగలంచ, దేవునిగుట్ట ఆదివాసుల్ని బతకనీయండి!

వడ్డెబోయిన శ్రీనివాస్‌ | 05.10.2017 11:16:52pm

వారు నోరు లేనోళ్ళు.అడవిలో అడివై బతికే వాళ్ళను అడవి నుండి బయటకు వెళ్ళమంటే అడివినే అడవిలోంచి వెళ్ళమన్నట్టుంటుంది.అడవిలో ఆకు పెరిగినట్టు, చెట్టు పెరిగినట్టు......
...ఇంకా చదవండి

గుర్మేహర్‌

వడ్టెబోయిన శ్రీనివాస్‌ | 06.07.2017 12:21:58am

నాన్న రుచి కోల్పోయిన జ్ఞాపకాలగాయం నీగుండెల్లో రక్తమొడ్తుండవొచ్చు హిందుత్వవిచ్చుకత్తులవిన్యాసం నీమనస్సుపొక్కిలి పొక్కిలి చేయవచ్చు ...
...ఇంకా చదవండి

సూర్యాక్షరం

వడ్డెబోయిన శ్రీనివాస్ | 19.11.2018 04:55:36pm

చీకటియుగానికి పాదులు తొవ్వుతున్న ద్వేషభక్తుల అబద్దాలముసుగు హామీలమత్తులో దేశం ఊగుతున్నప్పుడు అధికారంకౄరమృగమై దేశభక్తుల వేటాడుతూ నెత్తురు...
...ఇంకా చదవండి

భూమాట

వడ్డెబోయిన శ్రీనివాస్‌ | 01.04.2019 01:53:44pm

ముందస్తు ఎన్నికలు. ఏడ్చుకుంటూనో... నవ్వుకుంటూనో... పట్టాదారులందరు మూడెకరాల ముఖ్యమంత్రికే ఓటేశారు. గులాబి సుడిగాలి లేసింది. ఫ్రెండ్లీ ప్రభుత్వ ఆఫీసర్లు ......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •