"తిన్నాడో లేదో పాపం"

| సాహిత్యం | వ్యాసాలు

"తిన్నాడో లేదో పాపం"

- | 01.05.2020 01:40:50pm

నిన్న మధ్యాహ్నం మా ఇంటికి కాస్త దూరంలో ఉన్న కిరాణా షాపుకి వెళ్లి ఒక పెరుగు ప్యాకెట్ తెచ్చుకుందామని రోడ్డుమీదకు పోయా. కాస్త దూరంలో ఉన్న ఒక గానుగ చెట్టుకింద సైకిల్ పక్కగా పెట్టి నీడకోసం చేరిన ఓ యువకుడు కనబడ్డాడు. బాగా ఎర్రటి ఎండలో వస్తున్నట్టు ఉన్నాడేమో వళ్ళంతా చెమటలు. మాసిపోయిన బట్టలే వంటిపై ఉన్నాయి.మొద్దుచాకిరీ పల్లెటూరి యువకులు షర్టూఫ్యాంట్ వేస్తే ఎలా ఉంటాడో అలా ఉన్నాడు. ఎందుకో అతనివైపు వెళ్లి పలకరిద్దాం అనిపించి పోయా.

తలకూ మూతికీ కలిపి చుట్టుకున్న కండువాని తీసుకుని మొఖానికి మెడకూ పట్టిన చెమటలు తుడుచుకుంటున్నాడు. కాళ్ళకున్న చెప్పులు చూసినా అతని సైకిల్ చూసినా అతనుంటున్న పరిస్థితిని అంచనా వేయవచ్చు. పొలం పనులల్లో ఆరితేరిన దేహధారుడ్యం కనబడుతోంది. గడ్డిమోపులకు అనువుగా తయారుచేసుకున్న సైకిల్ కాస్త బురదకొట్టుకుని ఎండిపోయి తుప్పుతేలినట్టుగా కనబడుతోంది. నా మూతికి కట్టుకున్న కర్చీప్ కిందకి అనుకుని ఏంటి బాబూ ఇంత ఎండలో ఎక్కడికి పోతున్నావు.. ఏ ఊరు మీదీ అని అడిగాను. పిడచగట్టుకుపోయిన తన గొంతుతో మాట సరిగా రాలేదేమో అనుకున్నాను. అడిగిన వెంటనే సమాధానం చెప్పడానికి తన గొంతు సహకరించడంలేదు.నత్తి అనుకుంటా చాలాసేపటికి సమాధానం చెప్పాడు తడబడుతూ. అదికూడా నాకు సరిగా అర్ధం కాలేదు.

సరే ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చిందని ఇంత ఎండలో అంత దూరం ప్రయాణిస్తున్నావు.? పైగా ఇది బయటకు తిరిగే రోజులుకూడా కావని తెలిసీ దారిమధ్యలో పోలీసులకు కనబడితే కుళ్ళబొడుస్తారనీ తెలిసికూడా ఎందుకు రావడం పోవడం..? తప్పుకదూ..

ఇలా అడిగా.. తను అంతగా పట్టించుకోవడంలేదు. పైగా అటూఇటూ దేనికోసమో వెతుకుతున్నాడు. ఏమిటీ అడుగుతుంటే దిక్కులు చూస్తున్నావు అనగా.. మాటైతే తొందరగా చెప్పలేనని అనుకున్నాడేమో దాహం అంటూ ఇక్కడ మంచినీళ్లు ఎక్కడ దొరుకుతాయో అన్నట్టుగా సైగ చేసి చెబుతున్నాడు. సరే రమ్మని కిరాణా షాపు వద్దకు తీసుకునిపోయి కూలింగ్ లూజ్ వాటర్ ఒక అరలీటర్ ఇప్పించాను. గటగటా తాగేసి కృతజ్ఞతగా చూసాడు. మరలా చెట్టుకిందికి చేరి ఇప్పుడు చెప్పు అని అడిగాను.

తనకు పెళ్ళి అయి ఇద్దరు చిన్న పిల్లలున్నారనీ అత్తగారింట్లోనే ఇల్లరికం ఉంటూ వారికి కొడుకులేనిలోటుని తీరుస్తూ వారికున్న పొలాన్నీ గేదెలనూ చూసుకుంటూ వ్యవసాయపనుల్లో సాయంగా ఉంటున్నానని చెప్పాడు. ఆ ఊరుపేరేదో చెప్పాడుకానీ మాట అర్థం కాకపోవడంతో గుర్తుకురావడంలేదు. ఇక్కడికి దాదాపు ఎనభై వంద కిలోమీటర్ల మధ్యలో దూరం ఉండొచ్చు. ఇంకా దాదాపు ఓ అరవై కిలోమీటర్లు వెళ్లాలి తను. తను వెళ్లాల్సిన పని ఏమిటంటే తల్లికి అస్వస్థత. క్రిటికల్ పొజిషనంట. తమ్ముడువాళ్ళు ఉంటారుగానీ పట్టించుకోరంట. తమ్ముడు వ్యసనాలకు బానిస అవడంతో ఇంటిపట్టున ఉండకుండా ఇప్పుడు కల్తీసారాబట్టీలవెంట తిరుగుతూ అక్కడే ఉంటున్నాడంట.

తండ్రి ఉన్నాడుకానీ ఆయనకు కర్రసాయం ఉంటేతప్ప లేవలేని వికలాంగుడు అంట. అందుకే ఈ ప్రయాణం అని సగం అర్థం అయ్యీ సగం అర్ధం చేసుకోలేని మాటలతో తన నత్తితో చెప్పుకొచ్చాడు.

చీకటితో బయలుదేరిన అతనికి పోలీసులు ఎక్కడాకూడా ఆపలేదంట. అసలు ఎదురుపడలేదుగానీ ఇక్కడికి పదికిలోమీటర్ల దూరంలోని ఒక ఊరి రోడ్డుపై ఆపి అడిగారంట. తనకున్న భయం నత్తి ప్రయాణపు అలసట అన్నీ ఏకమై చెప్పేలోపే దింపి బాదారంట. కాళ్ళుపట్టుకుని బతిమాలుకుని ఎలాగోలా పరిస్థితి చెప్పి ఫోనులో తండ్రితో మాట్లాడించి వారు దయతలచి వదలగానే మరలా బయలుదేరి ఇక్కడివరకూ వచ్చాడంట. చొక్కా లేపి చూపించాడు. వాతలు కమిలిపోయి కనిపించాయి. కాళ్ళపైకూడా దెబ్బల గుర్తులు పైకి ఉబ్బిపోయి కనబడ్డాయి. అవి చూపించేటప్పుడు అతను చిన్నపిల్లాడిలా అనిపించాడు. కళ్ళు చెమర్చాయి.

నేను ఏదో డీప్ ట్రాన్స్ లోకి వెళ్ళిపోయా... మరలా తేరుకుని చూసేటప్పటికి అతను సైకిల్ పై పోతూ రోడ్డుపై మసకమసకగా కనబడుతున్న రోడ్డుసెగల తాలూకు మసక ఆవిరిలా నా పిలుపు అందుకోలేనంత దూరం వెళ్లిపోయాడు.... పాపం తిన్నాడో లేదో అడుగుదామని అనుకునేలోపు.... ఎవరైనా దాతలు తన ఆకలిని తీర్చి సేదతీర్చి ఉంటారని తెలిస్తే బాగుండు అనిపిస్తోంది.

No. of visitors : 367
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •