కరోనాను నివారించడం కాదు, వాడుకోవడం మన ప్రభుత్వానికి బాగా తెలుసు

| సంపాద‌కీయం

కరోనాను నివారించడం కాదు, వాడుకోవడం మన ప్రభుత్వానికి బాగా తెలుసు

- సాగర్ | 15.05.2020 08:28:23pm

వలస జీవుల మరణాలతో మనకి తెల్లవారుతోంది. రోజుల తరబడి స్వగ్రామాలకు పయనం సాగిస్తున్న వలస జీవులు గమ్యస్థానం చేరకముందే జీవితాన్ని ముగిస్తున్నారు. ఆకలితోనో, ప్రమాదాలతోనో ప్రాణాలు విడుస్తున్నారు. గత రెండు నెలలుగా లక్షలాది వలస జీవులు జీవితం మీద ఆశతో ప్రయాణాలను సాగిస్తూనే ఉన్నారు. వందలాది కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం అయినా బతుకు మీద ఆశ వారిని నడిపిస్తుంది. అలసటతో విశ్రమిస్తే ఏ లారినో, రైలో వారిమీదుగా పోతుంది. కదలకుండా ఉండమంటే ఇలా ఎవరు వెళ్లామన్నారు? ఎవరు చావమన్నారు అంటూ నిర్లక్ష్యపు వ్యాఖ్యలు చేస్తున్నారు. బోగీల మధ్య లింకుల్లో కూర్చుని నెలల పసికందుతో ప్రయాణం చేస్తున్న మహిళ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతుంది. ఇంకో గర్భిణీ మహిళా 500 కిమిలోటర్లు నడుస్తూ దారిలో ప్రసవించింది. మన దృష్టికి రానివి ఎన్నో. ఇంత సంపద కలిగిన దేశం, 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యం అంటూ పరిగెడుతున్న పాలకులు.. వలస జీవుల కోసం ఏమి చేయలేదు. ఏమో చేస్తాయన్న ఆశ కూడా లేదు.

వలస కార్మికుల తరలింపు గురుంచి, వాళ్లకు ఆహరం అందించడం గురించి పట్టించుకొనే స్థితిలో ప్రభుత్వం లేదు. అవి పూర్తిగా రాష్ట్రాల బాధ్యత అంటూ మాట్లాడుతుంది. ఓట్లే లక్ష్యంగా సాగే మన దేశ రాజకీయాలలో ఓటు వేయడానికి అక్కరకురాని వలస జీవుల గురించి మన పాలకులు ఎక్కడ పట్టించుకుంటారు? విదేశాల్లో చిక్కుకున్న ప్రజలను తరలించడానికి పెట్టిన శ్రద్ద, మధ్యతరగతి ప్రజలను ఆయా రాష్ట్రాలకు పంపంపడానికి చేసిన ఏర్పాట్లలో లేశమాత్రం కూడా వలస జీవుల మీద పెట్టలేదు. తాజాగా ప్రకటించిన ప్యాకేజిలో కూడా వారికీ తక్షణంగా సాంత్వన కలిగించే చర్యలు ఏమి లేవు.

ఇప్పటిదాకా అయిపోయిన లాక్ డౌన్ ఒక ఎత్తు, ఇకముందు చూడబోయేడి మరో ఎత్తు అని ప్రధానమంత్రి ప్రకటించారు.ʹ ఆత్మ నిర్భర్‌ భారత్‌ ʹ ఇరవై లక్షల కోట్ల ప్యాకేజి. వినడానికి పెద్దది. రోజుకు ఇంత ప్యాకేజి అని ఆర్ధిక మంత్రి విడతల వారీగా ప్రకటిస్తారు అని ప్రధానమంత్రి చెప్పారు. పత్రికలూ చాంతాడంత అక్షరాలతో హెడ్డింగులు పెట్టాయి. జనాలు నిజమనుకున్నారు. ఆర్ధికమంత్రి వచ్చారు ఇప్పటికే ఇన్ని లక్షల కోట్లు ఇచ్చాం అన్నారు. ఇంకా ఇదిగో ఇన్నిన్నీ అప్పులు ఇస్తాం అన్నారు. గత మూడు నెలలుగా ఇస్తూనే ఉన్నాం అంటూ చెప్పుకొస్తున్నారు. తక్షణం కడుపు నిండాల్సిన పేదవాడికి ఏమి చేస్తారో చెప్పటంలేదు. కొనుగోలు శక్తి పెంచడానికి పేదవాడి చేతిలో తక్షణం డబ్బులుండేటట్టు నగదు బదిలీ చేయండి అని ఆర్థికవేత్తలు చెప్తున్నారు. అయితే ప్యాకేజీలో రుణాలు ఇస్తాం అంటున్నారు కానీ ఆకలి తీర్చే మార్గం మాత్రం చెప్పడం లేదు. ప్యాకేజి అంటే ప్రభుత్వం ఎదో చేస్తుంది అనుకుంటే అప్పులు ఇస్తాం తీసుకుని తిరిగి కట్టండి, మేము ఎటువంటి సహాయం చేయము అని చెప్తుంది. ఇంతకముందు కరోనా నివారణకు ఇప్పటిదాకా చప్పట్లు కొట్టడం, దీపాలు ఆర్పడం, సప్తపది సూత్రాలు ఆచరించాలనడం, పూలుచల్లడం చేయాలని మినహా ప్రజలకు చేసిందేమిలేదు. చేయకపోగా కరోనా వ్యాప్తికి ప్రజలను బాధ్యులను చేశారు. ఇలా చేయడం ద్వారా రాజ్యం తన వైఫల్యాన్ని కప్పి పుచ్చుకోడానికి ప్రయత్నం చేస్తున్నది. అంతే కాదు, పేదలను ఆదుకోవాలని కూడా ప్రజలనే కోరాడు. ఇటువంటి సమయంలో వ్యక్తులకు సామాజిక బాధ్యత ఉండటం అవసరమే. కానీ మొత్తంగా అది కొంత మేర మాత్రమే పనిచేస్తుంది. దీని కంటే కరోనా నివారణలో రాజ్యం పాత్ర పెద్దది, కీలకమైంది. కానీ కరోనా మన దేశంలోకి ప్రవేశించినప్పటి నుండి కూడా అదేదో వ్యక్తుల బాధ్యతగా చూపిస్తున్నారు.

దేశవ్యాప్తంగా 14 కోట్ల మంది వలస కూలీలు ఉన్నారని ఒక అంచనా. ప్రధానంగా వీరు ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా, అస్సాం, ఈశాన్య రాష్ట్రాలకు చెందినవారు. వీరు ప్రధానంగా బెంగుళూర్, హైద్రాబాద్, ఢిల్లీ, అహ్మదాబాద్ ప్రాంతాలకు వలస పోతున్నారు. వీరిలో అత్యధిక శాతం మంది తయారీ రంగం, నిర్మాణ రంగం, పర్యాటక రంగాల మీద ఆధారపడి జీవిస్తున్నారు. పర్యటక రంగంలో దాదాపు 3.7 కోట్ల మంది ఉపాధి కోల్పోనున్నారని ఒక అంచనా. వీటితో పాటు వీటి మీద ఆధారపడే పరిశ్రమలకు సంబంధించిన వారు ఉద్యోగాలు కోల్పోనున్నారు. ఒక ప్రణాళిక లేకుండా రాత్రికి రాత్రే దేశ వ్యాప్త లాక్ డౌన్ ను అమలు చేయడంతో ఎక్కడిక్కడ వలస జీవులు చిక్కుకుపోయారు. వీరి గురుంచి ప్రభుత్వం ఏ మాత్రం ఆలోచించకుండా చేసిన చర్య ఫలితంగా ఏంతో మంది ప్రజలు ఆకలి చావులకు గురయ్యారు. వేలాది మంది తమ కుటుంబాలతో కాలినడకన స్వగ్రామాలకు ప్రయాణమై దారి మధ్యలోనే ప్రాణాలు వదిలారు. వీరే కాక దేశ వ్యాప్తంగా యాభై లక్షల మంది వరకు ప్రజలు ఆటో - రిక్షాల మీద ఆధారపడి బతుకుతున్నారు. వీరిలో చాలా మంది ఫైనాన్స్ మీద వాహనాలు తీసుకుని నడుపుతున్నారు. ఒక వైపు జీవనం సాగించడమే కష్టమైతే మరో వైపు ఫైనాన్స్ కట్టలేక తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. ఇక దేశంలో వేగంగా విస్తరిస్తున్న క్యాబ్ డ్రైవర్ల పరిస్థితి ఇదే దారిలో ఉంది.

ఇక కరోనా మొదలైన దగ్గర నుంచి ఎటువంటి ఆహారం తీసుకుంటే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందో వైద్యులు చెప్తూ వస్తున్నారు. 80 కోట్ల మంది ప్రజలు పేదరికంలో ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి. వీరి రోజువారీ సంపాదన 140 రూపాయాలు. ఇందులోనూ 30 శాతం మంది ప్రజలు సంపాదన 87.5 రూపాయలు మాత్రమే. రోజువారీ పని లేకపోతే వీరికి పూటగడవటం కూడా కష్టమే. వీరంతా పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ఇక పనిలేని లాక్ డౌన్ కాలంలో పూటగడవటమే కష్టం. ఇక పోషకాహారం గురుంచి ఏమి ఆలోచిస్తారు? చేతులు శుభ్రంగా శానిటైసర్ తో కానీ సబ్బుతో కానీ 20 సెకండ్ల దాక కడుక్కోవాలంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అసలు ఇల్లు లేని ప్రజలు మన దేశంలో నలభై లక్షల మంది దాక ఉన్నారన్నది ఒక అంచనా. ఇది 2011 నాటికీ 17 లక్షలుగా ఉంది. 73 లక్షల మంది ప్రజలకు సరైన గృహ వసతి లేదు. అయితే వీటి గురుంచి ప్రభుత్వం వద్ద కూడా సరైన లెక్కలు లేవు. సరైన నీటి సదుపాయం లేని దేశాలలో మనది 113 వ స్థానం. ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించాలి అనుకున్నప్పుడు ముందుగా ఆలోచించాల్సింది వీరి గురించి. తమకు నచ్చినపుడో లేదా తీరుబడి దొరకగానే లాక్ డౌన్ ప్రకటించి మీ ప్రాణాలు కాపాడటం కోసమే ఇదంతా చేశానని మోడీ అంటున్నాడు. లాక్ డౌన్ ప్రకటించిన తరువాత కూడా వీరి గురించి ఆలోచించడానికి ఆయనకు తీరిక లేకపోయింది. ఫలితంగా ప్రజలు కరోనా బదులు ఆకలితో చనిపోతున్నారు. అయితే కరోనా, లేకపోతే ఆకలితో చావడం మాత్రమే ప్రజలకు మిగిలింది.

గత ఏడాది ఇదే మార్చి - ఏప్రిల్ నెలలో రైతులు రుణమాఫీ కోసం నెత్తురోడుతున్న పాదాలతో దేశరాజధాని తరలి వెళ్లారు. అంతకముందు ఏడాది తమిళనాడు రైతులు గిట్టుబాటు ధర కోసం ఎలుకలను తింటూ తమ నిరసనను తెలియచేశారు. వ్యవసాయ సంక్షోభ నుంచి గట్టెకించండి అంటూ దేశరాజధానికి వెళ్లిన రైతులను లాఠీలతో, నీటి ట్యాంకులతో, రబ్బర్ బుల్లెట్లతో ప్రభుత్వం గాయపరిచింది. ఈ ఏడాది కరోనా సంక్షోభం నుంచి రక్షించమన్న వలస జీవులకు పోలీసు లాఠీలు, చీదరింపులు ఎదురయ్యాయి. ఏ సంక్షోభం వచ్చినా బలయ్యేది శ్రమజీవులే అన్నది మరోసారి కరోనా నిరూపించింది.

వలస కార్మికుల తరలింపుకు అనుమతినిచ్చిన ప్రభుత్వాలు ఒక్కసారిగా మాటమార్చాయి. నిర్మాణ, తయారీ రంగ కార్మికులు పోవడానికి వీలులేదు అంటూ ఉత్తర్వులు జారీ చేశాయి. కారణం వీరు వెళ్ళిపోతే స్థానికంగా ఉండే వారికీ అధికంగా జీతాలు ఇవ్వాల్సిరావడం. వలస జీవులనైతే శ్రమ దోపిడీ చేయడం సులభం. కాబట్టి అప్పటిదాకా వలస జీవులను పట్టించుకోని యజమానులు ఒక్కసారిగా ప్రభుత్వాన్ని కోరడం, ప్రభుత్వం వారిని ఆపడం జరిగిపోయాయి. ఇంత సంక్షోభ సమయంలో కూడా బీజేపీ ఏమి చేస్తుంది అంటే విద్యుత్ సంస్థలను పూర్తిగా కేంద్రం తన అజమాయిషీలోకి తీసుకోడానికి సిద్ధం అవుతుంది. ఇప్పటికే జీఎస్టీని తీసుకువచ్చిన కేంద్రం ఇప్పుడు ఒకే దేశం ఒకే ధర అంటూ విద్యుత్ సంస్థలను తన అదుపులోకి తీసుకుంటుంది. రాష్ట్రాల నుంచి ఒక్కో అధికారాన్ని లాక్కుంటుంది. కార్మిక చట్టాలు అమలును ఆపివేసింది. మరోవైపు ప్రజలవైపు మాట్లాడుతున్న మేధావులను అరెస్టులు చేస్తుంది. సీఏఏ, ఎన్ఆర్సీ ఆందోళనకారులను అరెస్టులు చేసింది. విద్యార్ధులపై ఉపా కేసులు పెట్టి ఒక ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. తూర్పు మధ్యభారతాల్లో మావోయిస్టు ఏరివేత ఆపరేషన్లు నిరంతరం చేస్తున్నారు. కార్పొరేట్లకు రుణాలు మాఫీ చేస్తున్నారు. కానీ తిండిలేని ప్రజలకు ఆహారం అందించడానికి మాత్రం పూనుకోవడంలేదు. ఈ మొత్తం వ్యవహారాన్ని రాష్ట్రాల మీదకు తోసివేసి కేంద్రం చేతులు దులుపుకుంది. ఒక్క లాక్ డౌన్ విధించడం తప్ప కేంద్రం చేస్తుందేమిలేదు. పైగా కరోనా కోసం ఇచ్చే విరాళాలు పీఎం కేర్స్ కు కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తే పన్ను మినహాయింపు లేదని ప్రకటించారు. అంటే ఇస్తే మాకే ఇవ్వాలని చెప్పడమే. దానికి లెక్కా పత్రాల వంటివేవీ ఉండవు కూడా. మీడియా ముందు మాత్రం కరోనాను అరికట్టడంలో మనమే ఆదర్శం అంటూ ఢంకా బజాయిస్తున్నాడు. వాస్తవం ఏమిటంటే కరోనాను కూడా వాడుకోవడంలో బిజెపి ప్రభుత్వం తనకెవరూ సాటిరారని నిరూపిస్తోంది.

No. of visitors : 543
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


స్మృతి చిహ్నాలు... పోరాటపు గుర్తులు

సాగ‌ర్‌ | 19.09.2016 10:53:49am

స్మృతి చిహ్నాలు మనం చూడలేని గత చరిత్రకి సంబందించిన ఆనవాళ్లుగాను , ఒక తరం నుంచి మరొక తరానికి వాటి రాజకీయ భావజాలాన్ని ప్రచారం చేసే సాధనలుగాను , వారి అమర........
...ఇంకా చదవండి

నేనూ అర్బన్ మావోయిస్టునే

సాగర్ | 22.09.2018 09:53:57pm

పూణే పోలీసులు బీజేపీ ప్రభుత్వం చేసిన ఈ అమానవీయ చర్యకు ప్రజలు ʹమీ టూ అర్బన్ నక్సల్ʹ, ʹపూణే పోలీస్ జవాబు దోʹ అంటూ తమ నిరసనను తెలిపారు......
...ఇంకా చదవండి

ఆ కాఫీ తోటలు ఎవరివి?

సాగర్ | 05.10.2017 11:05:45pm

విశాఖ మన్యంలో ఆదివాసులు 30 ఏళ్లగా మావోయిష్టు పార్టీ నాయకత్వంలో పోరాడి కాఫీ తోటలపై సంపాదించుకున్న యాజమాన్య హక్కును తిరిగి తీసుకోవడానికి ఆంద్రప్రదేశ్ ......
...ఇంకా చదవండి

ప్రజల పై యుద్ధం

సాగ‌ర్‌ | 05.10.2016 12:31:57am

ప్ర‌జ‌లు,సామ‌జిక కార్య‌క‌ర్తలు నేడు దండకారణ్యంలో జరుగుతున్న పాశవిక దాడికి, హక్కుల హననాకి వ్యతిరేకంగా తమ మద్దతు తెలపాల్సిన అవసరంను ఈ పుస్తకం మనముందుంచుతుంది ...
...ఇంకా చదవండి

వ్యవస్థ పొట్టవిప్పి చూపెడుతున్న కరోనా

సాగర్ | 01.04.2020 10:30:27pm

గత మూడు నెలలుగా ప్రపంచమంతా కరోనా చుట్టూ తిరుగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది లక్షల మందికి పైగా దీని బారిన పడ్డారు....
...ఇంకా చదవండి

బాబుకు ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది.

సాగర్ | 16.04.2019 12:13:15am

అంతులేని రాజ్యహింసకు, హక్కుల హననానికి పాల్పడిన చంద్రబాబు ప్రజాస్వామ్యం విలువలు అంటూ మాట్లాడటం కొత్తగా, వింతగా, కాసింత వినోదంగా కూడా ఉండొచ్చు......
...ఇంకా చదవండి

హిందూ రాజ్యం దిశగా

సాగర్ | 17.11.2019 10:20:58am

ʹఒకే ప్రజ, ఒకే భాష, ఒకే సంస్కృతి,ఒకే జాతి, ఒకే దేశం, ఒకే నాయకుడుʹ అనే సంఘ్ పరివార్ రాజకీయ లక్ష్యానికి ఆర్టికల్ 370 రద్దు తరువాత ఈ తీర్పు మరో విస్తరణలాంటిదే....
...ఇంకా చదవండి

కిసాన్ ముక్తి మార్చ్

సాగర్ | 06.12.2018 12:02:02am

ʹఅయోధ్య ఆలయం కాదు రుణ మాఫీ కావాలిʹ నినాదాలతో దేశ రాజధాని ప్రతిధ్వనించింది. లక్షకు పైగా రైతుల మట్టి పాదాలు తాకి ఢిల్లీ పార్లమెంట్ వీధులు పులకించాయి......
...ఇంకా చదవండి

వేటకెళ్ళిన ఆదివాసులను వేటాడి చంపిన పోలీసులు

సాగర్ | 17.03.2019 10:35:13pm

తమ కాళ్ళ కింద ఉన్న అపార ఖనిజ సంపదను పెట్టుబడిదారులకు పంచిపెట్టడానికి ప్రభుత్వాలు ఆదివాసులను చంపివేస్తున్నాయి. ఆ నిర్బంధాన్ని, హింసను తట్టుకుని వారు ప్రభు......
...ఇంకా చదవండి

చంద్రబాబు అయిదేళ్ల పాలన - మీడియా మేనేజ్మెంట్

సాగర్ | 01.04.2019 01:47:11pm

చంద్రబాబు చేసిన దోపిడీ అంతా ఆయన మానేజ్మెంట్ నైపుణ్యంతో అభివృద్ధి అయింది. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలలో తిరిగి దీనినే ఉపయోగిస్తూ ʹనేను రాకపోతే అన్ని ఆగిపోతాయిʹ అ.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •