పాలకులకు అందివచ్చిన వరం కోవిడ్ 19

| సాహిత్యం | వ్యాసాలు

పాలకులకు అందివచ్చిన వరం కోవిడ్ 19

- అరుణ్ | 15.05.2020 09:15:54pm


ఇంతవరకు మానవజాతి తన పేరాశతో, దురహంకారంతో ప్రకృతిని విషపూరితంచేసి, దానికి వైరస్ లు అంటించగా, ఇక వాటికి ముగింపు పెడుతూ, తనకు తాను పెట్టుబడిదారివ్యవస్థ మలినాలనుండి శుబ్రపరుచుకొనే ప్రయత్నాలలో భాగమే ఈ కోవిడ్ వైరస్ అని వైరాలజిస్ట్(వైరస్ అధ్యయనవేత్త) లు అంటున్నారు.

అనునిత్యం నదులను మలినంచేస్తున్న కర్మాగారాల యజమానులకు, అడవులను విధ్వంసం చేస్తున్న కార్పోరేట్లకు ఒకవైపు గులాములై, సలాం కొడుతూ, మరోవైపు ఓట్ల కోసం ప్రజాసంక్షేమం పేరుతో వందల కోట్లు అదే పెట్టుబడిదారులకు ʹనమామి గంగాʹ, చెట్ల పెంపకం లాంటి పథకాలతో ముడుపులు చెల్లిస్తున్న ప్రభుత్వాలు సిగ్గుపడేలా, కోవిడ్ గంగానది శుభ్రతను చేపట్టిందని కొందరి వువాచ. ఇందులోనూ సత్యముంది. కాని విపత్తునూ, తమ ప్రయోజనాలకనుగుణంగా మార్చుకోగల ఎత్తుగడలు ఆధునిక పాలకులున్నాయని విస్మరిస్తే నష్టపోయేది మనమే.

ʹసామ్రాజ్యవాదయుద్దాన్ని అంతర్యుద్ధంగా మార్చండిʹ అన్నారు, నాడు కామ్రేడ్ లెనిన్.విపత్తును సంపద పెంపుకై వినియోగించు అంటుంది నాడూ, నేడూ పెట్టుబడి. విపత్తును అధికార సుస్థిరరత్వానికై వాడుకోజూస్తూన్నారు నేటి పాలకులు. లెనిన్ సలహాను ఆచరించే పరిస్థితులు నేడు లేవు. ప్రపంచమంతటా కమ్యూనిస్టు విప్లవకారులు బలహీనంగా వున్నారనేది చేదు వాస్తవం. మరోవైపు విపత్తును తమసంపద పెంపుకై పెట్టుబడిదారివర్గం ఎలా వినియోగించుకున్నదో నోమి క్లెయిన్ తన ʹడిజాస్టర్ కాపిటలిజంʹలో సోదాహరణలతో వివరిస్తారు. ఇప్పుడు కూడా, కోవిడ్ విపత్తు సమయంలో పెట్టుబడి ప్రయోజనాలను కాపాడే వివిధ దేశాల పాలకుల విధానాలు ఎలా ప్రజాసంక్షేమ పథకాల ముసుగు వేసుకున్నాయో, ఆమె అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆర్ధిక రాయితీలను పరిశీలిస్తూ వివరిస్తారు. సంక్షోభం వాస్తవమే. కాని, కేవలం ఎంపికచేసుకున్న అత్యవసర విధానాలను అమలుజేస్తూ, సంక్షోభ కష్టనష్టాలను సామాన్యులపైన వదిలేస్తూ, సంక్షోభపు ప్రభావం పెద్దగా పడని వాళ్లకు ఆర్థిక రాయితీ లిస్తున్నారు అని అంటున్నదామే.

ఇక ఇంటిదగ్గరికొద్దాం..

కోవిడ్ కు ముందు:

ʹహిందూ హృదయ సామ్రాట్ʹ పాలనలో దేశం మొత్తం అసంతృప్తితో, నిత్య నిరసన ఉద్యమాలతో అట్టుడికిపోతున్నది. ఈ సంవత్సరం ఫిబ్రవరి దాకా CAA, NCR, NPR వ్యతిరేక నిరసనలతో దేశరాజధాని డిల్లీతో సహా చిన్న, పెద్ద పట్టణాలలో ప్రజలు వీధుల్లోకి వచ్చారు. ఆ ఉద్యమానికి మోడీతో సహా సంఘ్ పరివార్ మతం రంగు పులిమినా వారాసించినంతగా విజయవంతం కాలేదు. విశ్వవిద్యాలయలలోని వేలాదిమంది విద్యార్థులు నెలల తరబడి తమ రాజ్యాంగ హక్కు కోసం పోరుబాట పట్టారు. మరోవైపు హిందువుల వోట్లకోసం అస్సాంలో మోడీ-షా ద్వయం వేసిన ఎత్తుగడలు వారాశించిన పలితాలనివ్వక పోగా అక్కడా అసంతృప్తి జ్వాలలు వ్యాపించాయి. డిల్లీలో CAA, NCR, NPR వ్యతిరేక నిరసనకారుల పట్ల ప్రభుత్వ విద్వేష వైఖరి, వారిపై CAA, NCR, NPR సమర్థకుల పేరుతో సంఘ్ పరివార్ దాడులు, పోలీసుల ప్రేక్షకపాత్రనే గాకా, కొన్నిమార్లు వారు వహించిన చురుకైన పాత్ర ఇదంతా దేశాన్ని రెండుగా విభజించింది. ఒక సమస్య నుండి ప్రజల దృష్టిని మరలించేందుకు, ప్రజలను తప్పుదారి పట్టించేందుకు కూడా మరొక పెద్ద సమస్యను ప్రజలముందుకు తెస్తున్నారు. ఇది పాలకవర్గాలకు సహజమే. మోదీ ప్రభుత్వం అందులో తాను సిద్దహస్తురాలనిపించుకుంటున్నది. కాశ్మీర్ ప్రజల స్వయం ప్రతిపత్తిని కబలించి, హిందూ సామ్రాజ్య స్థాపనకు తొలి అడుగు వేసిన మోది ప్రభుత్వం కాశ్మీర్ లో. బయట వ్యతిరేకతను,కాశ్మీర్ ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కొనక తప్పలేదు. దాని నుండి ప్రజల దృష్టి మల్లింపుగా, అంతవరకు cold storage లో వుంచిన CAA, NCR, NPR పథకాలను అర్జెంటుగా ముందుకు తెచ్చి దేశమంతా అమలుజేసే ప్రయత్నంచేసింది.

హిందూ రాష్ట్ర సాధనకై మోడీ-సంఘ్ పరివార్ లు సృష్టించిన సామాజిక సమస్యలటుంచితే, ఆర్ధిక రంగం చిన్నాభిన్నమయి, దేశప్రజలలో, ముఖ్యంగా యువతలో అసంతృప్తి జ్వాలలు రేగాయి. ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం 6.1% పెరుగుదలతో 2017-18లో 45 సంవత్సరాల రికార్డుస్థాయికి చేరుకొంది. ఇది మోడీ ఆర్ధిక విదానాల ఫలితమేనని చెప్పక తప్పదు. తన డిజిటల్ రంగ మిత్రుల ప్రాపకంకై నోట్లరద్దుజేసి, కొన్ని లక్షల వుద్యోగాల రద్దుకు, వేల చిన్న, మద్యతరహా పరిశ్రమల మూతకు కారణమయ్యాడు. అంతేగాక గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా వ్యతిరేకించిన GST ని, ప్రధాన మంత్రిగా అమలుజేసి ఆర్థికరంగ తిరోగమనానికి కారణమయ్యాడు. ఒకవైపు కార్పోరేట్ పన్నులు 1 లక్షా 45 వేల కోట్లు మినహాయింపునిస్తూ, మరోవైపు ప్రజలు తమ ఆకస్మిక అవసరాలకై దాచుకున్న డబ్బును రిజర్వ్ బాంక్ నుండి 1 లక్షా 76 వేల కోట్లు ప్రభుత్వం వాడుకోవబం గమనార్హం. ఈయన విధానాలవల్ల ప్రపంచ ఆకలి సూచికలో మనదేశం 102 స్థానంలో వుంటే ఆశ్చర్యపడేదేముంది? ఇక ఇప్పుడు దేశ ఆర్ధికరంగం మరణశయ్యపై వుంది. ఇదీ మోదీగారి పాలనలో దేశపరిస్థితి. ఎన్నిరకాల విన్యాసాలు జేసినా, నాటకీయత ప్రధర్శించినా, ప్రజలను మతం పేరుతో విభజించినా, తాను తన అసమర్థపాలనను దాచుకోలేని పరిస్తితి. ఆయనకున్న ఒకే ఒక అనుకూల పరిస్తితి, ఆయనకు ధీటైన ప్రతిపక్షనాయకుడు లేకపోవడం. అంతేగాక, తనకు సుశిక్షితులైనా సంఘ్ పరివార్ తో పాటు గోబెల్స్ ను మించిన సోషియాల్ మీడియా మరియు ఎలెక్ట్రోనిక్ మీడియా వుండటం.

ఇక తన ఐదేళ్ళ పాలనలో ప్రభుత్వ యంత్రాంగాన్నంత తన గుప్పిట్లో తెచ్చుకున్న మోదీ విద్యారంగంలో వున్నత స్థానాలలో తన భావజాల మిత్రులను నింపాడు. న్యాయవ్యవస్థ నిష్పాక్షిత ప్రశ్నార్థకంగా మారింది. చివరకు ఇంతవరకు రాజకీయాలకు అతీతంగా ఉందనుకుంటున్న మిలిటరీ రాజకీయ ప్రకటనలకు పూనుకొనడంతో దేశప్రజాస్వామ్యంపై నీలినీడలు కమ్మాయని బుద్దిజీవులు అభిప్రాయపడ్డారు. ఈ దోపిడీ వ్యవస్థపై ప్రజలకు, ముఖ్యంగా మధ్యతరగతి బుద్ధిజీవులకు ఇంకా విశ్వాసం వుందంటే అది న్యాయవ్యవస్థపై వారికి అంతో, ఇంతో నమ్మకం ఉండటమే. రంజన్ గోగోయ్ వ్యవహారంతో ఆ విశ్వాసమూ నీరుగారే పరిస్థితి ఏర్పడింది.

ఇక ఎన్నికల రంగంలో మోడీ గ్రాఫ్ పడిపోయినట్టు 2019లో జరిగిన రాష్ట్రాల ఎన్నికలు స్పష్టం చేస్తున్నాయి. పైన తెల్పినట్టు మోడీకి ధీటైన ప్రతిపక్షనాయకుడు లేకపోవడం ఆయనకు అనుకూల పరిస్థితి అయినా, ఆర్ధిక మాంద్యం, నిరుద్యోగం ఆయన ప్రభుత్వానికి కొరకరాని కోయ్యలే. అవే వచ్చే ఎన్నికలలో ఆయన పుట్టిని ముంచుతాయనే అభిప్రాయం పరిశీలకులకు ఏర్పడింది.

సరిగ్గా ఇలాంటి వ్యతిరేక గ్రీష్మపవనాలు వీస్తున్న కాలంలో, ఆయన దశను మార్చేందుకా అన్నట్టు కోవిద్ వైరస్ మలయమారుతంలా ఆయనను తాకింది. ప్రజల్ని మాత్రం మృత్యువుపాలు చేస్తున్నది.

కోవిడ్ తర్వాత:

కరోనా వ్యాప్తి అరికట్టే భాద్యత ప్రభుత్వానిది కాదని, ఆ భాద్యత ప్రజలదేనంటూ దేశమంతటా లాక్ డౌన్ పేరుతో కర్ఫ్యూ విధించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, ప్రజల్ని మానసికంగా, ఆర్థికంగా సంసిద్దత చేయకుండా విధించిన ఈ లాక్ డౌన్ మధ్యతరగతి ప్రజలు చాలా క్రమ శిక్షణతో పాటిస్తున్నారు. దీంతో కష్టాలపాలపడ్డది సామాన్య ప్రజలు, ముఖ్యంగా లక్షలాది వలస కార్మికులు. మోది తాను పార్టీలోనూ తిరుగులేని నాయకుడనిపించుకుంటున్నాడే గాని కొవిడ్ ముందటి కాలంలో ఆయన కుడిభుజం షా కూడా డమ్మీగా మారాడని కొవిడ్ కాలంలో ప్రభుత్వ చర్యలే నిరూపిస్తున్నాయి. తమను ఏ మాత్రం సంప్రదించకుండా ప్రధానమంత్రి లాక్ డౌన్ ప్రకటించటంతో తాము హడావిడిగా ఆర్థిక రాయితీల ప్రకటన చేయాల్సివచ్చిందని సాక్షాత్తు ఆర్ధిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారంటే, దానికి అన్ని రాష్ట్రాలు తలూపాయంటే కోవిద్ మోదీ కిచ్చిన శక్తి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

ఇక వైరస్ వ్యాప్తి పేరుతో అన్ని నిరసన శిబిరాలు ఎత్తివేయబడ్డాయి. CAA,NCR,NPR వ్యతిరేక నిరసనకారులను జైళ్లకు పంపడం మొదలయ్యింది. ప్రశ్నించే గొంతుకులకు శాశ్వత మాస్క్ లు బిగించారు. ఒకవైపు, జైళ్ళు కిక్కిరిసిపోయాయని, అవి కోవిద్ వ్యాప్తికి దోహదం చేస్తాయని చెబుతూ, ఖైదీలను పెరోల్ పై విడుదల చేయాలని సలహానిచ్చిన సుప్రీం కోర్ట్ ఆనంద్ టెల్టుండే, నవలఖా లాంటి ప్రజామేధావులను మాత్రం జైలుకు వెళ్ళమంది. వాటికి వ్యతిరేకంగా నిరశన అవకాశాలు లేవుగా! ఇక ప్రశ్నించగలిగే మధ్యతరగతి గృహాలకే పరిమితం. ఆర్నబ్ గోస్వామిపై వచ్చిన నేరారోపణకు వివరణ ఇచ్చేందుకు మూడు వారాలు వ్యవదినిచ్చిన కోర్ట్ లు, ది వైర్ సంపాదకున్ని మాత్రం వేటాడుతుంది. ఎవరు ఏవైపో అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు.

ఇప్పుడుడు మధ్యతరగతి పూర్తిగా మూగపోయింది. ఆర్ధిక మాంద్యం, నిరుద్యోగం గురించి మాట్లాడేవాడే లేడు. మధ్యతరగతి గృహానికే పరిమితమవుతూ ప్రాణభయంతోనూ సకలసౌకార్యలను అనుభవించగలరు. దినవేతన కూలీలు, వలస కార్మికులు, తోపుడుబండ్లవాళ్ళు, టీ కొట్టువాళ్ళు, చిరుద్యోగులు నిత్య జీవన పోరాటంలో తలమునకలవుతుంటే అంతో, ఇంతోసామాజిక చైతన్యం, ఆలోచన శక్తివున్న మధ్యతరగతి ఉద్యమాలు చేయడం ఎప్పుడో మరిచినా కనీసం పత్రికా ప్రకటన ద్వారానైన నిరసనలు తెల్పే పరిస్థితిలో లేరు. కరోనా, కరోనా- అదే నామస్మరణ. ఫోన్ల ద్వారా చాటింగ్ లు, వీడియో కాన్ఫెరెన్స్ ల ద్వారా దేశ, విదేశాలలో వున్న బంధుమిత్రులతో కావలసినంత కాలక్షేపం. విద్యుత్ కు, నీటికి కొదవలేదు. నిత్యావసరాలకు కొరతలేదు. ఫోన్ కాల్ తో కావసినవి ఇంటికే వస్తాయి. వర్క్ ఫ్రం హోం తో జీతాలకు ఇబ్బందిలేదు. కాలక్షేపానికి టివి, కంప్యూటర్లు. ఇక పిల్లల చదువులకూ ఇబ్బందేమీ లేదు. అన్నీ ఆన్ లైన్ చదువులేకదా. కొద్దినెలలు జీతాలందక పోయినా జీవనానికి డోకా ఉండదు. ఆర్ధిక లావాదేవిలకై గూగుల్ పే, పేటియంలు, క్రెడిట్/డెబిట్ కార్డులుండానే వున్నాయి కదా. పొతే, వారాంతపు పబ్బులు, పార్టీలు, రోజు వారి జిమ్ లకే ఆటంకం. అలాంటి వారితో మోదీకి ఇబ్బంది లేదు. మోదీ విధానాలు వారిని ఇబ్బంది పెట్టవు. వారికున్న భయం ఒక్కటే. అదే చావు భయం. దానికి తోడు భవిష్యత్తులో ఇప్పుడనుభవిస్తున్న సుఖమయమైన జీవితాన్ని కోల్పోతామేమోననే శంక వారిని మానసిక అశాంతికి గురిచేయవచ్చు. ఈ భయమే మోదీ లాంటి నియంతల పాలనకు ఏ డోకా ఉండదని అభయమిస్తుంది. బయట జరుగుతున్న విషయాలను, లోపాలను బహిర్గతం చేసే కొద్ది మంది జర్నలిస్టులపై కేసులు పెడుతున్నారు. దాంతో ప్రభుత్వ అస్తవ్యస్తవిధానాలను ప్రశ్నించేవారు లేరు. లక్షలాదిమంది వలసకార్మికుల దీనస్థితిని పట్టించుకొనేవారే కరువయ్యారు. వున్నచోట ఉపాధి దొరకక, స్వంత ఊర్లకు వెళ్ళే అవకాశం లేక ఆకలి చావులకు సిద్దమవుతున్న వాల్లెందరో? ఇవేమీ మోదీకి పట్టవు. పట్టించుకోకపోయినా కరోనా భూతం ఆవహించిన దేశం మోదీని ప్రశ్నించదనే భరోసా ఆయనది.

దేశంలో మొదటినుండి పేరుకు మాత్రమె ఫెడరల్ వ్యవస్థ వుంది. ఆధికారాన్ని తనగుప్పిట్లో పెట్టుకున్న కేంద్రం రాష్ట్రాలను మునిసిపాలిటీలుగా చూస్తుందనే విమర్శ సాధారణ పరిస్థితిలోనే వున్నప్పుడు ఇక ఆరోగ్య అత్యవసర పరిస్థితి వుందని ప్రచారం జరుగుతున్న సమయంలో కేంద్రం సర్వమూ తానై వ్యవహరించడంలో ఆశ్చర్యమేముంది. అందులోనూ చక్రవర్తి మోదీగారి పాలనలో. నిధులు విడుదల అవసరాన్నిబట్టి గాక, అసమదీయులా, తసమదీయులా అనే వివక్షత కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఒక్క ఉత్తరప్రదేశ్ కు విడుదల చేసిన నిధుల మొత్తం దక్షిణాది రాస్ట్రాలకన్నింటికీ కలిపి విడుదలచేసిన నిధులకన్నా ఎక్కువగా వున్నదంటే మోది నిరంకుశత్వం తేటతెల్లమవుతుంది. అతని వ్యతిరేకంగా నోరువిప్పే వారే లేరు. మమతా ఒక్కటే అప్పుడప్పుడూ నోరువిప్పినా అరణ్యరోదనే. కరోనా హిందూత్వ వాదుల ముస్లిం విద్వేష ప్రచారానికి ఉద్దీపన కల్గించిందని చెప్పవచ్చు. నాటి తబ్లీగ్ ప్రహసనం, ఈ మధ్యే జరిగిన సాధుల హత్యాకాండ హిందూత్వవాదుల ముస్లిం విద్వేష ప్రచారానికి మరింత ఊతం ఇచ్చాయి. దాంతోపాటు, రామాయణ, మహాభారతాల టీవీ ప్రసారం ద్వారా ప్రజల్లో హిందూత్వ భావజాల వ్యాప్తిచేసే సానుకూల తీరిక సమయాన్ని ఇచ్చింది. సాంఘిక దూరం పాటించడం అమలు చేయడం కష్టమేమో గాని, ఈ ప్రచారం ఇలాగే కొనసాగుతే ముస్లింలను సామాజిక బహిష్కరణ, వెలివేతకు గురిచేసినా పట్టించుకోనేవారెవ్వరూ ఉండకపోవచ్చు. అలాంటి ఉదంతం ఇప్పటికే రాజస్థాన్ లో ఒక ముస్లిం గర్భిణిని ఆస్పత్రిలో చేర్చుకోకపోవడంలో బీజప్రాయంగా కనపడింది. పొతే, గల్ఫ్ దేశాధినేతలు అభ్యంతరం తెలపడంతో మోదీ కరోనాకు మత వివక్షత లేదంటూ సన్నాయి నొక్కులునొక్కాడు. కాని, తన అనునాయులను నియంత్రించే పనిమాత్రం చేయడంలేదు.

ఈ ప్రజల నిస్సహాయ పరిస్థితి గమనించే ప్రభుత్వం కాశ్మీర్ ప్రజల పొట్టకోడుతూ కొత్త డోమిసిల్ చట్టం తెచ్చింది. ఇక రాష్ట్రాలు ఉద్యోగుల జీతంలో కోతపెట్టినా, కేంద్ర DA లను నిలుపుజేసినా అడిగేవాడు లేడు. ఈ సమయంలో ఉద్యోగులు సమాజం కోసం తమ స్వంత ప్రయోజనాలను కొంతమేరకైనా త్యాగం చేయవలసిందే అనే భావన ప్రభుత్వం ప్రజల్లో కల్పించగల్గింది. థాంక్స్ టు కరోనా.

ʹ1948 నాటి ఫ్యాక్టరీల చట్టం (Factories Act-1948) లోని సెక్షన్ 51 సవరణకై కేంద్ర ప్రభుత్వం వ్యూహరచనలో వుంది. పై సెక్షన్ ప్రకారం రోజుకి 8గంటల పనిదినాన్ని పారిశ్రామిక యాజమాన్యాలు విధిగా అమలు చేయాలి. (డబుల్ జీతంతో OT నిబంధన ఓ మినహాయింపు) దానికి ఇప్పుడు రోజుకు 12 గంటల పనిదినాన్ని ప్రవేశపెట్టి సవరణ చేసే ప్రయత్నం జరుగుతోంది.

నిన్న 23-4-2020న ఒక్క కలంపోటుతో కోటి కుటుంబాల ప్రభుత్వోద్యోగులు, పింఛన్ దార్ల బ్రతుకులపై దాడి! 2020 జనవరి నుంచి 2020 జూన్ వరకూ 1,4500 కోట్ల రూపాయల విలువ గల కరవు భత్యం (DA), పింఛన్ల ఎగవేత! ఇది ఆరునెలలదే సుమా! 2020 జులై నుండి డిసెంబర్ వరకూ మరో విడత ఎగవేతకి, 2021 జనవరి నుంచి జూన్ వరకు ఇంకో విడత ఎగవేతకి కూడా నిర్ణయం! ఈ మొత్తం మూడు విడతలకి కలిపి సుమారు 45 నుండి 50 వేల కోట్ల ఎగవేత! ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ వర్గాలకు మాత్రమే! ఇదే బాటను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనుసరిస్తే మరెంత ఉంటుందో మరి! కరోనా బేరం ఎంత లాభం?ʹ -ఇఫ్టూ ప్రసాద్

దీన్ని గురించి ఆందోళన సరే, ప్రశ్నించే అవకాశమూ లేదు. కరోనా కల్పించిన పరిస్థితి అది. సాధారణ సమయాల్లోనే ప్రభుత్యోదోగుల పట్ల ప్రజలకు విముఖత వుంది. అది వారి స్వయంకృతాపరాధమే. ఇప్పుడు ఉద్యోగులు తన న్యాయమైన హక్కుల కోసం పోరాడే అవకాశం లేదు. తార్కికంగా ఆలోచిస్తే ఆర్థిక ఇబ్బంది సమయంలో వుద్యోగులనుండి ఆ మాత్రం త్యాగం ఆశించడంలో తప్పేమీ లేదనిపిస్తుంది కూడా. కాని, దీనివల్ల నష్టపోయేది కేవలం వుద్యోగస్తులూ, వారి కుటుంబాలు మాత్రమె కాదు. దాని ఫలితం మొత్తం ఆర్ధిక వ్యవస్తపై వుంటుంది.

ʹతాజా DA రద్దు చర్య వల్ల ఒక్కొక్క ఉద్యోగి/ పించందారుడు పొందే తలసరి నష్టం 13,000 నుండి 14,000 మధ్య! మొత్తం మూడు విడతల్లో కలిపి పొందే తలసరి నష్టం 40 నుండి 45 వేలు! దీనర్థం రానున్న కాలంలో కోటికి పైగా కుటుంబాల ఖర్చు అదే మేరకు తగ్గుతుంది. అదేమేరకు పొదుపు పెరుగుతుందిʹ -ఇఫ్టూ ప్రసాద్

ఈరోజు వస్తు వినిమయలోటువల్ల, ఉత్పత్తులు తగ్గడం చిన్న, మధ్యకారు పరిశ్రమలు మూత పడటంతో, కొత్త వుద్యోగాలటుంచి లక్షలాది ఉద్యోగాలు ఊడిపోయాయని అందువల్ల ప్రజల కొనుగోలుశక్తిని పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని చాలా మంది ఆర్థిక వేత్తలు ప్రభుత్వానికి సలహా నిచ్చారు. వాటికి పూర్తిగా భిన్నంగానే కాదు, విరుద్దంగా మోదీ చర్యలు చేపట్టడం కరోనా ఇచ్చిన ధైర్యమే. అయితే ప్రభుత్వం తన అనవర ఖర్చులు చేయడం లేదా అంటే, ఇదేకాలం లోనే ప్రభుత్వం ఇజ్రాయిల్ నుండి 116 మిలియన్ల డాలర్ల (7,888 మిలియన్ రూపాయల) విలువగల ఆయుధాలను దిగుమతి చేసుకొంది. ఆయుధాలు కదా ప్రశ్నిస్తే మామూలు సమయంలోనే దేశద్రోహులవుతాం. అదలా వుంచితే, రాజ్ భవన్, పార్లమెంట్ భవనాలు మన మహోన్నత హిందూత్వ సంస్కృతిని ప్రతిబింబించవని, వాటి స్థానంలో నూతన భవనాల నిర్మాణానికి రూ.20 వేల కోట్లను ప్రభుత్వం విడుదల చేయడం గమనార్హం. ఇక కార్పోరేట్లకు పన్ను మినహాయింపు కేవలం రూ. 1 లక్షా 45 వేల కోట్లు మాత్రమే. వీటిముందు, మూడు విడతలకి కలిపి సుమారు 45 నుండి 50 వేల కోట్ల ఎగవేత చాలా పెద్దదే సుమా!

ఇదే సమయం లో సుప్రీం కోర్ట్ రిజర్వేషన్లు రాజ్యంగా హక్కు కాదని, ఇప్పటివరకు దానివల్ల సంభంధిత వర్గాల్లోని సంపన్నులే బాగుపడుతున్నారని విచారం వ్యక్తం చేస్తూ వాటిని పునః సమీక్షించాలని తీర్పునిచ్చింది. ఇంతవరకు అగ్రవర్ణాలవారు దళితులలోని పేదలపై కుండలకొద్దీ కన్నీరు కారుస్తూ వెలిబుచ్చిన అభిప్రాయాలకు ఇప్పుడు చట్టబద్ధత కల్గింది. ఇప్పటికే కేటాయించిన పోస్టులకు తగినంతమంది కనీస అర్హతగల అభ్యర్థులు లేక భర్తీ కావడం కాలేదని ప్రభుత్వమే చెబుతుంది. ఇప్పుడు వారిలోని సంపన్న శ్రేణిని తొలగిస్తే మిగిలేది అన్నీ బాక్ లాగ్ పోస్టులే. కొన్నేళ్ళ తర్వాత అవి ఓపెన్ కేటగిరి చేర్చబడతాయి. దానివల్ల లాభపడేదెవరో చెప్పాలా?

మనవాళ్ళు ʹఏ కష్టమొచ్చినా దేవుని లీలʹ, ʹఅంతా మనమంచికేʹ అంటుంటారు. నిజమే కరోనా వ్యాప్తీ మన మంచికే. ʹమనʹ అంటే మనం ఎన్నుకున్న ʹహిందూ హృదయ సామ్రాట్ʹ మోదీ, అతని మిత్రోం అదానీ, అంబానీల కోసమే. ఇక మోదీకి బిల్ గేట్స్ లాంటి వాడు కితాబులిస్తే అసమంజసమేముంది.

అవును మరి మనదేశంలో చట్టం తన పని చేసుకపోతుంది. కరోనా తనపని తాను చేస్తూనే వుంది. అలాంటప్పుదు మోదీ తన పని తాను చెసుకపోవడంలో తప్పేముంది?

No. of visitors : 371
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


సీమ పోరాడాల్సింది... ప్రత్యేక హోదాకై కాదు- నికరజలాలు, నిధులకై

అరుణ్ | 04.02.2017 12:52:07am

ʹ ప్రత్యేక హోదాʹ ఎండమావుల వెంట ప్రజల్ని పరుగేట్టించేందుకు తమిళనాడు జల్లికట్టు ఉద్యమం ప్రేరణ కల్గించడం, దానికి అన్ని రాజకీయ పార్టీలు,ఉభయ కమ్యూనిస్టులతో సహా,...
...ఇంకా చదవండి

వీళ్లు చేసిన నేరం ఏంటి?

అరుణ్ | 16.06.2018 10:29:00am

హిందూ ఫాసిజం నగ్నంగా ప్రజల హక్కుల అణచివేస్తున్నప్పుడు, మనవరకు రాలేదు కదా అని మౌనం వహిస్తే ఏం జరుగుతుందో హిట్లర్ పాలన గురించి వీ ముల్లెర్ చెప్పిన మాటలు వాస్...
...ఇంకా చదవండి

ఇక కాశ్మీరీయుల పరాయీకరణ సంపూర్ణం

అరుణ్ | 16.08.2019 07:43:10pm

కాశ్మీరీయుల ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని చెప్పాల్సిన అవసరమూ లేదు. మిలిటెంట్ పోరాటాలు, వాటిని తనకనుకూలంగా మార్చుకునేందుకు వారికి ఆయుధ సంపత్తిని .....
...ఇంకా చదవండి

ప్రత్యేక హేళన

అరుణ్ | 21.03.2018 10:49:23am

అవును మరిచాను మీడియా తన స్వామి భక్తిని చాటుకుంటూనే వుంది వలసల ,ఆత్మహత్యల తో సీమ దాహం, దాహం అంటూ అంగలారుస్తూనేవుంది, ఆకాశం వైపు చూస్తూనే వుంది అమరావతి నుండి ...
...ఇంకా చదవండి

దేశంలో ప్రశాంతత నెలకొనివుంది-జైళ్ళూ నోళ్ళు తెరుచుకొనే వున్నాయి - తస్మాత్ జాగ్రత్త

అరుణ్ | 17.11.2019 11:14:53am

ఈ తీర్పు జరగబోయే పరిమాణాలకు సూచకమా?గతం లో రాజులూ దండయాత్ర పేరిట చేస్తున్నదదే-భూ ఆక్రమణ.వారే చట్టం,న్యాయం కాబట్టి,వారు చెప్పిందే న్యాయం,చేసేదే ధర్మం గా వుండే...
...ఇంకా చదవండి

ప్రకృతి వైపరీత్యాలు- జెండర్, కులం, వర్గం

అరుణ్ | 15.04.2020 08:57:19pm

చావు సమవర్తి. అవును, కాదనలేని వాస్తవమే. రాజూ పేదా, నవాబూ గరీబు, మంత్రులూ బంట్రోతులూ ఎవరయినా సరే, పుట్టిన ప్రతి జీవి చావాల్సిందే కదా....
...ఇంకా చదవండి

నాడు రెండుకళ్ళ-నేడు మూడు కాళ్ళ ముచ్చట్లు

అరుణ్ | 04.02.2020 05:38:00pm

, అన్ని ప్రాంతాలలో ఉపాధి, ఉద్యోగ కల్పనకు కేవలం పాలనా వికేంద్రీకరణ అంటూ కార్యాలయాలనన్నటినీ ఒక ప్రదేశంలో ఏర్పాటు చేయడం వల్ల జరగేదేమీ ఉండదు. అది పాలనా......
...ఇంకా చదవండి

నేరమే అధికారమైన వేళ

అరుణ్‌ | 02.03.2019 04:38:04pm

తూర్పుకు చిహ్నం, మార్పుకు సంకేతం అతడు బాంబులను పంచాలేధతడు బావాలను పంచాడతడు బావాలను బంధించాలనుకోకు అవి తేనేటీగలై ఈ వ్యవస్థకు చరమ గీతం పాడుతాయి...
...ఇంకా చదవండి

ఆన్ లైన్ విద్య -వర్గస్వభావం - ఒక పరిశీలన

అరుణ్ | 01.07.2020 05:28:52pm

బడుగుబలహీన వర్గాలకు విద్యను దూరంజేసి, క్రమంగా సమాజ మార్పులో, అభివృద్ధిలో వారి పాత్ర, వాటా లేకుండా చేయడమే ఈ ఆన్ లైన్ విద్య లక్ష్యం. అంతేగాక విద్యారంగపు .....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •