జీవితాలను లాక్ డౌన్
చేసి హృదయాలను
మ్యూట్ చేసే అయుధాన్ని
వాడికిచ్చాం
కానీ
వాడెప్పుడూ మాస్క్
ధరించడని ఇప్పుడందరికీ
ఎరుకలోకి వచ్చింది
గూడు కోల్పోయి
ఎటూ పాలుపోని
నడక యాత్ర
నరక యాతనగా మారి
ఆకలిని జోలిలో దాచి
పిల్లల్ను భుజానెత్తుకుని
పట్టాలెంబడి నడిచి పోతుంటే
వాడి సరుకు రైలు
పదారుమంది
రక్తాన్ని దేశ ముఖంపై
చిమ్ముకుంటూ పోయింది
కరోనా కష్టకాలంలో
తుపాకులకు విశ్రాంతినిచ్చి
అపత్కాలంలో ఆదివాసులకు
ఆసరాగా వుంటామన్నా
ఆగని వాడి ఎదురుకాల్పుల
ఆపరేషన్ లో రాగోగా స్వేచ్ఛ కోసం
స్వప్నించిన చైతు అమరత్వం
శాంతి సందేశాన్ని వెక్కిరిస్తోంది
నువ్వూ నేనూ
ఊపిరి తీయకుండా
ఆగిపోవాలి
వాడు మాత్రం ఆగడు
వాడి వ్యాపారం బంద్ పడదు
సముద్ర తీరాన్ని
విషపు పొగతో నింపి
నిదర్లోనే
మునుషుల మూగ జీవాల
ప్రాణాలరిస్తాడు
వాడొస్తాడు
కార్పొరేట్ విమానంలో
వెటకారంగా నవ్వుకుంటూ
ప్రాణానికి కోటి ప్రకటించి
నీ గొంతులో కరిగిన సీసం పోస్తాడు
అమర్యాదగా...
కానీ
రేప్పొద్దున్న రెపరెపలాడే
జెండాగా మారాల్సింది
ఈ నెర్రెలు బారిన పాదాలిస్తున్న
వాగ్ధానం కదా??
Type in English and Press Space to Convert in Telugu |
ఆకు కదలని చోట వర్షించిన కవిత్వంఒకమారుమూలపాఠశాలఉపాధ్యాయుడు ఈ నిశ్శబ్దాన్నిభరించలేక ఈ ఉక్కపోతనుధిక్కరిస్తూతనచుట్టూవున్నఆకుకదలనితనాన్నికవిత్వంగామనముందుఆవిష్కరించినదే ఈ సంకలనం....... |
ఆ పావురాలు!ఒలికిన నెత్తురు
అద్దిన జెండానందుకుంటూ
గుంపుగా ఆ పావురాలు! ... |
తెలవారని ఆకాశం!కొన్ని మంచు బిందువులేవో రాతిరి కురిసిన
వాన చివుళ్ళ నుండి రాలుతూ
రెక్కల చాటున ముఖం దాచుకున్న పక్షి
టపటప రెక్కలల్లారుస్తూ ఎగరబోతూ... |
నమస్కరిస్తూ..కళ్ళకు గంతలు కట్టుకొన్నదని
మీ న్యాయ దేవత ముందు
నగ్నంగా నిలబడిన ఆ
పదముగ్గురూ
విడిచిన లజ్జను మీ మఖంపై
నెత్తుటి ఉమ్ముగా ఊసి!... |
జీవసూత్రాన్ని చెప్పే చింతా అప్పలనాయుడు ʹదుక్కిʹకవితలనిండా రైతు జీవన చిత్రమే. ఒక దు:ఖార్తితో కొనసాగుతుంది. కురవని వానలు కలసిరాని కార్తెలు అప్పుల ఊబిలు కాడెద్దులను దూరం చేసే యంత్రాల దాష్టీకం అక్కరకు రాని ప... |
పాలపుంతల దారిలో..
అమ్మలు
అలా వచ్చి ఎర్ర పూలను
దోసిట్లో పోసి వెళ్ళి పోతారు
కొన్ని నెత్తుటి చారికలను
కళ్ళలో నీటి బిందువులుగా
మార్చి కడిగిపోతారు... |
దక్షిణ యాత్రనీ ఒంటి రంగును హేళన చేసి
నిన్ను బానిస చేసుకో చూస్తున్నాడు
నీకంటూ మిగిలిన ఆఖరి అవకాశం
నిన్ను నువ్వు జెండాగా ఎగురవేయడమే!!... |
కుందాపనఈ కవిత్వం నిండా పరచుకున్న దాహం ఒంటరితనం.సమూహంలో తను నిలబడ్డ చోటు ఒంటరిగా ఒక దీపపు సమ్మెకింద నీడలా వెంటాడడాన్ని మనకనుభవంలోకి తెస్తుంది.కలసి నడవాల్సిన దారు...... |
గులాబీ!వాడెంత విధ్వంసం చేసినా
నీ పసివాడి చేతిలో
గులాబీ విచ్చుకుంటూ
వాడిని భయపెడుతూనే వుంది!!... |
మస్వాల్..మరుగుతున్న మంచు తెరలుగా
విడిపోతూ రాలిపోతున్న
మస్వాల్ పూలెన్నో
ఇప్పుడిక్కడ ఒకటే హృదయ ఘోష
ఆజాదీ ఆజాదీ ....... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |