కాశన్న తాత సందెట్ల సీసలు...

| సాహిత్యం | క‌విత్వం

కాశన్న తాత సందెట్ల సీసలు...

- ఇక్బాల్ | 15.05.2020 11:33:25pm


పలుగూ పారా పట్టి
పంట కాలువను
పారించిన చేతులూ ఇవే...

తట్టా బుట్టా నెత్తిన బెట్టి
తరాల వలసకు పానం బోసిన
ఎండిన రెక్కలూ ఇవే...

మన గడ్డన మనరాజ్యమన్న
మాయా బంగారులేడీ పాలన వలపులవల చిక్కి
ఓటై వగచిన వొలపోతను
ఒడిసి పట్టిన దోసిళ్ళూ ఇవే...

విరామమెక్కడ..
విసుగెక్కడ..
ఆ బాహువులు
ఎప్పుడూ మాల్గాడి ఎంగేజ్లే...

పిడికెడు బుక్కకోసం
జానెడు జాగకోసం
నెలల ఎదురుచూపులకు
ధర్మ ప్రభువుల దానం
మందు దుకానాలంట...

నిన్నటి దాకా...
నేన్నీ దోస్తునన్న లాఠీన్నిలబెట్టి ...
ధరలుబెంచిన
ఈ దోపిడేమిటో...
బ్రాన్ది కొట్టులు తెర్సుడేమిటో...

సంకనిండా..
రమ్ము సీఎమ్ము
రెండు సేతుల.. జోడుమంత్రులు కిక్కు సీసాల్...

"ఈ ఎండల ఇదేమి తాతా?? "

నమ్మబుద్ది గాకనే
ఉండలేక అడిగితే కాశన్న తాతిట్లన్నడు...

"అమ్మతోడు నావిగాదు
నమ్ము బిడ్డా పెద్ద దొరవే...
ఉప్పు కారాన్కి అడగవోతే
మంచి గొస్తివి పట్క రమ్మనె

నస్కున వోతే పైట్యాలాయే
వో యావయ్యన్నిచ్చింటే బాగుండే
ఏc వన్నజనమా ఎగవడ్డరు

ఇమానంగ జెప్తున్న బిడ్డా
ఆపూటకు లేనోన్ని
ముసల్దాని పైనొప్పి గోలిగొన్లేను
గివి నావనుకోకురి..."

కరోన ఆపతి కాలం జిందాబాద్ !
సంక్షేమ రాజ్యసోపతి గాలం జిందాబాద్!!

No. of visitors : 198
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  వాళ్ల స్వేచ్ఛ కోసం పోరాడదాం
  నక్సల్బరీని ఎలా అర్థం చేసుకోవాలి?
  భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు
  నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  లాక్ డౌన్ లో అబద్ధాలు - ఎన్ కౌంటర్లు
  కా. కాశీం విడుదల కోసం కృషి చేసిన మిత్రులందరికీ విప్లవాభివందనాలు - కరోనా విపత్తులో రాజకీయ ఖైదీలను, ఇతర ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి
  చీమకుర్తి వలస కార్మికుల పోరాటం
  వివి ʹమన కవిʹ అని నిరూపించిన సముద్రస్వరం
  కడప జిల్లాలో వలస కూలీల దుఃఖనది
  కాపిటల్ లో కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు
  సర్వాంతర్యామి!
  నడవాలెనే తల్లి- నడవాలెనే

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •