నడవాలెనే తల్లి- నడవాలెనే

| సాహిత్యం | క‌విత్వం

నడవాలెనే తల్లి- నడవాలెనే

- ఉద‌య‌మిత్ర‌ | 15.05.2020 11:46:40pm

నడవాలెనే తల్లి- నడవాలెనే
ఇంకొంచెం దూరమే-ఇల్లొస్తదే

" నడవాలెనే "

కాల్లు నొస్తెనేమి- బొబ్బలెక్కితెనేమి
నీ కాల్లచెప్పులు అరిగిపోతేనేమి

"నడవాలెనే "

పైన సూర్యుడుమండె- కిందభూమిగాలె
జరమొచ్చినా పెయ్యి-సొలుపుకున్నాదా
ఆకలీ పేగులు- అరిగోసవెట్టంగ
అడుగడుగునాబతుకు- సుడిగుండమాయెనే

" నడవాలెనే "

నేనింకనడువనని- కాళ్ళకడ్డం పడితె
నేనేమిజేతునే- నేనెందువోదునే
నిన్నెత్తుకోలేను- నేనడువలేను
కడుపులో బిడ్డెమొ- కదలాడుతున్నాది

ʹ ʹ నడవాలెనే తల్లి "

నీసిట్టి పాదాలు -దయలేనిదారుల్ల
నడిచి నడిచి - ఎంతపాలారిపోయెనో
నడి ఎండకాలాన- నువ్వడుగులేస్తుంటే
పగిలిన నీకాళ్ళే- చరితకద్దాలే

" నడవాలెనే "

లాకుడౌనువెట్టి- పనిబందువెట్టిన్రు
ఇల్లు గల్లోడేమొ-- ఎల్లగొట్టిండు
దిక్కులేనోల్లము--బిక్కు బిక్కుమనగ
పిల్లజెల్ల దీసుకు--బయలెల్లినాము

" నడవాలెనే "

వలసకూలిబతుకు--కుక్క బతుకేతల్లి
ఉన్నోల్లకంటికే--దిష్టిబొమ్మలము
దుఃఖాలు వినకుండ--చప్పట్లు కొడతారు
చీకట్లు కనకుండ --దీపాలువెడతారు

" నడవాలెనే "

సదివె పిల్లలకేమొ --బస్సు లేస్తరంట
మీదిమోటరుబంపి-- గొప్పోళ్ళ దెస్తారు
బస్సు, రైలులేదు--సిల్లి గవ్వలేదు
నడిచినడిచీపానం--ఎపుడారిపోయెనో

" నడవాలెనే "

కడుపులో కరువెట్టి--ఊరెల్లగొట్టిన్రు
సేతికి చిప్పిచ్చి--పట్నమెల్లగొట్టె
ఎటుగాని బత్కులకు --ఎట్టిబత్కులకు
కంపగొట్టినోడె-- నీతులుజెబుతుండు

" నడవాలెనే "

మూడురోజులాయె--మెత్కు కరువైపాయె
నీబాధ జూస్తుంటె--ఆకులల్లాడెనే
గొడ్డలి దెబ్బకు--సెట్టుగూలినట్టు
ఆకలిదెబ్బకు--కుప్పగూలితివొ

" నడవాలెనే "

లాకుడౌను వెట్టిన --ఏలెటోడుజావ
వలసజీవుల బతుకు--బుగ్గి పాల్జేసెనా
ఒడ్డుజేరకముందే-- ఓడిరిగినట్టుగా
ఊరుజేరకముందే--ఊపిరాగిందా

చితికిపోయిన బతుకులూ --నాతల్లి
ఊరికేమనిజెప్పుదూ ---నాతల్లి





No. of visitors : 205
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నువ్వేనా?అదినువ్వేనా?

ఉద‌య మిత్ర‌ | 02.11.2016 10:10:15am

అలలమీదదోగాడే వెన్నెలదీపమా! అడవిపూలమీదుగ వీచే మలయమారుతమా ! నువ్వేనా! అదినువ్వేనా ! మా కనుకొసలజారే అశ్రువులమీద అక్షర సంతకంజేసింది నువ్వేనా!...
...ఇంకా చదవండి

పేగు దుఃఖం

ఉద‌య‌మిత్ర‌ | 17.07.2016 12:47:48am

నెత్తురోడుతున్న వీధులు వేలాది చేతులమీద సాగిపోయే ఎలిజీలు తూటాల వర్షం కింద జల్లెడైన నా అందాల కాశ్మీరం...
...ఇంకా చదవండి

నీ గూడు యాడనే సిలకా !

ఉద‌య మిత్ర‌ | 01.08.2016 02:25:09am

ఇకముందూ వానలు పడతాయి కాని తడవడానికి మా ఇల్లుండదు చెట్ల ఆకుల జారి భూమినీ ముద్దాడి హొయలుబొయే వానజల్లుల సంగీత ఝరులుండవు......
...ఇంకా చదవండి

పేగుబంధం

ఉద‌య మిత్ర‌ | 03.09.2016 01:51:54am

రాధమ్మ వోణీకి నగిషీ సల్మాబేగం కుట్టిందనివిన్నా గానకచేరీలొ రఫీ రఘుపతిరాఘవను ఓలలాడించెవాడట.......
...ఇంకా చదవండి

శిలలపై దుఃఖాన్ని చెక్కినారూ...

ఉదయమిత్ర | 07.12.2016 10:32:05am

ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్‌ఘడ్‌ భారీ నిర్బంధంలో ఉంది. జర్నలిస్టులకు అక్కడ ప్రవేశం లేదు. అయితే తమ తమ బాధల్ని బయటివాళ్ళకు తెలియపర్చడం కోసం అక్కడి గోండులు తమ స...
...ఇంకా చదవండి

మూడో కన్ను

ఉద‌య మిత్ర‌ | 16.03.2020 03:02:33pm

అమ్మా..నువ్వెవరైతేనేం కాలానికి మూడోకన్నువి ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

  • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
  • Students and the Revolution
  • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    వాళ్ల స్వేచ్ఛ కోసం పోరాడదాం
    నక్సల్బరీని ఎలా అర్థం చేసుకోవాలి?
    భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు
    నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
    లాక్ డౌన్ లో అబద్ధాలు - ఎన్ కౌంటర్లు
    కా. కాశీం విడుదల కోసం కృషి చేసిన మిత్రులందరికీ విప్లవాభివందనాలు - కరోనా విపత్తులో రాజకీయ ఖైదీలను, ఇతర ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి
    చీమకుర్తి వలస కార్మికుల పోరాటం
    వివి ʹమన కవిʹ అని నిరూపించిన సముద్రస్వరం
    కడప జిల్లాలో వలస కూలీల దుఃఖనది
    కాపిటల్ లో కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు
    సర్వాంతర్యామి!
    నడవాలెనే తల్లి- నడవాలెనే

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •