కడప జిల్లాలో వలస కూలీల దుఃఖనది

| సంభాషణ

కడప జిల్లాలో వలస కూలీల దుఃఖనది

- వరలక్ష్మి | 16.05.2020 02:45:28pm


ప్రొద్దుటూరు నుండి 92 మంది ఉత్తరప్రదేశ్ కు చెందిన వలస కూలీలు, తమ రాష్టానికి వెళ్ళడానికి అనుమతి వచ్చిందని అధికారులు ఫోన్ చేసి చెబితే ఆదరాబాదరాగా బయలుదేరారు. సంతోషంగా ఇళ్ళకు ఫోన్లు చేసుకొని అన్నీ సర్దుకొని రూములు ఖాళీ చేసి బస్టాండుకు పోయారు. మిట్ట మధ్యాహ్నం, తాగడానికి నీళ్ళైనా ఏర్పాటు చేయకుండా వాళ్ళను ఎండలో కోర్చోబెట్టారు. అక్కడి నుండి వాళ్ళను బస్సులో ఎర్రగుంట్ల రైల్వేష్టేషన్ కు తీసుకెళ్తామని చెప్పారు. చివరికి సాయంత్రం 7 గంటలకు మీ రాష్ట్ర ప్రభుత్వం నుండి పర్మిషన్ రాలేదు, ట్రైన్ కాన్సల్ అయింది, వెనక్కి వెళ్ళండని చెప్పడంతో వాళ్ళు నిలువునా కూలిపోయారు. వెనక్కి తిరిగితే వాళ్లకు అంతకుముందున్న కాసింత గూడు కూడా లేదు. ప్రభుత్వం కనీసం తిండి ఏర్పాటు కూడా చేయలేదు. విషయం తెలిసి ప్రజాసంఘాలు వెళ్లి దాతలను సంప్రదించి రోజూ భోజనం దొరికేలా ఏర్పాటు చేసారు.

కానీ ఆకలి కన్నా వీళ్ళను కుంగదీస్తున్న భయం వేరే ఉంది. లాక్ డౌన్ ఇంకా ఎన్ని రోజులుంటుందో అని! మేం మా ఇల్లు చేరుకోగాలమా లేక ఇక్కడే దిక్కులేని చావు చస్తామా అని. ఆకలో, కరోనానో మమ్మల్ని మింగేస్తుంది. ఎలాగైనా ఊరు చేరుకోవాలి. ఒక్కటే మాట. ఒకటే లక్ష్యం. ప్రభుత్వం ఏమీ చేయదని అర్థమైంది. రెండు నెలలు ఆకలితో దిక్కులేక పడి ఉంటే పట్టించుకోని ప్రభుత్వం, కనీసం పంపియ్యండి మా సావు మేం సస్తాం అన్నా పట్టించుకోదు. డబ్బున్న వాళ్ళదే ప్రభుత్వం. వాళ్ళ కోసం ఎంతైనా చేస్తుంది. ఎక్కడి నుండైనా రప్పించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది.

ఇలా ఆలోచించే 42 మంది రహస్యంగా సామాన్ల ట్రక్కు ఎక్కి బయలుదేరారు. కానీ పోలీసులు పట్టుకొని మళ్ళీ తీసుకొచ్చి పడేశారు. వీళ్ళకు కూడా, నీడ కల్పించడం కోసం మళ్ళీ ప్రజాసంఘాలు, దాతలు పూనుకోవాల్సి వచ్చింది. ఎంతగా విసిగిపోయారో, లేక భయపడిపోయారో గానీ మళ్ళీ తప్పించుకొని శుక్రవారం తెల్లవారుజామున కాలినడకన బయలుదేరారు. ఇప్పుడు వీళ్ళు పోలీసులను తప్పించుకొని రైలు పట్టాల వెంట పోతుంటారనే ఊహే భయం పుట్టిస్తోంది.

ఏమిటీ అవస్థ? కేవలం బతకడానికి వేలకిలోమీటర్లు కొట్టుకొచ్చి, ఎముకలు పిండి చేసుకొని కడుపు నింపుకోవడం. ఉండడానికింత గూడు, కాళ్ళు చాపుకోను ఇంత జాగా లేని బతుకులు. వెట్టి బతుకులు. ఇప్పుడు ఇట్లా ఎక్కడ చూసినా పుట్టలు పగిలినట్లు బైటికొచ్చి నెత్తుటి నడక సాగించాకపోతే బహుశా వీళ్ళున్నారని కూడా గుర్తించేవాళ్ళం కాము. ప్రభుత్వం ఇవాళ కళ్ళు మూసుకొని లాక్ డౌన్ అన్నదా లేక దానికెప్పుడూ కళ్ళు మూసుకునే ఉన్నాయా అనే ప్రశ్న వీళ్ళ వల్లనే బైటికొచ్చింది.

కడప జిల్లాలో దాదాపు 5వేల మంది వలస కార్మికులున్నారని తెలిసింది. వీళ్ళలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, బెంగాల్, ఒడిసా తదితర రాష్ట్రాల వాళ్ళున్నారు. రెండు నెలల లాక్ డౌన్ తో పనులు బందై ఆకలితో అలమటిస్తున్నారు. దాతల కంటబడి అంతో ఇంతో సహాయం దొరికితే తప్ప వీళ్ళను ఏ ప్రభుత్వ అధికారీ పట్టించుకున్నది లేదు. ఇలా సహాయం అవసరమైన వాళ్ళు ఎంత మంది, ఎక్కడెక్కడ ఉన్నారో విచారించే పని కూడా ప్రభుత్వం చేయలేదు. కార్పెంటరీ, ఎంబ్రాయిడరీ పనులు చేసే కొంత మంది ఇక్కడి ప్రజాసంఘాల దృష్టికి వచ్చారు. జయశ్రీ గారు చెప్పిందాని ప్రకారం వీళ్ళ సాధారణ జీవన పరిస్థితులే చాలా హీనంగా ఉంటాయి. సుమారుగా అందరూ కుటుంబాలకు దూరంగా కేవలం పని కోసం ఇక్కడికొచ్చి ఉంటున్నవాళ్ళే. 10-15 మంది కలిసి ఒక గదిలో ఉంటారు. నెలకు 8 నుండి పదివేలు వస్తే ఖర్చులకు పోను డబ్బులు ఇంటికి పంపించాలి. కూలి పని అనడం కన్నా వెట్టి చాకిరీ అనడం కరెక్టు. గాలీ, వెలుతురూ లేని ఇరుకిరుకు పనిస్థలాల్లో పొద్దస్తమానం పనిచేయాలి.

ఒక్క ప్రొద్దుటూరులోనే 1500 మంది ఉంటే వీరిలో సుమారు 800 మంది రామరాజ్యం నుండి (యూపి) వచ్చినవాళ్ళు. స్థానికుల కన్నా తక్కువ కూలికి పనిచేస్తారు. కుటుంబం కూడా ఉండదు కాబట్టి ఎక్కువ గంటలు పనిలో ఉంటారు. వీళ్ళను పనిలో పెట్టుకోడానికి కారణాలు ఇవే.

లాక్ డౌన్ కాలంలో మూడు నాలుగు వందల మందికి తప్ప మిగతావాళ్లకు సహాయం అందలేదని తెలుస్తోంది. అది కూడా ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు చేసిందే. మునిసిపల్ అధికారులు కూడా ఎవరైనా సహాయం అడిగితే దాతలను సంప్రదించి వాళ్ళ ద్వారానే ఇస్తున్నారు. ఏమంటే దీని కోసం మాకు ఏ కేటాయింపులు లేవు అంటున్నారు. సహాయం అవసరమైన వాళ్ళు ఎక్కడో ఉన్నారని ప్రజాసంఘాల వాళ్ళు వెళ్లి డబ్బు ఇవ్వబోతే అవి తీసుకోడానికి కూడా లేచి వచ్చే శక్తి లేక అలా చచ్చిన చేపల్లా పడిపోయి ఉన్నారని చెబుతున్నారు.

మూడో దశ లాక్ డౌన్ లో ప్రభుత్వం వలస కూలీలను వారి సొంతూర్లకు తరలించే ఏర్పాటు చేస్తామని చెప్పగానే ఇంటికిపోయి అయినవాళ్ళను కలుసుకోవాలనే తాపత్రయం కలగడం సహజం. ఇక్కడ మేము ఆకలితోనైనా చావాలి, కరోనాతోనైనా చావాలి. ఎందుకంటే కిక్కిరిసిన గదుల్లో ప్రభుత్వం చెప్పే ʹసామాజిక దూరంʹ పాటించడం అసాధ్యం. అట్లా ఇక్కడ దిక్కులేని చావు చచ్చేకన్నా, ఇంటికిపోయి అయినవాళ్ళ మధ్య చావడం మేలు అంటున్నారు. పోలీస్ స్టేషన్, ఎమ్మార్వో ఆఫీసు, మునిసిపల్ ఆఫీస్ చుట్టూ కాళ్ళరిగేలా తిరిగుతూ, అదిలింపులు, విదిలింపులు భరిస్తూ కదిలిస్తే కరిగి నీరై భోరున ఏడుస్తున్నారు. ఆకలితో చావాలా, ఆత్మహత్యలు చేసుకోవాలా అని అడుగుతున్నారు. మీ చేతకానప్పుడు మూసుకొని కూర్చోండి.. మా దారిన మేం పోతాం అని నిప్పులు కక్కుతున్నారు.

జిల్లాలో 5వేల మందికి గాను ఇప్పటికి నాలుగైదు వందల మందిని మాత్రమే పంపించారు. ఒక్కో బస్ లో 30 మందిని మాత్రమే ఎక్కించుకుంటామంటుంటే ఒక్క గదిలో పది మంది ఉన్నవాళ్ళం, సామాజిక దూరం ఇప్పుడే గుర్తొచ్చిందా అని అడుగుతున్నారు. పోనీ ఆలా కూడా ప్రభుత్వం వాహనాలు ఏర్పాటు చేయదు. సొంతంగా బస్సు ఏర్పాటు చేసుకుందామంటే 30 మందికి మాత్రమే పర్మిషన్ అని ఎమ్మార్వో అంటాడు. ఈ లెక్కన అయితే మనిషికి నాలుగైదువేలు పడుతుందని ఒడిసా కార్మికులు అంటున్నారు. తిండికే లేకుంటే వేలకు వేలు ఎక్కడి నుండి తెచ్చేది. చెప్పుకుంటూ పొతే అయ్యేది కాదు.

కానీ లక్షల కోట్ల పేకేజీలు ఏమయ్యాయి? బడాబాబుల సహాయ నిధులు ఏమయ్యాయి? పేదవాళ్ళంటే ఒక్క పోలీసు లాఠీలే ఆడతాఎందుకని? ప్రభుత్వం ఉన్నది ఎవరికోసమో తానే చెబుతున్నట్లుంది కదా?

No. of visitors : 153
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


సోషలిజమే ప్ర‌త్యామ్నాయం, నక్స‌ల్బ‌రీయే భారత విప్లవ పంథా

పి.వరల‌క్ష్మి | 29.04.2016 11:02:35am

20, 21వ శతాబ్దంలో పుట్టుకొచ్చిన భిన్న ధోరణుల‌న్నీ సారాంశంలో మార్క్సిస్టు వ్యతిరేకత ముఖ్యమైన ల‌క్షణంగా కలిగి ఉంటున్నాయి. కొన్నయితే మార్క్పిజం పేరుతోనే ప్రపంచ...
...ఇంకా చదవండి

నేనెందుకు రాస్తున్నాను?

పి.వరలక్ష్మి | 05.10.2016 01:16:41am

బూర్జువా పార్టీలు, మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తాయి కాబట్టి వాస్తవాలు చెప్పడం కోసం రాస్తాను. ఉదాహరణకు కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని దశాద్బాలుగా ఒక.......
...ఇంకా చదవండి

పెట్టుబడిదారీ వ్యవస్థ గర్భంలోనే ఎడతెగని సంక్షోభాలు

వ‌ర‌ల‌క్ష్మి | 12.03.2017 12:32:58am

సంక్షోభ కాలసూచికలు : ప్రజా ఆకాంక్షలు, ఆచరణ - సోషలిజమే ప్రత్యామ్నాయం (విర‌సం సాహిత్య పాఠ‌శాల కీనోట్).....
...ఇంకా చదవండి

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం

| 28.07.2016 08:35:37pm

అసంఖ్యాక రచనలు నిండైన సాహితీ జీవితాన్ని, నిబద్ధ సామాజిక దృక్పథాన్ని, నిజాయితీని తెలియజేస్తాయి. ఆమె రచనల్లో, ఆమె సామాజిక జీవితంలోనే ʹహజర్ చురాషిర్ మాʹ .......
...ఇంకా చదవండి

సీమ విద్యార్థులు ఆలపించిన కరువు రాగాల ʹకన్నీటి కెరటాలుʹ

పి.వరలక్ష్మి | 03.09.2016 01:40:55am

మన ఊర్లలో గూటి గువ్వలు, పాల పిట్టలు, ఎర్ర జొన్నలు, సజ్జ గింజెలు ఏమైపోయాయి? రాయలసీమ ప్రకృతి మరింతగా ఎందుకు నాశనమవుతోంది? పౌష్టిక ఆహారాన్నిచ్చే తిండి .......
...ఇంకా చదవండి

ఆ చావు ఎవరికీ రావొద్దు - యురేనియం ఎక్కడా తవ్వొద్దు.

పి.వరలక్ష్మి | 19.11.2019 08:06:37pm

నాగప్పకు బొత్తిగా బాలేదు. ఇరవై రోజుల క్రితం కింది నుండి తొడల భాగం దాకా విపరీతంగా బొబ్బలోస్తే పులివెందుల గవర్నమెంట్ ఆస్పర్తిలో చేర్చారట. రెండు రోజులుండి వచ్...
...ఇంకా చదవండి

ఇది మనిషి మీద యుద్ధం

పి. వరలక్ష్మి | 19.04.2016 10:59:20am

సైనిక, రాజకీయార్థిక, ప్రచార రంగాల్లో సామ్రాజ్యవాదం ఎంత దాడి చేస్తున్నదో అర్థం చేసుకోవాలంటే వాటన్నిటినీ అనుసంధానించే మంద్రస్థాయి యుద్ధాన్ని అర్థం చేసుకోవాలి...
...ఇంకా చదవండి

మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రం పై కీనోట్

పి. వ‌ర‌ల‌క్ష్మి | 03.06.2016 10:43:06pm

9, 10 జ‌న‌వ‌రి 2016 తేదీల్లో విజ‌య‌వాడ‌లో జ‌రిగిన విరసం 25వ రాష్ట్ర మ‌హాస‌భ‌ల్లో మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రంపై రాష్ట్ర కార్య‌ద‌ర్శి పి. వ‌ర‌ల‌క్ష్మి కీనోట్‌...
...ఇంకా చదవండి

ఉనా స్వాతంత్ర నినాదం

పి.వరలక్ష్మి | 15.08.2016 10:44:28pm

ఆగస్టు పదిహేను ద్రోహం చెప్పకపోతే అన్నం సహించదు నాకుʹ అని చెరబండరాజు అన్నట్లు బూటకపు స్వాతంత్రాన్ని ఎండగడుతూ నిజమైన స్వాతంత్రం కోసం ఉనా దళిత సమ్మేళనంతో... ...
...ఇంకా చదవండి

ప్రొఫెస‌ర్‌ క‌ంచ‌ ఐల‌య్య‌కు సంఘీభావంగా భావప్రకటనా స్వేచ్ఛకై

వరలక్ష్మి | 01.06.2016 09:29:12am

ప్రభుత్వాలు భావాల పట్ల నియంత్రణలు అమలుచేయజూస్తూ, భిన్నాభిప్రాయాన్ని, నిరసనను క్రిమినలైజ్ చేస్తూ దేశవ్యాప్తంగా ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలకు వ్య...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  వాళ్ల స్వేచ్ఛ కోసం పోరాడదాం
  నక్సల్బరీని ఎలా అర్థం చేసుకోవాలి?
  భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు
  నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  లాక్ డౌన్ లో అబద్ధాలు - ఎన్ కౌంటర్లు
  కా. కాశీం విడుదల కోసం కృషి చేసిన మిత్రులందరికీ విప్లవాభివందనాలు - కరోనా విపత్తులో రాజకీయ ఖైదీలను, ఇతర ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి
  చీమకుర్తి వలస కార్మికుల పోరాటం
  వివి ʹమన కవిʹ అని నిరూపించిన సముద్రస్వరం
  కడప జిల్లాలో వలస కూలీల దుఃఖనది
  కాపిటల్ లో కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు
  సర్వాంతర్యామి!
  నడవాలెనే తల్లి- నడవాలెనే

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •