తమ వర్గం వాడని కవుల లోకం గర్వంగా చెప్పుకోదగ్గ కవి వివి. ప్రేమ కవి నుండి విప్లవకవిగా రూపాంతరం చెందడానికెంత ఘర్షణ పడాలో అంత ఘర్షణ పడిన వాడు వివి. వివి ఒక సంచలనం, వివి ఒక గుండెనిబ్బరం.
తన దృక్ఫథాన్నుండి పక్కకు తొలగకుండా, ఏ తోట్రుపాటు లేకుండా, యాభై ఏళ్ళుగా జనం మధ్య ఉంటూ జనకవిత్వానికి తన కలాన్నీ, మేధస్సును అంకితం చేసినవాడు వివి. ఈయన తనకు తానే ఓ దోవనూ, ఒక కోవనూ ఏర్పాటు చేసుకున్నాడు. దానికి ఫలితంగా వివి దారిలో ఎదురుపడ్డవి జైళ్ళూ నిర్భంధాలు అవమానాలూ నిఘాలు. ఇప్పుడు కూడా ఆయన ఓ కుట్ర కేసులో ఖైదులోనే ఉన్నాడు. ఇంతలా రాజ్యాగ్రాహానికి గురై పదుల సార్లు ఖైదులోకి పోయిన కవి ఇంకోడు ఉన్నాడా? అనుమానమే!
ఇలాంటి కవిని మా వాడు అని ఎందుకు కవితాలోకం ఆలింగనం చేసుకోలేకపోయింది. సమాజంపై ప్రభావం వేసే ఏ చిన్న సంఘటన కూడా ఈ కవి చూపును దాటిపోలేదంటే అతిశయోక్తి కాదు. కారణం ఆయన నిబధ్ధతే! తిరుగుబాటు బావుటాని ఎగురవేయడమే. ధైర్యంగా విప్లవ సాంస్కృతిక రాయబారిగా ఉంటూ ప్రదర్శించిన ధీరత్వం వల్లే! కాలంతో ఎదురీతున్నప్పుడు ఎదురొచ్చే సవాళ్ళను ఎదుర్కోంటూ తనను తాను ఆ మార్పులతో అపడేట్ చేసుకోలేని వాడు కవెలా అవుతాడు? తనని తాను పరిస్థితులకు తగ్గట్టు చారిత్రక గమనానికి తగ్గట్టుగా మార్చుకుంటూ వచ్చాడు కాబట్టే వివి విప్లవకవి అయ్యాడు. జనం మీద రాజ్యం చేసిన ప్రతి దొమ్మినీ తన రాజకీయ తక్కెడలో తూస్తూ రికార్డు చేశాడు. తన పంధాలో ముందుకు సాగడంలో ఆయన చూపిన పరిణితి అనన్య సామాన్యమైంది. చాలా కొద్ది మందికే సాధ్యమైనది.
అలాంటి కవి గురించి పాలమూరు అధ్యయన వేదిక వాళ్ళు ఇటీవలే "వివి కవిత్వంతో ఒక రోజు" అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు వివి కవిత్వం మీద చేసిన ప్రసంగాలతో "సముద్ర స్వరం" అనే పుస్తకాన్ని ప్రచురించారు. వివి కవిత్వం గురించీ, ఆయన వ్యక్తిత్వం గురించీ, వారికి వివితో ఉన్న అనుబంధం గురించీ, ఇంతమంది వెలిబుచ్చిన భిన్న కోణాలు, పార్శ్వాలు ఖచ్చితంగా పాఠకులకు మంచి పఠానానుభవాన్ని కలిగిస్తాయి.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలందరూ మంచి పేరున్న కవులూ రచయితలు. వివితో ప్రత్యక్ష సంబంధం ఉండి ఆయనను దగ్గరగా చూసిన వారే కావడంతో ఆయన గురించి నిర్ధుష్టంగా వివరించడానికి అవకాశం వచ్చింది. కాబట్టి దానికి తగ్గట్టుగా, సాధ్యమైనంత స్పష్టంగా విపులంగా వివి గురించి చెప్పడానికి బాగా ప్రిపేర్ అయ్యారని ప్రసంగపాఠాలు చదివింతర్వాత పాఠకులకు అర్థమౌతుంది.
వివి ప్రత్యక్ష కార్యాచరణలో ఉన్న కవి అని ప్రత్యేకంగా గుర్తు చెయనవసరం లేదు. అయితే ఆ కార్యచరణ వెనుక ఓ నిర్ధిష్ట సిధ్ధాంతం, నిర్దిష్ట విప్లవోద్యమం చోదకశక్తులుగా పని చేస్తున్నాయి. ఆయన ఎంత సంఘజీవో ఎంత ఆచరణశీలో అంత రాజకీయజీవి. ఆయనవి సగటు ఓట్ల రాజకీయాలు కాదు. మొత్తం వ్వవస్థను మార్చి సమసమాజం సృష్టించాలని నినదించే ప్రత్యామ్నయ రాజకీయాలు. ఇప్పుడున్న దోపిడీ పీడనల స్థానంలో సమస్త పీడిత ప్రజారాశులను అధికారం స్థానంలో నిలబెట్టే రాజకీయాలవి. కాబట్టి ఈయన కవిత్వం కూడా సహజంగానే ధిక్కార స్వరం కలది. యాభై ఏళ్ళ నిబధ్ధత కలిగిన రాజకీయాలకు ప్రతింబింబంలా ఆయన కవిత్వం నిలబడిపోతుంది. ఇంతకంటే ఓ కవి నిరూపించాల్సిందేముంటుంది. కానీ వివి కవిత్వం పై రావాల్సినంతగా విమర్ళ రాలేదు. ఈ పుస్తకం ఖచ్చితంగా ఆ లోటును కొంత తీరుస్తుంది. అతి సూక్ష్మంగా కాకపోయినా స్థూలంగ నైనా వివి కవిత్వాన్ని పాఠకులు పరామర్శించడానికి ఉపయోగపడుతుంది. పాఠకులకు వివిని ఇంకొంత దగ్గరగా తెస్తుంది. పాలమూరు అధ్యయన వేదిక నిర్వహించిన సభ, ఈ పుస్తకం వేయడం వెనుక నిర్వహాకుల వ్యూహం కూడా ఇదే కాబోలు.
ఆయన కవిత్వమే ఆయన వ్యక్తిత్వం అని ఈ పుస్తకం ప్రూవ్ చేస్తుంది. కవిత్వం వ్యక్తిత్వం కావటం ఏమిటి అనే సందేహం కలగొచ్చు. కవిత్వం మహాఅయితే ఒక కవి వ్యక్తిత్వంలో ఒక పార్శ్వం కావొచ్చు. కానీ వివి విషయంలో అది నిజం కాదు.
ఆయన కవిత్వం అంతా ఆయన ఆచరణలో భాగంగా ఎదుర్కొన్న అనేకానేక సంఘటనలూ, రాజకీయ పరిణామలూ, ప్రజాపోరాటాలూ, మానవ హక్కులు, 1970 ల నుంచి నిన్నా మొన్న ఆయన జైలుకెళ్ళేదాకా ప్రతి మలుపులో చరిత్రని ఆవాహన చేసుకుంటూ వచ్చిన ఓ చలన- సంచలనాల ప్రతి. ఆయన వీటన్నింటికీ ప్రత్యక్షసాక్షి. ఆచరణ ఆయన గీటురాయి కాబట్టి, మిగతా అందరికంటే బాగా ఈ మార్పులను అధ్యయనం చేయగలిగాడు కాబట్టి మిగతా కవుల్లో లేని స్పష్టత ఆయన కవిత్వంలో గోచరిస్తుందని ఈ పుస్తకం రుజువు చేస్తుంది. ఇన్ని దశాబ్దాలుగా రాస్తున్నా ఆయన కవిత్వం మసకబారలేదు సరికదా అదింకా పదును దేరుతూ వస్తోంది. అందుకే వివి కవిత్వం 1300 పైగా పుటలుగా విస్తరించింది. వేణు గారన్నట్టు అయిదు దశాబ్దాల మన దేశ ప్రజల పోరాట చరిత్ర ఆయన కవిత్వం నిండా పరుచుకుంది. ఇది నిజానికి తెలుగు కవిత్వానికి ఒక కొత్త చేరుపు. ప్రజలచరిత్ర కవిత్వంలో తన స్థానాన్ని సంపాదించుకోవడానికీ, దానికి వివి పదునైన కలం తోడవడానికీ, నిజానికి కవిత్వ రీతి పరిపుష్టం కావడానికీ, కవిత్వంలోని కొన్ని ఖాళీలను పూరించడానికీ ఒక కవి పడిన యాతన కూడా చరిత్రలో ఒక చేరుపు.
చరిత్రని చెబుతున్నప్పుడు కవిత్వం పలుచనైపోయే ప్రమాదం లేదా అనే అనుమానం రావొచ్చు. నిజానికి విప్లవం తనకు తానే ఓ సృజానాత్మక వ్యక్తీకరణ. ప్రజాపోరాటాల నేపథ్యంలో వచ్చే సామాజిక మార్పులూ చేర్పులూ వాటికవే సృజనాత్మకమైనవి. కానీ వాటిని చూసే చూపులోనే వస్తుంది తేడా అంతా. కొందరికి అందులో హింస మాత్రమే కనబడొచ్చు ఇంకొందరికీ భద్రమైన దోపిడీ పీడనల్లేని భవిష్యత్ పట్ల నమ్మకం కనబడొచ్చు. ఏ ఘర్షణా లేకుండా అభివృధ్ధి సాధ్యం కాదనే సార్వజనీన సత్యాన్ని ఆచరణలో పెట్టాల్సిన బాధ్యత నిజానికి సృజనకారులుగా కవులకు ఉంది. అలాంటి దృక్ఫథానికి జీవితాన్ని అంకితం చేసిన కవి వ్యక్తీకరణల్లో సృజనాత్మకత ఉండదా? బలం ఉండదా? బరువు ఉండదా? ఈ చారిత్రక పరిణామ క్రమాన్ని తనవైన అధ్బుతమైన వ్యక్తీకరణలకు లోటే లేని కవిత్వం వివి రాశాడనీ వక్తలు నిరూపిస్తారు అనేక ఊటంకిపుల్తో!
చాలా భిన్నమైన రంగాల నుండి భిన్నమైన బ్యాక్ గ్రౌండ్స్ నుంచి వచ్చిన వారు వివి కవిత్వాన్ని సమీక్షించే పని పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు విభిన్నంగానే వివి కవిత్వాన్ని దర్శించారు. అందుకే ఏ ప్రసంగానికా ప్రసంగానికా ప్రసంగం వినూత్నంగా ఉంది. పాఠకులకు ఖచ్చితంగా ఉద్వేగానికి గురి చేస్తుంది. వివి కవిగా నిలబడ్డాడా కార్యకర్తగా నిలబడ్డాడా లేదా ఒకదానికొకటి సహయోగులా అనేది తేల్చడం కష్టం. కాకపోతే తన అనుభవాలన్నింటినీ కవిత్వంలో ఆవష్కరించుకోవడం ఒక ప్రొగ్రెసివ్ లక్షణం కాదా?
కాత్యాయని గారి ముందు మాట చాలా కొత్తగా అనిపించింది. ప్రసంగపాఠాల్లోని వక్తలు వివి మీద అంచనాలలోని ముఖ్యమైన అబ్సర్వేషన్స్ వరుసగా చెప్పుకుంటూ వచ్చారు. పాఠకులు పుస్తకం చదవడానికి సిధ్ధపడిపోవడానికి ఉపయుక్తమైన ముందుమాట.
నన్ను బాగా అబ్బురపరిచన వాటిలో దర్భశయనం, వేణుగోపాల్, ఖాదర్ అన్న, పాణి , ప్రభాకర్, యాకూబ్ అన్న ప్రసంగపాఠాలు వివి కవిత్వతత్వాన్ని బాగా పాఠకులకు దగ్గర చేస్తాయి. సందేహం లేదు. ఖచ్చితంగా చదవాల్సిన పుస్తకాన్ని ప్రచురించినందుకూ, కవుల కోసమే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు పాలమూరు అధ్యయన వేదికకు అభినందనలు..
Type in English and Press Space to Convert in Telugu |
తలపుల తోవలోకి స్వాగతంఓ చారిత్రకదశతో ఘర్షణపడి విశిష్ట వ్యక్తులుగా నిలబడ్డ ఇద్దరి జీవితాల గురించి మనకు పరిచయం చేసే రచన. ఆ మలుపుల్లో కైఫీ షౌకత్లు నిర్వహించిన పాత్రనూ సమాజం కచ్చితం... |
అలుగు నేత్రంఒకరి కన్నుల తడి
ఇంకొకరి కన్ను మోస్తున్న ఈ దివ్య
సందర్భం కంటున్న కల ఒకటి కావడం
ఎంత కాకతాళీయం... |
డ్రాక్యులా నీడదశాబ్దాల దాహపు రెక్కలు విచ్చుకొని
ఎడారి దేహం
ఒయాసిస్సుల తడి కోసం
వెదుకులాడుతుంది
ఇసుక పరదాల మధ్య స్వప్న కళేబరాల విస్ఫోటన ఉక్కపోతలో జీవితం ఉడికిపోతుంది... |
వారిద్దరూకాలాన్ని
మండించాలి
లేదా
మనమే
మంటలమవ్వాలి... |
సజీవ జ్ఞాపకమై…వర్ణసంకరం చేయడానికి తను సిధ్ధపడిందంటే
తన వర్ణమేదో మరిచిపోయెంతగా ఎంత మొహబ్బత్ కురిపించి ఉంటావో నువ్వు
నీ నీలి కౌగిళ్ళలో నలిగిన ఆ కురుల మీంచి ప్రహించిన
గాలి... |
డెన్ ఆఫ్ లైఫ్వాళ్ళ పాటల్నీ మాటల్నీ నృత్యాల్నీ అడవినీ అడవి జీవితాన్నీ
ప్రేమించడం నేర్చుకోవాలి
కార్చిచ్చులకు ఆజ్యం పోస్తున్న రాజ్యాన్నీ
రాజ శాసనాల్ని అదే కార్చిచ్చులకు కాన... |
పరిమళభరిత తావుల్లోంచినీకోసం నేను ఎదురుచూసేది
ఓ కొత్త యుధ్ధ వ్యూహం కోసమే కాదు
కొత్త జ్ఞానం పొందడం కోసమే కాదు
సహచరీ!
నీ నవీన జీవన ఆవిష్కరణల్లో
నన్ను నేను భాగం చేసుకుందామని.... |
చూపులుఒక సామూహికత ఎర్రజెండాల ఎగరేసుకొని
ఒకవిప్లవాన్ని నా చూపు
కలగా ధరించింది
... |
బందిష్ప్రతిఘటన ఊపిరిగా నిలబడిన కాశ్మీరంలో
నిషేదాజ్ఞల మధ్యే నినాదాలు పదునెక్కుతాయి
మంచుకోనల్లోంచి లావాలు పెల్లుబుకుతాయి
... |
ఇంతెహా ఇంతెజార్ కీ..నింగి మీద పొడిచిన ఆ నెలవంక
వంపులో ఏదో వెలుతురు కబురు
అతడు
పంపాడేమో
లేకుంటే
ఎందుకలా వెన్నెల ఆమె కప్పుకున్న చాదర్లా
ఆమె పలికే దువాలా ఇలపై వర్షిస్తుంది... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |