లాక్ డౌన్ లో అబద్ధాలు - ఎన్ కౌంటర్లు

| దండ‌కార‌ణ్య స‌మ‌యం

లాక్ డౌన్ లో అబద్ధాలు - ఎన్ కౌంటర్లు

- పాణి | 23.05.2020 10:43:51am

మానవాళికి వచ్చిన కరోనా విపత్తును పాలకులు పూర్తి స్థాయిలో వాడుకుంటున్నారు. ఆత్మ నిర్బర్ పేరుతో మోదీ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్లకు, సంపన్న వర్గాలకు పంచి పెట్టింది. తరతరాల పోరాట ఫలితమైన కార్మిక చట్టాలను రద్దు చేసింది. కరోనా వల్ల అందరి నోటికి గుడ్డలు కట్టేసి పబ్లిక్ రంగాలను ప్రైవేటీకరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ చర్యలతో విధానపరమైన అభ్యంతరమేమీ ఉండదు. అన్నీ కలిసి ఒకే దారిలోనే సాగిపోతున్నాయి.

ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు అణచివేత కోణం కూడా ఉంది. వేర్వేరు రూపాల్లో దాన్ని చూడవచ్చు. లాక్ డౌన్ కాబట్టి ప్రజలందరూ ఇండ్లలో ఉండాలని, భౌతిక దూరం పాటించాలని చెబుతున్న ప్రభుత్వాలు ఈ రెండు నెలలుగా నిరాటంకంగా ఎన్ కౌంటర్లు హత్యలు చేస్తునే ఉన్నాయి. అక్రమ అరెస్టులకు పాల్పడుతూనే ఉన్నాయి. లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి చత్తీస్ ఘడ్ లో సుమారుగా 11 మందిని ఎన్ కౌంటర్ పేరిట చంపేశారు. గడ్చిరోలి ప్రాంతంలో కరోనా జాగ్రత్తలపై ఆదివాసులకు అవగాహనా కల్పించడానికి వెళ్లిన కామ్రేడ్ మైనాను ఏకపక్ష కాల్పులలో చంపివేశారు. ఒడిషాలో గ్రామాల మీద దాడులు చేసి హత్యలు చేశారు. కేరళలో అక్రమంగా ఎస్ఏఏ కేసులు పెడుతున్నారు. పశ్చిమ కనుమల్లో పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్స్ చేస్తున్నారు. జార్ఖండ్ లో సుమారు 10 మందిని ఎన్కౌంటర్ పేరిట చంపివేశారు.

దేశమంతా కర్ఫ్యూ ఉందని చెప్పుకుంటూనే వందల వేల మంది పారా మిలటరీ బలగాలు పట్టణాల నుంచి తరలి వెళ్లి అడవులను గాలిస్తున్నాయి. హింసకు పాల్పడుతున్నాయి. అంటే లాక్ డౌన్లో ప్రభుత్వాలు ఒక పక్క పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తూనే ఇంకో పక్క ఇలాంటి హత్యాకాండ, అణచివేత కొనసాగిస్తున్నాయి.

కరోనా సమయంలో కూంబింగ్ ఆపరేషన్లకు వెళ్లే పోలీసుల ద్వారా ఆదివాసులకు కరోనా సోకవచ్చు అని, కాబట్టి దాడులు ఆపేయాలని నందిని సుందర్ డిమాండ్ చేశారు. సెర్చ్ ఆపరేషన్స్ తమ చేతిలో లేవని, తాము కేవలం అధికారులం మాత్రమే అని డీఐజీ సుందర్ రాజు అన్నాడు. కాకపోతే ఇంతక ముందు కంటే కొంత మేర బలగాలను తగ్గిస్తామని చెప్పాడు. జార్ఖండ్, గడ్చిరోలి పోలీసు అధికారులు మాత్రం ఈ సమయంలో కూడా మావోయిస్టులకు ఎలాంటి అవకాశాలు ఇవ్వదల్చుకోలేదని బాహాటంగానే ప్రకటించారు. లోతట్టు ప్రాంతాలకు వెళ్లి అయినా సరే వారిని మట్టుబెట్టడమే లక్ష్యం అన్నారు.

కరోనా కాలంలో కూడా ఇదీ పాలకుల విధానం. అయితే పోలీసులు ఇక్కడితో ఆగలేదు. మావోయిస్టు ఉద్యమాన్ని అణచివేయడంలో భాగంగా ఎప్పటిలాగానే అబద్ధ ప్రచారాలు కూడా చేస్తున్నారు. ఇటీవల దంతెవాడ ఎస్పీ అభిషేక్ మాట్లాడుతూ ప్రభుత్వం పీడీఎస్ పథకం ద్వారా ప్రజలకు అందిస్తున్న రేషన్ సరుకులను మావోయిస్టులు దోచుకుంటున్నారని ఆరోపించాడు. చత్తీస్ ఘడ్ కు తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వెళ్లిన కూలీలు తిరిగి వస్తోంటే అడ్డుకుంటున్నారని ఇంకో మాట అన్నాడు.

చత్తీస్ ఘడ్ డీఐజీ సుందర్ రాజు ఇంకా ముందుకు వెళ్లిపోయాడు. రాష్ట్రంలోని ఆదివాసీ ప్రాంతాల్లో ప్రజలకు కరోనా నివారణ సేవలు అందించడానికి వైద్యులు వెళ్లకుండా మావోయిస్టులు రోడ్లు, కల్వర్టులు పేల్చేస్తున్నారని ఆరోపించాడు. వంతెనలు కూలగొడుతున్నారని అన్నారు. వలస కూలీల విషయంలో మావోయిస్టులు పరిణతితో వ్యవహరిస్తారని ఆశించామని, కానీ వాళ్లు దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని వాపోయాడు. - ఇవన్నీ పత్రికల్లో వచ్చిన వార్తలే.

కానీ మావోయిస్టులు ఎక్కడ ప్రజల రేషన్ దోచుకున్నదీ చెప్పలేదు. వైద్య సిబ్బంది వెళ్లకుండా ఏ రోడ్లు పేల్చేశారో వివరాలు ఇవ్వలేదు. వలస కూలీల తిరుగు ప్రయాణాన్ని ఏ ఊళ్లో అడ్డుకున్నదీ ఊసే లేదు. అబద్దాలు చెప్పడం వాళ్ల అలవాటు. కాబట్టి లాక్ డౌనకు తగిన అబద్దాలు నిస్సిగ్గుగా చెప్పేశారు. ప్రజా జీవితంలో ఏ మాత్రం సంబద్దత లేని తాము మావోయిస్టుల గురించి ఇలా మాట్లాడితే ఎవ్వరైనా నవ్విపోరా? అని కూడా అనుకోలేదు. ఈ రెండున్నర నెలల్లో ప్రభుత్వాలు కరోనా బాధిత ప్రజలకు ఏం చేసింది అందరికీ తెలిసిందే. తాము ఏదో ఉద్దరించబోతే మావోయిస్టులు అడ్డుకుంటున్నారని చెప్పుకోవడం తప్ప ఇందులో ఏముంది?

నిజానికి మావోయిస్టులు తమ ప్రాంతాల్లో కరోనా నియంత్రణ చర్యలను ముమ్మరంగా చేపట్టారు. ఈ విషయంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. దీని గురించి నెలన్నర నుంచి వార్తలు వస్తున్నాయి. ఒక దశలో ఆంధ్రా ఒడిషా సరిహద్దు ప్రాంతం నుంచి మావోయిస్టు పార్టీ ఒక బహిరంగ ప్రకటన ప్రభుత్వానికి చేసింది. కరోనా తీవ్రమవుతున్నందు వల్ల తమ పార్టీ శ్రేణులు, సైనిక బలగాలన్నీ వైరస్ విషయంలో ప్రజా కార్యక్రమాన్ని చేపట్టాయని, ఈ కాలమంతా తమ వైపు నుంచి ప్రభుత్వ బలగాల మీద దాడులు ఉండవని స్పష్టం చేసింది. దీనికి ప్రభుత్వం స్పందించాలని సూచించింది. పోలీసులు దాడులకు పాల్పడితే తమ ప్రతిఘటన ఉంటుందని కూడా చెప్పారు.

కానీ ప్రభుత్వాలు స్పందించలేదు. పోలీసులే మాట్లాడారు. పోలీసులు ఇలా మాట్లాడటం చాలా కాలం కిందే మొదలైంది. రాంగూడ, గడ్చిరోలి ఎన్ కౌంటర్ల సందర్భంలో, కేరళలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు దేవరాజ్ ను ఎన్ కౌంటర్ చేసినప్పుడు కూడా సమాజం నుంచి వచ్చిన అన్ని ప్రశ్నలకు పోలీసులే సమాధానాలు చెప్పారు. అన్ని రకాలుగా పోలీసు అధికారులే సైనిక మానసిక యుద్ధాలను నడిపిస్తున్నారు. ఇది మంద్రస్థాయి యుద్ధతంత్రంలో భాగం. ప్రజా ఉద్యమాల గురించి అబద్దాలు ప్రచారం చేయడం పోలీసుల విధుల్లో భాగం అయిపోయాయి. వేలాది మందితో ఉద్యమ ప్రాంతాలన్నిట్లో ఈ కరోనా సంక్షోభంలో కూడా ఎప్పటిలాగే దాడులు చేస్తున్నారు. ఎన్ కౌంటర్ హత్యలు చేస్తున్నారు. వీటికి తోడు కరోనా వాతావరణానికి తగిన అబద్దాలనూ ప్రచారంలో పెడుతున్నారు. వీటన్నిటి మధ్యనే మావోయిస్టులు తాము ఎంచుకున్న కరోనా నియంత్రణ ప్రచారం చేస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.

ఇలాంటి అబద్దాలకు ఒక అసంగత విషయాన్ని కూడా పోలీసులు జోడించారు. లాక్ డౌన్ వల్ల మావోయిస్టులకు ఆహార సమస్య తలెత్తిందని, అందువల్ల ప్రజల రేషన్ దోచుకుంటున్నారని పోలీసు అధికారులు అన్నారు. ప్రజల రేషన్ దోచుకుంటున్నారనే అబద్దానికి ఇలాంటి సాకును కారణంగా చూపించి ప్రజలను నమ్మించవచ్చని అనుకున్నట్లుంది.

కానీ దంతెవాడలాంటి ప్రాంతాల్లో ఎన్నో ఏండ్లుగా ఆదివాసులు క్రాంతికారీ జనతన సర్కార్ ఆధ్వర్యంలో వ్యవసాయంలో స్వయం సమృద్ధి సాధించారని చాలా నివేదికలు చెబుతున్నాయి. ప్రధాన మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. అక్కడ ప్రజలు ప్రభుత్వం ఇచ్చే నాసిరకం రేషన్ మీద ఆధారపడలం లేదని, నాణ్యమైన పంట ఉత్పత్తులు సాధిస్తున్నారని వాటి సారాంశం.

పోలీసులు దీన్నంతా మరుగుపరచడానికి ఒకదాని మీద మరో అబద్ధాన్ని పేర్చేశారు. లాక్ డౌన్ మొదలుకాగానే మావోయిస్టుల ʹఫుడ్ చైన్ʹ దెబ్బతినిపోయిందని, ఏకంగా ప్రజల రేషన్ కాజేస్తున్నారని చెప్పదల్చుకున్నారు.

పత్రికా కథనాలకే పరిమితమైన వాళ్లకు కూడా నిజమేమిటో తెలియడం ఏమంత కష్టం కాదు కదా? అయినా పోలీసులు బరితెగిస్తారు. ఏమైనా మాట్లాడవచ్చని అనుకుంటారు. ఆశ్చర్యకరమేమంటే.. వలస కూలీలు తమ సొంత ప్రాంతాలకు వెళ్తోంటే మావోయిస్టులు ఎందుకు అడ్డగిస్తారు? కామన్ సెన్స్ ఉన్న వాళ్లెవరికైనా ఈ ప్రశ్న ఎదురవుతుంది. వలస కూలీల ప్రయాణంతో దేశవ్యాప్తంగా నిర్మాణ రంగంలో ఉన్న సంపన్నులు, పెట్టుబడిదారులు హడలెత్తిపోయారు. వీళ్లంతా ఊళ్లకు వెళ్లిపోయి తిరిగి మళ్లీ రాకుంటే తమ పనులు ఎలా పూర్తవుతాయని భయపడ్డారు. కారు చౌకగా శ్రమశక్తిని అమ్ముకొనే వాళ్లు ఎక్కడ దొరుకుతారని ప్రభుత్వాలకు విన్నవించుకున్నారు. వలస కూలీల తరలింపును ఆపాలని, రాష్ట్రాలోకి రానివ్వవద్దని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పుకున్నారు. ఒక దశలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే వలస కూలీలను రానీయమని కూడా చెప్పేశాయి.

మరి వలస కూలీలను అడ్డుకోవాల్సిన అవసరం మావోయిస్టులకు ఎందుకు ఉంటుంది? అనే ప్రశ్న ఎవరికైనా తలెత్తేదే. దీనికి వాళ్ల రాజకీయాలపట్ల ఏకీభావం ఉండనక్కర్లేదు. తార్కికంగా ఎదురయ్యే సందేహమిది.

విప్లవోద్యమాన్ని అణచివేసి ప్రజలకు దూరం చేద్దామని ప్రభుత్వాలు అనుకుంటాయి. అబద్దాలు ప్రచారం చేసి అనుమానాలు లేవదీయవచ్చని అనుకుంటాయి. కానీ ఈ రెండూ సాధ్యం కావని ఎన్నడో రుజువైంది. కాకపోతే కరోనా కాలంలో అబద్దపు ఎదురు కాల్పుల్లాగే అబద్ధాలు కూడా ఉంటాయని మరోసారి పోలీసులే నిరూపించుకున్నారు.





No. of visitors : 400
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?

పాణి | 04.05.2017 10:53:32am

హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల......
...ఇంకా చదవండి

రైతు - నీళ్లు

పెన్నేరు | 16.08.2016 01:10:03pm

రైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం......
...ఇంకా చదవండి

ఈ తీసివేత‌లు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?

పాణి | 16.08.2016 12:59:12am

నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా.........
...ఇంకా చదవండి

ఆజాదీ క‌శ్మీర్ : చ‌ల్లార‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌

పాణి | 16.07.2016 11:04:09am

కాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........
...ఇంకా చదవండి

వివేక్ స్మృతిలో...

పెన్నేరు | 17.09.2016 09:54:49am

వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు.......
...ఇంకా చదవండి

జీవిత కవిత్వం

పాణి | 04.06.2017 12:38:44pm

విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్‌ పద్ధతులకు వ...
...ఇంకా చదవండి

భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే

పాణి | 22.09.2017 01:18:31pm

ఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి......
...ఇంకా చదవండి

కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?

పాణి | 07.10.2017 11:08:49am

ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్‌ దేశస్థుల స్వేచ్ఛ గు...
...ఇంకా చదవండి

మానవ హననంగా మారిన రాజ్యహింస

పాణి | 02.11.2016 08:47:26am

ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం.......
...ఇంకా చదవండి

నాగపూర్‌ వర్సెస్‌ దండకారణ్యం

పాణి | 17.11.2017 11:35:51pm

దండకారణ్య రాజకీయ విశ్వాసాలంటే న్యాయవ్యవస్థకు ఎంత భయమో సాయిబాబ కేసులో రుజువైంది. నిజానికి ఆయన మీద ఆపాదించిన ఒక్క ఆరోపణను కూడా కోర్టు నిరూపించలేకపోయిందిగాని, ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

  • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
  • Students and the Revolution
  • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    వాళ్ల స్వేచ్ఛ కోసం పోరాడదాం
    నక్సల్బరీని ఎలా అర్థం చేసుకోవాలి?
    భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు
    నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
    లాక్ డౌన్ లో అబద్ధాలు - ఎన్ కౌంటర్లు
    కా. కాశీం విడుదల కోసం కృషి చేసిన మిత్రులందరికీ విప్లవాభివందనాలు - కరోనా విపత్తులో రాజకీయ ఖైదీలను, ఇతర ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి
    చీమకుర్తి వలస కార్మికుల పోరాటం
    వివి ʹమన కవిʹ అని నిరూపించిన సముద్రస్వరం
    కడప జిల్లాలో వలస కూలీల దుఃఖనది
    కాపిటల్ లో కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు
    సర్వాంతర్యామి!
    నడవాలెనే తల్లి- నడవాలెనే

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •