వాళ్ల స్వేచ్ఛ కోసం పోరాడదాం

| సంభాషణ

వాళ్ల స్వేచ్ఛ కోసం పోరాడదాం

- పాణి | 29.05.2020 12:56:28pm

ʹఇకనిప్పుడు ఏమీ మిగల్లేదు
ఓ భయానక శూన్యం
అవును అదే ఇప్పుడు కన్ను తెరిచింది
ఓ భయానక భవిష్యత్తు
అదిగో మన కోసం వేచి ఉందిʹ అంటాడు ప్రముఖ విప్లవ కవి సాయిబాబా.

జైలు.. భయానక శూన్యం.. అది కబళించేందుకు చూస్తోంది. లోబడిపోవాలా? లొంగిపోవాలా? భౌతికంగా లేచి నిలిచేందుకు రెండు కాళ్లు సహకరించకపోవచ్చు. విలువలు-విశ్వాసాలే ఆలంబన. చలనానికీ అవే ఆధారం.

ఒంటరితనం, అనారోగ్యం, స్వేచ్ఛా రాహిత్యం, అన్నీ కలిసిన భయానక శూన్యం. అది మనిషిని లోబరుచుకొనేది మాత్రమే కాదు. మనిషి ఆలోచనలనూ లొంగదీసుకొనేది. విశ్వాసాలను దెబ్బతీసేది. భయపట్టేది. నిస్సహాయులను చేసేది. కానీ భవిష్యత్తు ఉన్నది. అదీ భయానకమే. కానీ ఉన్నది. భవిష్యత్తు కాబట్టి ఆశను ప్రేరేపిస్తుంది. లేచి నిలబెడుతుంది. అదీ దానంతట అదే దగ్గరికి రాదు. దూరంగా వేచి ఉన్నది. మనమే చేరుకోవాలి. భయానకమే కావచ్చు. కానీ అది భవిష్యత్తు. అదే దాని శక్తి.

ఎంత తార్కికత ఉన్నదో చూడండి. ఎంత తాత్వికత ఉన్నదో గమనించండి.

జైలు మనుషులను మాత్రమే నిర్బంధించగలదు. ఆలోచనలను అదుపు చేయడం దాని తరం కాదు. విశ్వాసాలను రద్దు చేద్దామనుకుంటుంది. కానీ సాధ్యమా? అదే నిజమైతే చరిత్ర నడిచేదా? చుట్టూ ఎంత భయానక శూన్యం ఆవరించి ఉండనీగాక.. అందులోంచే సారవంతమైన ఆశ మొలకెత్తుంది.

మన చుట్టూ మాట పారాడలేని ఉక్కు గోడలు లేచి ఉండవచ్చు. అదే నిజమైతే మౌనంగానే మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. మన చుట్టూ నిరాశ ఆవరించినట్లు ఉండవచ్చు. అందులోనే ఆశను వెతుక్కొందాం. ఇది మన విశ్వాసాన్ని తుడిచేసే భయానక వాతావరణమే కావచ్చు. దీంట్లోంచే భయానక భవిష్యత్తులోకి ప్రసరిద్దాం. మన జైలు కవులు ఎంత మనోనిబ్బరంతో చారిత్రక ఆశావాదాన్ని ప్రకటిస్తున్నారో చూడండి. మనం వాళ్ల కోసం మాట్లాడటమంటే వాళ్ల విశ్వాసాన్ని అందుకోవడమే. జ్వలింపచేయడమే. నమ్మకాల కోసం వాళ్లు చెదరని గుండె దిటవును ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు వాళ్ల కోసం మాట్లాడటమంటే మనలోని విశ్వాసాలను, విలువలను పతాకాలను చేసి ఎగరేయడమే. నిజంగానే జైళ్లలో బందీలైన కవులు, మేధావులు, ప్రజా కార్యకర్తల గురించే మనం మాట్లాడుతున్నామా? స్వేచ్ఛ కోల్పోయిన మానవుల జీవితేచ్ఛ గురించి మాత్రమే మాట్లాడుతున్నామా? మృత్యుముఖంలో ఉన్న మన సహచరుల గురించే ఆరాటపడుతున్నామా?

ఇది వ్యక్తుల భౌతిక జీవితాన్ని కాపాడుకోవాలనే ప్రయత్నమే కాదు. తక్షణంగా అది కూడా. మానవ జాతి విశ్వాసాలను కాపాడుకోవాల్సిన తరుణం ఇది. ఆలోచనలను అదుపు చేయడానికే రాజ్యం ఇంత చేస్తున్నదని తెలిసి వచ్చాక వాళ్ల విడుదల కోసం చేసే పోరాటం ఎంత విశాలమైనదో మనకు అర్థమవుతుంది. ఇది వ్యక్తుల సమస్య కాదు. ఒక సాయిబాబానో, ఆయన సహచరులో, వీవీనో, ఆయన సహచరులో, తెలంగాణలో వివిధ ప్రజాసంఘాల నాయకులో, రచయితలో.. ఇది వ్యక్తుల గురించి మాట్లాడటం కాదు. వీళ్లుంతా మనకు తెలిసిన మనుషులు. తెలియని వాళ్లెందరో ఉంటారు. వీళ్లలో జీవితమంతా ఆలోచనలకు, ఆచరణకు ధారపోసిన వాళ్లున్నారు. ఈ ప్రపంచాన్ని సమూలంగా మార్చేద్దామనుకుంటున్న వాళ్లున్నారు. దారుణ అనారోగ్యాలతో తల్లడిల్లుతున్నవాళ్లున్నారు. స్త్రీలు ఉన్నారు. పురుషులు ఉన్నారు.

వాళ్లతో పోల్చితే మనం కాసింత స్వేచ్ఛలో ఉన్నాం. సుఖంగా ఉన్నాం. మన స్వేచ్ఛను వాళ్ల విడుదల కోసం వెచ్చిద్దాం. మన సుఖాన్ని వాళ్ల జీవితేచ్ఛ కోసం వినియోగిద్దాం. వాళ్లంతా అద్భుతమైన మానవులు కదా. సున్నిత భావుకులు కదా. అందుకే కవులయ్యారు. మేధావులయ్యారు. సమాజం కోసం శ్రమించే కార్యశీలురయ్యారు. తమ ఊహల్లో ఒక అద్భుత లోకాన్ని నిర్మించుకున్న వాళ్లు. గొప్ప ఉ త్తేజపూరితమైన వాక్కును సొంతం చేసుకున్నవాళ్లు. తమ సహచర్యంతో మనకొక ఉత్తేజాన్ని అందించిన వాళ్లు. ఇవాళ అనంతమైన జీవితానికి తడబాటు లేకుండా సవాల్ విసురుతూ మనల్ని అబ్బురపరుస్తున్నారు. వయోభారాలు, అనారోగ్యాల మధ్య కూడా నిర్భీతినే తమ ఉనికిగా చాటి మనకు ధైర్యం చెబుతున్నవాళ్లు. ఈ భయానకమైన భవిష్యత్తును ప్రజలు సుందర ప్రపంచం చేయగలరనే ఆశ్వాసాన్ని అందిస్తున్నవాళ్లు.

వాళ్లను భౌతికంగానే నిర్బంధించి, రోగాలపాలు చేసి, మృత్యుముఖంలోకి తోసేసి శతృవు సంతోషించవచ్చు. వాళ్ల అద్భుతమైన ఊహాశక్తి ముందు ఇవన్నీ నిలిచేవేనా? సాయిబాబా తానొక దుర్భర జైలు జీవితంలో ఉంటూ తన వలె మరో జైల్లో ఉన్న వివి గురించి ఏమన్నారో చూడండి. హద్దులు లేని మానవ ఊహను, విశ్వాసాన్ని రాజ్యం అదుపు చేయలేదని సాయి నిరూపిస్తున్నారు.

అతని కవిత్వం మట్టివాసన వేస్తుంది
అందులో సముద్రాలు పోటెత్తుతాయి
సుడులు తిరిగే తుఫాను
తూర్పు గాలులు గర్జిస్తాయి
ఉరిమే పడమటి రుతుపవన గాలులు
కుండపోత వర్షాన్ని మోసుకొస్తాయి
అతని చురుకైన పదాల ద్వారా
సామూహిక స్వరం మాట్లాడుతుంది

అతని లాలిపాటలను పిల్లలకు వినిపిస్తారు
వారు ఉజ్వల భవిష్యత్తు కలల్లో తేలిపోతారు
అతని మాటలు మహాపర్వతాలలో
దట్టమైన అడవుల్లో
నేలమీది కఠిన శిలల్లో
ప్రతిధ్వనిస్తాయి
భూమి ప్రతిఘటన
పిల్ల కాలువల్లో చేరి
దక్కను పీఠభూమి ఎగుడుదిగుడు
రాతి పగుళ్ళ గుండా ప్రవహించి
మహానదులలో పోగవుతుంది

మూర్ఖుడా, అది కవిత్వం
అది కవితాద్భుతం..

వివిని ఉద్దేశించిన ఈ కవిత్వం జైల్లో ఉన్న మన మిత్రులందరికీ వర్తించేదే. అది కవిత్వమని, జ్ఞానమని, ప్రజా ఆచరణ అని మూర్ఖుడికి తెలియదు. వాళ్లలో అంతులేని చారిత్రక ఆశావాదం ఉన్నదని, అది తార్కికమైనదని అధికారంలో ఉన్నవాడికి తెలియదు.

ఆ సంగతి తెలియజేయడమే మన పని. దీని కోసం మాట్లాడదాం. ఆలోచిద్దాం. రాద్దాం . వీలైన తీరులన్నిటా ఆందోళన చేద్దాం. ఉద్యమిద్దాం. మన కవులను, బుద్ధిజీవులను, మన ప్రజాసంఘాల నాయకులను విడిపించుకొనే దాకా వాడి మీద తలా ఒక రాయి విసిరేద్దాం. తలా ఒక వాక్యాన్ని సంధిద్దాం. దేశమే జైలయిన వేళ ఇనుప గోడల జైళ్లలో ఉన్న మన వాళ్లందరినీ విడుదల చేసుకోడానికి ప్రతి ఆలోచనను సానపడదాం .

.

No. of visitors : 263
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?

పాణి | 04.05.2017 10:53:32am

హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల......
...ఇంకా చదవండి

రైతు - నీళ్లు

పెన్నేరు | 16.08.2016 01:10:03pm

రైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం......
...ఇంకా చదవండి

ఈ తీసివేత‌లు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?

పాణి | 16.08.2016 12:59:12am

నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా.........
...ఇంకా చదవండి

ఆజాదీ క‌శ్మీర్ : చ‌ల్లార‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌

పాణి | 16.07.2016 11:04:09am

కాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........
...ఇంకా చదవండి

వివేక్ స్మృతిలో...

పెన్నేరు | 17.09.2016 09:54:49am

వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు.......
...ఇంకా చదవండి

జీవిత కవిత్వం

పాణి | 04.06.2017 12:38:44pm

విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్‌ పద్ధతులకు వ...
...ఇంకా చదవండి

భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే

పాణి | 22.09.2017 01:18:31pm

ఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి......
...ఇంకా చదవండి

కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?

పాణి | 07.10.2017 11:08:49am

ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్‌ దేశస్థుల స్వేచ్ఛ గు...
...ఇంకా చదవండి

మానవ హననంగా మారిన రాజ్యహింస

పాణి | 02.11.2016 08:47:26am

ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం.......
...ఇంకా చదవండి

నాగపూర్‌ వర్సెస్‌ దండకారణ్యం

పాణి | 17.11.2017 11:35:51pm

దండకారణ్య రాజకీయ విశ్వాసాలంటే న్యాయవ్యవస్థకు ఎంత భయమో సాయిబాబ కేసులో రుజువైంది. నిజానికి ఆయన మీద ఆపాదించిన ఒక్క ఆరోపణను కూడా కోర్టు నిరూపించలేకపోయిందిగాని, ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  సాహ‌సోపేత జీవితం
  నలబై వసంతాల దండకారణ్యం
  అరుణతార ఏప్రిల్ - జూన్ 2020
  తారకంగారంటే..
  సరిహద్దులు కాపాడేది దేశాన్నా, యుద్ధోన్మాదాన్నా?
  అనేక హింస‌ల గురించి లోతుగా చర్చించిన ఒక మంచి కథ -ʹకుక్కʹ
  హ్యాపీ వారియర్ : సాయిబాబా అండా సెల్ కవిత్వం ʹనేను చావును నిరాకరిస్తున్నానుʹ సమీక్ష
  అస్సాం చమురుబావిలో మంటలు - ప్రకృతి గర్భాన మరో విస్ఫోటనం
  దేశీయుడి కళ
  మీరొస్తారని
  బందీ
  ఊపా చట్టంలోని అమానవీయ అంశాలపట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •