సంకెళ్లు తెంచుకుంటున్న ఊపిరాడ‌నిత‌నం

| సంపాద‌కీయం

సంకెళ్లు తెంచుకుంటున్న ఊపిరాడ‌నిత‌నం

- సంఘ‌ర్ష్‌ | 02.06.2020 10:19:34pm

ఐ కాంట్ బ్రీత్... ఇప్పుడు అమెరికా అంత‌టా వినిపిస్తున్న నినాదం ఇది. వైట్ హౌజ్‌ను సైతం వ‌ణికించిన ʹఊపిరాడ‌నిత‌నంʹ. అవును... ʹఒక మనిషిని వేరొక మనిషి, ఒక జాతిని వేరొక జాతి... పీడించే సాంఘిక ధర్మం ఇంకానా ఇకపై చెల్లద‌ʹని నిన‌దిస్తున్న సంద‌ర్భం ఇది. జాత్యహంకారాన్ని న‌డి బ‌జార్లో నిల‌బెట్టిన సంద‌ర్భం. ఒక జాతి ఊరిరాడ‌నిత‌నం నుంచి పెల్లుబికిన లావా ఇది.

వివ‌క్ష‌, అణ‌చివేత వ్య‌వ‌స్థీకృత‌మైన చోట‌ ప్ర‌జా ప్ర‌తిఘ‌ట‌న వెల్లువెత్తుంద‌ని నిరూపించిన సంద‌ర్భం ఇది. మే 29న అమెరికాలోని మిన్నియా పోలీస్ లో ఒక శ్వేత‌జాతి పోలీసు అధికారి చేతిలో 46 ఏళ్ల న‌ల్ల‌జాతీయుడు హ‌త్య‌గావించ‌బ‌డ‌డం ఇవాల్టి సంద‌ర్భం. క‌రోనా కాలంలో ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌వుతున్న ఓ చిరు ఉద్యోగి జార్జ్‌ ఫ్లాయిడ్‌. 20 డాలర్ల నకిలీ నోటును చలామణి చేశాడ‌నే ఆరోప‌ణ‌ల‌తో త‌న‌ను నిర్బంధించిన పోలీసు అధికారి అత్యంత అమానుషంగా ఫ్లాయిడ్ ప్రాణాలు తీశాడు. ప‌ట్ట‌ప‌గ‌లు న‌డిరోడ్డుపై ప‌డేసి ప్లాయిడ్ మెడ‌పై మోకాలితో ఎనిమిది నిమిషాల పాటు నొక్కిపెట్టాడు. ʹఊపిరాడ‌డంలేదు వ‌దిలేయండిʹ అంటూ వేడుకున్నా శ్వేత‌జాతి అహంకారం క‌ర‌గ‌లేదు. అహంకారంతో కూడిన జాతి విద్వేషం, అధికారం క‌ల‌గ‌లిసి ఓ నిండు ప్రాణాన్ని బ‌లితీసుకున్నాయి.

ఈ అమానుషంతో న‌ల్ల‌జాతీయుల నుంచి పెల్లుబికిన ఆగ్ర‌హం ఇప్పుడు అమెరికాను అత‌లాకుత‌లం చేస్తోంది. మిన్నియా పోలీస్ మొద‌లు ఫిల‌డెల్ఫియా, వాషింగ్ట‌న్‌, న్యూయార్క్‌, చికాగో, కాలిఫోర్నియా లాంటి దాదాపు 40కి పైగా న‌గ‌రాల్లో నిర‌స‌న‌లు పెల్లుబుకుతున్నాయి. వేలాది మంది వీథుల్లోకి వ‌చ్చి ʹవియ్ కాంట్ బ్రీత్ʹ, ʹబ్లాక్ లైవ్స్ మ్యాటర్ʹ‌, ʹడోంట్ కిల్ అజ్‌ʹ, ʹఐ యామ్ నెక్ట్స్‌?ʹ అని నిన‌దిస్తున్నారు, నిల‌దీస్తున్నారు. ఈ ప్ర‌జాగ్ర‌హాన్ని అణ‌చివేసేందుకు భారీగా సాయుధ బ‌ల‌గాల‌ను ప్ర‌యోగించినా ప్ర‌జ‌లు లెక్క‌చేయ‌డం లేదు.

మ‌రోవైపు అధ్య‌క్షుడు ట్రంప్ వ్యాఖ్య‌లు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. ʹలూటింగ్‌ లీడ్స్‌ టు షూటింగ్‌ʹ అంటూ నిర‌స‌న‌కారుల‌ను దొంగ‌లుగా పేర్కొన‌డంతో పాటు, వారిని కాల్చి చంపుతామ‌ని చేసిన వ్యాఖ్య‌లు శ్వేతసౌధ‌పు అహంకారాన్ని ప్ర‌తిఫ‌లిస్తున్నాయి.

నిజానికి నల్లజాతీయుల పైనా, మైనారిటీలపైనా విద్వేషం రెచ్చ‌గెట్టేలా మాట్లాడ‌డం ఆయ‌న‌కు కొత్తేమీ కాదు. వ‌ల‌స‌ల వ‌ల్ల స్థానికులు ఉపాధి కోల్పోతున్నార‌ని, తాను అధికారంలోకి వ‌స్తే వ‌ల‌స‌ల‌ను అడ్డుక‌ట్ట‌వేస్తాన‌నే భ్ర‌మ‌లు క‌ల్పించిన ట్రంప్ అలాంటి దుందుడుకు చ‌ర్య‌లెన్నిటికో పాల్ప‌డ్డాడు. న‌ల్ల‌జాతీయుల ప‌ట్ల మాత్ర‌మే కాదు, ముస్లిం ప‌ట్ల‌, క‌మ్యునిస్టుల ప‌ట్ల విద్వేషాన్ని పెంచ‌డం అమెరికా ఆది నుంచీ అనుస‌రిస్తున్న‌ది. ఉగ్ర‌వాదాన్ని పెంచిపోషించిన అమెరికాయే ఆ నేరాన్ని ముస్లిం స‌మాజంపైకి నెట్టింది. ఇప్పుడూ అంతే. ప్ర‌జ‌ల మ‌ధ్య విద్వేషాల్ని రెచ్చ‌గొట్టే పాల‌క విధానాలే ఇలాంటి జాత్యహంకార దాడుల‌ను ప్రోత్స‌హిస్తున్నాయి.

ఈ విష‌యంలో భార‌త పాల‌క వ‌ర్గాలు ఏమాత్రం తీసిపోరు. నాజీల‌ను మ‌రిపించే మోడీ పాల‌న‌లో అమ‌ల‌వుతున్న బ్రాహ్మ‌ణీయ హిందూ ఫాసిజమే అందుకు నిద‌ర్శ‌నం. రాజ‌కీయ ఆధిప‌త్యాన్ని కాపాడుకునేందుకు మ‌త విద్వేషాలను రెచ్చ‌గొడుతున్న ఆర్ ఎస్ ఎస్ ముస్లిం స‌మాజాన్ని శ‌త్రువులుగా చిత్రీక‌రిస్తోంది. ద‌ళితుల‌ను, ఆదివాసుల‌ను, ముస్లింల‌ను దేశ‌ద్రోహులుగా ప్ర‌క‌టిస్తోంది. త‌మ చెమ‌ట‌, నెత్తురుతో సార‌వంతం చేసిన నేల నుండి త‌మ‌ను ప‌రాయిని చేస్తోంది. ప్రాణాల‌ను తీస్తోంది. మొత్తంగా రాజ్యాంగ హ‌క్కుల్ని హ‌రించి, ఆ స్థానంలో మ‌త విలువ‌ల్ని నిలిపేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.

కుల‌, మత‌, జాతి, వ‌ర్ణ వివ‌క్ష‌ల పునాదిపై అధికారాన్ని చేప‌ట్టిన మోదీ, ట్రంప్ జాత్యాహంకారం, మతో న్మాదానికి ప్ర‌తీక‌లు. భావోద్వేగాల‌ను రెచ్చ‌గొట్ట‌డం ద్వారా సమాజంలో అసమానతలను పెంచుతున్నఈ ఆధిప‌త్యాన్ని కూల‌దోయాల్సిన సంద‌ర్భం ఇది. అట్ట‌డుగు స‌మూహాల‌న్నీ ఐక్య‌మ‌వ్వాల్సిన సంద‌ర్భం ఇది. అణ‌చివేత‌, వివ‌క్ష‌ల‌కు వ్య‌తిరేకంగా తిరుగుబాటును ఎక్కుపెట్టాల్సిన సంద‌ర్భం ఇది. ఆ సంద‌ర్భాన్ని ఫ్లాయిడ్ మ‌న చేతికందించాడు. ముందుకెగ‌బాక‌డ‌మే మ‌న క‌ర్త‌వ్యం.

No. of visitors : 369
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •