మనకు తెలియని మేరువు

| సాహిత్యం | స‌మీక్ష‌లు

మనకు తెలియని మేరువు

- అరసవిల్లి కృష్ణ | 02.06.2020 10:36:37pm

కుటుంబంలో, ఉద్యమాలలో, సామాజిక అంశాలలో స్త్రీలు నిర్వహించిన భూమిక చరిత్రలో నమోదుకావడం, ఏఏ కాలాలలో, కుటుంబాలలో లేదా సామాజిక ఆచరణలో వారు చూపిన చొరవ, తెగువ ఆనాటి కాలయవనికపై వేసిన ప్రభావాలు వాటి వెలుగులో మిగిలిన సమాజం అనుసరించిన లేదా నడిచిన తీరు ఈ స్త్రీల చరిత్ర ఎట్లా రికార్డవుతుంది? సామాన్య స్త్రీల సంగతి సరే ఉద్యమాల వెంట నడిచిన వారు, దానిలో భాగమయిన వారు, మానవీయ స్పందనలతో ఉద్యమభారాన్ని స్వీకరించినవారు. ఇది కదా అసలు చరిత్ర అంటే, భారతీయ సామాజిక పరంపరలో అనేక త్యాగాలు చేసిన మహిళల నేపధ్యం వారు నడిచిన తొవ్వ. ఈ వెలుగులో కదా వర్తమాన కాలం స్వీకరించి, భవిష్యత్ ప్రపంచానికి వెలుగునిచ్చేది.

నల్లూరి రుక్మిణి కధారచయితగా, నవలా రచయితగా, తెలుగు సాహిత్యావరణలో పరిచయం అక్కర్లేని పేరు. అధ్యయనం, పరిశీలన రచయితగా ఓ బాధ్యతగల భూమికను నిర్వహించారు. ఇటీవల తాజాగా మేరువు అనే పేరుతో వాస్తవిక జీవితాన్ని, నవలగా చిత్రించారు. నవలా వస్తువు, కాలం మన కాలం నాటిదే. వర్తమాన కాలంలో కొనసాగుతున్న, భారతదేశ, విముక్తి పోరాటాలకు చెందిన కాలంలో కొనసాగుతున్న భారతదేశ విముక్తి పోరాటాలకు చెందిన కాలం అయితే ఈ పోరాట నేపధ్యంలో స్థలం, వ్యక్తులు, వారు నిర్వహించిన చారిత్రక కర్తవ్యాన్ని నాలుగు దశాబ్దాల తెలుగు సమాజపు ఉద్యమ జీవితాన్ని మేరువు నవలలో నల్లూరి రుక్మిణి నమోదు చేసారు.

ద్రోణవల్లి అనసూయమ్మ విప్లవోద్యమంతో పరిచయం ఉన్నవారికి ఆమె పేరు సుపరిచితమే. తెలంగాణా, సాయుధ రైతాంగ పోరాటం, దాని విరమణ తదనంతర, నక్సల్ బరి రాజకీయాలు, బహుశా అత్యంత సున్నితమైన కాలం. అంతకుముందు తెలుగు సమాజంలోకి ప్రవేశించిన కమ్యూనిజం, దానిని అందుకున్న తరం, వీటిమధ్య తొలితరపు కమ్యూనిస్టు భావనా ప్రపంచపు భావాజాలాన్ని అందుకున్న సాధారణ మహిళ. జీవితపు వివిధ దశలలో ప్రజల పక్షాన ఖచ్చితమైన పోరాట వైఖరి తీసుకున్న విప్లవోద్యమ ఆచరణ దాకా అనసూయమ్మ చేసిన ఉద్యమ ప్రయాణం, ఆమెతో నడిచిన స్థలకాలాలు, వ్యక్తులు నూతన ప్రజాస్వామిక విప్లవ ఆకాంక్షను వ్యక్తీకరించుకునే లేదా త్యాగాలుకు సిద్ధపడిన నూతన మానవుని ఆవిష్కరణ చుట్టూ నిర్మితమయిన నూతన భావజాల సంఘర్షణలో రాటుదేలిన వ్యక్తిత్వమే అనసూయమ్మది.

తెలుగు సమాజపు రాపిడిలో ఇంతగా రాటుదేలిన స్త్రీలు అరుదుగా కనబడతారు. రాజీలేని పోరాటతత్వాన్ని అందిపుచ్చుకోవడమే కాదు. ఓడిపోని ఓటమిని అంగీకరించలేని చివరి ఊపిరివరకు సమ, సమాజ ఆవిష్కరణ కోసం తపించిన మేరువును నవలగా చిత్రించడమంటే, మొత్తంగా పోరాట క్రమాన్ని ఒడిసిపట్టి చారిత్రక అంశాలుగా నమోదు చేయడమే. ఇది చిన్న ప్రయత్నమయిన దీని తీవ్రత చాలా ప్రభావం చూపుతుంది. త్యాగాల పరంపరలో అసమాన్య సాహసాలు ప్రదర్శించిన స్త్రీలు సంప్రదాయ కట్టుబాట్లకి పెద్ద అవరోధంగా అడ్డుగోడగా నిలిచిన పితృస్వామ్య భావజాలానికి దానిని ఎదుర్కోవడం కాదు. ఎదురొడ్డి నిలవడం, స్త్రీ, పురుష సమానతకు ఒకే విలువకు స్థిరంగా నిలబడటం దాని వెనుక వున్న సమాజపు వెక్కిరింతలను, ఊగిసలాటను ఖాతరు చేయకపోవడం ధిక్కరించడం మనకాలంలోని ద్రోణవల్లి అనసూయమ్మ కొనసాగించిన ధిక్కారం. కుటుంబ సంప్రదాయ భావనలు అదే సమయంలో ఉద్యమం వాటి మధ్య వ్యక్తిగతమైన జీవన ఆకాంక్షలు, వివాహం ఇద్దరు పిల్లలు, అమరుడయిన సహచరుడు వీటన్నిటి సారాంశంలో నిబ్బరాన్ని ధైర్యాన్ని తనకాలపు సమాజపు అనుమానపు సందేహాలను, లేదా ప్రశ్నలను ఎంతవరకు ఆమె తట్టుకొని నిలబడగలిగింది.

ఉద్యమం - జీవితం వీటి మధ్య సాగిన జీవన అనుభవాల రాపిడిలో అనసూయమ్మ సంప్రదాయ, లేదా అనుభవంగా వస్తున్న స్త్రీ, పురుష సంబంధాలలోని లేదా సంప్రదాయ కుటుంబ వ్యవస్థ స్త్రీ పురుష సంబంధాల విలువల చట్రాన్ని ధిక్కరించి, భారతీయ కుటుంబ వ్యవస్థలోని నైతికత అనే పదానికి భిన్నంగా ఉద్యమ నాయుకునితో, వైవాహిక సంబంధానికి అతీతంగా తనదయిన లైంగిక స్వేచ్చను కోరుకోవడం, పెళ్ళయి కుటుంబం ఉన్న ఉద్యమ సహచరునితో, వ్యక్తిగా, ఉద్యమకారిణిగా ప్రయాణం చేయడం ఈ దృష్టికోణం అనైతికత అనే చట్రం క్రింద నుండి చూచిన ప్రగతిశీల, మేధో శిబిరం అయితే దీని వెనుక దాగిన అనసూయమ్మ పోరాటరూపం మరుగున పడటం నాలుగు దశాబ్దాల ప్రజల పక్షాన పనిచేసిన ఆమె చొరవను తృణీకరించడం ఇది అనసూయమ్మ వైపు నుండి లేదా ఆమె కోల్పోయిన స్త్రీ సమయం నుండి విమర్శనాత్మక దృష్టిలో చూసినప్పుడు ఏర్పడే అనేక ప్రశ్నలు ఇది అనసూయమ్మకి మాత్రమే కాదు భారతీయ సమాజం, భూస్వామ్య భావజాలం, స్త్రీలపట్ల వారి నడక పట్ల అది విధించిన కట్టుబాట్లు, నియంత్రణ ఈ చట్టం నుండి స్త్రీల పెనుగులాట. ఇవాల్టి భారతీయ సమాజపు అనుభవంలోకి వస్తున్నది.

అయితే కుటుంబ వ్యవస్థలోని నైతికత అనే మాటకు విలువ ఏమున్నది. వివాహేతునితో శారీరక, మానసిక సాహచర్యం మాటేమిటి? అనే ప్రశ్నకూడా తలెత్తవచ్చు. మేరువు నవల మొత్తంగా ఈ దశను చిత్రించింది. ఉద్యమాచరణ కలిగిన ఒంటరి స్త్రీల విషయంలో వారి వెనుక దాగిన దు: ఖరాపిడిలో వారు ఎంచుకున్న మార్గం సమాజపు ఆమోదం పొందనప్పుడు వారు పొందిన మనఃస్థితిని పురుషుని వైపు నుండి అతను ఉద్యమాచారణలో ఉండనివ్వండి. కాని స్త్రీ పురుషుల విషయంలో కుటుంబ వ్యవస్థ లేదా ప్రగతిశీల ఆలోచనాపరులు తూకం వేసినప్పుడు స్త్రీని మాత్రమే మొత్తంగా బోనులో నిలబెట్టే దశ ఇవాల్టికే నడుస్తున్నది. ఇక్కడ ఇద్దరు చైతన్యవంతమయిన స్త్రీ, పురుషులు అన్నిరకాల పీడనలు తొలగి మానవీయ సమాజం రూపుదిద్దుకోవాలి. దాని కోసం త్యాగపు అంచులదాకా వెళ్ళిన స్త్రీ, పురుషులు, తమ ఇష్టా, ఇష్టాలపట్ల ఎలాంటి ఘర్షణకు లోనయివారు లేదా ఆ మన:స్థితి నుండి వారు ఎలాంటి స్వాంతన పొందగలిగినారు. వారిలో కుటుంబ సంబంధాలలోని తర్వాతి తరం వారిని ఎలా స్వీకరించగలిగింది. ఈ సంబంధాలకు స్త్రీ, పురుష సంబంధాలలోని లైంగిక స్వేచ్చ అనే తూకంలో ఎలాంటి ఆమోదం పొందగలిగింది. అనేది కూడా గమనించవలసిన అంశం.

ద్రోణవల్లి అనసూయమ్మ జీవితం తెలుగునాట కొనసాగిన ప్రగతిశీల ఆలోచనాధారకు నిలువెత్తు సాక్ష్యం కమ్యూనిస్ట్ ఆచరణ కుటుంబాలలోకి వస్తున్న సరికొత్త చైతన్యం ఆ వెలుగులో ఎనిమిది దశాబ్దాల జీవితం రాజకీయ జీవితంలో రహస్య జీవితం, నిర్బంధం, ప్రవాసం, జైలు, మరొకవైపు కుటుంబం ఇంత వైరుధ్యం కలగలిసిన జీవితం మహిళల వైపు నుండి చాలా అరుదైన అంశం. నిజానికి వీరు సామాన్య స్త్రీలలా కనబడుతున్నా వీరి వెనుక దాగిన జీవితం, రాజకీయాలు, వీరు నిర్వహించిన భూమిక ఎంతో కొంత మేర రికార్డు కావల్సిందే. నల్లూరి రుక్మిణీ మేరువు నవల ద్వారా అనసూయమ్మ జీవితాన్ని సాహిత్య సృజనలోకి తీసుకు రాగలిగింది. అయితే విప్లవ రచయిత తీసుకున్న ఈ చొరవను స్త్రీ లైంగిక స్వేచ్ఛను ఇంకా అంగీకరించలేని పితృస్వామ్య ఆధిపత్యం కేవలం, లైంగిక స్వేచ్చ దగ్గరే ఆగిన సంప్రదాయ ఆలోచనలు భారతీయ కుటుంబ వ్యవస్థను సజీవంగా వుంచి భూస్వామ్య భావజాలం ఎంతో కొంతమేర చర్చనీయాంశం కావాల్సి వుంది. చాలా వ్యూహాత్మకంగానే పితృస్వామ్యం చాలా ముసుగులతో స్త్రీలని అణచి ఉంచే భావజాలాన్ని నిత్యం సజీవంగా ఉంచుతుంది.

మేరువు నవల మనకు తెలియని స్త్రీల చరిత్రకు సంబంధించినది. అనేక ముద్రల మధ్య విలువలను స్త్రీలు మాత్రమే కాపాడాలి అనే విలువల చట్రంలో సాహస వనితల చరిత్రను వారి సమకాలీన ఉద్యమ సంబంధాలకు మరుగున పరిచినప్పుడు ఇది అసలు చరిత్ర, నిఖార్సయిన స్త్రీల చరిత్ర అని చాటిన నల్లూరి రుక్మిణీ సాహిత్య సృజనను స్వాగతించాల్సిందే. మేరువు ఇలాంటి స్త్రీల దృక్కోణాన్ని మరింత విశాలం చేసింది.

No. of visitors : 284
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


రెక్కల గూడు

అరసవిల్లికృష్ణ | 19.05.2018 08:44:01am

ఏమయినావు పావురాయి నీడల్ని- జాడల్ని మరిచిన మనుషులు కి తూర్పు దిక్కున ఎర్రని కాగడా వుందని నీ కళ్ళతో చెప్పలేక పోయావా- పొలికేక వినబడుతుందని.....
...ఇంకా చదవండి

అసమానత నుండి విప్లవం దాకా..

అరసవిల్లి కృష్ణ | 16.07.2020 11:41:15pm

కవిగా కాశీంను అంచనా వేయడానికి వాచకాన్ని చదవడం, కవిని దూరంగా వుండి గమనించడం మాత్రమే సరిపోదు. కవిని దగ్గరగా చూడాలి. కవి హృదయంలోకి దారి చేసుకొని వెళ్ళగలగాలి....
...ఇంకా చదవండి

ఒకరు వెనుక ఒకరు

అరసవిల్లి కృష్ణ | 18.02.2020 03:12:45pm

నాదగ్గర నాదేశ మూలవాసుల దగ్గర ఏ ధృవీకరణ పత్రం లేదు...
...ఇంకా చదవండి

రంగుల రాట్నం హఠాత్తుగా ఆగితే..

అరసవిల్లి కృష్ణ | 01.05.2020 12:27:46am

మార్చి 20న భారత ప్రధాని నరేంద్ర మోది మార్చి 22 ఆదివారం జనతా కర్ప్యూ అని ప్రకటించాడు. రేపటి తమ ఉపాధి ఏమిటి అనే ఆలోచించుకునే ప్రజలు సోమవారం తమ పనులకు ఆటంకం.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •