కోవిడ్ మాటున‌.. బీజేపీ నిరంకుశ‌త్వం

| సాహిత్యం | వ్యాసాలు

కోవిడ్ మాటున‌.. బీజేపీ నిరంకుశ‌త్వం

- పి. పావ‌ని | 02.06.2020 10:41:30pm

ప్రపంచవ్యాప్తంగా అసాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. దాదాపు రెండున్న‌ర నెల‌లుగా ప్ర‌జల సాధార‌ణ జీవితం ర‌ద్దైంది. ఆఫీసులు ప‌నిచేయ‌డం లేదు, మూత‌ప‌డ్డాయి. కంపెనీలు, ప‌రిశ్ర‌మ‌లు మూత‌ప‌డ్డాయి. ప్ర‌జార‌వాణా ఆగిపోయింది. దేశవ్యాప్తంగా ప్ర‌జ‌లు స్వ‌చ్చందంగా నిర్బంధాన్ని పాటించారు. ఇయితే ఈ రెండున్న‌ర నెల‌ల కాలంలో ప్ర‌భుత్వం ఏం చేసింద‌ని ఎవ‌రికైనా త‌ట్టిందా? ఏం చేసి ఉండాల్సింద‌ని ఎవ‌రైనా అనుకున్నారా?

ఇప్పుడు కొత్త‌గా ఈ ప్ర‌శ్నల‌ను వేసుకోవాల్సిన అవ‌స‌రం ఉందా అని కూడా నాకు అనిపిస్తోంది. ఎందుకంటే.. ఏడాది కాలంగా మోడీ 2.0 అని చెప్పుకుంటున్న బీజేపీ ప్ర‌భుత్వం ఈ ప‌న్నెండు నెల‌లు, అంత‌కు ముందు ఐదేళ్లు కూడా రెండే ప‌నులు చేసింది. ఇప్పుడు కూడా అవే మరింత గట్టిగా చేసింది. అస‌లు ప్ర‌భుత్వం ఇలాంటి అసాధార‌ణ ప‌రిస్థితుల్లో ఏం చేయాలి అనే చ‌ర్చ చాలా పెద్ద‌ది కానీ.. మార్చి రెండో వారం నుంచి కేంద్ర ప్ర‌భుత్వం ఏం చేసిందంటే.. చాలా సులువుగా చెప్పేయ‌వ‌చ్చు. అస‌లే కుంటుకుటూ న‌డుస్తున్న ఆర్థిక రంగాన్ని మ‌రింత దివాళా తీయించి.. కార్పోరేట్ల‌కు లాక్ డౌన్ నుంచి ఎలాంటి న‌ష్టం వాటిల్ల‌కుండా ప్యాకేజీల‌ను ప్ర‌క‌టించింది. రెండోది త‌న‌కు ఎదురు నిలిచిన వారిని నిరంకుశంగా అణ‌చివేసేందుకు కరోనా కాలాన్ని అత్యధ్భుతంగా వినియోగించుకుంది.

మొద‌టి నుంచి న‌రేంద్ర మోడీ అండ్ కో ఎజెండా రెండే.. గుజ‌రాత్ వ్యాపారుల జేబులు నింప‌డం, రెండోది అతి ముఖ్య‌మైన‌ది సంఘ్ పరివార్ చిర‌కాల కోరిక‌, రామ‌రాజ్య స్థాప‌న‌. వీటిని వ్య‌తిరేకించే వారిని అడ్డుకోడానికి ఎలాంటి ప‌ద్ద‌తుల‌నైనా తొక్క‌గ‌ల‌న‌ని ఆరేళ్లుగా వంద‌లాది సంద‌ర్భాల్లో నిరూపించుకుంది కూడా.

దానికి తాజా ఉదాహ‌ర‌ణ‌లే.. ఢిల్లీలో ప్ర‌జాస్వామిక‌వాదులు, విద్యార్థులు, నిర‌స‌నకారుల క‌క్ష‌పూరిత అరెస్టులు. ఈ వ్యాసం రాస్తున్న స‌మయానికి ఢిల్లీ పోలీసులు.. ఫిబ్ర‌వ‌రిలో ఈశాన్య ఢిల్లీలో జాఫ్రాబాద్ కేంద్రంగా జ‌రిగిన హింస‌కు సంబంధించిన కుట్ర‌దారుల‌ను పేర్కొంటూ చార్జిషీటు దాఖ‌లు చేసింది. అంత‌కు ముందు ఫిబ్ర‌వ‌రి మొద‌లు జూన్ ఒక‌టి దాకా అధికారిక లెక్క‌ల ప్ర‌కార‌మే 1300 మందిని అరెస్టు చేసింది. వీళ్లంతా ముస్లింలు, లేదా సీఏఏకి వ్య‌తిరేకంగా నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న ఉద్య‌మకారులు. అరెస్ట‌యిన వాళ్ల‌ను గ‌మ‌నిస్తే.. ఇది క‌క్ష‌పూరితంగా, వివ‌క్షాపూరితంగా జ‌రిగిందేన‌నీ, దోషుల‌ను వ‌దిలేసి, నిర్దోషుల‌ను, బాధితుల‌ను అరెస్టు చేశార‌నీ అర్థ‌మైతుంది. ఒక వేళ మీకు అనిపించ‌వ‌చ్చు.. ఇది నేను చెబుతున్న మాట అని. కాదు.. ఇదే అల్ల‌ర్ల కేసులో నిందితుడిగా అరెస్టైన జామియా విద్యార్థి ఆసిఫ్ ఇక్బాల్ త‌న్హా కేసు విచార‌ణ సంద‌ర్భంగా అడిషన‌ల్ సెష‌న్స్ జ‌డ్జి ధ‌ర్మేంద్ర రాణా ఈ మాట అన్నారు. ఈ కేసుకు సంబంధించిన విచార‌ణాధికారిని విచార‌ణ న్యాయ‌బ‌ద్దంగా జ‌రిగేలా చర్య‌లు తీసుకోమ‌ని ఆదేశించారు. బ‌హుశా త్వ‌ర‌లోనే జ‌స్టిస్ ధ‌ర్మేంద్ర రాణా వ‌ద్ద‌నుంచి ఈ కేసు బ‌దిలీ అయ్యే అవ‌కాశం ఉంది. ఏకంగా జ‌డ్జిగారే బ‌దిలీ అయినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర‌లేదు.

ఈశాన్య ఢిల్లీ హింస‌కు బాధ్యుల‌ను చేస్తూ.. రెండు నెల్ల‌లో ఢిల్లీ పోలీసులు జామియా విద్యార్థులు సఫూరా జర్గర్, మీరన్ హైదర్, ఆసిఫ్ ఇక్బాల్ తన్హా, జెఎన్‌యు విద్యార్థులు నతాషా నార్వాల్, దేవంగన కలితలతో పాటు సీఏఏ వ్య‌తిరేక ఉద్య‌మ కార్యకర్తలు ఇష్రత్ జహాన్, ఖలీద్ సైఫీ, గల్ఫిషా ఫాతిమా, షార్జీల్ ఇమామ్ వంటి వందలాది మంది ముస్లిం యువత‌ను అరెస్టు చేశారు. సిఎఎ-ఎన్‌ఆర్‌సికి వ్యతిరేకంగా రాజ‌ధానిలో విస్తృతంగా జరిగిన నిరసనలను టార్గెట్ చేసుకునే ఈ అరెస్టులు జ‌రిగాయ‌నేది స్ప‌ష్ట‌మే. అరెస్ట‌యిన వారంద‌రిపై యూఏపీఏ, మ‌ర్డ‌ర్, అటెంప్ టు మ‌ర్డ‌ర్ కేసులు న‌మోదయ్యాయి.

ఢిల్లీ హింస చెల‌రేగిన మూడురోజుల‌కు మీడియా ముందుకు వ‌చ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా అల్ల‌ర్ల‌కు కార‌ణ‌మైన ఎవ‌రినీ వ‌దిలి పెట్ట‌బోం అంటూ ప్ర‌క‌టించిచారు. మ‌రుస‌టి రోజే జేఎన్యూ విద్యార్థి షార్జీల్ ఇమామ్ ను పోలీసులు అరెస్టు చేశారు. త‌ద‌నంత‌రం ఖ‌లీద్ సైఫీని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచార‌ణలో సైఫీ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. అత‌డి రెండు కాళ్లు, చేతి వేళ్లు విరిగ‌గిపోయాయి. మెరుగైన వైద్య స‌దుపాయం అందించేందుకు వీలుగా బెయిల్ కోసం అత‌ని న్యాయ‌వాదులు ప్ర‌య‌త్నిస్తున్న స‌మ‌యంలోనే లాక్ డౌన్ ప్ర‌క‌టించారు. దీంతో బాధితుల త‌ర‌ఫు న్యాయ‌వ‌వాదులు కోర్టుకు వెళ్లేందుకు వీలులేనిప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. కానీ.. మ‌రింత మందిని అరెస్టుచేసేందుకు పోలీసులకు ఎలాంటి అవాంత‌రాలు ఎదుర‌వ్వ‌లేదు. సీఏఏ ఉద్య‌మ కార్య‌క‌ర్త ఇష్ర‌త్ జాహ‌న్ ను అరెస్టు చేశారు. అలా మొద‌లైన అరెస్టుల ప‌రంప‌ర‌.. మే చివ‌రి వారం జేఎన్యూ విద్యార్థులు న‌తాషా నార్వాల్, దేవంగ‌న క‌లిత‌ల అరెస్టుతో కొత్త మ‌లుపు తీసుకుంది.

మే 23న ఢిల్లీ అల్ల‌ర్ల కేసులో నిందితులుగా పేర్కొంటూ జేఎన్యూ విద్యార్థులు న‌తాషా, దేవంగ‌న‌ల‌ను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని మ‌రుస‌టి రోజు రెండు రోజుల పోలీసు క‌స్ట‌డీ కోరుతూ మెట్రోపాలిట‌న్ మెజిస్టేట్ ముందుహాజ‌రు ప‌రిచారు. అయితే మెజిస్ట్రేట్ నిందితులు కేవ‌లం మామూలు నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌నకారులుగా పేర్కొంటూ వారికి బెయిలు మంజూరు చేశారు. తీర్పు కాపీలు నిందితుల‌కు అంద‌క ముందే.. వారిపై ఐపీసీ 302, 307 సెక్ష‌న్ల కింద మ‌రో ఎఫైఆర్ న‌మోదు చేశారు. దీంతో వీరిద్ద‌రికీ 15 రోజుల జుడీషియ‌ల్ క‌స్ట‌డీ విధిస్తూ.. కోర్టు తీర్పు వెలువ‌రించింది. పోలీసులు మొద‌ట న‌మోదు చేసిన ఎఫ్ ఐ ఆర్ లో నిందితులు ఇద్ద‌రూ క‌నీసం సీఏఏ వ్య‌తిరేక ఉద్య‌మ‌కారులుగా నిరూపించేందుకు కూడా గ‌ట్టి ఆధారాలు కేసు డైరీలో లేవ‌ని జ‌డ్జి పేర్కొన‌టం గ‌మ‌నార్హం. ఇంత‌కంటే జాఫ్రాబాద్లో హింస చెల‌రేగ‌టానికి ఒక రోజు ముందు సీఏఏ వ్య‌తిరేక నిర‌స‌న‌లు ఆప‌క పోతే జ‌రిగే ప‌ర్య‌వ‌సానాల‌కు ఢిల్లీ పోలీసులే బాధ్య‌త వ‌హించాల్సింది అని మీడియా ముందు మాట్లాడిన బీజేపీ నేత‌లు అనురాగ్ ఠాకూర్, ప‌ర్వేశ్ వ‌ర్మ‌, క‌పిల్ మిశ్రాల‌పై ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం వింత‌ల్లోకి వింత‌.

ఇందంతా చ‌దువుతుంటే.. మీకు భీమా కోరేగావ్ కుట్ర‌కేసు గుర్తురాక మాన‌దు. అక్కడ కూడా సరిగ్గా దాడులు చేసినవారిని వదిలేసి బాధితులను, దేశవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులను కుట్ర కేసు మోపి అరెస్టులు చేశారు. ఢిల్లీ హింస కేసులో అరెస్ట‌యిన వారిగురించి చెప్పుకుంటూ పోతే.. పోలీసులు చేస్తున్న అనేక అసంబ‌ద్ద‌తలు బ‌య‌టప‌డతాయి. అవి ఎంత హాస్యాస్ప‌దంగా ఉంటాయో రెండున్న‌రేళ్ల క్రితం భీమా కోరేగావ్ కేసు మూలంగా దేశ ప్ర‌జ‌లంద‌రికీ బాగానే తెలుసు. అయితే అంత‌కంటే ప్ర‌యాద‌క‌ర‌మైన‌వి.

మోడీ రెండో ద‌ఫా ఏడాది పాల‌నలో సీఏఏ వ్య‌తిరేక నిర‌స‌నల మూలంగా ఒకింత ఇబ్బంది ప‌డిన బీజేపీకి క‌రోనా క‌లిసి వ‌చ్చింది. నిర‌స‌నకారుల‌పై ప‌గ‌తీర్చుకునేలా ప్ర‌వ‌ర్తించింది. ప్ర‌జ‌లు ఇళ్ల‌నుండి బ‌య‌టికి రాలేని.. అరెస్ట‌యిన వారికి స‌త్వ‌ర న్యాయ‌సాయం అంద‌లేని ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో నిర‌స‌న‌కారుల‌పై విరుచుకుప‌డి రోజుల త‌రబ‌డి అక్ర‌మ నిర్బంధంలో ఉంచి.. లెక్క‌లేనంత హింస‌ను ప్రయోగించింది. ఈ అరెస్టుల ద్వారా రెండు విష‌యాలు విష్ప‌ష్టమే. త‌న అప్ర‌జాస్వామిక‌, అనాగ‌రిక‌, నియంతృత్వ పోక‌డల‌ను కొన‌సాగిస్తాన‌ని.. వాటిని వ్య‌తిరేకిస్తే.. ఎలాంటి నీచానికైనా తాను దిగజారి, ప్ర‌జాస్వామిక వ్య‌వ‌స్థ‌ల‌ను దిగజార్చి ప‌గ‌తీర్చుకుంటాన‌ని ప్రభుత్వం త‌న చేత‌ల ద్వారా నిరూపిస్తోంది.

No. of visitors : 206
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  సాహ‌సోపేత జీవితం
  నలబై వసంతాల దండకారణ్యం
  అరుణతార ఏప్రిల్ - జూన్ 2020
  తారకంగారంటే..
  సరిహద్దులు కాపాడేది దేశాన్నా, యుద్ధోన్మాదాన్నా?
  అనేక హింస‌ల గురించి లోతుగా చర్చించిన ఒక మంచి కథ -ʹకుక్కʹ
  హ్యాపీ వారియర్ : సాయిబాబా అండా సెల్ కవిత్వం ʹనేను చావును నిరాకరిస్తున్నానుʹ సమీక్ష
  అస్సాం చమురుబావిలో మంటలు - ప్రకృతి గర్భాన మరో విస్ఫోటనం
  దేశీయుడి కళ
  మీరొస్తారని
  బందీ
  ఊపా చట్టంలోని అమానవీయ అంశాలపట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •