2 జూన్ 2014

| సాహిత్యం | క‌విత్వం

2 జూన్ 2014

- వరవరరావు | 02.06.2020 10:55:07pm

ఎన్నాళ్ల కల నిజమైంది
నా జ్ఞానంతో మొదలైన కల
నా చైతన్యంతో వికసించిన స్వప్నం
నలభై అయిదేళ్ల ఆకాంక్ష
ప్రజా వెల్లువలో లెనినను చూసిన పారవశ్యం

తెలంగాణ కోసమేనా ఈ తెలంగాణ కోసమేనా

ప్రతి ఒక్క యువకుడూ, విద్యార్థి
ఊరూ పేరూ కూడ
ఎక్కడా చరిత్రకెక్కకుండా పోరాడి
పోలీసు తుపాకి గుండ్లకు గుండెలిచ్చి
అమరులైన ఆశయం

ఏ ఆశలు చెలరేగి అప్పుడే అణగారి
ఆత్మహత్యలు చేసుకున్నారో గానీ
అందరూ దళితులూ బడుగువర్గాలు

వాళ్లు ఏలుకోవాల్సిన తెలంగాణ

ఎవ్వరూ లేరు
కాళోజీ, జయశంకర్, జనార్ధన్
విశ్వజ్యోతి, శాస్త్రిగారు, ఎంఆర్ కిషన్
సోషలిస్ట్ యూత్ లీగ్, ఆర్ విబి శర్మ
నరసింహస్వామి జ్వాల
రెజిడెబ్రె భావాలు, పట్టణ గెరిల్లా యుద్ధం
మాల్టవ్ కాక్ టెయిలు బ్యారికేడ్లు
ఫ్రెంచి విప్లవ విద్యార్థి
ఉద్యమం పోలీసు స్టేషన్ల పై కేంద్ర కార్యాలయాల పై దాడులు
కెఎస్, ఎస్ఎం, చెక్కిళ్ల ఐలయ్య
కొల్లిపర రామనర్సింహరావు

అవును నిజమే తెలంగాణ దగ్గరే
ఆగిపోయేవాళ్లు కాదు

ప్రత్యేక తెలంగాణ నుంచి గెరిల్లా జోన్ నుంచి
ప్రజాస్వామ్య తెలంగాణ దాక రూపకల్పన చేసిన
శ్యాం, మహేశ్, మురళి, కిషజ్, ఆజాద్
ఆర్ కె, సోమన్న, పువ్వర్తి అమరులు
ఇంకా పలువురు
ఎవ్వరూ లేరు

బెల్లి లలిత, ఐలన్న, నల్లా వసంత్, సుదర్శన్
రవీందర్ రెడ్డి, కనకాచారి, గంటి ప్రసాదం
ఆకుల భూమయ్య ఎవ్వరూ లేరు
రాజభవన్లో సరే
పరేడ్ గ్రౌండ్స్ లోనూ ఎవ్వరూ కనిపించలేదు

పోలిక వలసయితే పోరాటమూ అటువంటిదే
ఫలితమూ అటువంటిదేనా
భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ లకు
ఉరికంబాలే తప్ప స్వాతంత్ర్యం లేదా

దళిత హంతకులు నిర్దోషులని చెప్పే
తెలంగాణ తీర్పు?!
చదువడిగిన ఆదివాసీ బడుగు విద్యార్థులను
రస్టికేట్ చేసే హైదరాబాదీ మహిళ
బిఎస్ఎఫ్ కాల్పుల్లో ముగ్గురు ముస్లిం యువకుల మరణ

నిషేధాల తెలంగాణ! నిర్బంధాల తెలంగాణ!
ఆంక్షల తెలంగాణ!
చివరకేడు ఆదివాసీ మండలాలు
కోల్పోయిన తెలంగాణ!

మునిగిపోయే భూభాగం
ఏ రాష్ట్రంలో ఉంటేనేమిటి!?
ఎవరికి పుట్టిన బిడ్డని ఏడ్చేము
అడవి బిడ్డల కోసం

మన సంబురాలు మన తెల్లబట్టలు
మన బుక్కా గులాలు మన బాణసంచా

అర్ధరాత్రి అంబరాన్ని తాకిన ఉత్సాహం
హుస్సేన్ సాగర్ ఎక్కిళ్లు పెట్టిన
నెక్లెస్ రోడ్డు సాక్షిగా
రెండు రాష్ట్రాల శాసనసభల ముందరి
తెలంగాణ అమరుల స్థూపం సాక్షిగా

సూరపనేని, బాబూరావు, సముద్రుడు, శాకమూరి
సుగుణ, కౌముది
అంతా అడుగున పడిపోయారా?
ఏదో సిద్దించిన కొత్తమాయ మనల్ని ఆవరించిందా?
ఎవరి గజ్జెల రవళివే నీవు మంజీర?!
ఎవరి కజ్జలబాష్పధారవే నీవు మంజీర?

సామ్రాజ్యవాద ప్రపంచీకరణ గురించే మాట్లాడుతున్నం
ప్రజలపై యుద్ధం గ్రీన్ హంట్ ఆపరేషన్ గురించే మాట్లాడుతున్నం
పచ్చకామెర్లు అనడానికి లేదు
మనకిప్పుడు పసుపంటే ఒళ్లుమంట
ఇపుడు ఇది ఒక పార్టీ జెండా అయిపోయింది

నవాబు ముందు సాయెబు గోడకు కొట్టిన
గులాబీ అత్తరు
గుబాళింపులలో మైమరచామా

అభివాదం చేస్తే బదులు లేదు
పరస్పరాలు లేవు ఆదేశాలే
దొరకు దండం పెట్టి వీపు చూపకుండా
వెనక్కి వెనక్కి రావల్సిందే
ఆవేశపడితే వీపు మీద కాదు
కడుపు మీద కొడతారు

భూమి కోసం, నీళ్ల కోసం, వనర్ల కోసం గదా
నీ చదువులు చదివి,
నీ కొలువులు కొలవడానికి కాదు గదా –
తెలంగాణ ʹస్వపరిపాలనʹలో
సామాన్యుడు ఎక్కడ

ʹఈనాడుʹ సమ్మె నుంచి
స్టూడియో ఎన్ సమ్మె దాకా
పత్రికా స్వాతంత్ర్యం అంటే పాఠకుల స్వాతంత్ర్యం అని
వర్కింగ్ జర్నలిస్టుల స్వాతంత్ర్యమని
ఎన్ని ʹనిజాలʹ కోసం పోరాడాం మనం

గులాబీ భావ స్వాతంత్ర్యం
గులామీ ముళ్లతో హెచ్చరిస్తున్నదా

డిసెంటును రద్దు చేసే చరిత్రా
తెలంగాణ కోసం గుండెల్లో గుండ్లు మోసినవాళ్లను
బహిరంగ సభా వేదికల కింద బాంబులు పెడతామన్నా
తెలంగాణ కోసం లక్షలాది మందిని కదిలించిన వాళ్లను
తెలంగాణ కోసం డప్పు మీద దరువేసిన వాళ్లను
తెలంగాణ కోసం భుజాల మీద జాకను మోసిన వాళ్లను
ముందొచ్చిన చెవుల్ని మరచిన
వెనుకొచ్చిన కొమ్ముల పాలన

చరిత్ర తెలియడమే ఒక నేరమైపోయింది
ప్రజలు నిర్మించిన చరిత్రలో భాగం కావడం

నిజాం కాలేజి కాంగ్రెస్ తెలంగాణ సభ
తెలంగాణ సాకారంలో సారాన్ని నీరుకార్చింది
రాజ్యసభ ఆఖరిరోజు చర్చ
రాజ్య స్వభావాన్ని దాచలేకపోయింది
వెంకయ్య చంద్రబాబు నాయుడులతో
జైరాం రమేశ్ ముప్పేట వేసుకున్న ముడి
ʹపోలవరంʹ లో విప్పాడు
సీతారామ్ ఏచూరి మ్యాచ్ ఫిక్సింగ్ అని జారుకున్నాడు
మన మౌనం అన్నిటికీ అర్ధాంగీకారమైంది

హైదరాబాదు అర్ధ సింహాసనంపై
పోలీసు గవర్నర్ అడుగులకు మడుగులొత్తాలి మనం
పక్కలో బల్లెం - నెత్తి పై కత్తితో
తెలంగాణ ప్రజలు పదేళ్ల పాటు
అగ్నిగుండంలో నడవాలి
ఎవర్ని నమ్ముకుందాం
గుజరాత్ నుంచి ముజఫర్‌నగర్ దాకా
పారిన ముస్లింల రక్తంలో వికసించిన కమలాన్నా?
తెలుగు జాతి ఐక్యతను కాదు
ఐదేళ్లలో మళ్లీ తెలంగాణను
కలిపేసుకుంటానన్న చంద్రబాబునా?

అరవయ్యేళ్లు దగా చేసిన చెయ్యి
పక్షవాతం వచ్చి పడిపోయింది
నెహ్రూ ఇందిరా సోనియాల దాకా నమ్మిన జనం
తెలంగాణ ఇచ్చినా నమ్మనంత విసిగిపోయారు

ఒకే ఒక్కడు హీరో అయితే
విగ్రహానికే కాదు విధానాలకు కాజాలడు
కారులో వాళ్ల నలుగురికే స్థలముంటుంది
నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు
నడవాల్సిన దూరం చాలా ఉంది.

No. of visitors : 172
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


సోనీ సోరి నిరసన దీక్షకు సంఘీభావం ప్రకటించండి! ప్రజలకు, ప్రజాస్వామ్యవాదులకు, రచయితలకు విజ్ఞప్తి

వరవరరావు | 17.06.2016 12:32:46pm

తాజాగా సుకుమా జిల్లా గున్పాడ్‌ గ్రామంలో మడ్కం హిడ్మె అనే ఒక ఆదివాసీ మహిళపై స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ జిల్లా రిజర్వ్‌ గార్డ్‌లు చేసిన లైంగిక అత్యాచారం, హ........
...ఇంకా చదవండి

నిజమైన వీరులు నేల నుంచి వస్తారు

వరవరరావు | 16.07.2016 11:10:44am

1980ల నుంచి కూడా విప్లవ ఉద్యమానికి ఆదిలాబాద్‌ ‌జిల్లా బలమైన కేంద్రంగా ఉంది. ఇంద్రవెల్లి మారణకాండ నుంచి అది దండకారణ్య ఉద్యమానికి ఒక ఆయువుపట్టుగా ఉన్నది.......
...ఇంకా చదవండి

చరిత్ర - చర్చ

వరవరరావు | 15.05.2016 01:23:23pm

భగత్‌సింగ్ ఇంక్విలాబ్‌కు ` వందేమాతరమ్‌, జనగణమనకే పోలిక లేనపుడు హిందూ జాతీయ వాదంతో ఏకీభావం ఎట్లా ఉంటుంది? ఆయన ʹఫిలాసఫీ ఆఫ్‌ బాంబ్‌ʹ గానీ, ఆయన ʹనేను నాస్తికుణ...
...ఇంకా చదవండి

ముగ్గురు దేశద్రోహుల వలన సాధ్యమైన ప్రయాణం

వరవరరావు | 01.06.2016 12:30:00pm

ఆ కూలీ నిస్సందేహంగా దళితుడు, అంటరానివాడు. రోహిత్ వేముల రక్తబంధువు. ముజఫర్‌నగర్ బాకీ హై... అంటూ యాకూబ్ మెమన్‌ను స్మరించుకున్న దేశద్రోహి,...
...ఇంకా చదవండి

దండ‌కార‌ణ్య ఆదివాసీల స్వ‌ప్నాన్ని కాపాడుకుందాం : వ‌ర‌వ‌ర‌రావు

| 21.08.2016 10:46:12am

18 జూలై 2016, అమ‌రుల బంధు మిత్రుల సంఘం ఆవిర్భావ స‌భ సంద‌ర్భంగా వ‌ర‌వ‌ర‌రావు ఉప‌న్యాసం......
...ఇంకా చదవండి

నోటీసుకు జ‌వాబుగా చాటింపు

వ‌ర‌వ‌ర‌రావు | 22.05.2016 04:22:41pm

నిన్న‌టి దాకా ఊరు ఉంది వాడ ఉంది/ వాడ అంటే వెలివాడ‌నే/ అంట‌రాని వాళ్లు ఉండేవాడ‌/ అంట‌రాని త‌నం పాటించే బ్రాహ్మ‌ణ్యం ఉండేది/ ఇప్పుడ‌ది ఇంతింతై ...
...ఇంకా చదవండి

రచయితలేం చేయగలరు?

వ‌ర‌వ‌ర‌రావు | 16.07.2016 09:58:28am

1948లో భారత సైనిక దురాక్రమణకు గురయిన నాటి నుంచి కశ్మీరు ఆజాదీ కోసం పోరాడుతున్నది. ఆర్టికల్‌ 370 ‌మొదలు రాజ్యాంగం నుంచి ఎన్ని ప్రత్యేకమైన హామీలైనా ఆ సూఫీ.......
...ఇంకా చదవండి

రచయితలారా, మీరెటువైపు? వేదాంత వైపా? స్వేద జీవుల వైపా?

వరవరరావు | 03.07.2016 01:08:08am

అరుంధతీ రాయ్‌ ‌మావోయిస్టు పార్టీ ఆహ్వానంపై దండకారణ్యానికి వెళ్లినపుడు ఆమె బస్తర్‌లో ప్రవేశించగానే వేదాంత క్యాన్సర్‌ ఆసుపత్రి కనిపించిందట. దగ్గర్లోనే లోపల......
...ఇంకా చదవండి

వాగ్ధాటి కాశీపతి

వరవరరావు | 16.08.2016 01:29:44pm

1972లో విరసంలో ఆయన ప్రవేశం సాంస్కృతిక రంగంలో విప్లవోద్యమం నిర్వహించాల్సిన పాత్ర గురించి ఒక ప్రత్యేకమైన ఆలోచన ప్రవేశపెట్టినట్లైంది. అప్పటికే కొండప‌ల్లి.... ...
...ఇంకా చదవండి

రాజకీయ ఖైదీలు - చావు బతుకుల్లో కె. మురళీధరన్‌ (అజిత్‌)

వరవరరావు | 11.09.2016 10:16:25am

అజిత్‌గా విప్లవ శిబిరంలో ప్రసిద్ధుడైన కె. మురళీధరన్‌ 61వ ఏట అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు 2015, మే 9న మహారాష్ట్రలోని పూనెకు దగ్గరగా ఉన్న తాలేగాకువ్‌ ధబాడే.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  సాహ‌సోపేత జీవితం
  నలబై వసంతాల దండకారణ్యం
  అరుణతార ఏప్రిల్ - జూన్ 2020
  తారకంగారంటే..
  సరిహద్దులు కాపాడేది దేశాన్నా, యుద్ధోన్మాదాన్నా?
  అనేక హింస‌ల గురించి లోతుగా చర్చించిన ఒక మంచి కథ -ʹకుక్కʹ
  హ్యాపీ వారియర్ : సాయిబాబా అండా సెల్ కవిత్వం ʹనేను చావును నిరాకరిస్తున్నానుʹ సమీక్ష
  అస్సాం చమురుబావిలో మంటలు - ప్రకృతి గర్భాన మరో విస్ఫోటనం
  దేశీయుడి కళ
  మీరొస్తారని
  బందీ
  ఊపా చట్టంలోని అమానవీయ అంశాలపట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •