మానవగీతం

| సాహిత్యం | క‌విత్వం

మానవగీతం

- ఉద‌య‌మిత్ర‌ | 02.06.2020 11:22:09pm

మాయమౌతున్నడనుకున్న మనిషి
ఎదుట నిలలిచాడు..
మానవ చరిత్రలో
ఒక కొత్త అధ్యాయానికి తెరదీశాడు

ఒంగోలునుండి మేడ్చల్ దాంక
మేడ్చల్ నుండి ఆదిలాబాద్ దాంకా
మనుష్యులు చెట్లయి పూస్తున్నారు
వలసజీవుల సేదదీరుస్తున్నారు

కనిపెంచిన తల్లిని
బిడ్డలెల్లగొట్టినట్టు
తామునిర్మించిన నగరాలు
తమనే వెల్లగొడతే
వాళ్ళు అక్కునజేర్చుకుంటున్నారు

ఒక దుఃఖపు పాయను తమలోకి ఒంపుకొని
పిడికెడు విశ్వాసాన్నిస్తున్నారు

కాళ్ళున్నవి
మార్నింగ్ వాక్ లకే గాదనీ
గాయాలవైపు నడవడానిక్కూడాననీ
చేతులున్నవి
మొక్కడానికో
చప్పట్లు గొట్టడానికోగాదనీ
కాసిన్ని కన్నీళ్ళు తుడవడానికనీ
రుజువులుచేస్తున్నారు
నెర్రెలిడిసినభూమ్మీదకు
పంటకాలువలై విస్తరిస్తున్నారు

పొయ్యి ఆరడంలేదు
చెయ్యి ఆగడంలేదు

ఎవరువాళ్ళు..
ఉద్యోగులా...ఉపాధ్యాయులా..
పోలీసులా...రైతులా..
ముస్లిములా..హిందువులా..
చదువరులా..పామరులా..
భారతీయులా..ఎన్నారైలా..
ఎవరైతేనేం..
వాళ్ళంతా మానవులు
ఒకే దారానికి కుట్టిన
రంగురంగులపువ్వులు

వాళ్ళు
నార్మన్ బెతూన్ లు
డాక్టర్ కోట్నీస్ లు గాకపోవొచ్చుగాని
బతుకుయుద్ధంలో
క్షతగాత్ర కూలీల ఆత్మబంధువులు

కులాలు,మతాలు,హోదాలు
హద్దులు,సరిహద్దులుదాటి
వాళ్ళు..ఓ మహా మానవగీతానికి
కోరసెత్తుకున్నారు..

ఇప్పుడు
పాడాల్సింది
ఈగీతమే..

No. of visitors : 105
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


మరో తల్లి

స్వేచ్చానువాదం -ఉదయమిత్ర | 04.06.2017 02:02:49pm

రాయపూర్ జైలు లోని మహిళా విభాగపు ఆఫీసర్ గా ఆమె స్త్రీ ఖైదీల పట్ల పిల్లల పట్ల జరుగుతున్నా అనేక నేరాలను బట్టబ బట్టబయలు చేసింది. ఈ నేరాలను పై అధికారుల దృష్టికి ...
...ఇంకా చదవండి

రాతి పలక

ఉద‌య‌మిత్ర‌ | 18.11.2016 11:11:46am

చెట్ల చాటు నుండి, తుప్పల చాటునుండి, బండ చాటు నుండి అత్యంత సుశిక్షితులైన, అత్యంత క్రూరులైన రక్షక భటుల గుంపు వేగంగా, చురుగ్గా, గూడేల వైపు ʹʹవేయి కాళ్ల జెర్రిʹ...
...ఇంకా చదవండి

నది గొంతుక

ఉదయమిత్ర | 03.08.2018 11:37:33am

నూతన మానవుణ్ణి కలగన్నందుకు నాబిడ్డల జూడండని తన అలల చేతులతొ జల్లెడైన శరీరాల్ని ఎత్తిపట్టి భూమినీ ఆకాశాన్నీ ఒక్కటి జేసింది...
...ఇంకా చదవండి

గూడు

ఫెడీజౌడా | 22.09.2018 12:22:17pm

తన చిన్నారిగుండెల వెల్గిన చిరుదీపం లోకమంతా గొప్పవెలుగును ప్రసరించింది.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  సాహ‌సోపేత జీవితం
  నలబై వసంతాల దండకారణ్యం
  అరుణతార ఏప్రిల్ - జూన్ 2020
  తారకంగారంటే..
  సరిహద్దులు కాపాడేది దేశాన్నా, యుద్ధోన్మాదాన్నా?
  అనేక హింస‌ల గురించి లోతుగా చర్చించిన ఒక మంచి కథ -ʹకుక్కʹ
  హ్యాపీ వారియర్ : సాయిబాబా అండా సెల్ కవిత్వం ʹనేను చావును నిరాకరిస్తున్నానుʹ సమీక్ష
  అస్సాం చమురుబావిలో మంటలు - ప్రకృతి గర్భాన మరో విస్ఫోటనం
  దేశీయుడి కళ
  మీరొస్తారని
  బందీ
  ఊపా చట్టంలోని అమానవీయ అంశాలపట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •