ఆర్థిక సంబంధాల అసలు కథ ఏమిటో చెప్పిన తాయమ్మ కరుణ గారి కథ "బాధ్యత"

| సాహిత్యం | క‌థ‌లు

ఆర్థిక సంబంధాల అసలు కథ ఏమిటో చెప్పిన తాయమ్మ కరుణ గారి కథ "బాధ్యత"

- పలమనేరు బాలాజీ | 04.06.2020 11:52:09am


కథలను చదివి అర్థం చేసుకోవడం పాఠకుడి విజ్ఞతకు సంబంధించిన విషయం. ఉత్తమ కథలు ఉత్తమ పాఠకులను సులభంగా ఆకర్షిస్తాయి. కథలోని సూటిదనం, నిక్కచ్చితనం, సత్యాన్వేషణ, సమాజ పరిశీలన, వాస్తవిక దృష్టి కోణం ఆయా కథలను ఉత్తమ కథలుగా తీర్చిదిద్దుతాయి. రచయిత ప్రాపంచిక దృష్టి ఏమిటో రచయిత వ్యక్తిత్వం ఏమిటో ఆయా రచనలే చెబుతాయి. కొన్ని కథలు కొందరు రచయితల్ని గుర్తుండిపోయేలా తాయమ్మ కథ అలాంటిది. కొందరికి కథలే ఇంటి పేర్లు అవుతాయి. అట్లా తను రాసిన "తాయమ్మ కథ" ద్వారా తాయమ్మ కరుణగా కరుణ గారు మారడం కూడా ఒక కథే. చాలా మందికి తెలియని ఉద్యమ జీవితం గురించి లోతైన చూపుతో కథలు రాసిన వాళ్లలో కరుణ ఒకరు. ఆమె మొదటి కథా సంపుటి ʹతాయమ్మ మరికొన్ని కథలుʹ పేరిట 2009 జనవరిలో విరసం ద్వారా ప్రచురితం. 16 కథలతో వెలువడిన ఈ కథా సంపుటికి తుమ్మేటి రఘోత్తమ రెడ్డి గారు ,శివారెడ్డి గారు ముందుమాటలు రాశారు. ఆమెకు బాగా పేరు తెచ్చి పెట్టిన రెండు కథలు "తాయమ్మ కథ, కవులమ్మ ఆడిదేనా " ఈ కథా సంపుటిలో ఉన్నాయి.

తాయమ్మ కరుణ కథకురాలిగా అందరికీ సుపరిచితులు. రాసింది కొన్ని కథలే అయినప్పటికీ వాస్తవిక జీవితం నుంచి జీవిత వాస్తవికతను తెలియజెప్పిన మంచి కథలు ఆమె రాసారు.ఆమె రాసి ప్రతి కథలో స్పష్టత ఉంటుంది.ప్రతి కథలో జీవిత సత్యాన్ని కనుగొనాలనే అన్వేషణ కనబడుతుంది. అయితే కథలో అంతా చెప్పటం ఉండదు .ఆ చెప్పటం, చెప్పకపోవడం పాఠకున్ని ఆలోచింపజేస్తుంది. కథ ముగిశాక పాఠకుడు తీవ్రమైన భావోద్వేగాలకు లోనవుతాడు. ఆలోచించడం మొదలు పెడతాడు . కథ చదవడానికి ముందు కథలోని జీవితం గురించి తనకున్న అభిప్రాయాలు ఏమిటి ? తనకున్న అవగాహన ఏపాటిది ? కథ చదివిన తర్వాత తన అవగాహనలో వచ్చిన మార్పు ఏమిటి అన్నది ఇక్కడ ప్రధానం అవుతుంది. కథలో తాను చదివింది ఏమిటి ? ఈ కథ ద్వారా తెలుసుకున్నది ఏమిటి? కథలో తన ఊహకు రచయిత వదిలింది ఏమిటి? కథలోని ఖాళీలు ఏం చెబుతున్నాయి? కథ లోని వివిధ అంశాల పట్ల, పాత్రల పట్ల , జీవిత గమనం, సమాజ గమనం, మానవ మనస్తత్వం పట్ల ఒక అవగాహనకు రావడానికి పాఠకుడు తీవ్రంగా ప్రయత్నం చేస్తాడు. ఈ విధంగా పాఠకుడి ఆలోచనకు ఊహకు కొంత స్పేస్ వదలటం మంచి కథల లక్షణం. ఇలాంటి ప్రత్యేకమైన శిల్పం తాయమ్మ కరుణ కథల్లో కనబడుతుంది.

విరసం ప్రచురించిన ʹకథల పంట 3ʹ (2015) కథా సంకలనం లో తాయమ్మ కరుణ రాసిన "బాధ్యత "కథ ఆర్థిక పరిస్థితులు మానవ సంబంధాల మీద చూపి ప్రత్యక్ష ప్రభావాన్ని , మనుషుల భావోద్వేగాలను , వాళ్ల దుఖం తో సహా, అనేక ప్రశ్నలతో సహా మన ముందు నిలుపుతుంది. కథ దేనికదే సమాధానం కాదు. కథ దేనికదే ఒక ప్రశ్న అవుతుంది. ఎక్కడైనా ప్రశ్నించడం ఒక మంచి మానవ లక్షణం. సమస్యలకు పరిష్కారం ప్రశ్నించడంతోనే మొదలవుతుంది కాబట్టి కథ ప్రశ్నించినప్పుడు, ఆ కథ చదివిన పాఠకుడు తన్ను తాను ప్రశ్నించుకున్నప్పుడు, కథాంశం పైన, కథలో చర్చించిన అనేక విషయాల పైన ఆలోచించినప్పుడు ఆ కథల ప్రయోజనం నెరవేరినట్లే.

దిగువ మధ్యతరగతి కుటుంబంలో బ్రతకడమే ఒక ప్రశ్న ,ఒక సమస్య. తల్లిదండ్రుల సేవలను సంపూర్ణంగా వినియోగించుకున్న కొడుకు ,కూతురు వారికి వయసు అయిపోయిన తర్వాత ముసలి వాళ్లను భరించడం కష్టం అనే విషయానికి వచ్చినప్పుడు, ఆ ముసలి తండ్రి అరాకొర సంపాదన, ఆ ముసలి తల్లిదండ్రుల్ని చెల్లెలి ఇంట్లో ఉంచి చాకటానికి గాను , కొంత డబ్బు ప్రతి నెలా చెల్లెలుకు ఇవ్వడానికి సిద్ధపడిన అన్నయ్య దుర్భరమైన ఆర్థిక పరిస్థితుల కారణంగా తన మాట నిలబెట్టుకోలేకపోతాడు. చిన్న వయసులోనే భర్తను రోడ్డు ప్రమాదంలో పోగొట్టుకున్న వాణి అత్తగారి ఆదరణ లేక, వారి దూషణలకు దూరంగా, తన ఇద్దరు పిల్లలతో సహా అమ్మ గారి ఇంటికి వచ్చి చేరుతుంది. ఇక్కడ కథకురాలు ʹతల్లిగారింటికి వచ్చింది వాణిʹ అంటుంది కానీ, నిజానికి ఆ తల్లిదండ్రులే ఉంటున్నది కొడుకు గోపాల్ వద్ద.

అన్నా వదినలకు భారం కాకూడదని, ఉద్యోగానికి వెళ్ళడం మొదలు పెడుతుంది వాణి. ఓ రెండు నెలలకు అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర్లోనే ఇల్లు అద్దెకు తీసుకుంటుంది.గోపాల్ దగ్గరే ఉన్న తల్లిదండ్రులు వాణి పిల్లలను కనిపెట్టుకుని ఉంటారు.

" భర్త చనిపోయిన దుఃఖం ఎప్పుడూ వెన్నంటి ఉన్నా, పిల్లల భవిష్యత్తు.. ఎడతెగని ఆలోచనలు. ఎలా పెంచి పెద్ద చేయాలి . రెక్కలు తప్ప ఏమీ లేవు తండ్రి లోటు లేకుండా రాకుండా చూసుకోవాలి. ఈ ఉద్యోగంతో నెట్టుకు రావడం కష్టం.డిగ్రీ చదివే రోజుల్లోనే టైపు షార్ట్ హ్యాండ్ నేర్చుకుంది వాణి. అవి ఇప్పుడు పనికి వచ్చాయి. జర్నలిస్టుగా ఉద్యోగంలో చేరింది. ఐదు వేల జీతం నుంచి ఎనిమిది వేలకు చేరింది. కానీ ఆఫీసు దూరం. రాత్రులు ఇంటికి రావడం కష్టంగా ఉంది. అందుకని ఆఫీసుకు దగ్గరలో తీసుకుంది .తను ఉద్యోగానికి వెళితే పిల్లలను తీసుకు వచ్చే వాళ్ళు, తను వచ్చే వరకు చూసుకునే వాళ్ళు కావాల్సి వచ్చింది."

"ఇంట్లో పిల్లలను చూసుకోవడానికి ఇంట్లో ఎవరైనా ఉండాల అన్నయ్య" అని అడుగుతుంది వాణి.

తనకు భారం కాకుండా వేరే ఇల్లు తీసుకుని దూరంగా ఉండటం పట్ల కృతజ్ఞతతో ఉన్న వాళ్ళ అన్నయ్య గోపాల్ -అమ్మ నాన్నలను తీసుకెళ్ల మంటాడు.ఇక్కడ రచయిత్రి వాణి మనస్తత్వాన్ని ,ఆర్థిక పరిస్థితిని , ఆమె సంశయాన్ని , గొంతు వెనుక దాచి పెట్టుకున్న అభ్యర్థనను ఒక్కమాటలో చెబుతోంది. కథాకథనం లో రచయిత్రి సాధించిన శిల్ప పరిణితికి గొప్ప వాక్య నిర్మాణానికి ఉదాహరణ ఈ మాట. చాలా చిన్న మాటే. ఆ ఒక్క మాటతో గోపాల్ ఆమె అవస్థను అర్థం చేసుకుంటాడు.

"అమ్మ నాన్నను తీసుకెళ్ళు .నాకు ఇంట్లో నీరజ ఉంది.నీరజ ఎక్కడికైనా వెళ్ళినా నానమ్మ ఉండనే ఉంది కదా." గోపాల్.
" అంతేనా అన్నయ్యా" వాణీ కదల్లేదు.
" అమ్మా నాన్నల కోసం నెలకు ఎంతో కొంత నేను సర్దుతాను" గోపాల్.

ఆమె సంశయాన్ని, ఆమె పరిస్థితిని, తన గొంతు లోపలి మాటను ʹవాణి కదల్లేదు ʹ అని ఒక్కమాటలో చెప్పటం విశేషం.
***

భర్త చనిపోయిన రెండేళ్లకు చిన్నవయసు కదమ్మా మళ్ళీ పెళ్లి చేసుకోమ్మా, అని తల్లి చెప్పినప్పటికీ మొదటిసారి పెళ్లికి అప్పు చేశారు. ఇంకా రెండో పెళ్లి కూడానా ?అసలు భర్తను మర్చిపోవడం సాధ్యమేనా? వచ్చేవాడు పిల్లలను ఎలా చూసుకుంటాడు అనే అనేక అనుమానాలతో అమ్మ మాటను కాదంటుంది వాణి. పిల్లలకు ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలి అదే నిశ్చయంతో ఆఫీసులో పని అయ్యాక ఇంటికి వచ్చాక మిషన్ కుట్టడం పనిలో మునిగిపోతుంది వాణి.

పత్రికలో చేరిన ఈ నాలుగేళ్లలో రెట్టింపు అయిన జీతం. గిన్నెలు , మిక్సీ ,వాషింగ్ మిషన్ ఫ్రిజ్ ఒకటొకటిగా కొన్నది. రెండో పెళ్లి గురించి తల్లి ఎంత చెప్పినా ఆ మాటను దాటివేస్తుంది వాణి. గోపాల్ ఇచ్చిన మాట నిలబెట్టుకో లేకపోతాడు.తన చేతిలో ఉన్న కాంట్రాక్టు పని పోయింది‌. ప్రైవేట్ కాలేజీలో క్యాషియర్ గా జాయిన్ అయ్యాడు. ఇల్లు గడవటం అంతంతమాత్రంగానే ఉంటోంది.

తల్లిదండ్రులకు అనారోగ్యం వచ్చినప్పుడు మాత్రం ఎంతో కొంత ఇస్తున్నాడు గోపాల్ .అన్నయ్య నెలనెలా డబ్బులు ఇవ్వడం లేదని వాణీ కి మనసులో ఉన్నా, అతడి పరిస్థితి అర్థం చేసుకుంటుంది.ఈ మధ్య కాలంలో తండ్రి బడ్డీకొట్టు కి వెళ్లడం పూర్తిగా మానేసాడు . వాణి తన కొడుకుని మంచి స్కూల్లో జాయిన్ చేసింది -ఎక్కువ ఫీజు అయినా, దాంతో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి.

మరో కాంట్రాక్టు దొరకకపోవడం, పిల్లలు ఎదుగుతుండటం, క్లాసులు పెరుగుతుండటం, నానమ్మ మంచం మీదనుంచి కదలలేకపోవడం, ఆమెను ఆస్పత్రికి తిప్పాల్సిరావడం...ఈ నాలుగేళ్లుగా గోపాల్ కు ఆర్థిక భారం పెరిగింది. ఏడాదిగా తల్లిదండ్రులకు డబ్బులు ఇవ్వడం పూర్తిగా మానేసాడు.

నానమ్మకు విరేచనాలు పెట్టినప్పుడో, జ్వరం వచ్చినప్పుడుడో తల్లి నిర్మలమ్మ వచ్చి చేస్తోంది. అయితే నిర్మలమమ్మని వంటింట్లోకి రానివ్వడం లేదు కోడలు నీరజ. అప్పుడప్పుడు తల్లిగాని తండ్రిగాని అన్నయ్య దగ్గరికి పంపి కొద్దిరోజులు ఉంచుతోంది వాణి. వాళ్లకు బాగా లేనప్పుడు అన్నయ్య ఇంటికే పంపుతుంది.

నానమ్మను పోషిస్తున్నాం కాబట్టి తల్లిదండ్రులను అదనంగా పోషించడం కష్టమని అంటుంది నీరజ. ఇక్కడ ఒక మాటలో నేరుగా నీరజ మనస్తత్వాన్ని రచయిత్రి స్పష్టంగా చెబుతుంది.
"అత్త లేని సుఖం కు అలవాటు పడ్డ నీరజ వాళ్లు వచ్చి ఉన్నప్పుడల్లా ఇబ్బంది ఫీలవుతుంది".

ఈ కథలో పాత్రల మనస్తత్వాన్ని చక్కగా విశదీకరించడంలో రచయిత్రి నేర్పరితనం కనబడుతుంది. అన్నాచెల్లెళ్ల లో ఎవరి పట్లా రచయిత్రి పక్షపాతం చూపదు. వివక్షత చూపదు. త్రోటు పడని రచయిత్రి నిక్కచ్చితనం పదునైన కంఠస్వరంలో తెలుస్తుంది. ఆర్థిక పరిస్థితులు మానవసంబంధాలను ఎంత తీవ్రంగా ప్రభావితం చేస్తాయో, మనుషుల మనస్తత్వాలను, మాటలను ఆలోచనలను ప్రవర్తనను ఏ విధంగా మార్పుకు గురిచేస్తాయో , మారుతున్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మారే మనుషుల ఆలోచనలను వ్యక్తిత్వాలను ఈ కథలో గమనించవచ్చు. పరిస్థితులకు అనుగుణంగా మారుతున్న మనుషుల మనస్తత్వ చిత్రణ ప్రధానంగా ఈ కథలో పాఠకులను ఆకట్టుకుంటుంది.

తల్లిదండ్రుల భారాన్ని మోయలేక రాజమండ్రి నుండి భీమవరం కి వెళ్లడానికి గోపాల్ ప్రయత్నం చేస్తాడు. తనకు అమ్మ నాన్న సాయం గా ఉన్నారని ,బాధ్యతంతా తన మీదే వదిలేస్తాడా? ఏదో ఒకటి తేల్చుకోవాలి. లేదంటే అంటే తనకూ కష్టమే. రోజురోజుకు చిన్నపిల్లలయ్యే అమ్మానాన్నలకు చేయడం తన వల్ల కాదు. ఏమిటీ చేయడం? అని వాణి తీవ్రంగా ఆలోచిస్తుంది. చిన్నక్క పెద్ద అక్కలతో సంప్రదిస్తుంది. అవసరమైతే అందరం కలిసి కూర్చుని మాట్లాడుకుందాం. నెలకు ఎంతో కొంత ఇప్పించేలా చూద్దాం. గోపాల్ తన వల్ల ససేమిరా అంటే అమ్మా నాన్నల ఖర్చు అందరం భరిద్దాం అంటారు వాళ్ళు. వాళ్లేమీ స్థితిమంతులు కారు. కష్టాల్లో ఉన్నవాళ్లే. అయినా ఆ మాట అనడం అ ఆడబిడ్డల వ్యక్తిత్వం.

తనకు జరుగుబాటు అంతంత మాత్రమేనని, నానమ్మను తను చూసుకుంటున్నాడు కాబట్టి తల్లిదండ్రులను వాణి చూసుకోవాలి అని అంటాడు గోపాల్. వాణి అందుకు ఒప్పుకోదు. నెల నెలా డబ్బులు ఇవ్వక పోవడాన్ని ప్రశ్నిస్తుంది. నీకు బాధ్యత లేదా అని అడుగుతుంది అన్నయ్యను.

వాణి గోపాల్ నీరజల మధ్య తమ గురించి గొడవ మొదలైనప్పుడు "ఎందుకర్రా పోట్లడతారు. మేమిద్దరం ఎటన్నా వెళ్ళిపోయి బతుకుతాం" అనేస్తాడు ఎవరిదీ తప్పని చెప్పలేక తండ్రి అప్పారావు . నిర్మలమ్మ ఒక్క మాట మాట్లాడలేదు కొంగు నోటికి అడ్డం పెట్టుకుని కూర్చుంది. తండ్రి మాటలను వాణీ గోపాల్ పట్టించుకోలేదు. అన్నయ్య మాటలకు కరిగి పోకూడదు. ఏమీ మాట్లాడకుండా గమ్మున ఉండిపోయింది వాణి.

కొద్దిసేపటికి సర్దుకుని "అమ్మానాన్నలను తీసుకెళ్ళవే " అంటాడు గోపాల్.
"లేదన్నయ్యా. ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడే ఉండాలి" అంటుంది వాణి.
***
కథ‌ ఇలా ముగుస్తుంది.!

బయటకు వెళ్లి ఆలోచిస్తూ రోడ్డు వెంట తిరిగాడు. నాన్న బడ్జీ కొట్టు నడిపినన్నాళ్లు అట్టిపెట్టుకునే ఉంది.తనకు ఏ ఖర్చు లేకుండా వంట మనిషి అమ్మా, బయట పనులకు నాన్న పనికొద్చారు. ఈ రోజు నాన్న పనికి వెళ్లకపోయేసరికి భారంగా తయారయ్యాడు. ఇంకో ఐదారురు సంవత్సరాలు అమ్మానాన్న లేకపోతే దానికి గడవనే గడవదు. ఈలోగా తనకూ ఇబ్బందులు తొలగుతాయి. అవసరం తనది. నా దగ్గరి నుండి ఆశిస్తోంది. ఏనాడైనా తను ఒక్క పైసా వెనకేసుకుంది. లేదు. ఎప్పుడూ అప్పులు తీర్చడంతోనే సరిపోయింది. ఓ గంట అటూ ఇటూ తిరిగి ఇంటికి వెళ్ళాడు గోపాల్ . నీరజ వంట చేస్తోంది. అమ్మ బాగా ఏడ్చినట్టుంది. వాణి ప్రశాంత వదనంతో నానమ్మతో మాట్లాడుతోంది. నాన్న కుదేలై కుర్చీలో కూచున్నారు. పిల్లలు టీవీలో కార్టూన్స్ చూస్తున్నారు.

లోపలికి వెళ్ళి లుంగీ కట్టుకుంటూ వంట చేస్తున్న నీరజ దగ్గరికి వెళ్లి కళ్లలోకి చూశాడు- ఏమన్నా చెప్పిందా అన్నట్లు .

పెదవి విరిచి తల అడ్డంగా తిప్పింది నీరజ. ముందు రూము లోకి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. తల్లి తండ్రి ముఖంలోకి చూడలేకపోయాడు.చూసి తను ఏమీ చేయలేడు.
" ఏం ఆలోచించావే వాణీ"
" ఆలోచించడానికి ఏమీ లేదన్నయ్యా"

" వైజాగ్ నుండి అక్కా, హైదరాబాద్ నుంచి చెల్లి వీణ వస్తున్నామని ఫోన్ చేశార్రా." తండ్రి గోపాల్ .

" ఆహా.. అలాగా " గోపాల్

ఇన్నాళ్ళు గుట్టుగా ఎవరితో చెప్పించుకోలేదు. మెలిపెట్టే బాధ గోపాల్ ను ఆవరించింది. లేచి వెళ్ళి బెడ్ మీద పడుకుండిపోయాడు.
***

తల్లిదండ్రుల ముఖాలను చూసి ఏమీ చెప్పలేనని ,ఏమీ చేయలేనని అనుకోవడంలో గోపాల్ తన చేతకానితనాన్ని ఒప్పుకోవటం ఉంది.

ఈ కథలో రచయిత్రి సూక్ష్మంగా చెప్పిన విషయాల ద్వారా కొన్ని వాక్యాల ద్వారా పాత్రల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడమే కాకుండా జీవిత గమనాన్ని , కుటుంబ సభ్యుల మధ్య ఆర్థిక సమస్యలు సృష్టించే వైరాన్ని అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.

ముగ్గురు ఆడ పిల్లలకు పెళ్లిళ్లు చేయడం అంటే మాటలు కాదు. అంతంత మాత్రంగా ఉండే వాళ్ల జీవితాలు ఏమవుతాయో? ముగ్గురు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసిన ఇల్లు ఏమవుతుంది .అది ఎప్పుడో అమ్ముడయి ఉంటుంది. వడ్డీలు కట్టలేక అప్పుల మీద అప్పులు చేసి వడ్డీలలో, తీరని అప్పుల్లో కూరుకుపోయి ఉంటారని తెలిసిపోతుంది. ఉన్న ఇల్లు అమ్మడం, అప్పుల పైన అప్పులు చేయడం, అయినా అన్ని సమస్యల‌ మధ్యలో కూడా చిన్నమ్మాయి వాణి డిగ్రీ పూర్తి చేసుకోవటం, టైపు, షార్ట్ హ్యాండ్ నేర్చుకోవటం ఆమెను ఆదుకుంటుంది.భర్త చనిపోయిన తర్వాత అత్త వాళ్ళు ఆదరించక పోయినా తన కాళ్ళపై తాను నిలబడడానికి ఏదో ఒక ఉద్యోగాన్ని వెతుక్కుంటుంది. అలాంటి స్థితిలో అన్నయ్య తల్లిదండ్రులు ఇచ్చిన సహకారం గొప్పది. కానీ ఆర్థిక సమస్యలు భయపెడుతుంటే అదే మనుషుల మధ్య అంతరాలు పెరిగిపోతాయి.ఆర్థిక పరిస్థితులు ఎంత మాత్రం సహకరించనప్పుడు మమకారాలు కూడా మారిపోతాయి మనుషులు మారిపోతారు. ఆపేక్షలు అర్థాలు మార్చుకుంటాయి.

వ్యక్తుల మనస్తత్వాన్ని ఆడించే ఆర్థిక సాంఘిక శక్తుల గురించి మధ్యతరగతి స్వభావాన్ని గురించి ఈ కథలో రచయిత్రి సంభాషణల ద్వారా చెబుతుంది. అన్ని విలువలు కలగలిసిపోయిన ఒక సంకీర్ణ వ్యవస్థలో దేన్ని విడివిడిగా చూడలేని పరిస్థితిలో ఒకదానితో మరొకటి అంతర్లీనంగా ముడిపడిన అనేక అంశాలు

మనుషుల్నిమారుస్తాయి,ఏమారుస్తాయి. పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రధానంగా దెబ్బతిన్న మానవ విలువలు మానవ సంబంధాల గురించి సున్నితమైన సూక్ష్మమైన సునిశితమైన పరిశీలన ఈ కథనిండా అల్లుకుని ఉంది. ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఉన్నతంగా సంస్కారవంతంగా ప్రవర్తించడానికి మమకారంతో మాట్లాడుకోవడానికి ప్రేమ ఆపేక్షలతో కనబడటానికి అన్నాచెల్లెళ్లు లోలోపల మధనపడతారు. ఏమి చేతకాక, మంచిగా ఉండటం చేతకాక, ఆర్థిక సమస్యలను అధిగమించడం సాధ్యపడక, పరిష్కారం లేని సమస్యల తో గించుకుంటారు. దరిద్రం మనిషిని మనిషిని కాకుండా చేయటమే ఈ కథ. డబ్బుకు ఉన్న విలువ మనిషికి లేకపోవటం ఏమిటి అన్నదే ప్రశ్న.

కొన్ని సమస్యలను పరిష్కరించడంలో అనేకానేక కొత్త సమస్యలను ఎదుర్కోవడమే జీవితంలోని విషాదం.ఏదేమయినా మంచితనం వైపు, మనిషి తనం వైపు వీళ్లు ఎంతవరకు నిలబడతారు అన్నదే కథలోని మలుపు. సంశయం లేకుండా మొహమాటం లేకుండా వర్తమానంలో మనుషుల మధ్య జరిగే సంఘర్షణలని వాస్తవికంగా ఉన్నది ఉన్నట్లుగా చిత్రీకరించిన -చిక్కదనం నిక్కచ్చితనం నిండా ఉన్న కథ "బాధ్యత".

No. of visitors : 288
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


పరిమళం , పదును రెండూ వున్నకవిత్వం – చేనుగట్టు పియానో

పలమనేరు బాలాజీ | 04.02.2017 02:37:03am

కవి పాలక పక్షం, రాజ్యం పక్షం, వహించకుండా ప్రజా పక్షం వహిస్తున్నాడని ప్రజల ఆగ్రహాన్ని,ఆవేదనల్ని, ప్రశ్నల్ని,నిరసనల్ని తన గొంతుతో వినిపిస్తున్నాడని .......
...ఇంకా చదవండి

ʹనారుమడిʹ మళ్ళీ మళ్ళీ చదివించే మంచి క‌విత్వం

పలమనేరు బాలాజీ | 18.01.2017 11:47:15pm

కాలం గడచినా మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చి చదవాలని అనిపించే మంచి కవితా సంపుటాల్లో ʹ నారుమడి ʹ ఒకటి. యెన్నం ఉపేందర్ ( డాక్టర్ వెన్నం ఉపేందర్ )అటు కథకుడిగా , యిటు కవి...
...ఇంకా చదవండి

సాహిత్య విమర్శకు కొత్త బ‌లం

పలమనేరు బాలాజీ | 04.03.2017 09:54:02am

ఈ పుస్తకం లో వ్యక్త పరచిన అభిప్రాయాల్లో రచయిత ఎక్కడా సహనం కోల్పోలేదని, సాహిత్య అంశాల పట్ల రచయితకు గల ఆసక్తి ,నిబద్దత,స్పష్టతే ఇందుకు కారణాలని, విభేదించే...
...ఇంకా చదవండి

ఖాళీ ఇల్లు,ఖాళీ మనుషులు

పలమనేరు బాలాజీ | 01.06.2016 11:57:12am

నమ్ముకున్న కలల్ని గాలికొదలి ఇల్లు వదిలి, ఊరు వదిలి పిల్లల్ని వదిలి, సహచరుల్ని వదిలి...
...ఇంకా చదవండి

మనిషి లోపలి ప్రకృతి గురించి చెప్పిన మంచి కథ ʹ ఆఖరి పాట ʹ

పలమనేరు బాలాజీ | 03.08.2019 11:39:20pm

మనిషికి, మట్టికి మధ్య వున్న అనుభందం విడదీయరానిది . మట్టి మనిషిని చూస్తున్నాం, విoటున్నామని అనుకుంటాం కానీ, నిజానికి మట్టి మనిషిని నిజంగా సంపూర్ణంగా ......
...ఇంకా చదవండి

మార్కులే సర్వస్వం కాదని చెప్పిన కథ ʹ నూటొకటో మార్కు ʹ

పలమనేరు బాలాజీ | 05.09.2019 01:00:59pm

ʹ వీడికి వందకి వంద మార్కులు రావలసింది , కానీ తొoతొమ్మిదే వచ్చాయిʹ అప్పుడు ఒకే ఒక్క మార్కు కోసం ఇంత హైరానా పడి రావాలా అని ? అని అడుగుతాడు సైకాలజిస్టు......
...ఇంకా చదవండి

స్త్రీ సాధికారత కోసం సమానత్వం కోసం డిమాండ్ చేస్తున్న ʹ నీలి గోరింటʹ

ప‌ల‌మ‌నేరు బాలాజీ | 03.05.2019 03:22:15pm

ఆశావాద దృక్పథంతో మంచి సమాజం కోసం ఒక ఆధునిక స్త్రీ పడే తపనను ఈ కవిత్వం తప్పక చెపుతుంది. పసిబిడ్డల నుండి ముసలివాళ్ళు వరకు అన్ని ప్రాంతాల్లో స్త్రీలపై జరుగ...
...ఇంకా చదవండి

ఒక మంచి రాజనీతి కథ

పలమనేరు బాలాజీ | 16.07.2019 09:19:27pm

వ్యవస్థలో, మనిషిలో పేరుకుపోతున్న రాజకీయాన్ని దళారీ తనాన్ని వ్యాపార తత్వాన్ని నగ్నంగా చూపించిన ఈ కథలో ప్రతి పదం ముఖ్యమైనది, అనివార్యమైనది. ఆయా పదాలు......
...ఇంకా చదవండి

మానవ సంబంధాల ఉన్నతీకరణకు చక్కటి ఉదాహరణ ʹ చందమామ రావేʹ

పలమనేరు బాలాజీ | 16.08.2019 09:24:03pm

సాధారణంగా బిడ్డల వల్ల తల్లులు బాధలు పడే కథలు కొన్ని వేల సంఖ్యలో ఉంటాయి . తల్లి, బిడ్డలకు సంబందించిన కథలు కొన్ని వేల సంఖ్యలో వచ్చింటాయి. వృద్ధాప్యదశకు చేర.....
...ఇంకా చదవండి

వివక్షతని ప్రశ్నించిన కొత్త దళిత కథ : " పైగేరి నారణప్ప కథ..."

పలమనేరు బాలాజీ | 02.08.2020 04:14:44pm

కుల అహంకారాన్ని ప్రశ్నించి, వర్గ రాజకీయాల నుండి దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడమనే ఒక మనిషి కథను ఊరు నుండి తన సమాజం నుండి తన వర్గం నుండి దూరంగా ఉంటున్న .....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •